RCB Vs RR: చిన్నస్వామిలో బెంగళూరు చిందు | Rajasthan Royals Lose To Royal Challengers Bengaluru By 11 Runs, Check Out Full Score Details Inside | Sakshi
Sakshi News home page

RCB Vs RR: చిన్నస్వామిలో బెంగళూరు చిందు

Published Fri, Apr 25 2025 2:58 AM | Last Updated on Fri, Apr 25 2025 10:35 AM

Rajasthan Royals lose to Royal Challengers Bangalore by 11 runs

హోం గ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌ నెగ్గిన ఆర్‌సీబీ

11 పరుగులతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి

రాణించిన కోహ్లి, హాజల్‌వుడ్‌  

రాజస్తాన్‌ విజయానికి చివరి 3 ఓవర్లలో 40 పరుగులు కావాలి... భువనేశ్వర్‌ వేసిన 18వ ఓవర్లో జురేల్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులకు మారడంతో గెలుపు ఖాయమనిపించింది. అయితే 19వ ఓవర్లో హాజల్‌వుడ్‌ ఒకటే పరుగు ఇచ్చి 2 వికెట్లు తీయడంతో రాయల్స్‌ ఆశలు కోల్పోయింది. చివరి ఓవర్లో దయాళ్‌ 5 పరుగులే ఇచ్చాడు. దాంతో ఈ సీజన్‌లో చిన్నస్వామి మైదానంలో ఆడిన నాలుగో మ్యాచ్‌లో బెంగళూరుకు తొలి గెలుపు దక్కగా ...విజయానికి చేరువగా వచ్చి రాజస్తాన్‌ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది.  

బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 11 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. 

రెండో వికెట్‌కు వీరిద్దరు 51 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అనంతరం రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసింది. యశస్వి జైస్వాల్‌ (19 బంతుల్లో 49; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్‌ జురేల్‌ (34 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా ... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోష్‌ హాజల్‌వుడ్‌ (4/33) ప్రత్యర్థిని పడగొట్టడంతో కీలక పాత్ర పోషించాడు.  

సమష్టి ప్రదర్శన... 
బెంగళూరుకు ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (23 బంతుల్లో 26; 4 ఫోర్లు), కోహ్లి శుభారంభం అందించడంతో ఆ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి 59 పరుగులు సాధించింది. హసరంగ తొలి ఓవర్లోనే సాల్ట్‌ను అవుట్‌ చేసి తొలి వికెట్‌ అందించాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్‌ మరింత దూకుడుగా ఆడాడు. మరోవైపు కోహ్లి... సందీప్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 32 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. 

అనంతరం వరుసగా పరాగ్, దేశ్‌పాండే వేసిన రెండు ఓవర్లలో కోహ్లి, పడిక్కల్‌ కలిసి 5 భారీ సిక్స్‌లతో మొత్తం 37 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత 11 బంతుల వ్యవధిలో 7 పరుగులు మాత్రమే చేసిన జట్టు కోహ్లి, పడిక్కల్, పాటీదార్‌ (1) వికెట్లు కోల్పోయింది.   

జైస్వాల్‌ దూకుడు... 
భారీ ఛేదనలో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ జోరుగా మొదలైంది. తొలి బంతికే సిక్స్‌ కొట్టిన జైస్వాల్‌... దయాళ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాదడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత హాజల్‌వుడ్‌ ఓవర్లోనూ అతను వరుసగా మూడు ఫోర్లు బాదాడు. రెండు సిక్స్‌లతో ఆకట్టుకున్న వైభవ్‌ సూర్యవంశీ (16) ఎక్కువ సేపు నిలవలేదు. అనంతరం హాజల్‌వుడ్‌ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన జైస్వాల్‌ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. 

పవర్‌ప్లేలో రాయల్స్‌ 72 పరుగులు రాబట్టడం విశేషం. ఆ తర్వాత మరో రెండు ఓవర్లు నితీశ్‌ రాణా (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రియాన్‌ పరాగ్‌ (10 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించడంతో 49 బంతుల్లోనే స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత ఆర్‌సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాయల్స్‌ను నిలువరించడంలో సఫలమైంది.  

స్కోరు వివరాలు  
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హసరంగ 26; కోహ్లి (సి) రాణా (బి) ఆర్చర్‌ 70; పడిక్కల్‌ (సి) రాణా (బి) సందీప్‌ 50; టిమ్‌ డేవిడ్‌ (రనౌట్‌) 23; పాటీదార్‌ (సి) జురేల్‌ (బి) సందీప్‌ 1; జితేశ్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–61, 2–156, 3–161, 4–163, 5–205. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–33–1, ఫారుఖీ 3–0–30–0, తుషార్‌ దేశ్‌పాండే 2–0–36–0, సందీప్‌ శర్మ 4–0–45–2, హసరంగ 4–0–30–1, పరాగ్‌ 3–0–30–0.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) షెఫర్డ్‌ (బి) హాజల్‌వుడ్‌ 49; వైభవ్‌ (బి) భువనేశ్వర్‌ 16; రాణా (సి) భువనేశ్వర్‌ (బి) కృనాల్‌ 28; పరాగ్‌ (సి) జితేశ్‌ (బి) కృనాల్‌ 22; జురేల్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 47; హెట్‌మైర్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 11; శుభమ్‌ దూబే (సి) సాల్ట్‌ (బి) దయాళ్‌ 12; ఆర్చర్‌ (సి) పాటీదార్‌ (బి) హాజల్‌వుడ్‌ 0; హసరంగ (రనౌట్‌) 1; దేశ్‌పాండే (నాటౌట్‌) 1; ఫారుఖీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–52, 2–72, 3–110, 4–134, 5–162, 6–189, 7–189, 8–189, 9–191. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–50–1, యశ్‌ దయాళ్‌ 3–0–33–1, హాజల్‌వుడ్‌ 4–0–33–4, రొమారియో షెఫర్డ్‌ 1–0–15–0, సుయాశ్‌ శర్మ 4–0–31–0, కృనాల్‌ పాండ్యా 4–0–31–2.  

ఐపీఎల్‌లో నేడు
చెన్నై X  హైదరాబాద్‌
వేదిక: చెన్నై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement