
కావలి కన్నీటిసంద్రం
కావలి: విహారయాత్ర నిమిత్తం కుటుంబసమేతంగా కశ్మీర్‌లోని పహల్గామ్ వెళ్లి ఉగ్రవాదుల తూటాకు బలైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయం కావలికి గురువారం ఉదయం చేరుకుంది. శ్రీనగర్ నుంచి విమానంలో చైన్నె ఎయిర్‌పోర్టుకు తెల్లవారుజామున మూడు గంటలకు.. ఆపై రోడ్డు మార్గంలో అంబులెన్స్ ద్వారా పట్టణంలోని ఆనాలవారి వీధిలోని స్వగహం వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, తో బుట్టువులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. పార్థివదేహ పేటికను ఇంట్లోకి పో లీస్ అధికారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి భుజాలపై మోసి చేర్చా రు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. పార్థివదేహంపై జాతీయ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబీకులను ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఓదార్చారు.
కన్నీటిపర్యంతం
కావలిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మధుసూదన్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయులు విలపించారు. అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. మృతుడి భార్య, పిల్లలు రోదన అక్కడి వారిని కలిచివేసింది. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ నివాళులర్పించారు. పేద కుటుంబం నుంచి ఉన్నతంగా ఎదిగి.. మంచి వ్యక్తిత్వం గల మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరమని ఎమ్మెల్యే చెప్పారు.
మంత్రుల నివాళులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కావలి చేరుకొని మధుసూదన్ భౌతికకాయానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి.. ధైర్యంగా ఉండాలని సూచించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.
అంతిమయాత్ర
పట్టణంలోని ఆనాలవారి వీధిలోని తల్లిదండ్రుల నివాసం నుంచి మధుసూదన్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. నాలుగు కిలోమీటర్ల దూరంలోని బుడంగుంట శ్మశాన వాటిక వరకు సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పార్థివదేహాన్ని ఉంచారు.
అశ్రునయనాల మధ్య మధుసూదన్ అంతిమయాత్ర
నివాళులర్పించిన ప్రజానీకం

కావలి కన్నీటిసంద్రం

కావలి కన్నీటిసంద్రం

కావలి కన్నీటిసంద్రం