
● మైకా, క్వార్ట్‌జ్ పరిశ్రమపై ఆధారపడిన ఐదు వేల కుటుంబా
● తొమ్మిది నెలలుగా మూతపడిన క్వార్ట్‌జ్ గనులు
● తమ స్వార్థం కోసం పేదలను
వీధిన పడేసిన నేతలు
● నష్టాల ఊబిలో మైకా పరిశ్రమ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే మైకా గనులు జిల్లాకు వరం. ఈ ప్రాంతంలో దొరికే మైకా, క్వార్ట్‌జ్ ఫల్స్‌పర్‌కు వివిధ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నా.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గనులన్నీ మూత పడ్డాయి. నూతన పాలసీ పేరుతో మైకా పరిశ్రమలన్నీ ప్రభుత్వమే మూసివేయించి.. సిండికేట్ చేతుల్లోకి తీసుకుంది. కొన్ని గనుల్లో నామమాత్రంగా పనులు చేస్తున్నా.. మిగిలిన క్వారీల్లో పూర్తిగా నిలిపివేశారు. దీంతో మైకా పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులకు ఉపాఽధి లేక ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఉపాధి కోల్పోయిన వేలాది కుటుంబాలు
జిల్లాలో గతంలో 143 గనులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 80కి చేరుకుంది. వాటికి అనుసంధానంగా 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మంది, పరోక్షంగా మరో 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మైకా పరిశ్రమల్లో కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది. గడిచిన 9 నెలలు నుంచి కేవలం ఫల్స్‌ఫర్, మైకాకు మాత్రమే నామమాత్రంగా పర్మిట్ ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గని కార్మికులు వీధిన పడ్డారు.
సంక్షోభంలో యాజమాన్యాలు
ఈ సంక్షోభం ఒక్క కార్మికులకే కాదు గనుల యాజమాన్యాలతోపాటు ఫ్యాక్టరీ యాజమాన్యాలు లారీ యాజమానులపై కూడా ప్రభావం చూపుతోంది. ఇక్కడ లభించే అపారమైన ఖనిజాలను ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాలకు లక్షల టన్నుల్లో ఎగుమతులు జరుగుతుండేవి. ప్రస్తుతం ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.
రాకపోకలు బంద్
సైదాపురం మండలంలో గడిచిన 270 రోజుల నుంచి గనులన్నీ మూతపడడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో వాహన యాజమానులతోపాటు లోడింగ్ చేసే కూలీలు కూడా ఉపాధి కోల్పోయారు.
మౌనంగా యాజమానులు
ప్రభుత్వ అనుమతులతో మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న యాజమానుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి నిర్వహించే మైనింగ్ ఆపరేషన్ నామమాత్రంగానే జరుగుతుండటంతో ఏమి చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని గని కార్మికులపై కూటమి ప్రభుత్వం పగబట్టింది. తొమ్మిది నెలలుగా మైకా, క్వార్ట్‌జ్ క్వారీ పరిశ్రమలు నిలిచిపోవడంతో బతుకుదెరువు లేక వీధిన పడ్డారు. వాచ్‌మెన్ దగ్గర నుంచి జేసీబీ, పొక్లయిన్, ట్రాక్టర్లు, టిప్పర్లు, గని కార్మికులు ఎందరో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ గనుల్లో పనుల్లేక ఉపాధి లేక.. పిల్లల చదువుకు ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నారు.

● మైకా, క్వార్ట్‌జ్ పరిశ్రమపై ఆధారపడిన ఐదు వేల కుటుంబా

● మైకా, క్వార్ట్‌జ్ పరిశ్రమపై ఆధారపడిన ఐదు వేల కుటుంబా