
మంత్రి పెరియ స్వామి వంతు
సాక్షి,చైన్నె : డీఎంకే మంత్రులు దురై మురుగన్, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం తదుపరి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వేల్ మురుగన్ దృష్టిలో మంత్రి ఐ. పెరియస్వామి పడ్డారు. అక్రమాస్తుల కేసులో ఆయన విడుదలను రద్దుచేస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. డీఎంకే మంత్రులను కింది కోర్టులు విడదల చేయగా హైకోర్టు పునర్ సమీక్షా పిటిషన్ల విచారణ సమయంలో వాటిని రద్దు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వారం వ్యవధిలో ముగ్గురు మంత్రుల విడుదల రద్దు అయింది. 2006–2010లో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి మంత్రి ఐ. పెరియ స్వామి ఆస్తులు గడించినట్టుగా గతంలో కేసు నమోదైంది. ఆయన సతీమణి సుశీల, కుమారులు ప్రభు, సెంథిల్‌కుమార్‌ను ఈ కేసులో చేర్చారు. వీరిని దిండుగల్ కోర్టు కేసు నుంచి విడుదల చేసింది. అయితే పునర్ సమీక్షా పిటిషన్ విచారణలో విడుదల తీర్పు రద్దు చేస్తూ న్యాయమూర్తి వేల్ మురుగన్ తీర్పు చెప్పారు. ఈ కేసును ఐ. పెరియస్వామి అండ్ ఫ్యామిలీ మళ్లీ ఎదుర్కోకత ప్పలేదు. ఈ కేసును ఆరు నెలల్లో ముగించే విధంగా కింది కోర్టును న్యాయమూర్తి ఆదేశించారు.