Top Stories
ప్రధాన వార్తలు

భారత సరిహద్దుల్లో టెన్షన్.. పాక్ ఆర్మీ కాల్పులు
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు ప్రతి దాడులు చేస్తున్నాయి. దీంతో, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో, శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది. Small arms firing at some places on the Line of Control were initiated by the Pakistan Army. Effectively responded to by the Indian Army. No casualties. Further details are being ascertained: Indian Army officials pic.twitter.com/SlBSDPSJHA— ANI (@ANI) April 25, 2025మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని బందీపురాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BREAKINGEncounter breaks out in Bandipora, Jammu & Kashmir as terrorists open fire during a search operation.Security forces retaliate. No casualties reported yet. Updates awaited. pic.twitter.com/7jz8O8x4Ud— 𝕿𝖆𝖗𝖚𝖓 तरुण 卐 🇮🇳 (@fptarun) April 25, 2025

మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆయా మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..మీ తెగువకు మరోసారి సెల్యూట్..ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్ చేస్తున్నా.జీర్ణించుకోలేక అక్రమ కేసులు..» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయపెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.» తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్‌ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు.» అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. అన్నీ కోతలు.. అవకతవకలేఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఎంచుకుంటున్నారు. అడ్డగోలుగా భూ పందేరాలు..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు..చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అప్పు అంతా ఏమైపోతోంది..?మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు ఎందుకు లేవు? గతంలో జగన్ చేయగలిగాడు...మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్ నేరుగా బటన్ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపోయామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్ కొట్టేలా పెంచిన కరెంట్ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. చరిత్రలో రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్ అని గేమ్స్ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.వ్యవస్థలన్నీ విధ్వంసం.. » మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ని సైతం పీరియడ్‌గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్యక్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.వైఎస్సార్సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు కోవిడ్ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది.

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.8.21 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.4.25 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి రేవతి, వర్జ్యం: ప.2.49 నుండి 4.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.14 వరకు,అమృత ఘడియలు: రా.11.47 నుండి 1.17 వరకు.సూర్యోదయం : 5.42సూర్యాస్తమయం : 6.13రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం....వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.వృషభం....ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.మిథునం...భూవివాదాలు తీరతాయి. వాహనసౌఖ్యం. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం....వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.సింహం....పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి.కన్య...పొరపాట్లు సరిదిద్దుకుని పనులు చక్కదిద్దుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సానుకూలత.తుల...ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవదర్శనాలు చేసుకుంటారు.వృశ్చికం....పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.ధనుస్సు..ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు.మకరం....పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటాయి.కుంభం... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. ఆ«లయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో కొత్త సమస్యలు. శ్రమ పెరుగుతుంది.మీనం...కార్యజయం. ఆస్తివివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆధ్యాత్మిక చింతన వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనయోగం.

యుద్ధమేఘాలు!
సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. తనకు జీవనాడి వంటి సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై పాక్ గంగవెర్రులెత్తిపోయింది. ఇది తమపై నేరుగా యుద్ధ ప్రకటనేనంటూ గగ్గోలు పెట్టింది. ప్రతీకారంగా నామమాత్రపు సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసి అక్కసు తీర్చుకుంది. భారత్‌కు తన గగనతలాన్ని మూసేయడమే గాక వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బీరాలు పలికింది. ఎడాపెడా క్షిపణి పరీక్షలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సరిహద్దుల వెంబడి సైనిక మోహరింపులను కూడా యుద్ధ ప్రాతిపదికన భారీగా పెంచేస్తోంది. మరోవైపు దాయాది ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో ‘నిర్ణాయక చర్య’లకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గురువారం చోటుచేసుకున్న పలు కీలక పరిణా మా లు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్ మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. గురువారం శ్రీనగర్‌లోని మార్కెట్ ప్రాంతంలో భద్రతా దళాల గస్తీ తాజా పరిస్థితిని వివరించడంతో పాటు పలు ‘ఇతర’ అంశాలపైనా చర్చించినట్టు చెబుతున్నారు. ప్రధాని మోదీ కూడా పహల్గాం ముష్కరులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారికి దన్నుగా నిలిచిన దుష్టశక్తినీ కటినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఊహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకు ని తీరతాం’’ అంటూ ప్రతినబూనారు. తర్వాత కా సేపటికే ‘ఆక్రమణ్’ పేరిట సైన్యం భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించింది. అత్యాధునిక రఫేల్‌తో పాటు సుఖోయ్ తదితర యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. మరోవైపు పాక్‌లో ఉన్న భారతీయులు తక్షణం తిరిగి రావాలంటూ కేంద్రం అడ్వై జరీ జారీ చేసింది. పొరుగు దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఏకాకిని చేయడమే గాక దానిపై తీసుకోబోయే ‘కఠిన’ చర్యలకు జీ20 తదితర దేశాల మద్దతు కూడగడుతోంది. పహల్గాం ఆటవిక దాడి, అందులో పాక్ ముష్కరులు పాల్గొన్న వైనం తదితరాలను జీ20 సభ్య దేశాల రాయబారులకు విదేశాంగ శాఖ పూసగుచ్చినట్టు వివరించింది. భేటీకి హాజరైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆ్రస్టేలియా, యూఏఈ తదితర దేశాల రాయబారులు దాడిని తీవ్రంగా ఖండించాయి. పాక్‌కు కరుడుగట్టిన మద్దతుదారైన చైనా కూడా భేటీలో పాల్గొనడమే గాక భారత్‌కు మద్దతు పలకడం విశేషం. మరోవైపు పహల్గాం దాడి, తదనంతర పరిస్థితులను కాంగ్రెస్ తదితర పార్టీలన్నింటితో కేంద్రం పంచుకుంది. ఉగ్ర తండాలను శాశ్వతంగా నిర్మూలించి తీరాల్సిందేనని పార్టీలన్నీ ముక్త కంఠంతో అభిప్రాయపడ్డాయి. అందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా నిలుస్తామని అఖిలపక్ష భేటీలో ప్రకటించాయి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, దానికి తోడుగా యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్ పాక్ దిశగా కదులుతున్నట్టు సమాచారం.

మెగా అగచాట్ల డీఎస్సీ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని నిబంధనలు అడ్డంకి కాగా, ఆన్‌లైన్‌లోనూ సాంకేతిక కారణాలతో దరఖాస్తుకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా సకాలంలో పని చేయడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. కఠిన నియమాలతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల కు పదవ తరగతి, ఇంటర్మీడియట్లో కూడా కనీస మార్కులు 45–50 శాతం లేకుంటే ఇన్ వ్యాలిడ్‌గా చూపిస్తోంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యార్హత అయిన డిగ్రీలో సగటు మార్కులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నా కూడా దరఖాస్తు సబ్మిట్ అవ్వడం లేదు. ఓపెన్‌లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసేందుకు వీలు పడటం లేదు. దీనికితోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఉదాహరణకు.. ఓ డీఎస్సీ అభ్యర్థి ఇంటర్మీడియట్లో అరబిక్‌ను ద్వితీయ భాషగా తీసుకుంటే.. మెగా డీఎస్సీ అప్లికేషన్లో రెండవ భాష సెలెక్ట్ చెస్తే డ్రాప్–డౌన్ మెనూలో అరబిక్ ఆప్షన్ కనిపించట్లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ‘ఏదైనా ఇతర భాష’ అనే ఆప్షన్ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్ ఇవ్వలేదు.డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్ట్ ఆప్షన్ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలిమెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. కొంత మంది నిరుద్యోగులు డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు పూరించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొర్లడంతో చూసుకోకుండానే దరఖాస్తును సబ్మిట్ చేశారు. దీంతో హాల్ టికెట్ రాదేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యసనానికి తగిన సమయం దొరికేలా డీఎస్సీ షెడ్యూల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.పోటీ పరీక్షలకు కనీస మార్కులేంటి?» విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డీఎస్సీ రాసే అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెగా డీఎస్సీలో నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరట్లేదు. » ఎస్జీటీకి ఇంటర్మీడియట్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్‌కు డిగ్రీలో 50 శాతం కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్ అభ్యర్థులకు ఐదు శాతం మినహాయింపు ఉంది. కానీ, అనేక మంది నిరుద్యోగులు టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40 శాతం కనీస అర్హత మార్కులుగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోతున్నారు. » పీజీ ఇంగ్లిష్‌లో 42.5 శాతం మార్కులు కలిగిన ఓ మహిళ కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ పొందుతోంది. ఇలాగే ఇంటర్మీడియట్లో 47.5 శాతం మార్కులున్న ఓ జనరల్ అభ్యర్థి దరఖాస్తు చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు వేచిచూస్తున్న తరుణంలో కనీస మార్కులు 50 శాతం నిర్దేశించడంతో దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు.» టెట్‌లో ఉత్తీర్ణత సాధించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. టెట్ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కనీస మార్కులతో సంబంధం లేకుండా మెగా డీఎస్సీకి అర్హత కల్పించాలని కోరుతున్నారు. టెట్ ఉత్తీర్ణులయ్యామంటే డీఎస్సీకి అర్హత ఉన్నట్లే కదా.. అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు టెట్ ఎందుకు రాయించారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి కనీస మార్కులు 40 శాతానికి తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ముష్కర మూకలను మట్టిలో కలిపేస్తాం: ప్రధాని మోదీ
మధుబని: పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు భూమండలంలో ఎక్కడ దాక్కున్నా సరే వెతికి మరీ పట్టుకొని శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న దుష్ట శక్తులకు తగిన శిక్ష విధించక తప్పదని హెచ్చరించారు. గురువారం బిహార్‌లోని మధుబనిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ ర్యాపిడ్ రైలుతోపాటు మరికొన్ని రైళ్లను ప్రారంభించారు. జాతీయ పంచాయత్ అవార్డులు ప్రదానం చేశారు. పహల్గాం మృతులకు సంతాప సూచకంగా బహిరంగ సభలో తొలుత మౌనం పాటించారు. అనంతరం మోదీ కొద్దిసేపు ఆంగ్ల భాషలో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న ముష్కరులందరినీ కచ్చితంగా శిక్షిస్తామని ప్రతిన బూనారు. ఇలాంటి దాడులు మన నైతిక స్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని అన్నారు. శత్రువులు కేవలం నిరాయుధ పర్యాటకులనే కాదు, మనదేశాన్ని లక్ష్యంగా చేసుకొనే సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. వారిని మట్టిలో కలిపేస్తామని స్పష్టంచేశారు. దేశంలో మిగిలిన ఉన్న ఉగ్రవాద శేషాన్ని తుదముట్టించే సమయం వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం ‘‘మిత్రులారా.. బిహార్ గడ్డపై నుంచి మొత్తం ప్రపంచానికి చెబుతున్నా. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్నవారు ఎక్కడ దాగి ఉన్నా సరే గుర్తించి, బంధించి, శిక్షిస్తాం. ప్రపంచం అంచుల దాకా వారిని వేటాడుతాం. కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తాం. ఉగ్రవాదులెవరూ తప్పించుకోలేరు. ముష్కర మూకలను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం. శిక్ష తప్పనిసరిగా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మన దేశమంతా ఒకే మాటపై ఉంది. మానవత్వాన్ని విశ్వసించే వారంతా మన వెంటే ఉన్నారు. ఉగ్రవాదుల హేయమైన చర్య మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు్తన్నా. వారికి దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రతికూల సమయంలో మనకు అండగా నిలిచిన ప్రపంచ దేశాల నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు.దేశమంతటా ఒకేలా ఆగ్రహావేశాలు ఉగ్రవాద దాడిలో ఎంతోమంది నష్టపోయారు. కొందరు తమ కుమారులను పోగొట్టుకున్నారు. మరికొందరు తమ సోదరులను, జీవిత భాగస్వాములను కోల్పోయారు. బాధితులు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందినవారు ముష్కరుల రాక్షసత్వానికి బలయ్యారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి దాకా దేశమంతటా ఆగ్రహావేశాలు, విచారం ఒకేలా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదు. వేగవంతమైన అభివృద్ధి కావాలంటే శాంతి, భద్రతలతో కూడిన పరిస్థితులు అత్యంత కీలకం.

తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ నుంచి రూ.9 వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యకు అనుమతించిన అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బుగ్గన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులకు స్కీంకూటమి ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ వెలుపల భారీ అప్పులు చేయడం ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని స్కీం ప్రారంభించారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులు చేయాలనేదే ఈ స్కీం. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) బాండ్స్ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీ ఎక్కువగా ఔట్ సోర్సింగ్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఆ సంస్థకు మూలధన వ్యయం పెద్దఎత్తున అవసరం లేదు. కానీ, రూ.9 వేల కోట్లు కావాలని బాండ్లు జారీ చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదు..ఇండియా రేటింగ్స్ సంస్థ ప్రభుత్వ ఆదాయం గతేడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. 1.3 శాతమే వృద్ధి కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతానికి పెరిగిందని చెప్పింది. అయినా ‘సీఈ’ రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే.. డిబెంచర్ కొనుగోలుదార్లకు డీఎస్ఆర్ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు జమయ్యేందుకు అంగీకరించడం వల్లే. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏపీ ఎండీసీ గత వార్షిక నివేదికలో 9 నెలలకు రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉంది. 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు వస్తుంది. కానీ వీరు చేస్తున్న అప్పులు, డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగా పెట్టే 6 నెలల నిల్వలతో కలిపి చూస్తే రూ.10 వేల కోట్లు. వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువ. దీనిని ఏ బ్యాంక్ కూడా అంగీకరించదు.గతంలో ఎక్కడా లేని విధానం..ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఖజానాలో ఏ కారణంతో అయినా నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసినవారికి వెళ్లిపోతాయి. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల కోసం ముందుగానే నిర్దేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం.. అంటే మూడో భాగం కచ్చితంగా ఉంచాలి. ఇలా ప్రతి నెల ఉంచాలి. ఇదికాకుండా డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్(డీఎస్ఆర్ఏ) ఖాతాలో 6 నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలి. ఈ నిధులు తగ్గిపోతే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేరుగా బాండ్లు కొన్నవారికి వెళ్లిపోతాయి. ⇒ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే.. గనులను తాకట్టులో ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. నాడు బెవరేజెస్ కార్పొరేషన్‌పై అప్పులు తెస్తే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇవాళ గనులను తాకట్టుపెట్టడమే కాక... ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలన్నింటినీ తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీ రెవెన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చేలా నిబంధన పెట్టారు. ఆ ఖాతాను సంపూర్ణంగా అప్పుల కోసం తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీకి వచ్చే ఒక్క రూపాయి అయినా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు.మిసిలేనియస్ జనరల్ హెడ్‌కు ఇంత భారీ కేటాయింపులా?2025–26 రాష్ట్ర బడ్జెట్లో మిసిలేనియస్ జనరల్ హెడ్–0075 కింద ప్రభుత్వం రూ.7,916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్మెంట్కు కేటాయించని ఖర్చులు. చిన్న చిన్న వ్యయాలకు ఈ నిధులను వాడతారు. ఈ హెడ్ కింద 2016 –17లో రూ.131 కోట్లు, 2017 –18లో రూ.307 కోట్లు, 2018 –19లో 135 కోట్లుగా ఉండేది. 2023–24లో రూ.153 కోట్లు, 2024–25లో రూ.226 కోట్లు చూపించారు. కానీ, మొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్ కింద 2025–26కి గానూ రూ.7,916 కోట్లుగా చూపించారు. అంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్లో చూపించి కూటమి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకు ఇష్టం వచ్చినట్లు వాడేందుకు సిద్ధమయ్యారు. ⇒ గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఇలాగైతే చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరి తీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. ఏపీఎండీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే?తాజా అప్పులూ రాష్ట్ర అప్పుల పరిమితి కిందకేఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7 శాతం కన్నా తక్కువ వడ్డీ పడుతుంది. కానీ ప్రభుత్వం తాజాగా చేయబోయే అప్పు కూడా దీని కిందే వస్తుంది, కానీ దాదాపు 10 శాతం వడ్డీ పడుతుంది. దీనికి బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్‌గా తీసుకుని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293(1), 293(3), 203, 204 ఆర్టికల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అధికారులు దీనిని గుర్తించాలి.ఇదేనా సంపద సృష్టి అంటే?రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీలు అబద్ధాలు చెప్పాయి. మొదట్లో రూ.14 లక్షల కోట్ల అప్పులన్నారు. తరువాత రోజుకో రకంగా అప్పులపై అంకెలను మారుస్తూ మట్కా లెక్కల స్థాయికి తెచ్చారు. వైఎస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.3,32,500 కోట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశారు. 11 నెలలకు రూ.90 వేల కోట్ల మేరకు ఆర్బీఐ ద్వారా అప్పు చేసింది. మార్చి 2025లో రూ.8 వేల కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్ల అప్పు చేశారు. అమరావతి అప్పులు, బాండ్లు, మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిస్ అప్పులు తదితర అన్నీ కలిపితే రూ.1,47,655 కోట్లు అప్పులు చేశారు. ఈ సొమ్ము ఎక్కడకు వెళ్ళింది? మా ప్రభుత్వ హయాంలో ఏటా పేదలకు సంక్షేమ పథకాలను అందించాం. ఈ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. మరి అప్పులు చేసిన సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉద్యోగుల సొమ్ము రూ.76,516 కోట్లు వాడుకుంది.

ఆ హామీ ఏమైంది?
కశ్మీర్లో శాంతి ప్రక్రియ తన నాయకత్వంలో సాధారణ స్థితికి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ గత కొంతకాలంగా పలు సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. కశ్మీర్‌కు శాంతిని తెస్తానన్నది జమ్ము–కశ్మీర్ విషయంలో మోదీ ఇచ్చిన ప్రధానమైన హామీ. కానీ ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ప్రధాని ఎంత పొరబడ్డారో చూపించింది. పౌరులపై ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇది. ఇందులో 26 మంది పర్యాటకులు నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఈ దాడి ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీర్ఘకాల వేదనలను పరిష్కరించనప్పుడు అవి ఏదో ఒక రూపంలో బయటపడతాయి. తగ్గని ఉగ్రచర్యలుఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మోదీ, అమిత్ షా ద్వయం పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారానే దాని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కానీ అది జరగలేదని తాజా ఉగ్రదాడి తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ఈ నేపథ్యంలో తన సౌదీ పర్యటన నుండి అర్ధంతరంగా వెనుదిరిగిన మోదీ యథాప్రకారం కశ్మీర్ లోయలో హింసను ఖండించారు. ఆ ఘటన వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని హెచ్చరించారు. మరో వైపున పహల్గామ్ దాడి ఇటీవలి కాలంలో పౌరులపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందన అన్నట్లుగా, ముస్లింలు అధికంగా ఉన్న కశ్మీర్‌లోని పాఠశాలలు, దుకాణాలను మూసి వేశారు. పహల్ గామ్ దాడి చెదురుమదురు ఘటన కానే కాదు. లోయలో ఉగ్రవాద చర్యలు ఎన్నడూ తగ్గు ముఖం పట్టలేదని సూచిస్తూ ఇటీ వల పలు హింసా ఘటనలు జరుగుతూ వచ్చాయి. కానీ అవి పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. 2019లో కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కశ్మీర్లో హింసా కాండను అంతం చేయడమే ప్రత్యేక హోదా రద్దుకు కారణం అని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. దాని కొనసాగింపుగానే గత ఫిబ్రవరి 24న అమిత్ షా ఒక ప్రకటన చేస్తూ జమ్మూ కశ్మీర్లో ఏర్పడిన శాంతిని శాశ్వత శాంతిగా మార్చాలి అన్నారు. అయితే కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు తూర్పున 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ ఉగ్రదాడి ఆ రాష్ట్రంలో శాశ్వత శాంతి ఇంకా ఏర్పడలేదని స్పష్టంగా చూపించింది.ఈ ఘటనకు తామే కారణమని లష్కర్–ఎ–తోయిబా అనుబంధ సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ ప్రకటనలోని నిజానిజాలు వెంటనే తేలకపోయినా, ఈ దాడి భారత, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. పర్యాటకుల ప్రాణనష్టం పట్ల పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పాక్ ప్రభుత్వానికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిగా పాకిస్తాన్‌తో దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత ప్రభుత్వం, ఆ దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించడానికి పూనుకుంది.బలహీనమైన కశ్మీర్కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసమే ఆ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని రద్దుచేసినట్లు మోదీ తమ ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. కానీ కశ్మీర్ భూభాగంలో పెట్టుబడులు నేటికీ పరిమితంగానే ఉన్నాయన్నది గ్రహించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, మోదీ పదవీకాలంలో కశ్మీరీలు మరింత బలహీనంగా మారారు. లక్షలాది మంది సైనికులు కాపలా కాస్తున్న ఈ ప్రాంతంలో హిందువులు స్థిర నివాసం ఏర్పర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కశ్మీర్ లోయ జనాభా దామాషాను మార్చే ఈ లక్ష్యాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బయటి జనాభా లోయలోకి వస్తే తమ ఉద్యోగాలు, భూయాజమాన్య హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు భీతిల్లుతున్నారు. అదే సమయంలో నిరంతర దర్యాప్తులు, అణచివేత విధానాల మధ్యనే వారు జీవిస్తున్నారు. విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఉండటానికి, భారత ప్రభుత్వం కఠినమైన ప్రయాణ నిషేధాలను, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద ఏకపక్ష నిర్బంధాలను ఉపయోగిస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది కశ్మీర్ ఎన్నికల సందర్భంలో పేర్కొంది.ఈ ఉగ్రదాడి, చాలా కాలంగా నలుగుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభు త్వానికి అవకాశాన్నిస్తోంది. నిజానికి మోదీ మొదటి ఉద్దేశ్యం ఈ ప్రాంతాన్ని మరింతగా దిగ్బంధించడమే. అలా చేస్తే అది పొరపాటవుతుంది. 2019లో భారత ప్రభుత్వం విధించిన అన్ని ఆంక్షలూ... ఇంటర్నెట్ సేవలను దీర్ఘకాలికంగా నిలిపివేయడం, రాజకీయ నేతలను నిర్బంధించడంతో పాటు లాక్‌డౌన్‌ని కఠినంగా అమలు చేయడం వంటివి ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రేపాయి. ఆ చర్యలను క్రమంగా ఎత్తివేశారు, అయినా నష్టం జరిగిపోయింది. మరోపక్క ప్రధాన స్రవంతిలో, సోషల్ మీడి యాలో అదుపు లేకుండా ముస్లిం వ్యతిరేక భావన కొనసాగుతోంది. మోదీ దాన్ని చూసీచూడనట్టు వదిలే యాలని భావిస్తే కష్టమే. భారతీయులందరికీ నాయకుడిగా ఆయన వ్యవహరించాలి. సంయమనం పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వాలి. ఇప్పటికే ప్రతీకారదాడి అంటూ భావోద్వేగాలతో జనం ఊగిపోతున్నారు. ఆచితూచి వ్యవహరించడమే అంతర్జాతీయంగా ముఖ్యమని గ్రహించాలి.కరిష్మా వాస్వానీ వ్యాసకర్త ఆసియా వ్యవహారాల నిపుణురాలు

చిన్నస్వామిలో బెంగళూరు చిందు
రాజస్తాన్ విజయానికి చివరి 3 ఓవర్లలో 40 పరుగులు కావాలి... భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్లో జురేల్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులకు మారడంతో గెలుపు ఖాయమనిపించింది. అయితే 19వ ఓవర్లో హాజల్‌వుడ్ ఒకటే పరుగు ఇచ్చి 2 వికెట్లు తీయడంతో రాయల్స్ ఆశలు కోల్పోయింది. చివరి ఓవర్లో దయాళ్ 5 పరుగులే ఇచ్చాడు. దాంతో ఈ సీజన్లో చిన్నస్వామి మైదానంలో ఆడిన నాలుగో మ్యాచ్‌లో బెంగళూరుకు తొలి గెలుపు దక్కగా ...విజయానికి చేరువగా వచ్చి రాజస్తాన్ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు వీరిద్దరు 51 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 49; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా ... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజల్‌వుడ్ (4/33) ప్రత్యర్థిని పడగొట్టడంతో కీలక పాత్ర పోషించాడు. సమష్టి ప్రదర్శన... బెంగళూరుకు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 26; 4 ఫోర్లు), కోహ్లి శుభారంభం అందించడంతో ఆ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి 59 పరుగులు సాధించింది. హసరంగ తొలి ఓవర్లోనే సాల్ట్‌ను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ మరింత దూకుడుగా ఆడాడు. మరోవైపు కోహ్లి... సందీప్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 32 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం వరుసగా పరాగ్, దేశ్‌పాండే వేసిన రెండు ఓవర్లలో కోహ్లి, పడిక్కల్ కలిసి 5 భారీ సిక్స్‌లతో మొత్తం 37 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత 11 బంతుల వ్యవధిలో 7 పరుగులు మాత్రమే చేసిన జట్టు కోహ్లి, పడిక్కల్, పాటీదార్ (1) వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ దూకుడు... భారీ ఛేదనలో రాజస్తాన్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది. తొలి బంతికే సిక్స్ కొట్టిన జైస్వాల్... దయాళ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత హాజల్‌వుడ్ ఓవర్లోనూ అతను వరుసగా మూడు ఫోర్లు బాదాడు. రెండు సిక్స్‌లతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (16) ఎక్కువ సేపు నిలవలేదు. అనంతరం హాజల్‌వుడ్ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన జైస్వాల్ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో రాయల్స్ 72 పరుగులు రాబట్టడం విశేషం. ఆ తర్వాత మరో రెండు ఓవర్లు నితీశ్ రాణా (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), రియాన్ పరాగ్ (10 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించడంతో 49 బంతుల్లోనే స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాయల్స్‌ను నిలువరించడంలో సఫలమైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) హెట్‌మైర్ (బి) హసరంగ 26; కోహ్లి (సి) రాణా (బి) ఆర్చర్ 70; పడిక్కల్ (సి) రాణా (బి) సందీప్ 50; టిమ్ డేవిడ్ (రనౌట్) 23; పాటీదార్ (సి) జురేల్ (బి) సందీప్ 1; జితేశ్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–61, 2–156, 3–161, 4–163, 5–205. బౌలింగ్: ఆర్చర్ 4–0–33–1, ఫారుఖీ 3–0–30–0, తుషార్ దేశ్‌పాండే 2–0–36–0, సందీప్ శర్మ 4–0–45–2, హసరంగ 4–0–30–1, పరాగ్ 3–0–30–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) షెఫర్డ్ (బి) హాజల్‌వుడ్ 49; వైభవ్ (బి) భువనేశ్వర్ 16; రాణా (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 28; పరాగ్ (సి) జితేశ్ (బి) కృనాల్ 22; జురేల్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 47; హెట్‌మైర్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 11; శుభమ్ దూబే (సి) సాల్ట్ (బి) దయాళ్ 12; ఆర్చర్ (సి) పాటీదార్ (బి) హాజల్‌వుడ్ 0; హసరంగ (రనౌట్) 1; దేశ్‌పాండే (నాటౌట్) 1; ఫారుఖీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–52, 2–72, 3–110, 4–134, 5–162, 6–189, 7–189, 8–189, 9–191. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–50–1, యశ్ దయాళ్ 3–0–33–1, హాజల్‌వుడ్ 4–0–33–4, రొమారియో షెఫర్డ్ 1–0–15–0, సుయాశ్ శర్మ 4–0–31–0, కృనాల్ పాండ్యా 4–0–31–2. ఐపీఎల్లో నేడుచెన్నై X హైదరాబాద్‌వేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

ట...ట...ట... నిజమౌనా?
ఫలానా హీరో–హీరోయిన్ కాంబినేషన్ కుదిరింద‘ట’... ఓ పాట సెట్ కోసం ఐదువందల మందికి పైగా పని చేస్తున్నార‘ట’... ఆ డైరెక్టర్ 60 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడ‘ట’... ఆ స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో విలన్‌గా ఫిక్స్ అయ్యాడ‘ట’... ఇలా సినిమా పరిశ్రమ గురించి రోజుకో ‘ట...ట...ట...’ అంటూ వార్తలు ప్రచారంలో ఉంటాయి. మరి... ఈ ప్రచారంలో ఉన్న ఈ ‘ట’లు నిజమౌనా? అనేది తెలియాలంటే మాత్రం యూనిట్ చెప్పాల్సిందే. ఇక ప్రస్తుతం ఆ నోటా ఈ నోటా విహారం చేస్తున్న కొన్ని ‘ట’ల గురించి ఓ లుక్కేద్దాం.హీరో మహేశ్‌బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పంథాకి భిన్నంగా ఈ చిత్రాన్ని అతి వేగంగా పూర్తి చేసేం దుకు రాజమౌళి షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ఉన్న మహేశ్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారాయి. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలోని కోరాపుట్‌లో రెండు షెడ్యూల్స్‌ని మెరుపు వేగంతో పూర్తి చేసిన రాజమౌళి మూడవ షెడ్యూల్‌కి సిద్ధం అయ్యారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు 550 మంది పని చేస్తున్నారని టాక్. ఈ సెట్లో త్వరలోనే ఓ భారీ సాంగ్‌ని చిత్రీకరించనున్నారట రాజమౌళి. ఈ పాట సినిమాలో హైలైట్ అవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు కూడా గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రజనీకాంత్‌కి విలన్‌గా... రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ చిత్రంలో ఫాహద్‌ది పాజిటివ్ క్యారెక్టర్. ఒక రకంగా చెప్పాలంటే రజనీ పాత్రకు హెల్ప్‌ఫుల్‌గా ఉండే పాత్ర. అయితే ఇప్పుడు రజనీకాంత్‌కి విలన్‌గా మారారట ఫాహద్. ఏ సినిమాలో అంటే ‘జైలర్ 2’లో అని సమాచారం. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్లో ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఫాహద్‌ని విలన్‌గా ఎంపిక చేశారని టాక్. ఇటీవల కేరళలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. తదుపరి షెడ్యూల్లో ఫాహద్ పాల్గొంటారట. అప్పుడు ఈ చిత్రంలో ఫాహద్ విలన్‌గా నటిస్తున్న విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించాలని అనుకుంటోందని సమాచారం. సూర్య–కీర్తి మళ్లీ కుదిరేనా? సూర్య–కీర్తీ సురేష్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటోంది తమిళ పరిశ్రమ. ఈ ఇద్దరూ జంటగా ‘తానా సేంద కూట్టమ్’ (2018) అనే చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో సినిమా రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యకి జోడీగా కీర్తీ సురేష్ నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘796 సీసీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రీ ్రపొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా కీర్తీ సురేష్‌ను ఎంపిక చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి... ఈ వార్తలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. తమిళ దర్శకుడితో... హీరో కల్యాణ్ రామ్ జోరు మీదున్నారు. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఈ నెల 18న విడుదలై, హిట్‌గా నిలిచింది. తన తర్వాతి చిత్రాన్ని తమిళ దర్శకుడు గిరీశాయతో చేయనున్నారట కల్యాణ్ రామ్. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేశారు గిరీశాయ. ఈ సినిమా కోలీవుడ్‌లోనూ హిట్‌గా నిలిచింది. కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ (2022) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు గిరీశాయ. తాజాగా కల్యాణ్ రామ్ కోసం ఓ కథని సిద్ధం చేశారట ఆయన. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సాగే ఈ కథ కల్యాణ్ రామ్‌కి కూడా నచ్చిందట. దీంతో తన తర్వాతి మూవీని గిరీశాయ దర్శకత్వంలో చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తర్వాత ‘బింబిసార 2’ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే డైరెక్టర్ వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతో ‘బింబిసార 2’ మొదలయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈలోపు గిరీశాయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్ ఆసక్తిగా ఉన్నారని టాక్. ఇక కల్యాణ్ రామ్, గిరీశాయ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అరవై రోజుల్లో... డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలే వేరు. సినిమాలను జెట్ స్పీడ్‌లో తెరకెక్కిస్తారనే పేరుంది ఆయనకి. ఎంత పెద్ద సినిమా అయినా మూడు నాలుగు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేస్తుంటారు. అయితే తన తాజా చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట పూరి. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారట. అందుకే ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను లాక్ చేశారని టాక్. మే లేదా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లో పూర్తి చేయాలన్నది పూరి జగన్నాథ్ ఆలోచన అట. ఎందుకంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూరీని కోరారట. అందుకు తగ్గట్టు జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేసేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట పూరి జగన్నాథ్. రీమేక్ చిత్రంతో... వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రాజశేఖర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన తర్వాతి సినిమా ఏంటి? అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘శేఖర్’. ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 మే 20న విడుదలైంది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ (2023) సినిమాలో కీలక పాత్రలో కనిపించారు రాజశేఖర్. ఆ చిత్రం విడుదలై ఏడాదిన్నర దాటినా రాజశేఖర్ తర్వాతి సినిమాపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే... తమిళంలో ఘన విజయం సాధించిన ‘లబ్బర్ పందు’ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ‘లబ్బర్ పందు’ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 20న తమిళంలో రిలీజై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారట రాజశేఖర్. పెళ్లీడుకి వచ్చిన కూతురు ఉన్న ఒక వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని ప్రేమించే అబ్బాయికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్, ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్‌లో హిట్‌గా నిలిచింది. ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథ, కథనంలో మార్పులు చేసి, రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజశేఖర్. మరి... ఈ వార్తల్లో వాస్తవం ఏంటన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.– డేరంగుల జగన్ మోహన్
టూర్.. డర్!
ప్రభాస్ ది రాజాసాబ్.. టీజర్ రిలీజ్‌పై హింట్ ఇచ్చిన డైరెక్టర్!
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. గెలుపు ఎవరిది?
ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
ఫోన్‌కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి
ఎన్టీఆర్‌తో స్పెషల్ డ్యాన్స్?
ట...ట...ట... నిజమౌనా?
ప్రాణాలు కాపాడిన ఉప్పు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
మళ్లీ ఉగ్ర కాండ!
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
నీళ్లతో మనకేం పని! మనం తాగేది రక్తం కదా!!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
యుద్ధమేఘాలు!
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ఆ హామీ ఏమైంది?
మెగా అగచాట్ల డీఎస్సీ!
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్..
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్‌కు సెహ్వాగ్ కౌంటర్
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి: కమిన్స్
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
చిన్నస్వామిలో బెంగళూరు చిందు
కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే: అఖిలపక్ష భేటీలో రాహుల్
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
‘పది’పోయిన ఫలితాలు
పహల్గాం ఉగ్ర దాడి.. హైదరాబాద్‌లో హైఅలర్ట్
ప్రాణాలు కాపాడిన ఉప్పు
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
వైమానిక దాడికి రెడీనా ?
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
జగిత్యాలకు రెడ్ అలర్ట్
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్ జగన్
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
"గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
గద్వాలకు.. ప్రత్యేక సం‘స్థానం’
బాలకృష్ణ, నాగార్జున, బన్నీ..అందరికీ అదే పిచ్చి!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
‘భూదాన్’పై సీబీఐ విచారణ!
7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
గన్నవరం విమానాశ్రయం రికార్డు
‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
కట్టుకున్న భార్యలను కడతేర్చారు..
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
గెలిచి నిలిచేనా!
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
జీ20 దేశాల మద్దతు కూడగడుతున్న భారత్
రంగంలోకి యుద్ధనౌకలు!
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
మేఘా ఇంజనీరింగ్‌కు భారీ కాంట్రాక్టు
హైబ్రిడ్ తీవ్రవాదం
భద్రతా లోపాలు నిజమే
కశ్మీర్లో ఎన్కౌంటర్.. జవాను వీరమరణం
క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్
బంగారం డిమాండ్‌కు ‘ధరా’ఘాతం!
దాడిని తీవ్రంగా ఖండించిన అరబ్ దేశాలు
టూర్.. డర్!
ప్రభాస్ ది రాజాసాబ్.. టీజర్ రిలీజ్‌పై హింట్ ఇచ్చిన డైరెక్టర్!
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. గెలుపు ఎవరిది?
ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
ఫోన్‌కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి
ఎన్టీఆర్‌తో స్పెషల్ డ్యాన్స్?
ట...ట...ట... నిజమౌనా?
ప్రాణాలు కాపాడిన ఉప్పు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
మళ్లీ ఉగ్ర కాండ!
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
నీళ్లతో మనకేం పని! మనం తాగేది రక్తం కదా!!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
యుద్ధమేఘాలు!
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ఆ హామీ ఏమైంది?
మెగా అగచాట్ల డీఎస్సీ!
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్..
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్‌కు సెహ్వాగ్ కౌంటర్
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి: కమిన్స్
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
చిన్నస్వామిలో బెంగళూరు చిందు
కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే: అఖిలపక్ష భేటీలో రాహుల్
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
‘పది’పోయిన ఫలితాలు
పహల్గాం ఉగ్ర దాడి.. హైదరాబాద్‌లో హైఅలర్ట్
ప్రాణాలు కాపాడిన ఉప్పు
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
వైమానిక దాడికి రెడీనా ?
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
జగిత్యాలకు రెడ్ అలర్ట్
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్ జగన్
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
"గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
గద్వాలకు.. ప్రత్యేక సం‘స్థానం’
బాలకృష్ణ, నాగార్జున, బన్నీ..అందరికీ అదే పిచ్చి!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
‘భూదాన్’పై సీబీఐ విచారణ!
7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
గన్నవరం విమానాశ్రయం రికార్డు
‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
కట్టుకున్న భార్యలను కడతేర్చారు..
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
గెలిచి నిలిచేనా!
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
జీ20 దేశాల మద్దతు కూడగడుతున్న భారత్
రంగంలోకి యుద్ధనౌకలు!
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
మేఘా ఇంజనీరింగ్‌కు భారీ కాంట్రాక్టు
హైబ్రిడ్ తీవ్రవాదం
భద్రతా లోపాలు నిజమే
కశ్మీర్లో ఎన్కౌంటర్.. జవాను వీరమరణం
క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్
బంగారం డిమాండ్‌కు ‘ధరా’ఘాతం!
దాడిని తీవ్రంగా ఖండించిన అరబ్ దేశాలు
సినిమా

పహల్గామ్ ఘటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తీవ్రమైన బాధతో రాస్తున్నా!
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. పర్యాటకులపై జరిగిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తలచుకుంటే తనకు మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. కశ్మీర్‌పై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి అత్యంత క్రూరమైన చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ రెండు పేజీల సందేశాన్ని ట్వీట్ చేశారు.ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఏప్రిల్ 22, 2025.. పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రాంతమైన పహల్గామ్లో నెత్తురు చిందిన రోజు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె పగిలింది. ఈ దారుణమైన చర్యను చెప్పడానికి నకాు మాటలు కూడా రావడం లేదు. అందుకే బాధతో కూడిన హృదయంతోనే రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంంగా కాల్చి చంపారు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితికి గురయ్యారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రతి కశ్మీర్‌పై దాడి. శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా చేసిన దారుణచర్య. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది' అని రాసుకొచ్చారు.ఇలాంటి దారుణ ఘటనలు జరిగిన ప్రతిసారీ మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమానాలు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో అస్సలు క్షమించం.. ఇది నిజంగా భయంకరమైన చర్య.. అంతకుమించి పిరికిపంద చర్య. ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మన ఇంటిలో జరిగిన ఈ కృరమైన చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఇలాంటి చర్యల పట్ల ఎలాంటి సమర్థన లేదు. ఉగ్రవాదులు ఏం ఆశించి ఇంత దారుణానికి ఒడిగట్టారో తెలియదు. మీ చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసిందని.. ఎంతోమంది పిల్లలను అనాథలుగా మార్చిందని ప్రకాశ్ రాజ్ అవేదన వ్యక్తం చేశారు.కశ్మీర్ ఆట స్థలం కాదు.. యుద్ధం క్షేత్రం అంతకన్నా కాదని అన్నారు. మీరు ఉపయోగించుకునే ఆయుధం కాదు.. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశమే కశ్మీర్ అని తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు అనుభవించే బాధ వారి ఒక్కరిదే కాదు. మా అందరిది. మీతో పాటు మీరు కోల్పోయిన దానికి మేము చింతిస్తున్నామని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. మీరు కశ్మీర్లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు.. కానీ మిమ్మల్ని కాపాడలేకపోయినందుకు క్షమించమని అడుగుతున్నామని ప్రకాశ్‌రాజ్ పోస్ట్ చేశారు. Listen to this Voice from Kashmir . 🙏🏿🙏🏿🙏🏿💔💔💔 #PahalgamTerrorAttack pic.twitter.com/CJGsXcy3O1— Prakash Raj (@prakashraaj) April 24, 2025

రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
రామాయణ సినిమాలో సాయిపల్లవి కంటే ముందు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)కే సీతగా నటించే ఛాన్స్ వచ్చిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన శ్రీనిధి అవి నిజమేనంటోంది. హిట్ 3 సినిమా ప్రమోషన్స్‌లో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. రామాయణ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇప్పుడీ విషయం చెప్పొచ్చనే అనుకుంటున్నాను.స్క్రీన్ టెస్ట్ పూర్తిరామాయణ సినిమా (Ramayana Movie)లో మొదట నన్నే సీతగా అనుకున్నారు. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. మూడు సన్నివేశాల కోసం నేను ప్రాక్టీస్ కూడా చేశాను. నా యాక్టింగ్‌కు మంచి స్పందనే వచ్చింది. అందరూ నా నటనను చూసి మెచ్చుకున్నారు. యష్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నాడని తెలిసింది. సరిగ్గా అప్పుడే కేజీఎఫ్ 2 రిలీజైంది. మా జోడీ జనాలకు బాగా నచ్చేసింది. అలాంటప్పుడు ఈ మూవీలో యష్ రావణుడిగా.. నేను సీతగా నటిస్తే జనాలు ఎలా స్వీకరిస్తారని ఆలోచించాను. అవకాశం చేజారిందంటే..కచ్చితంగా వాళ్లు మమ్మల్నిలా చూసి జీర్ణించుకోలేరేమో అనిపించింది. ఈ సినిమా మాకు వర్కవుట్ అవొచ్చు, కాకపోవచ్చు అనుకున్నాను. ఏదేమైనా సీత పాత్రకు సాయిపల్లవి (Sai Pallavi) పూర్తి న్యాయం చేయగలదు. తనను సీతగా చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మనకు ఏదైనా కలిసొచ్చిందంటే (అవకాశం వచ్చిందంటే) సంతోషపడాలి.. అది చేజారిందంటే.. ఇంకోచోట మనకోసం ఏదో అవకాశం వేచి ఉందని అనుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది.సినిమాశ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాల్ని అందుకుంది. ఈ బ్యూటీ హిట్: ద థర్డ్ కేస్‌తో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది.చదవండి: బిగ్‌బాస్ షో హోస్ట్‌గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే!

పెళ్లిరోజు.. భార్యకు ఊహించని బహుమతిచ్చిన హీరో విజయ్ తండ్రి
పుట్టినరోజు, పెళ్లి రోజు వచ్చిందంటే చాలు.. భార్యాభర్తలు ఏదో ఒక బహుమతి ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ దర్శకుడు కూడా అదే పని చేశాడు. కాకపోతే 79 ఏళ్ల వయసులోనూ పెళ్లిరోజును గుర్తుపెట్టుకుని మరీ సతీమణికి ప్రేమగా బహుమతివ్వడం అందర్నీ ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎస్ఏ చంద్రశేఖర్ (S A Chandrasekhar).ప్రముఖ డైరెక్టర్లు ఈయన దగ్గర పనిచేసినవాళ్లేఈ కోలీవుడ్ డైరెక్టర్.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని దాదాపు 70 సినిమాలు తెరకెక్కించాడు. తెలుగులో చట్టానికి కళ్లు లేవు, పల్లెటూరి మొనగాడు, దోపడి దొంగలు, దేవాంతకుడు వంటి చిత్రాలను రూపొందించాడు. డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఈయన దగ్గర సెంతిల్నాథన్, సి.రంగనాథన్, పవిత్రన్, ఎస్.శంకర్, ఎం. రాజేశ్ సహా పలువురు డైరెక్టర్లు అసిస్టెంట్‌గా పనిచేశారు.BMW కారు గిఫ్ట్చంద్రశేఖర్.. తన కుమారుడు విజయ్ (Vijay)ను హీరోగా వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడతడు దళపతిగా రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన విషయం తెలిసిందే! చంద్రశేఖర్ భార్య పేరు శోభ. తాజాగా వీళ్లు పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు భాగస్వామికి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్‌గా కారు ఇచ్చానంటూ ఓ వీడియో షేర్ చేశాడు. బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న చంద్రశేఖర్.. అందులో భార్యను ఎక్కించుకుని డ్రైవ్ చేశాడు. ఇది చూసిన అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by S A Chandrasekhar (@dir_sac) చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి

చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
ధనశ్రీ వర్మ పేరు దాదాపు అందరికీ సుపరిచితమైన పేరు. ఇటీవలే భారత క్రికెటర్ చాహల్‌తో విడాకులు తీసుకుంది. 2020లో చాహల్‌ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగమ్మ ఐదేళ్లకే తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పేసింది. అయితే కెరియర్ పరంగా ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ సంగతులేంటో చూసేద్దాం.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో బలగం తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే ధనశ్రీ వర్మ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో ధనశ్రీ వర్మ కనిపించింది. ఈ సినిమాలో చాహల్ మాజీ భార్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.కాగా.. ముంబయిలో పుట్టి పెరిగిన ధనశ్రీ డెంటిస్ట్‌గా వైద్య రంగంలో వృత్తిని కొనసాగించారు. నృత్యంపై తనకున్న అభిరుచితో లెజెండరీ కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తానే సొంతంగా డ్యాన్స్ అకాడమీని స్థాపించారు. ధనశ్రీ వర్మ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ధనశ్రీ డిసెంబర్ 22, 2020న భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకుంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవలే విడాకులు తీసుకున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్..
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేయగల్గింది. రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్, యశ్ దయాల్ తలా వికెట్ సాధించారు.అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను విరాట్ ఊతికారేశాడు. ఫిల్ సాల్ట్, పడిక్కల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. విరాట్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉టీ20 క్రికెట్లో ఒకే వేదికపై 3500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 105 టీ20 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 3500 పరుగులు చేశాడు.టీ20ల్లో ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..3500 - బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ(భారత్)3373 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)3253 - రోజ్ బౌల్, సౌతాంప్టన్‌లో జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్)3241 - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్‌లో అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)3238 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)👉అదేవిధంగా టీ20 క్రికెట్లో మొదట బ్యాటింగ్ చేసిన సందర్బాల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 62 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ బాబర్(61) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాబర్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.👉ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే..62 - విరాట్ కోహ్లీ*61 - బాబర్ అజామ్57 - క్రిస్ గేల్55 - డేవిడ్ వార్నర్52 - జోస్ బట్లర్52 - ఫాఫ్ డు ప్లెసిస్

ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్‌కు సెహ్వాగ్ కౌంటర్
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 6 ఓటుమలతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదివ స్ధానంలో కొనసాగుతోంది. కాగా ఎస్ఆర్హెచ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్,అమిత్ మిశ్రాలు క్రిక్‌బజ్ లైవ్ షోలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా అమిత్ మిశ్రాకు సెహ్వాగ్ కౌంటరిచ్చాడు.అసలేమి జరిగిందంటే?పోస్ట్ మ్యాచ్ లైవ్ షోలో మిశ్రా, సెహ్వాగ్‌లు సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు గురించి చర్చించారు. అయితే మిశ్రా మాత్రం ఈ అంశం నుండి దృష్టి మరల్చి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ప్లేఆఫ్‌కు చేరుకునే వారి అవకాశాల గురించి మాట్లాడాడు."సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు అసాధ్యం అనుకుంటున్నాను. వారు ప్రస్తుతం ఆడుతున్న క్రికెట్ బ్రాండ్ ప్రకారం.. వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలవడం కష్టం. ఒకవేళ గెలవాలంటే చెన్నై అన్ని విభాగాల్లోనూ బాగా రాణించాలి. ధోని బ్యాటింగ్‌కు వస్తే కనీసం 30 బంతులు ఆడాలి. వారి టాప్ ఆర్డర్ కూడా రాణించాలి" అని మిశ్రా పేర్కొన్నాడు. వెంటనే సెహ్వాగ్ జోక్యం చేసుకుని ప్రశ్న సీఎస్కే గురుంచి కాదు, ఎస్ఆర్హెచ్ గురించి అని మిశ్రాతో అన్నాడు. దీంతో మిశ్రా వెంటనే క్షమాపణలు చెప్పాడు. అందుకు ఇదంతా ధోనికి ఉన్న పేరు వల్లే అంటూ సెహ్వాగ్ సమాధానమిచ్చాడు.చదవండి: అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్

IPL 2025: రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం..
RCB vs RR Live Updates:రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం..చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేయగల్గింది.రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్, యశ్ దయాల్ తలా వికెట్ సాధించారు.అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.16 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 160/416 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో షిమ్రాన్ హెట్‌మైర్(11), ధ్రువ్ జురెల్(31) ఉన్నారు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. దూకుడుగా ఆడుతున్న యశస్వి జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 49 పరుగులు చేసిన జైశ్వాల్.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన సూర్యవంశీ.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(35), రాణా(6) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(35),సూర్యవంశీ(10) ఉన్నారు.చెలరేగిన విరాట్, పడిక్కల్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు..17వ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్‌లో ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. దేవ్‌దత్త్ పడిక్కల్(50), పాటిదార్(1) ఔటయ్యారు. 18 ఓవర్లకు ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజులో జితేష్ శర్మ(9), టిమ్ డేవిడ్(14) ఉన్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్‌విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన కోహ్లి.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 15.1 ఓవర్లకు ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(50), టిమ్ డేవిడ్(0) ఉన్నారు.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ..రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లి 56 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు పడిక్కల్(29) ఉన్నాడు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్..61 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. హసరంగా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(28), పడిక్కల్(1) ఉన్నారు.2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 18/02 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(5), సాల్ట్(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగగా.. ఆర్సీబీ ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఆర్సీబీ ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్రాజస్తాన్ యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
బిజినెస్

బీమా ప్రీమియం రేట్ల నోటిఫికేషన్లో జాప్యం
మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2025-26 సంవత్సరానికి సవరించిన మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల వివరాలు ఇంకా విడుదల కాకపోవడంతో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మధ్య సంప్రదింపుల తర్వాత సాధారణంగా ఈ రేట్లను ప్రకటిస్తారు.ప్రస్తుతానికి అయితే బీమా సంస్థలు గత ఏడాది రేట్ల ఆధారంగానే ప్రీమియంలను వసూలు చేస్తున్నాయి. త్వరలో వెలువడే సవరించిన రేట్లు ప్రస్తుతం కంటే ఎక్కువగా ఉంటే బీమా సంస్థలు నష్టపోయే ప్రమాదం ఉంది. అదే రేట్లు తక్కువగా ఉంటే వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఇప్పటికే తన సిఫార్సులను పూర్తి చేసిందని, తదుపరి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఐఆర్డీఏఐ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తొలుత ఈ రేట్లను 2025 మార్చి 31 లోపు విడుదల చేయాలని అధికారులు భావించారు. వాటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ రేట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. అయితే ఈసారి కొన్ని వాహన కేటగిరీలకు 10-15% ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపివేత.. కారణం..గత ఐదేళ్లలో థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు 2-4% వరకు స్వల్పంగా పెరిగాయి. కానీ బీమా సంస్థలు ఈ ఏడాది గణనీయంగా రేట్లను సవరించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. పెరుగుతున్న క్లెయిమ్ ఖర్చులు కంపెనీల నష్టాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఇదిలాఉండగా, రోడ్డు ప్రమాద కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థలు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం, బాధితుల సామాజిక భద్రతను రక్షించేందుకు కట్టుబడి ఉండాలి. కానీ రేట్ల నిర్ధారణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థల వైఖరిపట్ల కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపివేత.. కారణం..
ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ) పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఆగస్టు 16, 2025 నుంచి సరుకు రవాణా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రన్‌వే 14/32 కోసం కొత్త ట్యాక్సీవేల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ సామర్థ్యం మెరుగవుతుందని అధికారులు తెలిపారు. తిరిగి తదుపరి నోటీసులు అందేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయిని చెప్పారు.ముంబయిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సరఫరా కావాల్సిన సరుకు రవాణా నవీ ముంబై విమానాశ్రయం నుంచి జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పు ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తున్నప్పటికీ ఫార్మాస్యూటికల్స్, పాడైపోయే వస్తువులు వంటి ప్రత్యేక సరుకు రవాణా నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌ల మధ్య దూరం, ముంబయి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సరుకు రవాణా ఆలస్యం కావచ్చని కొందరు భావిస్తున్నారు.సీఎస్ఎంఐఏకు పెరుగుతున్న ప్యాసింజర్, కార్గో రద్దీ కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ల రవాణా ఆలస్యం అవుతుంది. దాంతో మరిన్ని మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్ వర్గాలు ఈ చర్యలకు పూనుకున్నాయి. ఎయిర్ ట్రాఫిక్‌కు గ్లోబల్ హబ్‌గా ముంబయి స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ సదుపాయాలు ఎంతో కీలకం కానున్నాయని తెలిపాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కిమౌలిక సదుపాయాల నవీకరణ ఇలా..రన్ వే 14/32 కోసం కొత్త టాక్సీవేలుటెర్మినల్ 1లో ఏటా రెండు కోట్ల మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు.మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్ (ఎంఎంటీహెచ్)లో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు డైరెక్ట్ మెట్రో యాక్సెస్, అండర్ గ్రౌండ్ బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.అత్యాధునిక ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.ఈగేట్స్, ఫాస్టాగ్ ఎనేబుల్డ్ పార్కింగ్, ఉచిత ఇంటర్ టెర్మినల్ కోచ్ ట్రాన్స్ఫర్ సర్వీసులను అందించేలా చర్యలు చేపడుతున్నారు.

వరుస లాభాలకు బ్రేక్..
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 24,246 వద్దకు చేరింది. సెన్సెక్స్ 315 పాయింట్లు దిగజారి 79,801 వద్దకు చేరింది. ఇటీవల వరుసగా పెరిగిన మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లోకి చేరుకున్నాయి.సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇన్ఫోసిస్, నెస్లే, టీసీఎస్ స్టాక్‌లు నష్టపోయాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కిఈ రోజు మార్కెట్ల ఒడిదొడుకులకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఇటీవలి లాభాలను స్వీకరించేందుకు పూనుకున్నారు. ఇది అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కి
ప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో చేపట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)లో తన ప్రమేయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. డోజ్‌కు కేటాయిస్తున్న సమయాన్ని వచ్చే నెల నుంచి తగ్గించబోతున్నట్లు చెప్పారు. టెస్లాపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో వారానికి ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే డోజ్‌కు సమయం కేటాయిస్తానని మస్క్ పేర్కొన్నారు.టెస్లాపై దృష్టి సారిస్తూ అధిక సమయం దానికే కేటాయించబోతున్నట్లు మస్క్ తీసుకున్న నిర్ణయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్ డోజ్ బాధ్యతలకు అధిక సమయం కేటాయించనప్పటికీ ట్రంప్ మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఈమేరకు అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సందర్భంగా మస్క్ తెలివితేటలు, దేశభక్తిని కొనియాడారు. ఫెడరల్ సంస్కరణల్లో ఆయన చేసిన కృషిని సమర్థించారు.నిజమైన దేశభక్తుడు..మస్క్ తన ప్రభుత్వ పాత్ర కంటే టెస్లా వ్యాపారానికే అధిక ప్రాధాన్యత ఇస్తారని అందరికీ తెలుసునని ట్రంప్ అన్నారు. డోజ్‌లో మస్క్ పాత్ర వివాదాన్ని రేకెత్తించినప్పటికీ టెక్నాలజీలో తాను ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజకీయ విభేదాల వల్ల తన ఆవిష్కరణల ప్రాధాన్యతను తగ్గించకూడదన్నారు. తాను నిజమైన దేశభక్తుడన్నారు. స్పేస్ఎక్స్తో మస్క్ ఏరోస్పేస్ విభాగంలో చేసిన ఆవిష్కరణలను గుర్తు చేసుకున్నారు. స్పేస్ఎక్స్ రాకెట్లు నింగిలో దూసుకెళ్లి, తిరిగి క్షేమంగా ల్యాండ్ అవ్వడం ఒక అద్భుతం అన్నారు. ఇది కేవలం మస్క్‌తోనే సాధ్యమైందని చెప్పారు. తిరిగి తాను త్వరలోనే డోజ్‌కు అధిక సమయం కేటాయించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: 7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్2025 మొదటి త్రైమాసికంలో టెస్లా లాభాలు 71% క్షీణించాయి. మస్క్ సంపద తగ్గడానికి తాన వ్యాపారాల్లో పెరుగుతున్న రాజకీయ ప్రమేయమే కారణమని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
ఫ్యామిలీ

Makara Thoranam మకర తోరణం,రాక్షస ముఖం కథ ఏమిటి?
వివిధ దేవాలయాలలో ద్వారతోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే మకరతోరణమని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణమధ్యంలో అలంకరించటానికి గల కారణం గురించి స్కంద మహాపురాణంలో ఒక కథ ఉంది.పూర్వం ‘కీర్తిముఖుడ‘నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొంది అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనాలలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు నారదుని ప్రేరణతో శివపత్ని జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలను అన్నింటినీ మింగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణం లేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్తవశంకరుడైన శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా ధరించాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉందని, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు ‘నిన్ను నువ్వే తిను‘ అని చెప్పాడు. శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగం నుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. నీవు ఈ నాటినుంచి సమస్త దేవాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దేవతా దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు ‘అని వరమిచ్చాడు. ఆ నాటినుంచి కీర్తిముఖుడు దేవాలయాలలోని తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస మకర ముఖంతో అలంకరించి భక్తులలో ఉండే వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకర తోరణం అని పేరు వచ్చింది.

Vaisakha Masam పర్వదినాల వైశాఖ : ఎన్ని విశేషాలో!
28, సోమవారం నుంచి మే 27, మంగళవారం వరకు వైశాఖమాసంసంవత్సరంలోని అన్ని మాసాలూ విశిష్టమైనవే అని చాటి చెప్పే గొప్ప సంస్కృతి మనది. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన వైశాఖమాసంలో స్నానానికి, దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వైశాఖమాసంలో ప్రతిరోజూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్నిస్తుందని పద్మపురాణం చెబుతోంది. నెలంతా స్నానం చేయలేనివారు కనీసం శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథుల్లో స్నానం చేసినా సకలపాపాల్ని నివృత్తి అవుతాయి. స్నానం తర్వాత త్రికరణశుద్ధిగా విష్ణుపూజ చేయాలి. అట్లాగే యథాశక్తి ఏకభుక్తం, నక్తం ఆచరించేవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వైశాఖ పురాణం చెబుతోంది. పాలిచ్చే ఆవును, పాదుకలు, చెప్పులు, గొడుగు, విసనకర్ర, అన్ని సౌకర్యాలతో కూడిన శయ్య, దీపం, అద్దం– ఇవన్నీ గురువుకి దానంగా ఇవ్వాలి. అశక్తులైనవారు చలివేంద్రాలు నిర్వహించటం, పరమశివునికి నిరంతరాయంగా అభిషేకం జరిగే ఏర్పాట్లు చేయడం, పితృదేవతల తృప్తి కోసం చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు, ఇంకా నీటితో నింపిన కుండని దానం చేయటం అన్ని విధాలా మేలుని కలిగిస్తుంది.ఈ మాసం ఈ పర్వదినాలు... అక్షయతృతీయ...వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయ అంటారు. ఈరోజున చేసే పూజలు, హోమం, దానం, పితృ తర్పణం అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి కాబట్టే దీనికా పేరొచ్చింది. ఈ పర్వదినాన నీటితో నింపిన కుండ, గోధుమలు, శనగలు ధాన్యాలు, పెరుగన్నం దానం చేయటం వల్ల శాశ్వతంగా శివ సాయుజ్యాన్ని పొందవచ్చని పురాణోక్తి. అదేవిధంగా గొడుగు, ΄ాదరక్షలు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేయటం ఎంతో పుణ్యప్రదం.పరశురామ జయంతి...శ్రీమహావిష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతిగా చెప్పబడుతోంది. వైశాఖ శుక్ల తృతీయ నాడు పునర్వసు నక్షత్రంలో రాత్రి సమయంలో సాక్షాత్తూ ఆ హరియే పరశురాముడిగా రేణుకా గర్భం నుండి స్వయంగా అవతరించాడు. అంతటి మహా తపశ్శాలి జయంతిని మనం యుగయుగాలుగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉపవాసం చేసి ప్రదోషకాలంలో పరశురాముని షోడశోపచారాలతో పూజించిన వారికి శత్రు పీడ ఉండదని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. గంగోత్పత్తి...గంగోత్పత్తి అంటే గంగాదేవి ఆవిర్భవించటం లేదా అవతరించటం. వైశాఖ శుక్ల సప్తమిన గంగోత్పత్తి అని పృథ్వీచంద్రోదయ గ్రంథం చెబుతోంది. వైశాఖ శుక్ల సప్తమిన జహ్ను మహర్షి కోపంతో గంగను తాగాడు. తన కోపం చల్లారాక మళ్ళీ కుడిచెవి నుండి వదిలిపెట్టాడు. ఈ కారణంగా ఈ రోజున గంగానదిలో స్నానం చేయటం చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుంది. కనీసం గంగాదేవిని స్మరిస్తూ పుణ్య నదుల్లో పవిత్ర స్నానం చేస్తే కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అదీ వీలు కానప్పుడు చెరువు వద్ద లేదా కాలువ వద్ద గంగను ధ్యానిస్తూ స్నానాలాచరించవచ్చు. హనుమజ్జయంతి...శ్రీరామ భక్తాగ్రేసరుడైన హనుమంతుడు – చైత్ర పౌర్ణమినాడు జన్మించినట్లు పలు గ్రంథాలు చెబుతున్నాయి. కాగా పరాశర సంహిత వైశాఖ బహుళ దశమిని ఆంజనేయుడి జన్మదినంగా పేర్కొంటోంది. అందుకే దక్షిణ భారతదేశంలో వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి జరుపుకుంటూ ఉండగా, ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమిని హనుమజ్జయంతిగా భావించి వేడుకలు జరుపుతారు. ఈరోజున ఆంజనేయస్వామిని పూజించటం వలన గ్రహ దోషాలు నివారించబడతాయి. ఇంకా భూత, ప్రేత, పిశాచాల పీడలు తొలగి, గాలి చేష్టలు వంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. హనుమజ్జయంతినాడు సుందరకాండ, హనుమాన్ చాలీసాపారాయణ చేయడం మంచిది. ఈ రోజు శ్రీ సీతారామచంద్రులను పూజించడం వల్ల హనుమంతుని అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందవచ్చు. నృసింహ జయంతి...వైశాఖ శుద్ధ చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. నృసింహ జయంతినాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామికి షోడశోపచార పూజ జరిపి, శ్రీ నృసింహస్తోత్రం–శ్రీ నృసింహ సహస్ర నామ జపం చేసిపానకం–వడపప్పు, చక్ర పొంగలి–దద్ధ్యోదనం నివేదిస్తే స్వామి వారి అనుగ్రహంతో సర్వసంపదలు లభిస్తాయని ప్రతీతి. వైశాఖ పూర్ణిమ– బుద్ధ పూర్ణిమ...లోకంలోని ప్రజల దుఃఖ నివారణకోసం, శాంతిని నెలకొల్పటం కోసం గౌతముడు శుద్ధోదన చక్రవర్తికి, మహామాయకు జన్మించిన వైశాఖ శుద్ధ పూర్ణిమకే బుద్ధజయంతి అని పేరు. గౌతముడు బుద్ధుడిగా పరివర్తన చెందిన ఈ రోజుకే బుద్ధపూర్ణిమ అని కూడా పేరు.వైశాఖ శుద్ధ దశమి – శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి... తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులకు వారి కులదైవం అయిన వాసవీ మాత ఎంతో ముఖ్యం. అలాంటి వాసవి జయంతి వైశాఖ శుద్ధదశమి నాడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరి అవతారమైన వాసవీదేవి సుమారు వెయ్యేండ్ల క్రితం పెనుగొండలో ‘కుసుమ శ్రేష్టి’, కుసుమాంబ పుణ్యదంపతులకు వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం నాడు జన్మించింది.వైశాఖ శుద్ధ ఏకాదశి – మోహినీ ఏకాదశి...ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణు లోక ప్రవేశం కలుగుతుందని పురాణ వచనం.వైశాఖ పూర్ణిమ – మహావైశాఖి...వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపాన్ని శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు. ఈ వేళ శ్రీకూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం సత్ఫలితాలనిస్తుంది.వైశాఖ శుద్ధ పూర్ణిమన్నమయ్య జయంతి...తెలుగులో తొలి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి 32 వేల కవితలతో సంకీర్తనలు సమర్పించిన పద కవితా పితామహుడు తాళ్ల΄ాక అన్నమాచార్యుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు నందక ఖడ్గం అంశగా నారాయణసూరి, లక్కమాంబ దంపతులకు జన్మించిన పర్వదినం వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అన్నమయ్య జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతారు.శంకర జయంతి... రామానుజ జయంతి...వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యుల వారు జన్మించిన అత్యంత విశిష్టమైన తిథి. ఈ రోజున వైష్ణవులు తప్పనిసరిగా రామానుజుల జయంతిని వైభవంగా జరుపుకుంటే, వైదిక మతానుసారులు శంకర జయంతిని చాలా నిష్ఠగా జరుపుకుంటారు. వైశాఖ బహుశ విదియ– నారద జయంతి...బ్రహ్మ మానస పుత్రుడు, పరమ భాగవతోత్తముడు, సకల శాస్త్ర పారంగతుడు, సంగీత కోవిదుడు, అనుక్షణం నారాయణ నామస్మరణతో ఆనంద పారవశ్యుడయ్యే నారదుడు పుట్టిన ఈ పర్వదినాన ఆయన పేరు మీదుగాపాత్రికేయులకు పురస్కారాలు ప్రదానం చేయడం ప్రతీతి. నారాయణ లోక కల్యాణం కోసం కలహ భోజనుడిగా పేరు తెచ్చుకున్న నారద మహర్షిని స్మరించు కోవడం చాలా మంచిది.వైశాఖ బహుళ ఏకాదశి– నిర్జల ఏకాదశి...ఈరోజు చుక్క నీటిని కూడా తాగకుండా ఉపవసించిన వారి పట్ల ప్రసన్నుడై శ్రీ మహావిష్ణువు సకల సంపదలు కలిగించి, అంతిమాన మోక్షం ప్రసాదిస్తాడని ప్రతీతి. వైశాఖ శుద్ధ దశమి– అన్నవరం సత్యదేవుని కల్యాణ మహోత్సవం...తిరుమల తరువాత అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, కోరిన వరాలిచ్చే సత్యదేవుడు కొలువైన దివ్యక్షేత్రం అన్నవరం. శ్రీ అనంతలక్ష్మీ రమాదేవి అమ్మవార్లతో కలిసి రత్నగిరిపై (అన్నవరం కొండ)పై శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఈ పుణ్య స్థలంలో వెశాఖ శుద్ధ దశమినాడు సీతారాములే పెళ్లిపెద్దలుగా సత్యదేవుని వివాహం కన్నుల పండువగా జరుగుతుంది.

Sperm Race ఇది రొటీన్ రేస్ కాదు! సమ్‌థింగ్ స్పెషల్!
ఈ నెల 25న ప్రపంచంలోనే తొలిసారిగా లాస్ ఏంజిల్స్‌లో ‘లైవ్ స్పెర్మ్ రేస్’ జరగనుంది. జీవనశైలిలో మార్పులు... మొదలైన వాటివల్ల పురుషుల్లో పెరుగుతున్న సంతాన లేమి అనే క్లిష్టమైన సమస్యపై ఈ రేస్ దృష్టి సారిస్తుంది.‘ఎవరి స్పెర్మ్ హెల్తీయెస్ట్? ఫాస్టెస్ట్?’ అనే దానిపై జరిగేపోటీ ఇది. పోటీ ఎలా ఉంటుంది? అనే విషయానికి వస్తే... నిజమైన స్పెర్మ్‌తో కూడిన రేస్ ఇది. మానవ ప్రత్యుత్పత్తి మార్గాన్ని అనుసరించేలా మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్ రూపొందించారు. సింక్రనైజ్డ్ స్టార్టర్లతో రసాయన సంకేతాలు, ఫ్లూయిడ్ డైనమిక్స్ కోర్సు ద్వారా స్పెర్మ్ నమూనాలు ఈత కొట్టేలా చేస్తారు. ఈపోటీని యాక్షన్ హై–రిజల్యూషన్ కెమెరాతో రికార్డ్ చేస్తారు. విజేతను నిర్ణయించడానికి మూడు రేసులు జరుగుతాయి. ప్లే–బై–ప్లే కామెంటరీ అలరిస్తుంది.ఇన్స్టంట్ రీప్లే, కామెంటరీ, గణంకాలు, లీడర్ బోర్డ్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లను అభిమానులు ఆస్వాదించేలా చేస్తుంది.ఈ రేస్‌లో బెట్టింగ్ కూడా ఉంటుంది!అత్యంత వేగంగా ఈత కొట్టే స్పెర్మ్‌పై అభిమానులు పందెం కట్టవచ్చు. ‘ఏ లాఫ్ విత్ ఏ డీపర్ పర్పస్’ నినాదంతో ఈ రేస్‌కు శ్రీకారం చుట్టారు. యువ మిలియనీర్ల బృందం ఈ విచిత్ర పోటీని నిర్వహిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హెల్త్, టెక్, ఎంటర్టైన్మెంట్లను మిళితం చేసి రూపొందించిన రేస్ ఇది. ‘ఎవరూ టచ్ చేయని అంశాన్ని తీసుకొని ఆసక్తికరంగా ఈ రేస్‌ను రూపొందించాం. ఇది పురుషుల సంతానలేమి గురించి ప్రజలు నిస్సంకోచంగా మాట్లాడుకునేలా చేస్తుంది’ అంటున్నారు పోటీ నిర్వాహకులు.రేస్ ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ‘ఎక్స్’లో ‘ది స్పెర్మ్ ట్రాక్: నాట్ యువర్ యావరేజ్ రేస్’ టైటిల్‌తో ట్రైలర్ విడుదల చేశారు. ఈ రేస్‌లో పాల్గొనే టీమ్‌లను కూడా పరిచయం చేశారు. రేస్ ఉద్దేశం గురించి ‘స్పెర్మ్ రేసింగ్ మేనిఫెస్టో’ కూడా విడుదల చేశారు. ఈ మైక్రోస్కోపిక్ బ్యాటిల్లో వీర్య విజేత ఎవరో వేచి చూద్దాం.ఇది చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్

Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!
సాధారణంగా విడాకులను (Divorce) ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక ఫెయిల్యూర్‌గానే పరిగణిస్తున్నారు. కాలమెంత మారినా విడాకులు తీసుకున్న మహిళను చిన్నచూపు చూసే ధోరణి మాత్రం పోలేదు. డైవోర్స్‌ని ఓ అవమానంగా, పరువు ప్రతిష్ఠలకు భంగంగా భావించే పరిస్థితే ఇంకా! అయితే వాయవ్య ఆఫ్రికా దేశమైన మారిటానియా (Mauritania) తీరు ఇందుకు భిన్నం. అక్కడ విడాకులు అంటే ఒక వేడుక. ఆ దేశంలోని మారి తెగలోని మాతృస్వామ్య పద్ధతులే ఇందుకు కారణం అంటారు పరిశీలకులు, విశ్లేషకులు. మారిటానియాలో ఒక వివాహిత ఎన్నిసార్లయినా విడాకులు తీసుకోవచ్చు. ఆ విడాకుల సందర్భాన్ని ఒక మెహెందీ, పాటలు, డాన్సులు, విందుతో ఒక సెలబ్రేషన్‌గా నిర్వహిస్తారు. దాని ఉద్దేశం.. ఆ అమ్మాయి మళ్లీ పెళ్లికి సిద్ధంగా ఉందని తెలియజెప్పడమేనట. అమ్మాయిలైతే విడాకులను తమకు దొరికిన స్వేచ్ఛలా భావిస్తారట. విడాకులు తీసుకున్న యువతులు తమ అభిరుచుల్లో ప్రావీణ్యాన్నిపెంపొందించుకునే ప్రయత్నం చేస్తారట. కొంతమంది పైచదువులు చదువుకుంటారు, కొంతమంది రాజకీయాల వైపు మళ్లుతారు, ఇంకొంతమంది ఆర్టిస్ట్‌లు అవుతారు.. ఇలా తమకు నచ్చిన రంగాన్ని ఎంచు కుంటారు. పిల్లలుంటే వాళ్ల సంరక్షణ తల్లి చాయిసే! చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్ఇంకో విషయం ఏంటంటే.. విడాకులు తీసుకున్న ఆడవాళ్లందరికీ ఒక మార్కెట్ ఉంటుంది. అందులో వాళ్లింటి సామాన్లన్నిటినీ అమ్మేస్తారు. ఒకరకంగా ఈ మార్కెట్‌ను వాళ్లు తమ స్వేచ్ఛకు ప్రతీకగా భావిస్తారు. పాత భారాన్నంతా దింపేసుకుని కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నామనే సూచననిస్తున్నట్టన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం.. మారిటానియాలో కొత్త పెళ్లికొడుకులు డైవోర్స్ అయిన మహిళలను చేసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే సంసారంలో వాళ్లు అనుభవజ్ఞులని. అందుకే పెళ్లికి అక్కడ విడాకుల వనితలకే డిమాండ్ ఎక్కువ. మరో ముఖ్యమైన సంగతేంటంటే.. విడాకుల వనితలు మాత్రం విడాకులు పొందిన పురుషులను చేసుకోరు. కొత్త పెళ్లికొడుకులనే చూస్తారు. విడాకులు పొందిన మగవాళ్లను ఫెయిల్యూర్ హజ్బెండ్స్గా పరిగణిస్తారట.
ఫొటోలు
అంతర్జాతీయం

విశ్వసనీయ మిత్రదేశం
జెడ్డా: ‘‘భారత్–సౌదీ అరేబియా స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలి. అందుకు నా పర్యటన దోహదపడుతుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహా్వనం మేరకు ఆయన మంగళవారం సౌదీలో పర్యటించారు. మోదీ విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆరు ఎఫ్–15 ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా నిలవడం విశేషం. సంబంధిత వీడియోను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది.మోదీకి లభించిన అపూర్వ ఆహ్వనం భారత్–సౌదీ అరేబియా మధ్య బలపడుతున్న రక్షణ సహకారానికి ప్రతీక అని పేర్కొంది. ఎయిర్‌పోర్టు నుంచి బస చేసే హోటల్‌కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. సౌదీ గాయకుడు హషీం అబ్బాస్ ‘ఆయే వతన్ మేరే ఆబాద్ రాహే తూ’ హిందీ పాటను చక్కగా ఆలపించారు. మోదీ చప్పట్లతో ఆ గాయకుడిని అభినందించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులతో ఆప్యాయంగా మాట్లాడారు.సౌదీ యువరాజు నా సహోదరుడు భారత్‌కు సౌదీ అత్యంత విలువైన, విశ్వసనీయమైన మిత్రదేశమని మోదీ ఉద్ఘాటించారు. ఆయన మంగళవారం ‘అరబ్ న్యూస్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసియాలో శాంతి, స్థిరత్వాన్ని రెండు దేశాలు ప్రగాఢంగా కోరుకుంటున్నాయని మోదీ తెలిపారు.

శనివారం పోప్ అంత్యక్రియలు
వాటికన్ సిటీ: వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో మూడు రోజులపాటు ప్రజల సందర్శనలు, నివాళుల తర్వాత శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కోట్లాది మంది క్యాథలిక్‌ల అత్యున్నత మతాధికారి అయినప్పటికీ అత్యంత సాధారణ వ్యక్తిలా ఖనన క్రతువును పూర్తిచేయాలని పోప్ కోరుకున్నారని, అదేరీతిలో అంత్యక్రియలను పూర్తిచేస్తామని వాటికన్ వర్గాలు ప్రకటించాయి.పోప్ మరణంతో ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్న వేళ పోప్ అంత్యక్రియల షెడ్యూల్ వివరాలను వాటికన్ అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద శనివారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియల కార్యక్రమాన్ని మొదల పెట్టనున్నారు. కార్డినళ్ల కాలేజీ డీన్ అయిన 91 ఏళ్ల కార్డినల్ జియోవన్నీ బటిస్టా రే నేతృత్వంలో ఈ కార్య క్రమాన్ని నిర్వహించను న్నా రు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవి యర్ మిలేయీ తదిత రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ సోమవారం బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కోమాలోకి వెళ్లి, తర్వాత గుండె వైఫల్యం కారణంగా కన్ను మూసిన విషయం విదితమే.తొలిసారిగా పార్థివదేహం ఫొటో విడుదలఅధికారిక నివాసంలోకాకుండా పోప్ పార్థివదేహాన్ని పోప్‌గా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆయన నివసిస్తున్న డోమస్ శాంటా మార్టా గెస్ట్‌హౌస్ హోటల్ చాపెల్లోనే ఉంచారు. వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పరోలిన్ పోప్‌కు నివాళులర్పిస్తున్న ఫొటోలను అధికారికంగా మంగళవారం విడుదలచేశారు. ఎర్రని వస్త్రంతో కప్పిన కలపతో చేసిన శవపేటికలో పోప్ పార్థివదేహాన్ని ఉంచారు. పోప్ నచ్చిన శ్వేత వర్ణ ‘మిటర్’ టోపీని ఆయనకు పెట్టారు. సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననంఆయన ఎక్కువగా సందర్శించి, ప్రార్థించే సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి ప్రాంగణంలోనే పోప్‌ను ఖననం చేయనున్నారు. అక్కడే తనను ఖననం చేయాలని పోప్ గతంలోనే సూచించారు. ఆ మేరకే ఖనన క్రతువును పూర్తిచేయనున్నారు.

వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం
జైపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఆయనను చూస్తే అసూయగా ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని కొందరు విమర్శిస్తున్నప్పటికీ ఆయన పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తున్నాయే తప్ప ఎక్కడా తగ్గడం లేదన్నారు. అంతర్జాతీయంగా మోదీకి లభిస్తున్న అప్రూవల్ రేటింగ్స్ తనకు అసూయ కలిగిస్తున్నాయని, ఈ విషయం సోమవారం నేరుగా మోదీకే చెప్పానని వెల్లడించారు.‘మోదీ స్పెషల్ పర్సన్’ అని ప్రశంసించారు. మంగళవారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ సదస్సులో వాన్స్ ప్రసంగించారు. ప్రధానంగా ఇండియా–అమెరికా సంబంధాలపై మాట్లాడారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం విషయంలో తుది ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధమైందని ప్రకటించారు. రోడ్‌మ్యాప్‌పై విధివిధానాలను ఇరు దేశాలు అధికారికంగా ఖరారు చేశాయని వెల్లడించారు. భారతదేశ ఉత్పత్తులపై విధించిన 26 శాతం ప్రతీకార సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం కావడం డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీల విజన్ వాస్తవరూపం దాల్చే విషయంలో ఒక కీలకమైన ముందడుగు అని వాన్స్ అభివర్ణించారు. భారత్–అమెరికా సంయుక్తంగా ప్రగతి సాధించాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ‘కొరుకుడుపడని కఠినమైన సంధానకర్త’ అని అభివర్ణించారు. ఆయనతో బేరం తేల్చడం అంత సులభం కాదన్నారు. అందుకే ఆమెరికా ఆయనను గౌరవిస్తోందని వ్యాఖ్యానించారు. మిత్రుడిగా వచ్చా.. తాను ఇండియాకు నీతిబోధలు చేయడానికి రాలేదని, ఒక భాగస్వామిగా, మిత్రుడిగానే వచ్చానని జె.డి.వాన్స్ అన్నారు. ఏ పని ఎలా చేయాలో ఇండియాకు నేర్పే ఉద్దేశం తనకు లేదన్నారు. గతంలో అమెరికా ప్రభుత్వాలు భారత్‌కు నీతి పాఠాలు బోధించేందుకు ప్రయత్నించేవని, భారత్‌ను చౌకగా కార్మిక శక్తి లభించే దేశంగానే చూసేవారని చెప్పారు . ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులను మరింత అధికంగా కొనుగోలు చేయాలని భారత్‌కు విజ్ఞప్తిచేశారు.అమెరికా ఇంధన, రక్షణ ఉత్పత్తులు, పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేయాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. టెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి వేర్వేరు కీలక రంగాల్లో భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’పై ఇరుదేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.ఇవాన్ ఇండియాలోనే ఉంటానన్నాడు ప్రధాని మోదీ తమకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారని జె.డి.వాన్స్ ఆనందం వ్యక్తంచేశారు. మోదీ ప్రేమానురాగాలు తమ కుటుంబాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా తమ ముగ్గురు పిల్లలకు మోదీ ఎంతో ఆత్మీయులయ్యారని తెలిపారు. మోదీ ఇచ్చిన విందు తన కుమారుడు ఇవాన్‌కు ఎంతోగానో నచ్చిందని, ఇండియాలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నట్లు ఇవాన్ తనతో చెప్పాడని అన్నారు. తన పిల్లలకు డొనాల్డ్ ట్రంప్‌తో ఏర్పడిన అనుబంధం ఇప్పుడు మోదీతోనూ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇండియాలో తన కంటే తన భార్య ఉషా చిలుకూరికే గొప్ప ఆదరణ లభిస్తోందని వాన్స్ చమత్కరించారు.అంబర్ కోట సందర్శనవాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం ఉదయం రాజస్తాన్‌లోని చరిత్రాత్మక అంబర్ కోటను సందర్శించారు. వాన్స్ కుటుంబానికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి దియా కుమారీతోపాటు అధికారులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. చక్కగా అలంకరించిన ఏనుగులు, తీర్చిదిద్దిన రంగవల్లులు, జానపద నృత్యాలతో అమెరికా ఉపాధ్యక్షుడికి ఆత్నియ స్వాగతం లభించింది. చందా, మాలా అనే రెండు ఏనుగులు తొండాలు ఎత్తి వాన్స్ కుటుంబానికి స్వాగతం పలికాయి. రాజస్తానీ సంప్రదాయ జానపద నృత్యాలు అలరించాయి.

పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక
చారిత్రకంగా చూస్తే... పోప్స్ మృతదేహాలను వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం రివాజు. ఈ సంప్రదాయాన్ని కాదని 1903లో పోప్ లియో-13 మృతదేహాన్ని ఆయన కోరిక మేరకు సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో పూడ్చిపెట్టారు. ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) ఆఖరి కోరిక ఏంటో తెలుసా? తన భౌతిక కాయాన్ని వాటికన్ వెలుపల సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి(రోమ్)లో ఖననం చేయాలనేది ఆయన మనోవాంఛ. 2023 డిసెంబరు 12న మెక్సికన్ వార్తా సంస్థ ‘ఎన్+’కు కు ఇంటర్వ్యూ ఇస్తూ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలకు సంబంధించి మనసులోని మాట బయటపెట్టారు. అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో అంతకుముందే చర్చించినట్టు తెలిపారు. సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి విషయానికొస్తే... ఆరుగురు పోప్స్ మృతదేహాలను అక్కడ ఖననం చేశారు. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్-9 అంత్యక్రియలు అక్కడ నిర్వహించారు. శిశువైన జీసస్ ను కన్య మేరీ ఎత్తుకున్న ‘సేలస్ పోపులి రోమని’ (రోమ్ ప్రజలకు రక్షణ) పెయింటింగ్ ఆ చర్చిలో ఉంది. ఆ చిత్రంతో పోప్ ఫ్రాన్సిస్ ది ప్రత్యేక అనుబంధం. పోప్ హోదాలో పర్యటనలు చేసి తిరిగొచ్చాక ఆయన దాని ఎదుట ప్రార్థనలు చేసేవారు.:::జమ్ముల శ్రీకాంత్(Source: AmoMama.com. Photo Credit: The Catholic Weekly).
జాతీయం

వైమానిక దాడికి రెడీనా ?
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి ప్రతీకారంగా, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై భారత వాయుసేన దాడులు చేయొచ్చనే అంచనాలకు బలం చేకూర్చేలా గురువారం కొత్త పరిణామం సంభవించింది. సెంట్రల్ సెక్టార్లో ‘ ఎక్సర్సైజ్ ఆక్రమణ్’ పేరిట భారత వాయుసేన అతిపెద్ద వైమానిక విన్యాసాలు మొదలెట్టింది. సమతల మైదాన ప్రాంతాలతోపాటు దుర్భేద్య పర్వతమయ ప్రాంతాల్లో శత్రుమూకలను ఎలా తుదముట్టించాలి? ఎలా సులువుగా తప్పించుకోవాలి అనే అంశాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు అభ్యాసం చేశాయని రక్షణ రంగంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విదేశం నుంచి కొనుగోలు చేసుకున్న అత్యంత అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు ముందుండి డ్రిల్ చేయగా వాటిని అనుసరిస్తూ సుఖోయ్–30, ఇతర రకాల యుద్ధవిమానాలు ఈ వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. శత్రుస్థావరాలను ధ్వంసంచేయడం, శత్రువుల దాడుల నుంచి ఒడుపుగా తప్పించుకోవడం, ప్రతిదాడి చేస్తే దీటుగా బదులివ్వడం, సుదూరంలోని లక్ష్యలపై దాడిచేయడం వంటివి మరోసారి అభ్యసనం చేశారు. తూర్పు సెక్టార్‌లోని స్థావరాల్లోని బలగాలు ఈ అభ్యసనంలోని బృందాలకు సాయపడుతున్నాయి. నిజంగా యుద్ధం వస్తే హఠాత్పరిణామాలను ఎదుర్కొనేలా యుద్ధవిమాన పైలెట్లకు దోహదపడేలా ఈ విన్యాసాలకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. భూతలం మీద లక్ష్యాలతోపాటు విద్యుదయస్కాంత సైనిక ఉపకరణాల వినియోగంపైనా మరింత పట్టుచిక్కేలా డ్రిల్ కొనసాగుతున్నట్లు సమా చారం. భారతవాయుసేన పైలట్లలో అత్యంత దూకుడు, నైపుణ్యమున్న ‘టాప్ గన్’ పైలట్లతో ఈ వైమానిక విన్యాసాలు చేయిస్తు న్నారు. దూరంలోని లక్ష్యాలపై బాంబులు జారవిడవడం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. సమరంలో సన్నద్ధత, అత్యంత నైపుణ్యం సాధించడంపై జరుపుతున్న ఈ అభ్యాసా న్ని ఐఏఎఫ్‌లోని సీనియర్ ఉన్నతాధి కారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు పంజాబ్‌లోని అంబాలా స్థావరం నుంచి, పశ్చిమబెంగాల్లోని హషిమరా స్థావరం నుంచి శత్రు భీకర రఫేల్ యుద్ధవిమానాలు బయల్దేరి వెళ్లాయి.

ముష్కర మూకలను మట్టిలో కలిపేస్తాం: ప్రధాని మోదీ
మధుబని: పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు భూమండలంలో ఎక్కడ దాక్కున్నా సరే వెతికి మరీ పట్టుకొని శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న దుష్ట శక్తులకు తగిన శిక్ష విధించక తప్పదని హెచ్చరించారు. గురువారం బిహార్‌లోని మధుబనిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ ర్యాపిడ్ రైలుతోపాటు మరికొన్ని రైళ్లను ప్రారంభించారు. జాతీయ పంచాయత్ అవార్డులు ప్రదానం చేశారు. పహల్గాం మృతులకు సంతాప సూచకంగా బహిరంగ సభలో తొలుత మౌనం పాటించారు. అనంతరం మోదీ కొద్దిసేపు ఆంగ్ల భాషలో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న ముష్కరులందరినీ కచ్చితంగా శిక్షిస్తామని ప్రతిన బూనారు. ఇలాంటి దాడులు మన నైతిక స్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని అన్నారు. శత్రువులు కేవలం నిరాయుధ పర్యాటకులనే కాదు, మనదేశాన్ని లక్ష్యంగా చేసుకొనే సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. వారిని మట్టిలో కలిపేస్తామని స్పష్టంచేశారు. దేశంలో మిగిలిన ఉన్న ఉగ్రవాద శేషాన్ని తుదముట్టించే సమయం వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం ‘‘మిత్రులారా.. బిహార్ గడ్డపై నుంచి మొత్తం ప్రపంచానికి చెబుతున్నా. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్నవారు ఎక్కడ దాగి ఉన్నా సరే గుర్తించి, బంధించి, శిక్షిస్తాం. ప్రపంచం అంచుల దాకా వారిని వేటాడుతాం. కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తాం. ఉగ్రవాదులెవరూ తప్పించుకోలేరు. ముష్కర మూకలను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం. శిక్ష తప్పనిసరిగా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మన దేశమంతా ఒకే మాటపై ఉంది. మానవత్వాన్ని విశ్వసించే వారంతా మన వెంటే ఉన్నారు. ఉగ్రవాదుల హేయమైన చర్య మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు్తన్నా. వారికి దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రతికూల సమయంలో మనకు అండగా నిలిచిన ప్రపంచ దేశాల నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు.దేశమంతటా ఒకేలా ఆగ్రహావేశాలు ఉగ్రవాద దాడిలో ఎంతోమంది నష్టపోయారు. కొందరు తమ కుమారులను పోగొట్టుకున్నారు. మరికొందరు తమ సోదరులను, జీవిత భాగస్వాములను కోల్పోయారు. బాధితులు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందినవారు ముష్కరుల రాక్షసత్వానికి బలయ్యారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి దాకా దేశమంతటా ఆగ్రహావేశాలు, విచారం ఒకేలా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదు. వేగవంతమైన అభివృద్ధి కావాలంటే శాంతి, భద్రతలతో కూడిన పరిస్థితులు అత్యంత కీలకం.

యుద్ధమేఘాలు!
సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. తనకు జీవనాడి వంటి సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై పాక్ గంగవెర్రులెత్తిపోయింది. ఇది తమపై నేరుగా యుద్ధ ప్రకటనేనంటూ గగ్గోలు పెట్టింది. ప్రతీకారంగా నామమాత్రపు సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసి అక్కసు తీర్చుకుంది. భారత్‌కు తన గగనతలాన్ని మూసేయడమే గాక వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బీరాలు పలికింది. ఎడాపెడా క్షిపణి పరీక్షలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సరిహద్దుల వెంబడి సైనిక మోహరింపులను కూడా యుద్ధ ప్రాతిపదికన భారీగా పెంచేస్తోంది. మరోవైపు దాయాది ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో ‘నిర్ణాయక చర్య’లకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గురువారం చోటుచేసుకున్న పలు కీలక పరిణా మా లు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్ మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. గురువారం శ్రీనగర్‌లోని మార్కెట్ ప్రాంతంలో భద్రతా దళాల గస్తీ తాజా పరిస్థితిని వివరించడంతో పాటు పలు ‘ఇతర’ అంశాలపైనా చర్చించినట్టు చెబుతున్నారు. ప్రధాని మోదీ కూడా పహల్గాం ముష్కరులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారికి దన్నుగా నిలిచిన దుష్టశక్తినీ కటినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఊహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకు ని తీరతాం’’ అంటూ ప్రతినబూనారు. తర్వాత కా సేపటికే ‘ఆక్రమణ్’ పేరిట సైన్యం భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించింది. అత్యాధునిక రఫేల్‌తో పాటు సుఖోయ్ తదితర యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. మరోవైపు పాక్‌లో ఉన్న భారతీయులు తక్షణం తిరిగి రావాలంటూ కేంద్రం అడ్వై జరీ జారీ చేసింది. పొరుగు దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఏకాకిని చేయడమే గాక దానిపై తీసుకోబోయే ‘కఠిన’ చర్యలకు జీ20 తదితర దేశాల మద్దతు కూడగడుతోంది. పహల్గాం ఆటవిక దాడి, అందులో పాక్ ముష్కరులు పాల్గొన్న వైనం తదితరాలను జీ20 సభ్య దేశాల రాయబారులకు విదేశాంగ శాఖ పూసగుచ్చినట్టు వివరించింది. భేటీకి హాజరైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆ్రస్టేలియా, యూఏఈ తదితర దేశాల రాయబారులు దాడిని తీవ్రంగా ఖండించాయి. పాక్‌కు కరుడుగట్టిన మద్దతుదారైన చైనా కూడా భేటీలో పాల్గొనడమే గాక భారత్‌కు మద్దతు పలకడం విశేషం. మరోవైపు పహల్గాం దాడి, తదనంతర పరిస్థితులను కాంగ్రెస్ తదితర పార్టీలన్నింటితో కేంద్రం పంచుకుంది. ఉగ్ర తండాలను శాశ్వతంగా నిర్మూలించి తీరాల్సిందేనని పార్టీలన్నీ ముక్త కంఠంతో అభిప్రాయపడ్డాయి. అందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా నిలుస్తామని అఖిలపక్ష భేటీలో ప్రకటించాయి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, దానికి తోడుగా యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్ పాక్ దిశగా కదులుతున్నట్టు సమాచారం.

ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
గువాహటి: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రెటిక్ ఫ్రంట్((AIUDF) ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలను ప్రభుత్వ కుట్రలో భాగమేనని నోరు జారిన ఎమ్మెల్యే అనిముల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే అమినుల్ పై బీఎన్ఎస్ సెక్షన్లు 152/196/197(1)/113(3)/352/353 నమెదు చేసిన పోలీసులు.. గురువారం అరెస్ట్ చేశారు. బుధవారం అమినుల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించడంతో సుమోటో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయాన్ని ‘ ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు పోలీసులు.పాక్ కు సపోర్ట్ గా నిలిస్తే కఠిన చర్యలు: సీఎంఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతుగా నిలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం రాష్ట్ర సీఎం హిమాంతా బిశ్వా శర్మ స్పష్టం చేశారు. ఇందులో చిన్నా పెద్దా తేడా ఏమీ లేదని హెచ్చరించారు. ఇదిలా ఉంచితే, ఎమ్మెల్యే అమినుల్ వ్యాఖ్యలతో తమకు ఏమీ సంబంధం లేదని అంటోంది ఏఐడీయూఎఫ్. ఈ విషయంలో తాము ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని, అమినుల్ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని ఏఐడీయూఎఫ్ చీఫ్ మౌలానా బదరుద్దీన్ తెలిపారు.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

ఏసీబీ వలలో ఎస్సారెస్పీ ఉద్యోగులు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఎస్సారెస్పీ డివిజన్–6 కార్యాలయంలో తోటి ఉద్యోగి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ శ్రీధర్‌బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్‌లు బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఎస్సారెస్పీ డివిజన్– 6లో రికార్డ్ అసిస్టెంట్ యాజాజ్ ఉల్ఖాన్ అనారోగ్యానికి గురై గతేడాది ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సెలవులో ఉన్నారు. ఆరోగ్యం కుదుట పడ్డాక నవంబర్ 1న విధుల్లో చేరారు. ఇందుకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా సమర్పించారు. సెలవు కాలానికి సంబంధించిన వేతనం చెల్లించకుండా శ్రీధర్‌బాబు, సురేశ్‌లు 6 నెలలుగా యాజాజ్ ఉల్ ఖాన్‌ను వేధిస్తున్నారు. ఇదేమిటని బాధితుడు ప్రశ్నిస్తే.. రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు.దీంతో యాజాజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు బాధితుడు సదరు అధికారులకు కార్యాలయంలో డబ్బు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టుకు తరలించారు.బిల్లులతో సంబంధం లేని ఉద్యోగిసీనియర్ అసిస్టెంట్ సురేశ్‌కు బిల్లుల చెల్లింపులతో సంబంధమే లేదు. అయినా.. అందులో తలదూర్చి బిల్లులు క్లియర్ చేయకుండా చిరుద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
తిరుపతి,సాక్షి: తిరుపతిలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు దళిత బాలికకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోలీసులు నిందితుల్ని గుర్తించారు. ఎఫ్. ఐ.ఆర్.51/2025 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్‌చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నా’.. అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. బద్దెనల్లిలో రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక.. కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది. డీపీఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత క్రీదాది మల్లేశ్బాబుతోపాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా, తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురి కోసం తల్లిదండ్రులు మంగళవారం తిరుపతికి బయలుదేరారు.