
మణికొండ: తమ వాహనాలకు లక్కీ నెంబర్‌లు ఉండాలని కోరుకునే వారు వాటిని దక్కించుకునేందుకు పోటీలు పడ్డారు. మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఈ బిడ్డింగ్‌లో లక్కీ నెంబర్‌ల ధరలు లక్షల రూపాయల్లో పలికాయి. మంగళవారం జరిగిన బిడ్డింగ్‌లో మొత్తం రూ.52,69,216 ఆదాయం సమకూరినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.
అందులో టీజీ 07ఆర్ 9999 నెంబర్ ఏకంగా రూ. 12,49,999లకు కాం్రగ్యూంట్ డెవలపర్స్ వారు దక్కించుకున్నారు. టీజీ 07ఎఎ 0009 నెంబర్‌ను రుద్ర ఇన్ఫాస్ట్రక్షర్స్ రూ.8.50లకు, టీజీ 07ఎఎ 0001నెంబర్‌ను 4.77 లక్షలకు ఫ్యూజీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థలు దక్కించుకున్నాయని అధికారులు తెలిపారు.