
వివిధ కారణాలతో రద్దు చేసిన 40 బార్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన 40 పాత బార్ల స్థానంలో..కొత్త బార్ల లైసెన్స్‌కు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చేవూరి హరికిరణ్ తెలిపారు. ఈనెల 26 చివరి తేదీ అని, గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో అనుమతి ఇచి్చన వాటిలో వివిధ కారణాలతో 40 బార్లు మూసివేతకు గురయ్యాయని, వీటి లైసెన్సులను కూడా ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
ఆదిలాబాద్‌లో 5, కరీంనగర్‌లో ఒకటి, వరంగల్‌లో నాలుగు, ఖమ్మంలో రెండు, నల్లగొండలో ఒకటి, మహబూబ్‌నగర్‌లో ఐదు, మెదక్‌లో ఒకటి, నిజామాబాద్‌లో నాలుగు, రంగారెడ్డి జిల్లాలో రెండు బార్లను పునరుద్ధరించాలని నిర్ణయించామన్నారు. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో 15 బార్లకు దరఖాస్తులు తీసుకోవడం లేదని వెల్లడించారు.
⇒ మీర్‌పేట మున్సిపాలిటీలో పాత బార్ల స్థానంలో కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేశామని, వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలరెడ్డి తెలిపారు.
⇒ వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని కొడంగల్ మున్సిపాలిటీలోని పాత బార్ల స్థానంలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు.