అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు: సీఎం రేవంత్‌ | Cm Revanth Reddy Review On Women And Child Welfare Department | Sakshi
Sakshi News home page

అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు: సీఎం రేవంత్‌

Published Sat, Mar 2 2024 5:50 PM | Last Updated on Sat, Mar 2 2024 6:08 PM

Cm Revanth Reddy Review On Women And Child Welfare Department - Sakshi

అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

సాక్షి, హైదరాబాద్‌: అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు.

అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలన్న సీఎం.. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీ ప్రక్షాళన.. 14 మంది అధికారులపై వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement