హైదరాబాద్‌ అత్యంత సేఫ్: సీపీ అంజనీకుమార్‌‌ | CP Anjani Kumar Said Hyderabad Is Second Safest City In Country | Sakshi
Sakshi News home page

అత్యంత సేఫ్‌ సిటీల్లో హైదరాబాద్‌ నంబర్‌-2

Published Sat, Mar 27 2021 4:04 PM | Last Updated on Sat, Mar 27 2021 5:16 PM

CP Anjani Kumar Said Hyderabad Is Second Safest City In Country - Sakshi

హైదరాబాద్‌లో 6 లక్షల సీసీ కెమెరాలున్నాయని.. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీపీ పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో కూడా రికార్డు అయ్యేలా టెక్నాలజీని వాడుతున్నామన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అత్యంత సేఫ్‌ సిటీల్లో హైదరాబాద్‌ నంబర్‌-2లో ఉందని సీపీ అంజనీకుమార్‌ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ఒకటని అమెరికాకు చెందిన సర్వే కంపెనీ కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. నేరస్తులను గుర్తించడంలో సీపీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.

హైదరాబాద్‌లో 6 లక్షల సీసీ కెమెరాలున్నాయని.. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీపీ పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో కూడా రికార్డు అయ్యేలా టెక్నాలజీని వాడుతున్నామన్నారు. ఎన్నో నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కోర్టుల్లో ఆధారాలుగానూ ఉపయోగపడుతున్నాయన్నారు. సీసీ కెమెరాలు ఉండటంతో 2018 నుంచి బహిరంగ ప్రదేశాల్లో నేరాల శాతం తగ్గుతూ వస్తోందని సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.
చదవండి:
ట్యాంక్‌బండ్‌పై చూస్తుండగానే కాలిపోయిన కారు
లాక్‌డౌన్‌ పెట్టం‌: సీఎం కేసీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement