
వరంగల్ చౌరస్తాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది.
సాక్షి, వరంగల్: వరంగల్ చౌరస్తాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. బ్యాంక్ వేధింపులు తట్టుకోలేక చిలుకూరి క్లాత్‌స్టోర్ బ్రదర్స్ కుటుంబం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.
అనంతపురంలో మహిళా లెక్చరర్ ఆత్మహత్య
మరో ఘటనలో.. ఏపీలోని అనంతపురం కేంద్రీయ వర్శిటీ మహిళా లెక్చరర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్‌కు మహిళా లెక్చరల్ యోజిత సాహో ఊరేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.