
హైదరాబాద్ : నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.
పోలీసుల వివరాల మేరకు నార్సింగిలోని స్థానికంగా పాషా నగర్ కాలనీలోని జీ ప్లస్ టూ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్క్ చేసి ఉన్న కారులో మంటలు వ్యాపించాయి. కారులో వేడి తీవ్రత కారణంగా మంటలు భవనం మొత్తం వ్యాపించాయి.
అగ్ని ప్రమాదంతో భవనంలో నివాసం ఉంటున్న ఇద్దరు పిల్లలు కిందకి దూకారు. మంటల దాటికి గ్రౌండ్ ఫ్లోర్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు జమీలా, సహానా,నాలుగేళ్ల చిన్నారి షీర్జా మరణించారు.
ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.