
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీ మదీనా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘన్సీ బజార్ లోని హోల్ సేల్ క్లాత్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. ఆ ఐదంతస్తుల భవనంలో చిక్కుకున్న వారిని రక్షించే యత్నం చేస్తున్నారు.