
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో నగరంలో కొందరు పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలను నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని చైతన్యపురిలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు పోలీసుల దృష్టికి సమాచారం అందడంతో సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయినట్టు పోలీసులు గుర్తించారు. పబ్‌కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో డ్యాన్స్ చేయిస్తున్నారు. ముంబై నుంచి యువతులను ఇక్కడికి తీసుకువచ్చి.. కస్టమర్లకు ఎర వేస్తున్నారు పబ్ యాజమాన్యం. ఈ క్రమంలో సోదాల్లో భాగంగా 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు, కస్టమర్స్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.