
4,28,832 ఇప్పటివరకు పరిశీలించిన దరఖాస్తులు
60,213 ఇప్పటివరకు ఆమోదం పొందినవి
అధికారుల పరిశీలనతో వెలుగులోకి....
మరోసారి వివరాల అప్‌లోడ్‌కు అవకాశమిచ్చి న పురపాలక శాఖ
సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ల క్రమబదీ్ధకరణ) దరఖాస్తుల్లో అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయనివారు 75శాతం మంది దాకా ఉన్నారు. అధికారులు దరఖాస్తులు పరిశీలించే క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. 2020 ఆగస్టు 26కు ముందు ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చి ంది. రూ.1,000 ఫీజుగా చెల్లించి దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
అయితే వివిధ కారణాల వల్ల ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ అప్పట్లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగా గత డిసెంబర్‌లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 2020 నాటి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో జనవరి నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలైంది.
అరకొరగానే అప్‌లోడ్
దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లు అప్పట్లో అప్‌లోడ్ చేయలేదు. మొత్తంగా 75 శాతం అసంపూర్తి దరఖాస్తులే అందజేశారు. ప్లాట్ల రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, లే అవుట్ కాపీలు, ఇతర పత్రాలు అప్‌లోడ్ చేయకుండా వచ్చి న దరఖాస్తులను పక్కనబెడుతూ అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా, వాటిలో కేవలం 60,213 దరఖాస్తులు మాత్రమే ఆమోదించినట్టు పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. తద్వారా రూ.96.60 కోట్లు ఫీజు రూపంలో వసూలైనట్టు చెప్పారు. పరిశీలించిన దరఖాస్తుల్లో 75 శాతం పూర్తిస్థాయి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వాటిని ఆమోదించడం లేదని దరఖాస్తుదారులకు చెప్పారు. షార్ట్‌ఫాల్స్ వివరాలను కూడా దరఖాస్తుదారులకు తెలియజేశారు.
మరోసారి అవకాశం
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడానికి పురపాలకశాఖ మరో చాన్స్ ఇచ్చి ంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయడానికి, మున్సిపాలిటీ/కార్పొరేషన్/నగరాభివృద్ధి సంస్థల నుంచి అధికారిక షార్ట్ ఫాల్స్ లెటర్ కోసం వేచిచూడకుండా పూర్తిస్థాయి డాక్యుమెంట్లను ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సేల్‌డీడ్, ఈసీ, మార్కెట్ వ్యాల్యూ సర్టీ ఫికెట్, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర దరఖాస్తు వివరాలను మొబైల్ నంబర్ ఓటీపీని వినియోగించుకొని ఈ పోర్టల్ ద్వారా సవరించుకోవచ్చునని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు.
ఇందుకోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఏవైనా సందేహాలుంటే తీర్చుకోవడానికి లేదా వివరాల కోసం ఈ హెల్ప్‌డెస్క్‌లను సందర్శించవచ్చునని తెలిపారు.