
సాక్షి, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసింది. నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగిన మేడారం జాతర.. అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు.
చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త పడిగిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను తరలించారు. కరోనా వైరస్ విజృంభన తర్వాత జరిగిన ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. మరోవైపు లక్షల మంది భక్తులు వన దేవతాలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు.