కేసీఆర్‌ తర్వాత నేనే నంబర్‌ వన్‌: మంత్రి ఎర్రబెల్లి | Minister Errabelli Dayakar Rao Attend Students Reunion Warangal Govt School | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ తర్వాత నేనే నంబర్‌ వన్‌: మంత్రి ఎర్రబెల్లి

Published Mon, Mar 13 2023 11:15 AM | Last Updated on Mon, Mar 13 2023 11:15 AM

Minister Errabelli Dayakar Rao Attend Students Reunion Warangal Govt School - Sakshi

సాక్షి, వరంగల్‌(పర్వతగిరి): ‘కేసీఆర్‌ తర్వాత రాజకీయాల్లో నేనే నంబర్‌–1.. నాకెవరూ సాటిలేరు’.. ఈ మాటన్నది ఎవరో కాదు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఆయన ఆదివారం వరంగల్‌ జిల్లా పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1987–88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి సమితి అధ్యక్షునిగా పోటీ చేసినప్పుడు టాస్‌ వేసి కాంగ్రెస్‌ వారు ఓడించారని తెలిపారు. అలా రెండు సందర్భాల్లో ఆ పార్టీ వారు కక్ష గట్టడంతో కసితో టీడీపీలో చేరానని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో ఓడించానని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement