బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్‌ | Notices To Former BRS MLA Jeevan Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్‌

Published Tue, Oct 22 2024 9:26 AM | Last Updated on Tue, Oct 22 2024 12:45 PM

Notices to former BRS MLA Jeevan Reddy

ఆర్మూర్‌: ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన జీవన్‌రెడ్డి మాల్‌కు ఆంధ్రప్రదే శ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ సోమవా రం నోటీసులు జారీ చేసింది. సంస్థ యజ మాని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డితో పాటు రుణం తీసుకోవడానికి షూరిటీ ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేశారు. 

ఆర్మూర్‌ కొత్త బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మలి్టప్లెక్స్‌ నిర్మాణం కోసం విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ వద్ద రూ.40 కోట్ల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.45.46 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు.

 తమ ఆస్తులను షూరిటీగా పెట్టిన కాటిపల్లి గంగారెడ్డి, యాల్ల నరేందర్, నక్కల లక్ష్మణ్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి. షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. సకాలంలో రుణ బకాయిలు చెల్లించకపోవడంతో భూములు స్వా«దీనం చేసుకుంటామని వ్యవసాయ భూముల వద్ద ఫ్లకార్డులు పెట్టి, నోటీసులను అతికించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. 

జీవన్ రెడ్డికి ఝలక్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement