TGSPDCL: ఫోన్‌పే, పేటీఎంలో కరెంటు బిల్లులు చెల్లించకండి | RBI Bars UPI Payments Apps PhonePe, Paytm, AmazonPay, GooglePay From Power Bill Payments, More Details | Sakshi
Sakshi News home page

ఫోన్‌పే, పేటీఎంలలో కరెంటు బిల్లులకు నో: టీజీఎస్పీడీసీఎల్‌

Published Mon, Jul 1 2024 9:44 PM | Last Updated on Tue, Jul 2 2024 11:26 AM

Rbi Bars Upi Payments Apps From Power Bill Payments

సాక్షి,హైదరాబాద్‌: ఫోన్‌ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్‌ పే లాంటి యూపీఐ పేమెంట్‌ యాప్‌ల ద్వారా ఈజీగా విద్యుత్‌ బిల్లులు చెల్లించే ఛాన్సు ఇక లేదు. ఈ నెల నుంచి విద్యుత్‌ బిల్లులు యూపీఐ యాపుల్లో పే చేయడం కుదరదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే యూపీఐ పేమెంట్‌ యాప్స్‌ ఈ సేవలను నిలిపి వేశాయి. 

ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) తమ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ రెండింటి ద్వారానే ఈ నెల కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది.  

ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు టీజీఎస్పీడీసీఎల్‌ విద్యుత్‌ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని ఆ సంస్థ ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా తెలిపింది. ఒక్క దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థే కాకుండా  ఉత్తర తెలంగాణకు సంబంధించిన టీజీఎన్‌పీడీసీఎల్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థది అదే పరిస్థితని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement