గ్రూప్‌-1పై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం | Telangana Government Added few more Posts To Group 1 | Sakshi
Sakshi News home page

Group-1: గ్రూప్‌-1పై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

Published Tue, Feb 6 2024 3:41 PM | Last Updated on Tue, Feb 6 2024 4:06 PM

Telangana Government Added few more Posts To Group 1 - Sakshi

రెండుసార్లు రద్దై.. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత కొరవడిన తరుణంలో గ్రూప్‌1పై కీలక.. 

హైదరాబాద్‌, సాక్షి: గ్రూప్‌-1 విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ జీవో విడుదల చేసింది. దీంతో గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్‌ 1 పోస్టుల సంఖ్య.. ఈ సర్కార్‌ నిర్ణయంతో పెరిగినట్లయ్యింది. 

ఆర్థిక, హోం, లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌, పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌డెవలప్‌మెంట్‌, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లలో వివిధ పోస్టులు కలిపి మొత్తం 60 పోస్టులను పాత నోటిఫికేషన్‌కు జత చేస్తూ మూడో తేదీన నిర్ణయం తీసుకుంది. ఇక.. 

2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.పేపర్‌ లీకేజీల వ్యవహారం వెలుగు చూడడంతో ఎగ్జామ్‌ రెండుసార్లు రద్దుకాగా.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం, ఇతరత్రా పరీక్షల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండునెలలు కావొస్తున్నా.. ఎగ్జామ్‌ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై స్ఫష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో సర్కార్‌ తాజా నిర్ణయంతో పోస్టుల సంఖ్య మాత్రం 563కి చేరినట్లయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement