
మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు, ఐఐఎం లాంటి ఉన్నత విద్యాసంస్థలను కేటాయించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మేధావులు లేఖ రాశారు. 8 డిమాండ్లలతో తమ సంతకాలతో 64 మంది ప్రొఫెసర్లు, విద్యావేత్తలు.. మోదీకి లేఖ రాశారు. ‘‘విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి.ఐటిఐఆర్‌ను పునరుద్ధరించాలి. రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ కేటాయించాలి. మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు, ఐఐఎం లాంటి ఉన్నత విద్యాసంస్థలను కేటాయించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.
‘‘వివక్ష లేకుండా తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. రాష్ట్రం పట్ల కక్షపూరిత, వివక్షపూరిత ధోరణి విడనాడాలి. మతతత్వ ధోరణి విడనాడి దేశ ఐక్యతను, బహుళత్వాన్ని కాపాడుకునే పాలన కొనసాగించాలి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలను తీసుకోవాలి’’ అని లేఖలో డిమాండ్ చేశారు.
చదవండి: గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు