
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తాత్కాలిక బ్రేక్ పడింది. గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవతవకలు జరిగాయని హైకోర్టులో 20 పిటిషన్ల వరకూ దాఖలు కావడంతో వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నియామకాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ మేరకు గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని స్సష్టం చేసింది. విచారణ పూర్తయ్యే వరకూ నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. పోస్టింగ్ లు మాత్రం తుది తీర్పు వెలువడే వరకూ ఇవ్వొద్దని క్లియర్ గా స్పష్టం చేసింది.
కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. దీనిపై సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫలితాలు విడుదల చేయడానికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు.
అయితే గ్రూప్-1 సరీక్షల్లో అవతవకలు జరిగాయని పలు పిటిషన్లు దాఖలు కావడంతో నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. యథావిధిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని, కాకపోతే తుది తీర్పు ఇచ్చే వరకూ పోస్టింగ్‌లు ఇవ్వొద్దని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొదది. దాంతో తమ నియామకాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నిరాశ అలముకుంది. మళ్లీ గ్రూప్-1 పరిస్థితి ఇలా టర్న్ తీసుకుందేమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.