
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీఈసెట్ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీఈసెట్ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్‌లో మార్పులను అభ్యర్థులు గమనించాలని కోరింది. హాల్ టికెట్స్‌ను త్వరలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు..
1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30 మరియు 31
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న
ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు