
ప్రత్యేక మెడికల్ క్యాంపుపై సమీక్ష
తిరుపతి తుడా: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల సందర్భంగా మెడికల్ సర్టిఫికెట్స్ జారీ, పరిశీలన కోసం రుయా ఆస్పత్రిలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటుపై సంబంధిత అధికారులు సమీక్షించారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సమస్యలపై రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభుని ఏపీ జేఏసీ చైర్మన్ సురేష్‌బాబు, డీఈఓ కేవీఎన్ కుమార్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురువారం కలసి చర్చించారు.
పాల్ ట్యాబ్‌ల పంపిణీ
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు సంబంధించి పాల్ ట్యాబ్‌లను గురువారం పద్మావతీపురంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో డీఈఓ కేవీఎన్.కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 15 ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూళ్లకు ఒక్కో స్కూలుకు 30 చొప్పున మొత్తం 450 పాల్ ట్యాబ్‌లను అందించినట్లు తెలిపారు. ఈ ట్యాబ్‌లో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్‌కు సంబంధించి కంటెంట్ ఉంటుందని, తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందని తెలిపారు. అలాగే వృత్తివిద్యకు సంబంధించి వివిధ స్కిల్ డెవెలెప్‌మెంట్ అంశాలు ఇందులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో తిరుపతి డీవైఈఓ కె.బాలాజీ, సమగ్ర శిక్ష సీఎంఓ సురేష్, జిల్లా పాల్ నోడల్ అధికారి రుక్మాంగధ, జీసీడీఓ పుష్ప, ఏఎస్‌ఓ సారథి పాల్గొన్నారు.

ప్రత్యేక మెడికల్ క్యాంపుపై సమీక్ష