
మహిళకు తీవ్ర గాయాలు
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని విన్నమాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. పట్టణంలోని బాలాజీ గార్డెన్ వీధికి చెందిన నవ్య శనివారం విన్నమాల గ్రామ సమీపంలో రోడ్డు దాటుతోంది. అదే సమయంలో నెల్లూరు నుంచి చైన్నె వైపు వెళుతున్న కంటైనర్ లారీలో ఉన్న ఐరన్ చానల్ తగిలి తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను 108 అంబులెన్స్‌లో నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ నీలపకుండా వెళ్లింది. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.