
పంటపొలాలపై ఏనుగుల బీభత్సం
పాకాల మండలం గానుగపెంట పంచాయతీలో ఆదివారం ఏనుగులు పంటలను నాశనం చేశాయి.
రోగులపై భారం
ప్రభుత్వాస్పత్రుల్లో కనీసం బీపీ, షుగర్‌తోపాటు దగ్గు మందులు కూడా లేకపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. చివరకు బీ కాంప్లెక్స్ మాత్రలు కూడా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా మందులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కలెక్టర్ ఓ అడుగు ముందుకేసి డిస్ట్రిక్ పర్చైజింగ్ కమిటీని ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నాఉ. . రోగులకు అత్యవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు రాయించే స్లిప్‌లతో ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ల్యాబ్‌లో సైతం అరకొరగానే పరీక్షలు చేస్తున్నారు. ఆయా టెస్ట్‌లకు కావాల్సిన మందులు, సామగ్రి అందుబాటులో లేక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రక్త, మూత్ర పరీక్షలకు అవసరమైన కెమికల్స్ సైతం లేని దయనీయ పరిస్థితి..
– 8లో

పంటపొలాలపై ఏనుగుల బీభత్సం