సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడు | - | Sakshi
Sakshi News home page

సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడు

Published Wed, Apr 2 2025 7:36 AM | Last Updated on Wed, Apr 2 2025 7:36 AM

సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడు

సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడు

కొడంగల్‌: సూర్యదేవ నమో నమః అంటూ భక్తులు పరవశించిపోయారు. మంగళవారం ఉదయం పద్మావతీ సమేత శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా ము స్తాబు చేసిన వాహనంపై స్వామివారు బద్రి నారాయణమూర్తిగా పూజలు అందుకున్నారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్ర సాదాలు పంపిణీ చేశారు. సోమవారం రాత్రి స్వామివారు గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

నిషేధిత పదార్థాల

రవాణా చట్టరీత్యా నేరం

డీఎస్పీ బాలకృష్ణారెడ్డి

తాండూరు టౌన్‌: ప్రభుత్వ నిషేధిత పదార్థాల రవాణా చట్టరీత్యా నేరమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి తాండూరు రైల్వే స్టేషన్‌లో పోలీసులు ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పలు రైళ్లలో హైదరాబాద్‌ వైపు నుంచి తాండూరుకు వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, అనుమతి లేని మద్యం, డ్రగ్స్‌, గుట్కా వంటి పదార్థాలను గతంలో రవాణా చేస్తూ తాండూరు రైల్వే స్టేషన్‌లో పలువురు దొరి కారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ మీదుగా తాండూరుకు వస్తున్న రైళ్లలో నిషేధిత పదార్థాలను రవాణా చేస్తున్నారనే అనుమానంతో తనిఖీలు చేశామన్నారు. తనిఖీల్లో తాండూరు పట్టణ, రూరల్‌ సీఐలు సంతోష్‌ కుమార్‌, నగేష్‌, ఎస్సైలు రమేష్‌, స్వామిదాసు, గిరి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులపై దాడులు ఆపాలి

కొడంగల్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసులు చేస్తున్న దాడులను ఆపాలని తెలంగాణా ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్‌పల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కుపంపించారని ఆరోపించారు. యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. విశ్వ విద్యాలయాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వాటిని అమ్మకానికి పెట్టడం సరైంది కాదన్నారు.

నిర్బంధాలతో

ఉద్యమాలను ఆపలేరు

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య

షాబాద్‌: ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను అమ్మడానికి కుట్ర చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఆరోపించారు. షాబాద్‌లో మంగళవారం సీపీఐ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి సంఘం నాయకులను రాత్రికి రాత్రే అరెస్టు చేసి నిర్బంధించడం దుర్మార్గమని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేయకుండా నిర్బంధం విధించడం.. హైదరాబాద్‌ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని లాక్కొని విక్రయించాలని చూడడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల ఆస్తులు మ్ముకోవడమేనా ప్రజా ప్రభుత్వం అంటే అని నిలదీశారు. గత ప్రభుత్వం సర్కారు భూములు, ప్రజల ఆస్తులను అమ్మినందుకు ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. నిర్బంధాలు, పోలీసులతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నక్కలి జంగయ్య, నాయకులు రఘురాం, నారాయణ, మధు, శ్రీశైలం, రాములు, శేఖర్‌, రామకృష్ణ, పాండు, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement