
16 అడుగుల గిరినాగు పట్టివేత
● ఊపిరి పీల్చుకున్న రైతులు
వేపాడ: మండలంలో చామలాపల్లి నుంచి వెంకయ్యపాలెం వెళ్లే రహాదారిలో అరిగివాని చెరువువద్ద 16 అడుగుల గిరినాగును స్థానికులు గుర్తించారు. శుక్రవారం రాత్రి అరిగివాని చెరువు కళ్లాలవద్ద బుస కొడుతుండగా అక్కడ ఉన్న రైతులు గమనించి చూసి గిరినాగుగా గుర్తించారు. తక్షణమే వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం ప్రతినిధి వరపుల కృష్ణకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్దలానికి చేరుకుని 16 అడుగుల గిరినాగును భద్రంగా పట్టుకుని గొనెసంచెలో భద్రపరిచారు. ఉదయాన్నే అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. దీంతో స్దానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు.