Vizianagaram District Latest News
-
ఇక్కడ సున్నా శాతం
అక్కడ శతశాతం.. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రామభద్రపురం మండలంలోని బూసాయవలస కేజీబీవీ బాలికలు సెకెండియర్లో శతశాతం ఫలితాలు సాధించారు. బైపీసీ విభాగంలో సెకెండియర్లో 33 మందికి 33 మంది, ఫస్టియర్‌లో 33 మందికి 32 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్ విద్యార్థిని బి.షర్మిల బైపీసీలో 963/1000 మార్కులు సాధించింది. అయితే, రామభద్రపురం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాల విద్యార్థులు సున్నా శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షకు హాజరైన 14 మందికి అందరూ ఫెయిలయ్యారు. హైస్కూల్ ప్లస్‌లను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, విద్యాబోధనకు అర్హత ఉన్న అధ్యాపకులను నియమించకపోవడమే దీనికి కారణమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే కళాశాలలపై నిర్లక్ష్యం తగదంటున్నారు. – రామభద్రపురం -
మా క్లినిక్‌కు వచ్చేయండి..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి... జిల్లాకే పెద్దది. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి అనారోగ్యానికి గురైనా తొలుత ఆశ్రయించేది ఈ ఆస్పత్రినే. అందుకే ప్రతి రోజు 1100 నుంచి 1200 మధ్యన ఓపీ నమోదవుతుంది. అయితే, కొందరు వైద్యులు ప్రభుత్వాస్పత్రిలో రోగులకు సేవలందించే అవకాశం ఉన్నా... తమ సొంత క్లినిక్‌లలో మంచి సేవలు అందిస్తామని నమ్మించే ప్రయత్నంచేస్తున్నట్టు సమాచారం. ప్రమాదాల్లో గాయపడిన వారిని, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగుల పట్ల వైద్యులు వ్యవహరిస్తున్న తీరును కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వైద్య ఖర్చులు తట్టుకోలేక ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారిని ప్రైవేటు క్లినిక్‌లకు రావాలని చెప్పడంపై మండిపడుతున్నారు. కొంతమంది వైద్యులు అయితే చాలా కాలంగా రోగులను క్లినిక్‌లకు తరలించి ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య సేవలు ఇలా.. వైద్య సేవలు ఇలా.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కంటి, ఎముకలు, న్యూరోమెడిసిన్, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, చర్మ, దంత, ఈఎన్టీ, ఎన్సీడీ, పలమనాలజీ ఓపీ విభాగాలు ఉన్నాయి. రోజుకి సగటున 1100 నుంచి 1200 మంది వరకు రోగులు ఆస్పత్రికి వస్తారు. 270 నుంచి 300 మంది వరకు ఇన్‌పేషేంట్స్‌గా చికిత్స పొందుతారు. రోజుకు 40 నుంచి 50 మంది వరకు డిశ్చార్జ్ అవుతారు. సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఇక్కడ అయితే రెండు, మూడు రోజులు ఉండాలి మా క్లినిక్‌లో ఆపరేషన్ చేసిన రోజే ఇంటికి పంపిస్తాం వైద్యుల తీరుతో విస్తుపోతున్న రోగులు ‘గంట్యాడ మండలానికి చెందిన సీహెచ్ ఈశ్వరమ్మ అనే మహిళ చేతిపై చిన్నకాయను తొలగించేందుకు అవసరమైన చికిత్స కోసం కొద్ది రోజుల కిందట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఆర్థో (ఎముకల) విభాగానికి వెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆపరేషన్ చేసి చేతిపై ఉన్న కాయ తొలిగించాలని చెప్పారు. సర్వజన ఆస్పత్రిలో అయితే శస్త్రచికిత్స చేసిన తర్వాత రెండు, మూడు రోజులు ఉండాలని, మా క్లినిక్‌లో అయితే చేసిన రోజే ఇంటికి పంపించేస్తాం అని చెప్పారు. చీటీపై ఫోన్‌నంబర్ రాసి ఆ మహిళకు ఇచ్చారు. క్లినిక్‌లో ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టంలేక ఆమె ఇంటి వద్దే ఉండిపోయారు.’ చర్యలు తీసుకుంటాం సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారికి ఇక్కడే మెరుగైన వైద్యసేవలు అందజేయాలి. అవసరమైతే శస్త్రచికిత్స చేయాలి. క్లినిక్‌లకు రావాలని చెబితే వెంటనే రోగుల బంధువులు ఫిర్యాదు చేయాలి. ఏ వైద్యుడిపై ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
24న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
● యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వి.నర్సింహరావు విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 24న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికుల ధర్నాలు జరుగుతాయని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్.వి.నర్సింహరావు అన్నారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పడు మొఖం చాటేశారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డులో రూ.4,293 కోట్లు నిధులు ఉన్నాయని, వాటితో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి.రమణ, నాయకులు బి.సత్యం, కె.సంతోష్‌కుమార్, ఆర్.సతీష్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన
–8లోమృత్యుంజయుడు పింటూ భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన పింటూ ఏనుగుల నుంచి తప్పించుకోవడంతో అందరూ పిరిపీల్చుకున్నారు. చీపురుపల్లి రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు, రాజ్యాంగ నియమాలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన సాగిస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా పాలన రావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా చీపురుపల్లి పట్టణం లావేరు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బీఆర్ అంబేడ్కర్ ఎంతో కృషి చేశారన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ సమానత్వంతో జీవించాలని, విద్యావకాశాలు అందాలనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించారన్నారు. దీనికి అనుగుణంగానే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేసి ప్రతిఒక్కరూ చదువుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందించాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తండ్రి బాటలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా మరో రెండు అడుగులు ముందుకు వేసి విద్యాదీవెన, వసతిదీవెన, అమ్మఒడి, నాడు–నేడుతో పాఠశాలలను అభివృద్ధి చేశారని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కక్షపూరితమైన రెడ్‌బుక్ పాలన సాగిస్తోందన్నారు. మద్యం, గంజాయి, మహిళలపై దాడులు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, విపక్షాలపై దాడులు, ప్రతిపక్ష సోషల్ మీడియా వారిపై తప్పుడు కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు గెరిడి రామదాసు, నాయకులు ఇప్పిలి తిరుమల, ముళ్లు పైడిరాజు, మజ్జి శంకరరావు, కరణం ఆదినారాయణ, గవిడి సురేష్, అడ్డూరి కృష్ణ, ప్రభాత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ తీరును విమర్శించిన మాజీ ఎంపీ బెల్లాన -
వెబ్సైట్లో స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితా
● 19వ తేదీలోగా అభ్యంతరాల స్వీకరణ ● డీఈఓ యు.మాణిక్యంనాయుడు విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రధానోపాధ్యాయ గ్రేడ్–2 పదోన్నతి ఖాళీ పోస్టుల భర్తీ కోసం స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు పాఠశాల విద్యాశాఖ జోన్–1 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల గ్రేడ్–2 పదోన్నతి కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారన్నారు. జాబితాను ‘ఆర్‌జేడీఎస్‌ఈవీఎస్‌పీ.కాం’ వెబ్సైట్లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 19వ తేదీలోగా ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు, విశాఖపట్నం కార్యాలయానికి ఆధారాలతో సమర్పించాలని సూచించారు. రాజ్యాంగంతో సమానత్వం విజయనగరం క్రైమ్: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతో అందరికీ సమాన అవకాశాలు సిద్ధిస్తున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. స్థానిక డీపీఓలో ఆంబేడ్కర్ జయంతిని వెనకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో సోమ వారం నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటా నికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు, సీఐ నర్సింహమూర్తి పాల్గొన్నారు. రేషన్ బియ్యం పంపిణీలో కోత! బొబ్బిలిరూరల్: మండలంలోని కాశిందొరవలస పంచాయతీ పరిధిలోని కాశిందొరవలస, డొంగురువలస, ఎరకం దొరవలస గిరిజన గ్రామాల్లోని అంత్యోదయ కార్డుదారులకు 35 కేజీలకు రెండు కేజీలు తగ్గించి డీలర్ పంపిణీ చేశాడు. దీనిపై కార్డుదారులు సోమవారం ఆందోళనకు దిగారు. బియ్యం తక్కువగా రావడం వల్లే రెండు కేజీల చొప్పున తగ్గించి ఇచ్చినట్టు డీలర్ లచ్చన్నదొర తెలిపాడు. విషయం తెలుసుకున్న సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. డీలర్‌ను హెచ్చరించి కార్డుదారులకు తగ్గిన బియ్యం మరలా అందజేశారు. గత నెలలో తక్కువ బియ్యం సరఫరా చేయడంతో ఈ నెలకూడా అదే ఇండెంట్ ప్రకారం బియ్యం సరఫరా అయ్యాయని, ఇది తెలియక డీలర్ బియ్యంలో కోత విధించి పంపిణీ చేశారని సీఎస్‌డీటీ తెలిపారు. కళ్లికోటలో గజరాజులు కొమరాడ: ఇటీవల జియ్యమ్మవలస మండలంలో సంచరించిన ఏనుగులు పాతదుగ్గి మీదుగా సోమవారం కళ్లికోట గ్రామానికి చేరుకున్నాయి. కళ్లికోట, గారవలస, దుగ్గి గ్రామాల రైతులు రాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్లవద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగుల గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. ఏనుగుల సంచారంతో జొన్న, కూరగాయల పంటలు నాశనమవుతున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందజేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. -
ఐక్యతకు కారణం అంబేడ్కర్
విజయనగరం అర్బన్: విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశం నేటికీ ఐక్యంగా ఉందంటే అది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగమే కారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో సోమ వారం అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి మంత్రితో పాటు పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ సేతు మాధవన్ ఆధ్వ ర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి.చిట్టిబాబు, జిల్లా అధికారులు, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు స్థానిక జొన్నగుడ్డిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. దేశభక్తి గీతాలకు చిన్నారుల నృత్యప్రదర్శన -
విజయనగరంలో క్రికెట్ బెట్టింగ్‌ల జోరు
● ఏడుగురిపై కేసు నమోదువిజయనగరం క్రైమ్: ఐపీఎల్ జరుగుతున్న వేళ ప్రతిచోటా క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతూనే ఉన్నాయి. అయితే క్రికెట్ బెట్టింగ్‌లపై అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాచారం తెలిసిన వెంటనే కేసులు నమోదు చేయాలని సోమవారం ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్ సూచనలతో విజయనగరం వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తన బృందంతో కలిసి దాడి చేసి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న స్థానిక ఉల్లి వీధికి చెందిన బుర్లి వాసును పట్టుకుని విచారణ చేయగా ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో శేఖర్, శ్రీను, అప్పలరాజు, నారాయణరావు, ఓబుల్‌రెడ్డి, గోల్డ్ శ్రీనులపై కేసు నమోదు చేశారు. -
దళిత అభ్యున్నతే అంబేడ్కర్ ఆశయం
● గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీకట్టిమణివిజయనగరం అర్బన్: దేశాభివృద్ధికి దళిత అభ్యున్నతే మూలమని, దానినే ఆశయంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసుకున్నారని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. భారతరత్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం ఘనంగా జరిగాయి. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాల్లో అన్నింటికన్నా ఉత్తమమైన భారత దేశ రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేడ్కర్‌కు దక్కిందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి, డాక్టర్ గంగునాయుడు మండల, డాక్టర్ కుసుమ్, సుప్రియదాస్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీలో.. అండ్కర్ జయంతి ఉత్సవాలు స్థానిక జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో సోమవారం వేడుకగా జరిగాయి. స్థానిక యూనివర్సిటీ ప్రాంగణంలో అంబేడ్కర్ చిత్రపటానికి యూనివర్సిటీ ఇచ్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి, పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
రెడ్‌క్రాస్ సొసైటీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి సత్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు–1(డీఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ, అకౌంటెంట్ పోస్టు–1(ఏదైనా డిగ్రీ, టాలీ అనుభవం ఉండాలి), జన ఔషధి మెడికల్ షాపులో ఫార్మసిస్ట్ పోస్టు–1(బి.ఫార్మశీ లేదా డి.ఫార్మసీ విద్యార్హత)కు అర్హత గల అభ్యర్థులు ఈనెల 21 వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 08922–272700, 9493092700, 6305042755 లను సంప్రదించాలని సూచించారు. కరెంట్ పోల్‌పై తిరగబడ్డ జేసీబీ సాలూరు రూరల్: మండలంలోని కొదమ పంచాయతీ అడ్డుగూడ, కోడంగివలస గ్రామాల మధ్యలో ఘాట్‌రోడ్డు వద్ద ఆదివారం రాత్రి ట్రాలీపై తీసుకువెళ్తున్న జేసీబీ తిరగబడి పక్కనే ఉన్న కరెంట్ పోల్‌పై పడింది. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. యువకుడి అదృశ్యంపై కేసు నమోదుపార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం పరిధిలో ఓలేటి వారి ఫారం సమీపంలో నివాసం ఉంటున్న రాహుల్ పండిత్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం నుంచి ఆచూకీ లేవకపోవడంతో తండ్రి ముఖేష్ పండిత్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు.చికిత్స పొందుతూ వీఆర్ఏ మృతిసీతానగరం: మండలంలోని వెంకటాపురం(కామందొరవలస)రెవెన్యూ గ్రామానికి చెందిన వీఆర్ఏ తోట నాగయ్య విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతిచెందాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 16న ఇంట్లో చెదలు నివారణకని తెచ్చి ఉంచిన చెదల నివారణ మందును వీఆర్ఏ నాగయ్య యాదృచ్ఛికంగా తాగాడు. చెదల నివారణమందు తాగినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా నాటి నుంచి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతిచెందినట్లు తెలియజేశారు. సోమవారం వీఆర్ఏ తోట నాగయ్య మృతిచెందినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.రాజేష్ కేసు నమోదుచేసి మృతదేహానికి పోస్టుమార్టం చేసినట్లు తెలియజేశారు. మృతుడు నాగయ్య అంత్యక్రియల నిమిత్తం తహసీల్దార్ ప్రసన్నకుమార్ ఆదేశాలమేరకు ఆర్ఐ నాగి రెడ్డి శ్రీనివాసరావు, వీఆర్వో బాబూరావు రూ.10వేలు కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నాగయ్య కుటుంబాన్ని సచివాలయ ఉద్యోగులు పరామర్శించి సానుభూతి వెలిబుచ్చారు. పశువుల రవాణాను అడ్డుకున్న పోలీసులులక్కవరపుకోట: అక్రమంగా వాహనాల్లో పశువులను కుక్కి తరలిస్తున్న వాహనాలను ఎల్.కోట ఎస్సై నవీన్‌పడాల్ తన సిబ్బందితో కలిసి సోమవారం అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జామి మండలం అలమండ గ్రామం సంతనుంచి నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాల్లో అధిక పశువులను ఎక్కించి రవాణా చేస్తున్న వాహనాలను భీమాళి జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 2 వాహనాల్లో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాలతో పాటూ పశువులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి పశువులను సమీపంలో గల గోశాలకు తరలించారు. ఈ మేరకు రెండు వాహనాలను సీజ్ చేసి సంబంధిత డ్రైవర్లను విచారణచేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ముగిసిన జిల్లా స్థాయి టెన్నిస్ చాంపియన్‌షిప్
విజయనగరం: విజయనగరం సిటీ క్లబ్ ఆవరణలో రెండురోజుల పాటు కొనసాగిన జిల్లా స్థాయి పోటీలు ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణలో సాగి సోమవారం ముగిశాయి. ఈ పోటీల్ల క్రీడాకారులు ఉత్తమమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఐదు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో దాదాపు అరవై మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 12, అండర్ 16, అండర్ 30, 40, 50 విభాగాల్లో పోటీలకు సిటీ క్లబ్ ఆతిథ్యం ఇచ్చింది. క్రీడాకారుల నుంచి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ వసూలు చేయకుండా వారిని ప్రోత్సహించేందుకు నిర్వాహకులు టెన్నిస్ పోటీలు నిర్వహించి విజేతలకు చాంపియన్ షిప్ ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విజయనగరానికి టెన్నిస్ క్రీడకు ఉన్న సంబంధాన్ని అంతా మననం చేసుకున్నారు. ప్రతి ఏడాది దివంగత నారాయణ దొర, ముద్దుబాబు, బాబ్జీలు జాతీయస్థాయి పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించేవారని గుర్తుచేశారు. వారి స్ఫూర్తితో సిటీ క్లబ్ అధ్యక్షుడు రంగబాబు, జాతీయ టెన్నిస్ మాజీ కోచ్ సన్నిబాబు, శ్రీను, శివాజీల చొరవతో ఈ ఏడాది జిల్లాస్థాయి టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించామని వైభవ్, సాత్విక్, కౌశిక్ కోచ్ గౌరీశంకర్, రామారావు పోటీల ముగింపు కార్యక్రమంలో తెలిపారు. త్వరలో మరిన్ని పోటీలను నిర్వహిస్తామన్నారు. అతి తక్కువ ఫీజ్ తో సిటీ క్లబ్ ఆవరణలో టెన్నిస్ శిక్షణ ఇస్తున్నామని చిన్నారులు ఈ అవకాశం వినియోంచుకోవాలని కోచ్ గౌరీశంకర్ తెలిపారు. -
మృత్యుంజయుడు పింటూ
● ఏనుగుల దాడి నుంచి క్షేమంగా బయటకుభామిని: ఏనుగుల ఘీంకారంతో దిక్కులు పిక్కటిల్లుతున్న సాయం సంధ్యా సమయం, మరో వైపు భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన పింటూ ఏనుగులకు చిక్కాడన్న ప్రచారంతో ప్రజల పరుగులు..ప్రమాద స్థలానికి వెళ్లడానికి ప్రజలకు ధైర్యం చాలడం లేదు. ఏనుగులు కనిపిస్తూనే ఉన్నాయి. ఏనుగులకు అరటిగెల ఇవ్వడానికి వెళ్లిన పింటూ సాంత్రో వాటికి దొరికి పోయాడనే ప్రచారం ఊపందుకుంది. మరో పక్క సింగిడి, బిల్లుమడ, నులకజోడు గ్రామస్తులతో రోడ్డంతా నిండిపోయింది. చివరికి సోమవారం సాయంత్రం పింటూ బయటపడడంతో ప్రజల్లో ఆందోళన తగ్గింది. మృత్యుంజయుడిగా పింటూ సాంత్రో బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగుల దాడిలో పింటూ చిక్కుకుని తప్పించుకునే క్రమంలో బురదలో పడిపోయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని బత్తిలి ఎస్సై డి.అనిల్ కుమార్ అటవీ సిబ్బందితో కలిసి పింటూ సాంత్రోను ప్రజల ముందుపెట్టి వెల్లడించి సింగిడి గ్రామస్తులకు అప్పగించారు. -
వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించండి
● అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేతవిజయనగరం గంటస్తంభం: వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.గురుమూర్తి కోరారు. వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు వీఆర్ఏలు స్థానిక కలెక్టరేట్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ రెవెన్యూ సహాయకులుగా పైకి విధులు నిర్వహిస్తున్నా వారు అంతర్గతంగా ఆఫీస్ కార్యాలయాల్లో అటెండర్లుగా, స్వీపర్లుగా, డ్రైవర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారన్నారు. అటువంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాగే అర్హులైన వారికి ప్రమోషన్, నైట్‌డ్యూటీల రద్దు, జీతంతో కలిపి డీఏలు, భూసర్వేల సందర్భంగా టీఏ, డీఏలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, ప్రసాద్, పైడిరాజు, సన్యాసప్పుడు, రామప్పుడు, జయరావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆటో ఢీకొని యువకుడికి గాయాలు
గంట్యాడ: విజయనగరం మండలం కోరుకొండపాలెం గ్రామానికి చెందిన యువకుడు నొడగల గణేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గణేష్ బైక్‌పై గంట్యాడ మండలం పెదవేమలి వైపు వస్తుండగా గంట్యాడ మండలం మురపాక నుంచి ఎదురుగా వస్తున్న ఆటో పెదవేమలి, కోరుకొండపాలెం మధ్య గెడ్డ సమీపంలో బైక్‌ను ఢీకొట్టడంతో గణేష్ కింద పడిపోగా కాలు విరిగిపోయింది. స్థానికులు 108 అంబులెన్సులో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బైక్ ఢీకొని మహిళకు..సీతానగరం: మండలంలోని జాతీయరహదారిలో సోమవారం రాత్రి అంటిపేట వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఓ మహిళ గాయాల పాలైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంటిపేట ప్రజలకు కూడలిగా ఉండే రావిచెట్టు సమీపంలో గాడి లక్ష్మి రోడ్డు దాటుతుండగా బొబ్బిలి మండలం అప్పయ్యపేట గ్రామానికి చెందిన మోటార్ సైక్లిస్ట్ సీతానగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా లక్ష్మిని ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. గాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
గంజాయి తరలింపు కేసులో ఆరో నిందితుడి అరెస్ట్
తెర్లాం: గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన కేసులో ఆరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్సై సాగర్‌బాబు సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వారు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. 2024లో రెండు కార్లలో 18.2 కేజీల గంజాయిని రామభద్రపురం నుంచి రాజాం తరలిస్తుండగా తెర్లాం జంక్షన్ వద్ద స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో వారి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి, రెండు కార్లను సీజ్ చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అదే కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి మండలం ఘాడిగూడకు చెందిన ఆరో నిందితుడు రామభద్రపురం బైపాస్ వద్ద ఆదివారం రాత్రి సంచరిస్తుండగా తెర్లాం పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఐదవ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి కేసును ఛేదించేందుకు కృషిచేస్తున్న ఎస్సై సాగర్‌బాబు, సిబ్బందిని సీఐ నారాయణరావు అభినందించారు. -
పన్ను వసూలులో నిర్లక్ష్యం..!
● పంచాయతీల్లో పడకేసిన ప్రగతి ● వసూలులో వెనుకబడిన అధికారులు ● బకాయి రూ.కోట్లలోనే..రామభద్రపురం: పంచాయతీల్లో ఇంటి పన్ను, ఆస్తిపన్ను వసూలు విషయంలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది.ఫలితంగా ఆయా పంచాయతీలు ఆర్థిక సంక్షోహం ఎదుర్కొంటుండడంతో పల్లెల్లో ప్రగతి పూర్తిగా పడకేసింది. గ్రామాల్లోని గృహాలు, ఖాళీస్థలాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ద్వారా మార్చి 31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేస్తామని అధికారులు ప్రకటించినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. ఇంటి పన్నుల వసూలు ఇలా.. జిల్లాలో 777 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో మార్చి 31 నాటికి 2023–24 ఏడాదికి సంబంధించి ఇంటి పన్నులు పాతబకాయి రూ.3,31,52,718 కాగా, 2024–25 ఏడాదికి వసూలు చేయాల్సింది. రూ. 15,76,14,332. మొత్తంగా రూ. 19,07,67,050 లు వసూలు లక్ష్యం ఉంది. అయితే ఇందులో పాత బకాయి రూ.2,66,11,654లు, ఈ ఏడాది రూ.13,40,20,752లు వసూలు చేశారు.మొత్తంగా రూ.16,06,32,406 వసూలైంది. ఇంకా పాత బకాయిలు రూ.65,41,064లు, 2024–25 ఏడాది వసూలు చేయాల్సింది రూ.2,35,93,584 బకాయి ఉంది. మొత్తంగా రూ.3,01,34,644లు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పడకేసిన ప్రగతి.. పంచాయతీ ఖజానాలో పైసా లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిధులు లేక వాటిలో ప్రగతి పనులు పడకేశాయి. తాగునీటి పథకాల నిర్వహణతో పాటు వీధిదీపాలు, పారిశుద్ధ్యం నిర్వహణకు సొమ్ములేదు. దీంతో గ్రామకార్యదర్శులు, సర్పంచులు గ్రామాల్లో పనులు చేయించుకోలేకపోతున్నారు. వీధుల్లో రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలకు నిధులు లేవు.నీటి పథకాలను అతికష్టం మీద నిర్వహిస్తున్నారు. మోటార్లు కాలిపోతే రూ.వేలల్లో ఖర్చువుతుంది. ఆ సొమ్మును సర్పంచులే భరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తే వాటిలో బిల్లు చేసుకోవాలన్న ఆశతో సొంత సొమ్మును ఖర్చు పెడుతున్నారు. మారుమూల గ్రామాల్లో వీధి దీపాలు కూడా వెలగడం లేదని, పండగలకు మాత్రమే వీధి దీపాలు వెలుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.కాళ్లరిగేలా తిరిగినా సీసీ రోడ్డు వేయరు ప్రతి నాయుకుడి దగ్గరికి కాళ్లరిగేలా తిరిగినా మా వీధిలో సీసీ రోడ్డు వేయడం లేదు. ఏళ్లుగా బుగ్గి, బురదలోనే తిరుగుతున్నాం. ఎన్నికల సమయంలో వచ్చిన పెద్ద నాయకుల దృష్టిలో కూడా పెట్టాం. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పడమే కానీ చేయడం లేదు. ఇకనైనా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – బోయిన బాలరాజు, నేరళ్లవలస, జన్నివలసపన్నులు వదిలే ప్రసక్తి లేదు.. గ్రామాల్లో ప్రజల నుంచి ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు రాబడతాం. వదిలే ప్రసక్తి లేదు.త్వరలో వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. పన్ను వసూళ్లపై ప్రచార మాధ్యమాల ద్వారా, అలాగే సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించి పక్కా ప్రణాళికతో వసూలు చేస్తాం. ఆస్తి పన్ను చెల్లింపులో ఇప్పుడు 50 శాతం రాయితీ వర్తిస్తుంది. పన్నులు వసూలైతేనే ప్రగతి పనులకు నిధుల కొరత లేకుండా ఉంటుంది. – వెంకటరమణ, ఈవోపీఆర్డీ, రామభద్రపురం ఆస్తి పన్ను వసూలు ఇలా.. అలాగే పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరులైన మార్కెట్ వేలం, చేపల చెరువులు, దుకాణాలు, చేపల చెరువుల లీజులు, సంతలు, సెల్‌టవర్స్ తదితర ఆస్తి పన్నులు 2023–24 ఏడాది పాత బకాయిలు రూ.1,65,42,853లు, 2024–25 ఏడాది వసూలు చేయాల్సింది రూ.3,25,95,344 ఉండగా, మొత్తంగా 4,91,38,197 వసూలు లక్ష్యం ఉంది. ఇందులో పాతబకాయి రూ.95,09,074లు, ఈ ఏడాది రూ.2,57,44,030లు వసూలు చేశారు.మొత్తంగా రూ.3,52,53,104 వసూలైంది.ఇంకా పాత బకాయిలు రూ.70,33,779లు, ఈ ఏడాది వసూలు చేయాల్సింది రూ.68,51,314 బకాయి ఉంది. మొత్తంగా రూ.1,38,85,093లు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అయితే మార్చి 31 అర్ధరాత్రి నుంచి ఆస్తిపన్నుకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్ నిలిపివేసినట్లు తెలిసింది.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం వివరాలు అప్డేట్ అయిన తర్వాత వెబ్సైట్ మళ్లీ అందుబాటులోకి రానుందని సమాచారం. -
మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా గోవిందరావు బాధ్యతల స్వీకరణ
విజయనగరం క్రైమ్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రమంతటా ఉన్న దిశ మహిళ పోలీస్స్టేషన్లను మహిళా పోలీస్స్టేషన్లుగా మార్చిన సంగతి విదితమే. విజయనగరం మహిళా పోలీస్‌స్టేషన్‌కు రెండో డీఎస్పీగా ఆర్.గోవిందరావు సోమవారం బాధ్యతులు చేపట్టారు. అనంతరం నేరుగా ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లి ఎస్పీ వకుల్ జిందల్‌ను కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అలాగే స్టేషన్ కు వచ్చిన ప్రతి బాధితురాలి బాధను అర్థం చేసుకుని కేసు నమోదు చేసేలా ప్రవర్తించాలని చెప్పారు. ఇక మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గోవిందరావు 1991లో డిపార్ట్మెంట్లో చేరి జిల్లాలోని ఎస్.కోట, డెంకాడ, సబ్ మైరెన్, విజయనగరం రూరల్ ఎస్సైగా పనిచేశారు. ఇటీవలే విజయనగరం డీఎస్పీగా పనిచేసిన అనంతరం మహిళా స్టేషన్ డీఎస్పీగా తాజాగా బాధ్యతలు చేపట్టారు. -
లలిత.. నీవే ఆదర్శం
● ఇంటర్ బైపీసీలో సత్తా చాటింది ● ప్రభుత్వ కళాశాలల విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కై వసం నెల్లిమర్ల: నిరుపేద కుటుంబంలో పుట్టిన లలిత నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. తమ స్వగ్రామం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యాభ్యాసం కోసం చేరింది. ఇక్కడే ఉన్న ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతిగృహంలో ఉంటూ కళాశాలకు ప్రతిరోజూ నడిచి వెళ్లేది. కష్టం అయితేనేం ఇష్టపడి చదివింది. తాను అనుకున్నది సాధించింది. తాజాగా శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. బైపీసీ గ్రూపులో 989 మార్కులు సాధించి, ప్రభుత్వ కళాశాలల విభాగంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదీ నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బర్ల లలిత సాధించిన ఘనత. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బర్ల లలిత తల్లిదండ్రులు సంగమేష్ , సుశీల ఇద్దరూ వ్యవసాయ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. పదో తరగతిలో 504 మార్కులు సాధించిన లలితను కార్పొరేట్ కళాశాలలో చదివించే స్థోమత వారికి లేదు. అందుకే దూరమైనా సరే వసతిగృహం అందుబాటులో ఉన్న నెల్లిమర్ల ప్రభుత్వ కళాశాలలో బైపీసీ గ్రూపులో చేర్పించారు. గతేడాది ఫస్ట్ ఇయర్ కూడా లలిత స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇప్పుడు 989/1000 మార్కులు సాధించి, ప్రభుత్వ కళాశాలల విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచింది. లతితను విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిణి జ్యోతిశ్రీ, సహాయ సంక్షేమాధికారిణి రాజులమ్మ, వసతిగృహ సంక్షేమధికారిణి కృష్ణవేణి అభినందించారు. -
సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ రేపు
విజయనగరం అర్బన్: పట్టణంలోని సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈ నెల 15న డక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పూల్ క్యాంపస్ డ్రైవ్‌ను నిర్వహిస్తుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొడక్షన్ విభాగంలో ట్రైనీ కెమిస్ట్ పొజిషన్ కోసం బీ ఎస్సీ కెమిస్ట్రీ మరియు సీబీజెడ్, డిప్లమా మెకానికల్, బీటెక్ మెకానికల్ పాసైన, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న చివరి సెమిస్టర్ వరకు బ్యాక్‌లాగ్స్ లేని పురుషులు 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉన్న వారు మాత్ర మే అర్హులని తెలిపారు. ఎంపికై న వారు తుని లోని బ్రాంచ్‌లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు నేరుగా కళాశాల ప్రాంగణానికి పూర్తి బయోడే టా, ధ్రువపత్రాలు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోల తో హాజరు కావాలని సూచించారు. పేర్ల నమో దుకు 7012393316, 9032772661 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. రక్తదానంతో ప్రాణదానం విజయనగరం టౌన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలు విడనాడి రక్తదానానికి ముందుకు రావా లని విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ ఇల్తామాష్ కోరారు. నగరంలోని బీసీ కాలనీలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లాలో రక్తం నిల్వల కొరత కారణంగా తలసీమియా పిల్లలు, గర్భిణుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. రక్తదానం చేసిన 30 మందిని సత్కరించారు. శిబిరంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, శరత్, అశోక్, సాయి, రఘు, సాయిప్రసాద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 16న ర్యాలీ విజయనగరం టౌన్: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన తలపెట్టిన భారీ ర్యాలీ కి సంబంధించి జిల్లా ముస్లిం సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆబాద్‌వీధిలో ఉన్న కార్యాలయంలో ఆదివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకుడు ఆబ్దుల్ కరీమ్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేయడం దారుణమన్నారు. వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం కలుగు తుందన్నారు. మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు షరీఫ్, ముస్తఫా, జాకీర్ హుస్సేన్, మొహమ్మద్ నిజాం, అన్సర్, చిస్తి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా శ్రీవారి చక్రస్నానాలు రాజాం : మండలంలోని అంతకాపల్లి గ్రామంలో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీపద్మావతి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుని ఉత్స వ విగ్రహాలకు మిధున లగ్నంలో చక్రస్నానా లు నిర్వహించారు. కనుల పండువగా జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్ కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఏఈఓ జి. జగన్మోహన్ఆచార్య, ఆలయ పర్యవేక్షకులు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేడు డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి పార్వతీపురం టౌన్: భారత రాజ్యాగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సోమవారం నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు తన కార్యాలయంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందన్నారు. అనంతరం సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. -
పరీక్ష ఫెయిలయ్యానని..
భోగాపురం: మండలంలోని ముంజేరు గ్రామానికి చెందిన మొగసాల స్రవంతి (19) అనే యువతి మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వి.పాపారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముంజేరు గ్రామానికి చెందిన స్రవంతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 12వ తేదీన వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేకపోడవంతో ఆదివారం మధ్యాహ్నం చీరతో ఊయ్యాల హుక్కుకు ఉరివేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి తండ్రి సూరిబాబు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పురుగు మందు తాగి వ్యక్తి.. రామభద్రపురం: మండలంలోని ఎస్.సీతారాంపురం గ్రామానికి చెందిన మునకాల వెంకటరమణ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వి.ప్రసాదరావు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరమణ నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు. మూడేళ్లుగా మానేశాడు. అయితే మూడు నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల రెండు రోజుల నుంచి ఆ నొప్పి కాస్త ఎక్కువవడంతో చిన్న కుమారుడు కార్తీక్ ఆస్పత్రికి తీసుకెళ్లి డాక్టర్‌కు చూపిస్తానని చెప్పినా వినకుండా శనివారం మండలకేంద్రంలోని చిన్నమ్మతల్లి గుడి సమీపంలోని మామిడితోటలో పురుగుమందు తాగేశాడు. దీంతో స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. పెద్ద కుమారుడు పృథ్వీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్య -
ఇంటర్ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం
● ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 6 గురుకులాల్లో శతశాతం ఉత్తీర్ణతవిజయనగరం అర్బన్: ‘ఇది విజయనగరం జిల్లా వేపాడ మండల కేంద్రంలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల భవనం. ఇక్కడి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులు 75 మంది ఎంపీసీ, బైపీసీ కోర్సులలో పరీక్ష రాస్తే అందరూ ఉత్తీర్ణలై శతశాతం ఫలితాల గురుకులాల జాబితాలో చేరింది. అదే విధంగా ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ, బైపీసీ పరీక్షలు రాసిన 62 మంది విద్యార్ధులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ ఇంటర్ ఎంపీసీలో 454/470 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అధిక మార్కుల తెచ్చుకున్న వారితో ఈ కళాశాల ముందువరుసలో ఉంది. ●● పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండల కేంద్రంలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఇది. ఇక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదివిన 73 మంది విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ కోర్సుల విద్యార్థులు 61 మందికి అందరూ పాసై శతశాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ద్వితీయ ఇంటర్లో 966/100 మార్కులు తెచ్చుకుని కె.గాయత్రి, పి.శాంతికుమారి జిల్లా స్థాయిలో ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. ప్రథమ ఇంటర్ బైపీసీలో 454/700 మార్కులతో పి.రేవతి జిల్లాలో ముందువరసలో ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో గురుకులాల విద్యార్థినులు ద్వితీయ ఇంటర్ ఎంపీసీ కోర్సుల ఫలితాల్లో జిల్లా స్థాయి మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థుల వివరాలిలా ఉన్నాయి. గరుగుబిల్లి గురుకుల పాఠశాల విద్యార్థిని పి.మేఘన 972/1000, కొమరాడ గురుకుల కళాశాల విద్యార్థిని కె.గాయత్రి 966/1000, పి.శాంతికుమారి 966/1000, వేపాడ గురుకుల విద్యార్థిని ఎం.కావ్య 961/1000 మార్కులతో మొదటి నాలుగు స్థానాలను వరుసగా సాధించారు. అదేవిధంగా బైపీసీలో కూడా మొదటి మూడు స్థానాలు గురుకులాల విద్యార్ధినులే సాధించారు. చీపురుపల్లి గురుకుల విద్యార్థిని కె.కల్యాణి 975/1000, కొమరాడ గురుకుల విద్యార్థిని టి.లోహిత, డి.దుర్గ 974/1000, చీపురుపల్లి విద్యార్థిని కె.రమ్య 968/1000 మార్కులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. సీఈసీ విభాగంలో నెల్లిమర్ల విద్యార్థినులు కె.శశికళ 959/1000, ఎం.హారిక 927/1000 మార్కులు తెచ్చుకుని వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు. హెచ్ఈసీ విభాగంలో భామిని విద్యార్థిని ఎ.రాజేశ్వరి 856/1000 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రథమ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కొమరాడ విద్యార్థిని పి.రేవతి 463/470, గరుగుబిల్లి విద్యార్థిని ఆర్.పూజిత 459/470, వేపాడ విద్యార్థిని సౌజన్య 454/470 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ప్రథమ ఇంటర్ బైపీసీ విభాగంలో కొమరాడ గురుకుల పాఠశాల విద్యార్థిని వై.ప్రశాంతి 433/440, వంగర గురుకుల విద్యార్థినులు కె.హరిప్రియ 432/440, పి.మౌనిక 431/440 మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఎంఈసీ గ్రూప్‌లో ఎన్.రేణుక 424/440, సీఈసీలో వై.దేవి 421/500, హెచ్ఈసీ గ్రూప్‌లో డి.సంజన 477/500 మార్కులతో ఆయా గ్రూప్‌లలో మొదటి స్థానంలో ఉన్నారు. పెరిగిన ఉత్తర్ణత శాతం గత ఏడాది ఫలితాల్లో ప్రథమ ఇంటర్ 82.21 ఉత్తీర్ణత శాతం ఉంటే తాజాగా వచ్చిన ఫలితాల్లో 86.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా గత ఏడాది ద్వితీయ ఇంటర్లో 87.25 ఉత్తీర్ణత శాతం ఉంటే తాజాగా వచ్చిన ఫలితాల్లో 93.82 శాతం నమోదైంది. -
సత్తా చాటిన గిరిబాలలు
సీతంపేట: కార్పొరేట్ తరహా కళాశాలను తలదన్నేలా కనిపిస్తున్న ఈ భవనం మల్లి గిరిజన గురుకుల ప్రతిభా కళాశాల. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఈ సంవత్సరం విద్యార్థులు 99 శాతం ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 71 మంది హాజరు కాగా 70 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 67 మంది విద్యార్థులు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. ● సీతంపేట బాలికల గురుకుల కళాశాలలో 163 మంది ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కాగా 160 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో 19 మంది పరీక్షలకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత చెందారు. ద్వితీయ సంవత్సరంలో 165 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందరూ పాసయ్యారు. వృత్తివిద్యాకోర్సులో 25 మందికి 25మంది పాసయ్యారు. సీతంపేటలోని బాలురు గురుకులంలో 165 మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరు కాగా 159 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 157 మందికి 153 పాసయ్యారు. ఫలితం ఇచ్చిన మౌలిక సదుపాయాల కల్పన విద్యార్థులకు గత ప్రభుత్వ హయాంలో సమకూర్చిన సౌకర్యాలు, స్టడీ మెటీరియల్, ప్రత్యేక తరగతులు, పూర్తిస్థాయిలో బోధన సిబ్బంది నియామకం వంటి చర్యలతో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా మొదటిస్థానం సాధించిందని చెప్పవచ్చు. కేజీబీవీతో పాటు పలు కళాశాలల్లో నాడు–నేడు వంటి పనులు జరగడం విద్యార్థులకు చదువుకోవడానికి తగిన సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అప్పటి ప్రభుత్వం కల్పిండంతో పాటు అమ్మఒడి పేరుతో ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చెల్లించడం తదితర కారణాలతో గిరిజన విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి మొగ్గుచూపారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల్లో అయితే పరిమితంగా ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ వంటి గ్రూపుల్లో 40 సీట్లు మాత్రమే ఉంటాయి. తమ పిల్లలకు రెసిడెన్షియల్ కళాశాలల్లో సీట్లు కావాలని తల్లిదండ్రులు ఐటీడీఏ పీఓకు మొరపెట్టుకోవడంతో ఆయన చొరవతో రెండు, మూడేళ్లుగా అదనంగా మరో 10 సీట్లు కూడా పెంచుతూ వచ్చారు. ఈ ఫలితాల్లో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 11 మందికి పైగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 900లకు పైబడి మార్కులు సాధించారు. అలాగే 20 మందికి ఫస్టియర్‌లో 400లకు పైబడి మార్కులు వచ్చాయి. ఇంటర్ ఫలితాల్లో అద్భుతం -
ప్రజలపై గ్యాస్ మంట
విజయనగరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుతో పాటు వంట గ్యాస్‌పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్ధానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జంక్షన్ ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గ్యాస్ బండలు మహిళలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ..కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్భాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్‌పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారం మోపుతున్నారన్నారు. అధికారం చేపట్టిన పది నెలల కాలంలో విద్యుత్ చార్జీలు, మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ ఆందోళనకు దిగారని విమర్శించారు. పట్టణాల్లో పెంచిన ఆస్తి పన్నులతో ప్రజలు సతమతం అవుతున్నారని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటు అని విమర్శించారు. వెంటనే ఎకై ్సజ్ సుంకం రద్దు చేయాలని కోరారు. పెట్రోల్,డీజల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్నగర్ ఽశాఖ సహాయ కార్యదర్శి బూర వాసు, బల్లివీధి శాఖ సహాయ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, శాంతినగర్ శాఖ నాయకురాలు సూరీడమ్మ, మహిళలు పాల్గొన్నారు. మహిళల నిరసన -
బస్సు ఢీకొని తండ్రీకొడుకుల మృతి
బలిజిపేట: మండలంలోని వంతరాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బలిజిపేట గ్రామానికి చెందిన ముడుసు రామయ్య(30), కుమారుడు పవన్‌కుమార్(3) అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజాం నుంచి ఆటో డ్రైవింగ్ చేసుకుని వస్తుండగా వంతరాం గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. రామయ్య బలిజిపేట గ్రామానికి చెందిన యాదవ కుటుంబీకుడు. ఆయన ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం కుమారుడిని తీసుకుని రాజులమ్మ యాత్రకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వంతరాం సమీపంలో జరిగిన బస్సు ఢీకొని ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో భార్య భవాని, కూతురు రమ్య, కుటుంబసభ్యులు, బంధువులు లబోదిబోమని రోదిస్తున్నారు. రామయ్యకు ఉండడానికి కనీసం ఇల్లుకూడా లేదని, భార్య, కూతురికి ఆరోగ్యం బాగోలేకపోతే రాజులమ్మ మొక్కుతీర్చుకుని వస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని భావించిన తండ్రి భార్యను, ఆడపిల్లను ఇంటివద్ద ఉంచి, కొడుకును తీసుకుని వెళ్లాడని బంధువులు తెలిపారు. కుటుంబయజమాని మృతితో భార్య, ఆడపిల్ల నడిరోడ్డున పడ్డారని వాపోతున్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య భవాని ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం తరలించినట్లు చెప్పారు. చెట్టును ఢీకొని టిప్పర్ డ్రైవర్..రేగిడి: మండల పరిధిలోని రెడ్డిపేట జంక్షన్ వద్ద ఆదివారం వేకువజామున ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ చెట్టును ఢీకొనడంతో డ్రైవర్ మృతిచెందాడు. దీనిపై ఎస్సై పి.నీలావతి అందించిన వివరాల ప్రకారం ఆమదాలవలస వద్ద ఉన్న ముద్దాడపేట ర్యాంప్ నుంచి ఇసుకను తీసుకువెళ్లేందుకు సాలూరు నుంచి డ్రైవర్ టిప్పర్‌తో వస్తున్నాడు. రాజాం నుంచి పాలకొండ వైపు వేకువజామున 3గంటల సమయంలో మలుపు వద్ద వాహనం అదుపుచేయలేక చెట్టును బలంగా ఢీకొన్నాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో గాయాలపాలైన డ్రైవర్ తన ఫోన్లో మిగిలిన డ్రైవర్లకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న వారంతా కేబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీసి అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడిని అనకాపల్లి జిల్లా కోడూరు మండలం గొల్లపేటకు చెందిన పల్లా నాగరాజు (30)గా గుర్తించామని ఎస్సై తెలిపారు. మృతుడి చిన్నాన్న దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తున్నామన్నారు. మృతుడికి భార్య హేమవర్షిణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సీహెచ్‌సీకి తరలించామన్నారు.లారీ కింద పడి వ్యక్తి..కొమరాడ: మండలకేంద్రం కొమరాడ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తవలస గ్రామానికి చెందిన బిడ్డిక లక్ష్మణ్(55)లారీ చక్రాల క్రింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..రాయగడ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న లారీ రహదారి పక్కగుండా నడిచి వెళ్తున్న లక్ష్మణ్‌ను ఢీకొంది. దీంతో కింద పడిన లక్ష్మణ్ పై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో నుజ్జునుజ్జై పోయాడు. మృతుడికి నలుగురు పిల్లలు, భార్య ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం -
హెచ్‌సీ కృష్ణమూర్తికి సత్కారం
పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.కృష్ణమూర్తి తనకు నెలకు వచ్చిన జీతంలో కొంతమొత్తాన్ని పేదప్రజలు, పేద విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తున్న విషయం, అలాగే మరికొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు ఆదివారం పట్టణ శివారులో ఉన్న సూర్యపీఠం దేవస్థానంలో సాహితీ లహరి, మంచుపల్లి సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ కృష్ణమూర్తి సేవలను కొనియాడుతూ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావుల చేతుల మీదుగా సాహితీ లహరి సేవాశ్రీ పురస్కారాన్ని కృష్ణమూర్తికి అందజేశారు. కార్యక్రమంలో డా.మంచుపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ పోలీస్‌శాఖలో పనిచేస్తూ తన కష్టార్జితంలో కొంతమొత్తాన్ని సామాజిక రంగంలో విస్తృతంగా సేవలు అందించేందుకు కేటాయిస్తున్న కృష్ణమూర్తి సేవలు పలువురికి ఆదర్శమని ప్రశంసించారు. పశువులశాల దగ్ధందత్తిరాజేరు: మండలంలోని పిలింగాలవలసలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో పశువుల శాల, గడ్డివాములు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గండి సింహాచలానికి చెందిన పశువుల శాలకు నిప్పు అంటుకోవడంతో పక్కనే ఉన్న గండి కృష్ణ గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామస్తులు సమాచారం అందించడంతో బాడంగి ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బిల్లుమడ సమీపంలో ఏనుగులుభామిని: మండలంలోని పాత బిల్లుమడ సమీపంలో ఆదివారం ఏనుగుల గుంపు హడావిడి చేసింది. గ్రామ సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు ప్రవేశించడంతో చూసేందుకు పిల్లలు,పెద్దలు పోటీ పడ్డారు.వరుస సెలవులు కావడంతో పిల్లలతో పెద్దలు బిల్లుమడ గ్రామానికి వెళ్లి ఏనుగులను దగ్గరుండి చూశారు. సందర్శకులు పెరిగి కేకలు వేయడంతో తోటలోకి ఏనుగులు జారుకున్నాయి. ఏనుగుల సమీపంలో ఉండాల్సిన ట్రాకర్స్ వలస రైతు జీడి తోటకాపలాలోనే ఉంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పౌష్టికాహారంపై అవగాహన వంగర: ఇంటి పనుల్లో మహిళలకు పురుషులు సహకారం అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కె.కల్యాణి కోరారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని కోనంగిపాడు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు ఇంటి వద్ద పురుషులు అందించాల్సిన సహకారంపై ఆదివారం అవగాహన కల్పించారు. వారికి ప్రతిరోజూ పౌష్టికాహారం అందేలా చూడడంతో పాటు బరువులు ఎత్తే పనులు వారితో చేయించవద్దన్నారు. రెండేళ్ల వయసు వరకు చిన్నారులను బాగా చూసుకోవాలన్నారు. అనంతరం పౌష్టికాహారం ప్రయోజనాలను గర్భిణులు, బాలింతలకు వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సీహెచ్ రూపావతి, జి.రమణి, జి.పద్మ, ఎన్.లక్ష్మి, పి.కల్యాణి తదితరులు పాల్గొన్నారు. యువకుడి మృతిపై కేసు నమోదుకొత్తవలస: మండలంలోని విజయనగరం రోడ్డులో గల బలిఘట్టం గ్రామం జంక్షన్ సమీపంలో శనివారం లారీ ఢీకొని గొల్లలపాలెం గ్రామానికి చెందిన ఎస్.వినయ్‌కుమార్ మృతి చెందడంపై సీఐ ఎస్.షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేసినట్లు ఆదివారం ఆయన తెలిపారు.లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని గాలింపు చేపట్టినట్లు చెప్పారు. కాగా మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. -
నిలిచిన బలసలరేవు వంతెన.. తొలగని చింత
● మాట ఇచ్చి మరచిపోయిన పవన్‌కళ్యాణ్ ● గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెనకోసం పోరాడిన ప్రజలు ● వారికి సంఘీభావంగా పోరాటంలో పాల్గొన్న జనసేనాని ● ప్రజల పోరాటాన్ని గుర్తించి వంతెన మంజూరుచేసిన జగన్మోహన్రెడ్డి ● రూ.87 కోట్ల కేటాయింపు ● కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కదలని పనులు రాజాం: సంతకవిటి మండలం వాల్తేరు గ్రామ సమీపంలో నాగావళి నదిపై బలసలరేవు వద్ద వంతెన నిర్మితమైతే వేలాది మంది రాకపోకలకు అనువుగా ఉంటుంది. శ్రీకాకుళానికి దారి దగ్గరవుతుంది. వంతెన నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు. చివరకు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వంతెన మంజూరు చేసింది. బలసలరేవు నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఇసుకలపేట వరకు వంతెన పనులకు శ్రీకారం చుట్టింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.87 కోట్ల కేటాయించింది. పనులు ప్రారంభించి వేగవంతం చేయించింది. నదిలో పిల్లర్ల నిర్మాణం మూడోవంతు పూర్తయ్యాయి. ఇంతలో ఎన్నికలు రావడంతో వంతెన పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయా యి. ఇంతవరకూ వంతెన పనుల గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వంతెన కోసం మాట్లాడకపోవడంపై జనం మండిపడుతున్నారు. వంతెన పోరాట కమిటీ ఏర్పాటుచేసిన నిరవధిక దీక్షలో భాగంగా 2019 అక్టోబర్ 20న వాల్తేరుకు వచ్చి దీక్షలో పాల్గొన్న పవన్‌కళ్యాణ్ ఇప్పుడు కినుక వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, అప్పటి సీఎం చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చిన జనసేనాని ఇప్పుడు అదే నాయకుడి చేతిలో కీలుబొమ్మ అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడగకుండానే వంతెన మంజూరుచేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బలసలరేవు వద్ద వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ పలు సర్వేలు నిర్వహించింది. అవసరమైన నిధులను అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాంతో అప్పటి ఎమ్మెల్యే కంబాల జోగులు సాధించుకున్నారు. సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలిగించడంతో పాటు రెండు జిల్లాలను కలిపేవారధిలా మార్చారు. 560 మీటర్లు పొడవున 16 పిల్లర్లతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. రెండు వైపులా వంతెన అప్రోచ్ నిర్మాణం కోసం 14 ఎకరాల భూమిని రైతుల వద్ద సేకరించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే వాల్తేరు, పనసపేట, గారన్నాయుడపేట, చిత్తారిపురం, కావలి, గోకర్ణపల్లి, సిరిపురం, జీఎన్‌పురం, జానకీపురం, శేషాద్రిపురం, అప్పలఅగ్రహారం, బూరాడపేట, మంతిన, మల్లయ్యపేట, రామారాయపురం, మల్లయ్యపేట, చింతలపేట, మందరాడ, మండాకురిటి తదితర గ్రామాలతో పాటు ఆమదాలవలసలో పలు మండలాలుకు రహదారి సౌలభ్యం కలుగుతుంది. పనులు జరుగడం లేదు వాల్తేరు వద్ద నాగావళి నది గుండా వందలాది మంది ప్రతిరోజు రాకపోకలు సాగిస్తారు. వర్షాకాలంలో నాటు పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా ఉంటున్నాయి. అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే కంబాల జోగులు కృషితో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వంతెన నిర్మాణానికి రూ. 87 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వంతెన పనులను పట్టించుకోకపోవడం విచారకరం. – గురుగుబెల్లి స్వామినాయుడు, వైఎస్సార్సీపీ సంతకవిటి మండలాధ్యక్షుడు, వాల్తేరు -
సాయి స్థూపం శంకుస్థాపన
విజయనగరం టౌన్: కాశీవిశ్వేశ్వర సహిత శ్రీ షిర్డీసాయి దక్షిణాభి ముఖ అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద 40 అడుగుల సాయి స్థూపానికి శనివారం శంకుస్ధాపన నిర్వహించారు. స్థానిక రీమాపేట ఉమామహేశ్వరనగర్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, షిర్డీసాయి సేవక్ సంఘ్ ఉప్పల బాపిరాజు దంపతులు కార్యక్రమంలో పాల్గొని పూజాధికాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధిలో భాగంగా తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా 40 అడుగుల సాయి స్థూపం నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. స్థూపంపై కలువ పువ్వులో ఆశీనులైన సాయి నిలువెత్తు విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుందన్నారు. ఈ సందర్భంగా సాయి భక్తులు రాసిన సాయినామకోటి పుస్తకాలను, నవధాన్యాలతో సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. -
మే 20న దేశ వ్యాప్త సమ్మె
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ పార్వతీపురం: దేశ వ్యాప్తంగా మే 20న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ వెల్లడించారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో శనివారం జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు హక్కులను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం చేయాలన్నారు. రానున్న మే డే రోజున పోరాట స్ఫూర్తిని రగిలించేలా ఘనంగా వేడుకలు నిర్వహించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్పు తీసుకురావడం కార్మికుల మెడకు ఉరితాడు లాంటిదన్నారు. కష్టపడే కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పద్ధతుల్లో విరివిగా ప్రచారం చేసి మే 20న చేపట్టే సమ్మెలో కార్మిక వర్గం మొత్తం పాల్గొనేలా చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, కార్యవర్గ సభ్యులు బీవీ రమణ, ఎన్వై నాయుడు, ఆర్.రాము, కె.సాంబమూర్తి, వి.ఇందిర పాల్గొన్నారు. -
3వేల సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
విజయనగరం క్రైమ్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3వేల సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల పనితీరుపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2,125 సీసీ కెమెరాలు అమర్చామన్నారు. తొలుత ప్రజలు కోరిన చోట కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు, ఆలయాల పరిరక్షణకు సీసీ కెమెరాలు అవసరమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పర్యవేక్షణ బాధ్యతలను విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి డీఎస్పీలకు అప్పగించారు. వీడని ఏనుగుల బెడద జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ ఎరుకలపేట, వెంకటరాజపురం గ్రామస్తులను ఏనుగుల బెడద వీడడం లేదు. శనివారం ఉదయం గవరమ్మపేటలోని అరటి, పామాయిల్ తోటల్లో సంచరించిన ఏనుగులు సాయంత్రానికి ఎరుకలపేట, వెంకటరాజపురం పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నాయి. వరి పంటను ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటకు పరిహారం అందజేయాలని కోరుతున్నారు. -
అనుభవానికి పెద్దపీట
● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులుగా రాజన్నదొర, బెల్లాన సాక్షి ప్రతినిధి, విజయనగరం: అత్యంత కీలకమైన వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ)లో సీనియర్ నాయకులైన మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లకు చోటుదక్కింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేకు పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించి కొత్తగా రూపొందించిన పీఏసీ సభ్యుల జాబితాను శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. మొత్తం 33 మంది సభ్యుల ఈ జాబితాలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పీడిక రాజన్నదొరకు, విజయనగరం జిల్లా నుంచి బెల్లాన చంద్రశేఖర్‌కు అవకాశం కలిగింది. పీడిక రాజన్నదొర.. ప్రభుత్వ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేసి 2004లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాజన్నదొర అడుగుపెట్టారు. తొలుత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేగా, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి విజయనగరంలో సీనియరు నాయకులైన బొత్స సత్యనారాయణ, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, సూర్యనారాయణ దేవ్ ఆశీస్సులతో ప్రజానేతగా ఎదిగారు. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. బెల్లాన చంద్రశేఖర్... గ్రామ స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బెల్లాన చంద్రశేఖర్ తర్వాత జిల్లా స్థాయి దాటి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2004 నుంచి 2008 వరకూ చీపురుపల్లి ఎంపీటీసీ సభ్యుడిగా, తర్వాత 2008లో చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. అనూహ్యంగా 2011లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. 2019లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా 2015 నుంచి 2016 వరకూ సేవలందించారు. ఎంఏ, బీఎల్ చదివిన చంద్రశేఖర్ తొలుత న్యాయవాదిగా పనిచేశారు. చీపురుపల్లి కోర్టులో ప్రాక్టీస్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నారు. -
వేతనాలు ఇవ్వండి మహాప్రభో!
రామభద్రపురం: పని చేసినా పస్తులే.. అనేలా ఉపాధి హామీ పథకం వేతనదారుల పరిస్థితి తయారైంది. గత 10 వారాలుగా పనులకు వెళ్తున్నా వేతనాలు మాత్రం చెల్లించడం లేదని రామభద్రపురానికి చెందిన వేతనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోజువారీ కూలి డబ్బులపై ఆధారపడే కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నామని పేర్కొంటున్నారు. నచ్చిన కూర వండుకుని ఇష్టంగా తిని చాలా రోజులైందని వాపోయారు. ఓ వైపు ఎండలు మండిపోతున్నా.. మరోవైపు కడుపు మాడిపోతున్నా కష్టపడి పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి తాము చూడలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలా నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమ వేతనాలు అందివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
విజయనగరం: జిల్లా కేంద్రం వేదికగా జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ఉల్లాస భరిత వాతావరణంలో ప్రారంభమైంది. నగరంలోని సిటీ క్లబ్ ఆవరణలో అండర్ – 12, 16, 30 ప్లస్, 40 ప్లస్, 50 ప్లస్ వయస్సుల కేటగిరీల్లో శనివారం నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 60 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. విజయనగరం సిటీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతి ప్రధానోత్సవం చేయనున్నారు. టెన్నిస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ తరహా పోటీలను త్వరలో మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు రామారావు, రంగబాబు, వైభవ్ తెలిపారు. జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలను ఒకప్పుడు సిటీ క్లబ్ నిర్వహించిందని, ఎందరో అంతర్జాతీయ ఆటగాళ్లు సిటీ క్లబ్లో ఆడారని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఐదు విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టెన్నిస్ జాతీయ స్థాయి క్రీడాకారులు సన్యాసిరాజు, కోచ్ గౌరీశంకర్, నిర్వాహకులు సాత్విక్, కౌశిక్, సీనియర్ ప్లేయర్స్ ఈ పోటీలను ప్రారంభించారు. జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం -
ఎర్రచెరువు ఆక్రమణల తొలగింపు
తెర్లాం: మండలంలోని పెరుమాళి గ్రామంలో ఉన్న ఎర్రచెరువు ఆక్రమణలను రెవిన్యూ అధికారులు శనివారం తొలగించారు. తహసీల్దారు కార్యాలయంలో ఇటీవల జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గ్రామానికి చెందిన పలువురు చెరువు ఆక్రమణలపై తహసీల్దారు హేమంత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆక్రమణలను పరిశీలించాల్సిందిగా ఆర్ఐ, వీఆర్వోలను తహసీల్దారు ఆదేశించారు. దీంతో వారు క్షేత్రస్థాయికి వెళ్లి ఆక్రమణకు గురైన ఎర్రచెరువును పరిశీలించి, చూడగా ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారించి తహసీల్దార్‌కు విషయం తెలియజేశారు. దీంతో ఆయన ఆక్రమణలు తొలగించాలని ఆదేశించడంతో జేసీబీతో చెరువు గర్భంలోని ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ భూములు గానీ చెరువు గర్భాలను గానీ ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణమూర్తినాయుడు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. -
మృత్యు ఒడిలోకి...
శుభలేఖ ఇచ్చేందుకని బయలుదేరి..పాలకొండ రూరల్: తన పెద్దనాన్న కుమారుడు వివాహం తొలి శుభలేఖను తమ ఇంట పేరంటాళ్లకు చూపించేందుకు వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో మరో మూడు వారాల్లో ఆ ఇంట జరగాల్సిన వివాహ వేడుకలో విషాదం నెలకొంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పాలకొండ మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు గొర్ల కృష్ణ, భాను దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు మోహనరావు ఉన్నారు. కుమార్తెకు వివాహం కావడంతో కుమారుడిని తమ రెక్కల కష్టంతో చదివిస్తున్నారు. మోహనరావు పెద్దనాన్న కుమారుడికి మే 9వ తేదీన వివాహం నిశ్చయమైంది. దీంతో మోహనరావు అలియాస్ మణి(20) అన్నీ తానై వివాహ ఏర్పాట్లను చూస్తున్నాడు. ఇందులో భాగంగా పెండ్లి శుభలేఖను తొలిత పేరంటాళ్లకు, దేవతలకు చూపించి తరువాత బంధువులకు ఇచ్చేందుకు తన పెద్దనాన్న విశ్వేశ్వరరావుతో కలిసి శనివారం సిద్ధమయ్యాడు. తన బైక్‌పై పెద్దనాన్నతో కలిసి దుగ్గి – నక్కపేట వెళ్లేందుకు శనివారం ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో స్థానిక రాజుపేట ఖానాల దాటి వీరఘట్టం రోడ్డుకు తన బైక్‌ను తిప్పే సమయంలో వీరఘట్టం నుంచి సురేష్ స్కూల్‌కు చెందిన బస్సు ఢీకొంది. దీంతో బైక్ పైనుంచి మోహనరావుతో పాటు పెద్దనాన్న తుళ్లిపడ్డారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న మోహనరావు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయాడు. ఇంతలోనే తేరుకున్న పెద్దనాన్న విశ్వేశ్వరరావు కేకలు వేశాడు. స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. ఇంతలోనే అక్కడి యువకులు మోహనరావును ఆస్పత్రికి వేరొక బైక్‌పై తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో 108 వాహనం రావడంతో క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మోహనరావు మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. విశ్వేశ్వరరావు స్వల్ప గాయాలతో కోలుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సును స్టేషన్‌కు తరలించారు. కోటిపల్లిలో విషాదం మోహనరావు అలియాస్ మణి మృతితో కోటిపల్లిలో విషాదం నెలకొంది. పెళ్లి సందడితో ఉండాల్సిన ఆ ఇంట కన్నీటి రోదనలు వినిపిస్తున్నాయి. తమ ఒక్కగానొక్క కుమారుడిపై విధికి కన్ను కుట్టిందని తల్లిదండ్రులు కృష్ణ, భాను గుండెలవిసెలా రోదిస్తున్నారు. వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మరొకరికి గాయాలు రాజుపేట వద్ద ఘటన -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240పైడితల్లి చండీయాగం విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పురస్కరించుకుని శనివారం చదురుగుడి, వనంగుడి ఆలయ ప్రాంగణంలో చండీయాగం ప్రక్రియను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు సాయికిరణ్, దూసి శివప్రసాద్, వెలువలపల్లి నరసింహమూర్తి, తాతా రాజేష్‌లు యాగప్రక్రియను నిర్వహించి, యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రాలను, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కెఎన్‌విడివి.ప్రసాద్ పర్యవేక్షించారు.అమ్మవారికి గోరింటాకుతో అర్చన విజయనగరం టౌన్: నగరంలోని సిటీ బస్టాండ్ వద్దనున్న అభయాంజనేయస్వామి ఆలయంలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు వికె.గాయత్రీ శర్మ ఆధ్వర్యంలో శనివారం గోరింటాకుతో అర్చనలు నిర్వహించారు. చైత్ర మాస పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు, నక్షత్ర హారతులు నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బొందిగామ మండలం అలమండ గ్రామానికి చెందిన అలిబిల్లి నాని( 20) విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తనతో పాటు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై గంట్యాడ మండలం తాటిపూడి రిసార్ట్‌కు పికినిక్కు వెళ్లారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో అక్కడ నుంచి బయలుదేరి విజయనగరం వస్తుండగా గింజేరు దాటిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవే గ్రిల్స్‌ను ఢీకొట్టడంతో నానితో పాటు బైక్‌పై వెనుక కూర్చొన్న వంశీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని అంబులెన్సులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. నాని అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంచార్జ్ ఎస్ఐ అశోక్‌కుమార్ తెలిపారు. కళ్లల్లో కారం కొట్టి పుస్తెలతాడు అపహరణ రాజాం సిటీ: పట్ట పగలు మహిళ కళ్లల్లో కారంకొట్టి పుస్తెలతాడు అపహరించుకుపోయిన ఘటన మండల పరిధి పొగిరి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జడ్డు చిన్నమ్మడు ఉదయం 7గంటల సమయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుకభాగంలో ఉన్న తన కళ్లంలో ఆవులకు మేత వేస్తుంది. ఆ సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చాడు. ఆమె వద్దకు వెళ్లి తన చేతిలో ఉన్న కారం ఆమె ముఖంపై చల్లి మెడలోని 38 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కున్నాడు. అప్రమత్తమైన ఆమె పెనుగులాడినప్పటికీ ప్రయోజనం లేక కేకలు వేసింది. ఆమె కేకలు విని అక్కడకు చేరుకున్న తన భర్త నరేంద్రతో పాటు మరికొంత మందికి విషయం చెప్పంది. వెంటనే పుస్తెలతాడు అపహరించుకుపోయిన వ్యక్తి రాజాం వైపు వెళ్తున్నాడని గమనించి వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన సీఐ కె.అశోక్‌కుమార్ ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు గ్రామస్తుల వద్ద ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. -
రంగప్ప చెరువు వద్ద ఉద్రిక్తత
రాజాం సిటీ: పట్టణ పరిధిలోని రంగప్ప చెరువు ఆధునికీకరణ పనుల్లో భాగంగా అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. జేసీబీతో అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత భూమిలో సాగుదారులు అక్కడకు చేరుకుని ఏళ్ల తరబడి తమ సాగులో ఉన్న భూములు లాక్కోవద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఒకింత ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికారులు చెరువు వద్ద ట్రెంచ్‌లు ఏర్పాటు చేస్తున్న జేసీబీకి అడ్డంగా నిలుచొని నినాదాలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే నోటీసులు అందించామని, ఇది ప్రభుత్వ భూమి అని, ఈ చెరువుకు ఆనుకుని ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని అధికారులు చెప్పడంతో బాదితులు నిరసన తెలిపారు. 114 సర్వే నంబర్లో దళితులకు, స్వతంత్ర సమరయోధులకు పేరిట ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, దీంట్లో తాము సాగు చేసుకుంటున్నామని, పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయని, భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నామని సాగుదారులు బి.అప్పారావు, ఎన్.ఆదియ్య, తవిటినాయుడు, ఎన్.గడ్డియ్య, శంకర్ తదితరులు అధికారుల ఎదుట వాపోయారు. ఇప్పుడు అధికారులు ఇలా తమ భూమిని లాక్కోవడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 70 కుటుంబాల వారు రోడ్డున పడతామని, పేదల భూములను కాపాడాల్సిందిపోయి తమ పొట్ట కొట్టొద్దంటూ జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక భూమికి సంబంధించి సరైన పత్రాలను చూపాలని పేర్కొంటూ అక్కడ నుంచి వెనుదిరిగారు. భూ సాగుదారుల ఆందోళన -
కూటమి కుట్రలు!
చిరుద్యోగులపై కొనసాగుతున్నగంట్యాడ: చిరుద్యోగులపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరుద్యోగుల తొలగింపే లక్ష్యంగా పని చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొండపల్లి ఇలాఖాలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు చిరుద్యోగులను తొలగించారు. కేజీబీవీల్లో పని చేసే కుక్, వాచ్మన్లను, పాఠశాలల్లో పని చేసే ఆయాలు, వాచ్మన్లు, ఉపాధి పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. మండలంలో ఇప్పటికే 15 మంది వీఓఏలను తొలగించారు. తాజాగా పెణసాం వీఓఏ(గ్రామైఖ్య సంఘం సహాయకురాలు)ను కూడా తొలగించారు. పెణసాం గ్రామంలో ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కూడా కూటమి నేతలు పెద్ద రచ్చే చేశారు. పెణసాం వీఓఏ సుంకరి సన్యాసమ్మ(ఇందిర) గడిచిన 14 ఏళ్లుగా పని చేస్తుంది. ఇప్పుడు ఆమెను తొలగించి ఆ స్థానంలో వేరే మహిళను నియమించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న పొదుపు సంఘాల అధ్యక్షులు అంతా ఒక్కటై సన్యాసమ్మ వీఓఏగా బాగానే పని చేస్తున్నారని, సంతృప్తికరంగా సేవలు అందిస్తుందని, ఆమెనే కొనసాగించాలని తీర్మానించారు. అయినా అధికారులు వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు. తొలగింపు ఉత్వర్వులు ఇవ్వరట..! ఏదైనా ఉద్యోగిని విధుల నుంచి తొలిగిస్తే ఏ కారణం చేత తొలగిస్తున్నారో.. ఉత్తర్వులు ఇస్తారు. కానీ వెలుగు అధికారులు మాత్రం తొలగింపు ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతున్నారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలగింపు ఉత్తర్వులు ఉంటే న్యాయ పోరాటం చేసేందుకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. పెణసాం వీఓఏ తొలగింపు ఆమెను కొనసాగించాలని పొదుపుల సంఘాల తీర్మానం అయినా తొలగించిన వైనం మంత్రి కొండపల్లి ఇలాఖాలో తీరిది! తొలగించాం.. రికార్డులివ్వమని చెప్పారు... నేను 14 సంవత్సరాలుగా వీఓఏగా పని చేస్తున్నాను. పొదుపు సంఘాల మహిళల అందరికీ సంతృప్తికర సేవలు అందిస్తున్నాను. వెలుగు సీసీ నిన్ను తొలగించాం.. నీ స్థానంలో వేరొకరిని నియమిస్తాం.. రికార్డులు అప్పగించమని చెప్పారు. ఇలా తొలగిస్తే ఎలా జీవించేది. – సుంకరి సన్యాసమ్మ, వీఓఏ, పెణసాంవీఓఏను తొలగించాం.. పెణసాం వీఓఏను తొలగించాం. వీఓఏలను తొలగింపు ఉత్తర్వులు అంటూ ఏమీ ఇవ్వం. ఇది నిబంధనల మేరకే చేశాం. – కోరుకొండ సులోచనదేవి, ఏపీఎం, వెలుగు -
నోటిఫికేషన్ ఇచ్చారు... పోస్టుల భర్తీ మరిచారు..!
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పిన కూటమి నేతలు... ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. చిరుద్యోగులకు వేదన మిగుల్చుతున్నారు. మరోవైపు నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల భర్తీలోనూ నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. పోస్టులను భర్తీ చేస్తారా, లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఐసీడీఎస్ పరిధిలోని డీసీపీయూ, శిశుగృహ, చిల్డ్రన్ హోమ్‌లలో పోస్టుల భర్తీకి 2023 నవంబర్ 20వ తేదీన అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల భర్తీ పక్రియ చేపడుతున్న తరుణంలో ఎన్నికలకోడ్ రావడంతో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కా రు పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి 2024 సెప్టెంబర్ 4న కొత్తగా 23 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో కాంట్రాక్టు పద్ధతిన భర్తీచేసే పోస్టులు 5, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేవి 9, పార్ట్‌టైమ్ పోస్టులు 9 ఉన్నాయి. వీటికోసం 640 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా పోస్టుల భర్తీకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశంపై ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం మాట్లాడుతూ కొద్ది రోజుల కిందటే పీడీగా బాధ్యతలు స్వీకరించానని, పోస్టుల భర్తీ పక్రియపై ఆరా తీసి భర్తీకి చర్యలు తీసుకుంటానన్నారు. శిశుగృహ, బాలసదన్లలో పోస్టుల భర్తీకి 2024 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ 23 పోస్టులకు 640 మంది అభ్యర్థులు దరఖాస్తు ఇప్పటికీ భర్తీ చేయని వైనం -
నగరంలో కేంద్ర బృందం పర్యటన
విజయనగరం: ప్రభుత్వం తరఫున ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసేందుకు కేంద్ర బృందం నగరంలో శనివారం పర్యటించింది. నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్ట్స్ కమిటీ సభ్యులైన డాక్టర్ గౌరవ్ త్రిపాఠి, సుదీప్ శుక్లాదాస్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు శనివారం విచ్చేశారు. జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్య సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పీహెచ్‌సీలను తనిఖీ చేయడంతో పాటు హెల్త్ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వీటీ అగ్రహారంలో ఉన్న జొన్నగుడ్డి పీహెచ్‌సీకి చేరుకుని అక్కడ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల పరిస్థితి, వైద్య పరికరాల పనితీరు వంటి అంశాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం 41వ నంబరు సచివాలయం చేరుకుని అక్కడ వివిధ అంశాలను, వైద్య పరమైన సేవలను ఏఎన్ఎంలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ బృందం సభ్యులు తమ పరిశీలన అంశాలను నమోదు చేసి పీహెచ్‌సీలకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నారు. మరో వారం రోజుల్లో వేరొక బృందం రానున్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. -
కాళ్లుపట్టుకుంటేనే ఉపాధి పని
జియ్యమ్మవలస రూరల్: ‘సుమారు 500 మంది వేతనదారుల మధ్య కాళ్లపై పడి క్షమాపణ చెబితేనే ఉపాధిహామీ పనికల్పిస్తాం.. లేదంటే పనికి రానివ్వం’ అంటూ ఫీల్డు అసిస్టెంట్, మేట్ల వేధింపులకు ఓ వేతనదారు మనస్థాపానికి గురైంది. గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జియ్యమ్మవలస మండలం జోగులమ్మ పంచాయతీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థాని కులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లుగా పనిచేస్తున్న టీడీపీ నాయకులు ఎలకల శంకర బాబు, కాబోతుల ఇల్లంనాయుడు కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ ముద్రవేసి వేతనదారుల ను ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కోవలో వేతన దారు బూరి గౌరమ్మ, భర్త త్రినాథరావును వేధింపులకు గురిచేశారు. ఉపాధి పని ఇవ్వకుండా.. పనికి వెళ్లినా ఒక గ్రూప్ నుంచి వేరే గ్రూప్‌లోకి మార్పు చేస్తూ, హాజరు వేయకుండా మనోవేదనకు గురిచేశారు. ఈ విషయమై పలుమార్లు జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. కాళ్లు పట్టుకుంటేనే పని ఇస్తామని వేధించడంతో మనస్థా పానికి గురైన బూరి గౌరమ్మ శుక్రవారం మధ్యాహ్నం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే ఆమెను చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ల గా డాక్టర్ ఎల్.వంశీకృష్ణ చికిత్స అందించారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ తాము వైఎస్సార్సీపీ మద్దతుదారులమని ముద్రవేసి కొన్నాళ్లుగా పని కల్పించడంలేదని వాపోయారు. కూటమి ప్రభుత్వంలో కొత్త సంస్కృతి విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గౌరమ్మను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం నాయకులు కొత్త సంస్కృతిని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కలెక్టర్, ఎస్పీ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకుల వేధింపులు మనస్థాపంతో వేతనదారు ఆత్మహత్యాయత్నం మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శ -
రేగిడి ఘటనపై విచారణకు కమిటీ
● ముగ్గురు జిల్లా అధికారులతో ఏర్పాటు ● నివేదిక ఆధారంగా చర్యలు ● సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సాక్షి, పార్వతీపురం మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ నెల 9న ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ’బాలికా ఆశ్రమం భద్రమేనా?’ శీర్షికన ప్రచురితమైన కథ నానికి ఆయన స్పందించారు. పాఠశాలలో చదువుతున్న బాలికను ఓ ఉపాధ్యాయుడు ద్విచక్ర వాహనంపై కురుపాం తీసుకెళ్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం ముగ్గురు జిల్లా అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలి పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మహిళా శిశు సంక్షేమశాఖ పథక అధికారిణి, ఎస్సీ సంక్షేమం–సాధికారత అధికారి విచారణ కమిటీ సభ్యులుగా ఉంటారని వివరించారు. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. సమగ్ర విచారణ జరపాలి: గిరిజన సంఘాల డిమాండ్ రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వైద్యం పేరిట పురుష ఉపాధ్యాయులు గిరిజన బాలికలను బయటకు.. ప్రైవేట్ ఆస్పత్రికి, ఆర్ఎంపీ వద్దకు తీసుకుని వెళ్లారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాలు పేర్కొన్నాయి. గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం, ట్రైబల్ రైట్స్ ఫోరం, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ సంఘాల నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, పార్వతీపురం ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పాలక రంజిత్‌కుమార్, పల్ల సురేష్, మువ్వల అమర్నాథ్, ఆరిక చంద్రశేఖర్, ఇంటికుప్పల రామకృష్ణ, చెల్లూరు సీతారాం, కోలక గౌరమ్మ, బి.రవికుమార్, బీటీ నాయుడు తదితరులు మాట్లాడుతూ.. బాలికల పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయులను నియమించడమే అనేక సమస్యలకు కారణమన్నారు. రేగిడి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, మహిళా డిప్యూటీ మేట్రిన్ ఉండగా.. పురుష ఉపాధ్యాయులు బాలికలను వైద్యంపేరిట బయటకు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. తక్షణమే మహిళా అధికారులతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. -
పగలు, రాత్రి తేడా లేకుండా..!
● అనధికార విద్యుత్ కోతలు ● ఎండ వేడమికి ఇబ్బంది పడుతున్న జనం ● ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేత విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనధికారిక విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండవేడిమితో పాటు ఉక్కబోతను భరించలేక అవస్థలు పడుతున్నారు. ఫ్యాన్ కింద సేదతీరుదాం అంటే విద్యుత్ కోతల వల్ల ప్రజలకు అవకాశం లేని పరిస్థితి. కొద్దిమందికి మాత్రమే ఇన్వర్టర్స్ ఉన్నాయి. ఇన్వర్టర్స్ లేని పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ కోతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 10, 15 నిమిషాల పాటు పదేపదే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 30 నిమిషాల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇస్తాం. విద్యుత్ కోతలే ఉండవు, చార్జీలు కూడా పెంచబోమని కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రకటనలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టేశారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఇవ్వాల్సిన సమయంలోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పవర్‌కట్ అని కాకుండా రకరకాల కారణాలతో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అధికారికంగా కాకుండా అనధికారికంగా ఇష్టానుసారం కోతలు పెడుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విద్యుత్ సరఫరా ఎప్పడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైతులకు తప్పని ఇబ్బందులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అకాశంలో చిన్నపాటి మబ్బు వేసినా వ్యవసాయ విద్యుత్‌కు సరఫరా నిలిపివేస్తున్నారు. ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల్లో పదేపదే విద్యుత్ నిలిపివేయడం వల్ల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ద్వారా పంటలకు సాగునీరు అందించే రైతులు ఇబ్బంది పడుతున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. రోజులో నాలుగు, ఐదుసార్లు అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల విద్యుత్ ఎప్పడువస్తుందో ఎప్పడు పోతుందో తెలియని పరిస్థితి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతరాయంగా 9గంటల పాటు విద్యుత్ అందేది. గృహ వినియోగదారులకు కూడా 24 గంటల పాటు విద్యుత్ అందేది. అత్యవసరంగా విద్యుత్ కోత విధించాల్సి వస్తే అధికారికంగా ప్రకటించేవారు. జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు 7,41,828 జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు 7, 41, 828 ఉన్నాయి. వాటిలో కేటగిరి–1 కి సంబంధించి 6,04,535, కేటగిరి–2 కనెక్షన్లు 65, 194 ఉన్నాయి. కేటగిరి–3 కనెక్షన్లు 2,822 ఉన్నాయి. కేటగిరి –4 కనెక్షన్లు 14,168, కేటగిరి–5 కనెక్షన్లు 55,109 ఉన్నాయి. ప్రతిరోజూ విద్యుత్ సరఫరా నిలిపివేత ప్రతిరోజూ పగలు లేదా రాత్రి పూట 10, నుంచి 15 నిమిషాల పాటు 2,3 పర్యాయాలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. వేసవికాలం కావడంతో పగలు, రాత్రి కూడా ఉక్కబోత కారణంగా ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ కిందికి వెళ్దామంటే విద్యుత్ సరఫరా ఉండడం లేదు. ఆర్. నాగేశ్వరావు, వినియోగదారు, పెదవేమలి గ్రామం గంట్యాడ మండలం విద్యుత్ కోతలు లేవు అధికారికంగా ఎక్కడా విద్యుత్ కోతలు విధించడం లేదు. ఎండవేడిమికి కొన్ని చోట్ల ట్రిప్ అవడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. రాత్రివేళ ఎక్కడైనా సమస్య తలెత్తితే విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం. ఎక్కడ సమస్య వచ్చినా విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
పత్రికా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం
పత్రికల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తే ఊరుకోం. దాడులతో జర్నలిస్టుల బాధ్యతను అడ్డుకోలేరు. జర్నలిస్టులపై దాడులే లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ తీరు సరైనది కాదు. వార్తలో తప్పుంటే ఖండించాలి. భయపెట్టే విధంగా క్రిమినల్ కేసులంటూ అరెస్టు నోటీసులు ఇవ్వడం దారుణం. కేసులు పెట్టి పత్రికలపై పెత్తనం చెలాయించాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వం బయటకు రావాలి. జర్నలిస్టులపై ప్రభుత్వ తీరు మారకపోతే ఐక్యపోరాటాలు కొనసాగుతాయి. – పీఎస్‌ఎస్‌వీ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే -
అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ
వేపాడ: మండలంలోని గుడివాడ గ్రామంలో అట్రాసిటి కేసుపై విజయనగరం డీటీసీ డీఎస్పీ పి.వీరకుమార్ శుక్రవారం విచారణ నిర్వహించారు. గ్రామానికి చెందిన జి.కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్సై బి.దేవిపై నమోదైన కేసులో డీఎస్పీ గ్రామంలోని ఎస్సీ కాలనీలోను, పాన్‌షాపు వద్ద సాక్షులు, ఫిర్యాదుదారులను విచారణ చేసి వివరాలను నమోదు చేసుకున్నారు. డీఎస్పీతో పాటు ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు విచారణలో పాల్గొన్నారు. ఆరు కేజీల గంజాయి స్వాధీనంవిజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లో శుక్రవారం ఆరు కేజీల గంజాయి పట్టబడింది. ఒడిశా నుంచి ఓ వ్యక్తి ట్రైన్లో గంజాయితో వచ్చి స్టేషన్లో దిగాడన్న పక్కా సమాచారంతో వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రామ్‌గణేష్‌లు హుటాహుటిన స్టేషన్‌కు వెళ్లి రిజ్వరేషన్ కౌంటర్ పక్కనే ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ వద్ద ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, అనుగూరు పంచాయతీ పరిధి, లాటింగ్కు చెందిన 32 ఏళ్ల రమాకాంత్ బెహరాను అదుపులోకి తీసుకుని ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసునమోదు చేసి కోర్టులో హాజరు పరచడంతో న్యాయమూర్తి 14 రోజలు రిమాండ్ విధించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. 870 లీటర్ల సారా పట్టివేత● నలుగురి అరెస్టు సీతంపేట: మండలంలోని సుందరయ్యగూడ ప్రాంతంలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఏఈఎస్ ఏఎస్ దొర ఆధ్వర్యంలో సారా బట్టీలపై శుక్రవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా 870 లీటర్ల సారా పట్టుకున్నారు. సారా వండడానికి సిద్ధం చేసిన 1250 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు ఏఈఎస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వూయక మురళి, బిడ్డిక ఆదినారాయణ, వి.సంజీవరావులతో పాటు నల్లబెల్లం సరఫరా చేసిన లబ్బకు చెందిన జాన్ సురేష్‌ను అ రెస్టు చేసినట్లు చెప్పారు. సారా వండినా, విక్రయించినా, అక్రమరవాణా చేసినా చర్యలు త ప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మొ బై ల్ పార్టీ టీమ్ మురళి, కొత్తూరు సీఐ కిరణ్మ యి, పాలకొండ ఎస్సైలు ఫణీంద్రబాబు, ఎల్ .తిరుపతిరావు, వాసుదేవరావు పాల్గొన్నారు. ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టురాజాం సిటీ: మండల పరిధి పొగిరి గ్రామ సమీపంలోని మామిడిచెట్టు కింద పేకాట ఆడుతున్న ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై వై.రవికిరణ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో దాడిచేసి పట్టుకున్నామని, వారి దగ్గర నుంచి రూ. 6140లు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసినట్లు చెప్పారు. మరో ఏడుగురు పేకాట రాయుళ్లు.. రాజాం సిటీ: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని అమృత ఆస్పత్రి ఎదురుగా ఉన్న స్థలంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని శుక్రవారం అరెస్టు చేశామని సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై వై.రవికిరణ్‌తో పాటు సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారన్నారు. ఈ దాడిలో పేకాటరా యుళ్ల నుంచి రూ.62,430లుతోపాటు ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకంపార్వతీపురంటౌన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశామేరకు శుక్రవారం పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నలుగురిని కమిటీలో నియమించారు. వివరాలిలా.. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే కళంకం
● సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు అక్రమం, అన్యాయం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాస్వామ్యమనే సౌధానికి నాలుగో స్తంభమైన పత్రికలను అణచివేసేందుకు క్రిమినల్ కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ పాలనలో సర్వసాధారణమైపోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్యానికే కళంకం అని విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోనూ ఇటీవల సాక్షి, ప్రజాశక్తి రిపోర్టర్లపైనా ఇక్కడి మంత్రుల ప్రోద్బలంతో వారి అనుచరులు స్వల్ప కారణాలకే ఫిర్యాదు చేయడం, అవెంతవరకూ న్యాయసమ్మతమో కనీసం పరిశీలన లేకుండానే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు నమోదు చేస్తున్నారని ప్రస్తావించారు. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మారకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పాత్రికేయులపై కేసులు భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
సురక్షిత ప్రసవాలే లక్ష్యం
పార్వతీపురంటౌన్: మాతా, శిశు ఆరోగ్య శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆశా నోడల్ అధికారులతో ఎన్జీఓ హోమ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ భాస్కరరావు పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష చేశారు. మాతా, శిశు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, గర్భిణిగా నమోదు చేసినప్పటి నుంచి ప్రసవానంతరం వరకు పూర్తిస్థాయిలో ఆరోగ్య తనిఖీలు, వైద్యపరీక్షలు, నెల వ్యవధిలో రెండు డోసుల టిడి ఇంజక్షన్, ప్రతిరోజూ ఐరన్, కాల్షియం మాత్రలు, నిర్దేశించిన కాల వ్యవధిలో కనీసం నాలుగు తనిఖీలు తప్పనిసరి అని తెలిపారు. గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలు సత్వరమే గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని, సురక్షిత ప్రసవమే ధ్యేయంగా కృషి చేయాలని కోరారు. సాధారణ ప్రసవాలు పీహెచ్‌సీల్లో జరిగేలా చూడాలని చెప్పారు. గిరిశిఖర, మారుమూల గిరిజన గ్రామాల్లో గర్భిణులను నెల/రెండు నెలలు ముందుగానే వసతి గహాల్లో చేర్చాలని సూచించారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయడం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రక్తహీనత ఉన్నట్లు గుర్తించిన గర్భిణుల్లో హీమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందేలా పర్యవేక్షించాలని సూచించారు. వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఆశ కార్యకర్తలకు ఆరోగ్యశాఖ పంపిణీ చేసిన యూనిఫాంను ప్రోగ్రాం అధికారులతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో డీఐఓ డా.ఎం.నారాయణరావు,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, డా.రఘుకుమార్, డీపీహెచ్ఎన్ఓ ఉషారాణి, డీపీఓ లీలారాణి, డీసీఎం విజయలత, డెమో సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు -
ఏపీ బ్రాహ్మణ సేవాసంఘం ప్రచార క్యాదర్శిగా జీవీ శ్రీనివాస్
సీతానగరం: ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సీతానగరం మండలకేంద్రానికి చెందిన గన్నవరపు వెంకట శ్రీనివాస్‌ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోనూ రు సతీష్‌శర్మ, హెచ్‌కే మనోహర్‌రావు ఉత్తర్వులు జా రీ చేశారు. ఈ మేరకు శుక్రవారం నూతనంగా నియమితులైన రాష్ట్ర ప్రచారకార్యదర్శి గన్నవరపు వెంకట శ్రీనివాస్ మండలకేంద్రంలో మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తానని తెలియజేశారు. ఆయన ఎంపిక పట్ల ఉమ్మడి జిల్లా బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. -
పీఎంశ్రీ రాష్ట్ర బృందం పర్యటన
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో పీఎంశ్రీ పథకం రాష్ట్ర బృందం సభ్యులు డాక్టర్ ఎస్.ప్రసాద్, జి.మహేశ్వర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ సహాయకులతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ పీఎంశ్రీ పథకం కింద మన్యం జిల్లాలో 19 పాఠశాలలు ఎంపికై నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు, క్రీడామైదానం, ల్యాబ్‌లు, మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ 19 పాఠశాలలు మోడల్ పాఠశాలలుగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిధులు మంజూరు చేసిందన్నారు. నిర్మాణ, అభివృద్ధి పనులన్నీ సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ అధికారుల సహకారం, సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేస్తే మరిన్ని నిధులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం పనులు జరుగుతున్న తీరు, సమస్యలను 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.రమాజ్యోతి, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఆర్.తేజేశ్వరరావు, ఇంజినీరింగ్ సహాయకులు, సెక్టోరల్ సిబ్బంది 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
అక్షరంపై దాడి సిగ్గుసిగు్గ
● పత్రికా స్వేచ్ఛను హరించడానికే అక్రమ కేసులు ● కూటమి ప్రభుత్వ తీరుపై జర్నలిస్టు సంఘాల నిరసన విజయనగరం అర్బన్: వాస్తవాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు, నిజాలు ప్రచురించే పత్రికలపై కూటమి ప్రభుత్వం దాడులకు దిగడం, పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం సిగ్గుసిగ్గు అంటూ జర్నలిస్టు సంఘాలు నినదించాయి. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపాయి. సాక్షి దిన ప్రత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఆరుగురు జర్నలిస్తులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేయడాన్ని ఖండించాయి. విజయనగరం కలెక్టరేట్ గాంధీ బొమ్మ వద్ద శుక్రవారం పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు, పత్రికా ప్రతినిధులు ఆందోళన చేశారు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్యచేసిన ఉదంతాన్ని వెల్లడించినందుకు కేసులు నమోదు చేయడం విచారకరమన్నారు. ఇది అక్షరంపై దాడిచేయడమేనన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులపై దాడులు పెరిగాయన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, అక్రమ కేసులను ఎత్తేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ వినతిని ప్రభుత్వానికి పంపుతానని చెప్పారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి వీఎస్‌ఎస్‌వీ ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌నాయుడు, ప్రధాన కార్యదర్శి వ్యాస్, వివిధ పత్రికల సంపాదకులు పంచాది అప్పారావు, కొల్లూరి జగన్నాథ శర్మ, వై.ఎస్.పంతులు, సాక్షి టీవీ జిల్లా బ్యూరో అల్లు యుగంధర్, వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు. కేసులు తగవు రాష్ట్రంలో పత్రికలకు స్వేచ్ఛలేకుండా పోయింది. రోజురోజుకీ జర్నలిస్టులపై ప్రభుత్వ దాడులు పెరుగుతున్నాయి. ఈ ఘటనలను చూస్తూ జర్నలిస్టులు ఊరుకోరన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. ఏ పత్రికై నా ఇచ్చిన వార్తలో అసత్యాలుంటే న్యాయస్థానాలున్నాయి. వాటిని ప్రభుత్వం ఆశ్రయించాలే తప్ప క్రిమినల్ కేసులు పెట్టి పత్రికల స్వేచ్ఛను హరించేందుకు పూనుకోవడం అప్రజాస్వామికం. – కొల్లూరి జగన్నాథశర్మ, జర్నలిస్టు ● -
అటకెక్కుతున్న ఇటుక
● పడిపోయిన విక్రయాలు ● ముందుకు సాగని పరిశ్రమరాజాం: మట్టి ఇటుకల తయారీ పరిశ్రమ గతేడాది వరకూ మూడు ఇటుకలు ఆరు బట్టీలు అన్న చందంగా నడిచింది. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో పుట్టగొడుగుల్లా ఇటుక పరిశ్రమలు పుట్టుకొచ్చేవి. ఒక్కో బట్టీ వద్ద నాలుగు నుంచి ఐదు కుటుంబాలు జీవనం సాగించేవి. ఏటా ఇటుకల ధరలు పెరుగుతూ వచ్చేవి. వేసవితో పాటు అన్ని కాలాల్లో వాటి సీజన్ నడిచేది. మట్టి ఆధారంగా ఈ ఇటుకలకు డిమాండ్ కూడా అధికంగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కొంతకాలంగా ఇటుకల వ్యాపారం మందగించింది. ఇటుకలు కొనే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా వాటి ధర పతనమైంది. నిర్మాణాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇటీవల ఈ పరిశ్రమలు ఎత్తేసి, వేరే పనులకు కుటుంబాలు వలసపోతున్నాయి. వాటిని నమ్ముకుని పెట్టుబడి పెట్టిన వ్యాపారులు సొమ్ముచేసుకోలేక తంటాలు పడుతున్నారు. అమాంతం పడిపోయిన ధర గతంలో ట్రాక్టర్ (2000) ఇటుకల ధర రూ.10 వేలు ఉండేది. ఈ ధర ఆయా ఇటుక బట్టీల వద్ద పలికేది. రవాణా చార్జీలు అదనంగా రూ.1500లు నుంచి రూ.2500లు వరకూ ఉండేవి. రాజాం మండలంలోని పొగిరి, కొత్తపేట, పెనుబాక తదితర ప్రాంతాల్లో ఇటుకకు డిమాండ్ ఉండేది. రేగిడి మండలంలోని కుమ్మరి అగ్రహారం, తాటిపాడు, లక్ష్మణవలస, ఖండ్యాం ప్రాంతాల వద్ద ఇటుక తయారీ అధికంగా ఉండడంతో పాటు తరలింపు కూడా చాలా ఎక్కువగా ఉండేది. సంతకవిటి మండలంలోని రంగారాయపురం, మేడమర్తి, పోడలి, తాలాడ ప్రాంతాల్లో ఇటుక బట్టీలకు మంచి డిమాండ్ ఉండేది. ఇటుక ధరల్లో తగ్గేది లేదన్నట్లుగా వ్యాపారులు విక్రయాలు చేసేవారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఇటుక పరిశ్రమలు ముందుకు నడవడంలేదు. బట్టీల వద్ద ట్రాక్టర్ ఇటుక ధర ఒక్కసారిగా రూ.7,500లు, రూ.8వేలకు పడిపోయింది. కొన్ని పరిశ్రమల వద్ద ఇటుకలను కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. నిర్మాణాలు మందగించడంతో ఇటుక పరిశ్రమల వద్ద ఇటుకలు అలానే దర్శనమిస్తున్నాయి. నెలల తరబడి ఇటుకల విక్రయాలు జరగకపోవడంతో వాటి నిమిత్తం పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాల కారణంగా ఇటుకబట్టీలు తడిసిముద్దవుతున్నాయి. లక్షలాది రూపాయల పెట్టుబడులతో పెట్టిన ఇటుకబట్టీలు వ్యాపారం లేక వెలవెలబోతుండగా, ఇటుక పరిశ్రమలు పెట్టిన వ్యాపారులు, రైతులు దివాలా తీసే పరిస్థితి కనిపిస్తోంది. రాజాం నియోజకవర్గంలో 210కి పైగా ఇటుక పరిశ్రమలు ఉన్నాయి. ఇటుక బట్టీ నిలిపివేశాం మండలంలోని అగ్రహారం వద్ద మాకు ఇటుకల బట్టీ ఉండేది. గత ఏడాదికాలంగా డిమాండ్ తగ్గిపోయింది. దీంతో చేసేదిలేక ఇబ్బందులు పడ్డాం. అప్పులకు వడ్డీలు చెల్లించలేక వేరే పనులు చేస్తూ అప్పులు తీర్చే ప్రయత్నాలు చేస్తున్నాం. కె. వెంకటరమణ, ఇటుకల వ్యాపారి, అగ్రహారం, రేగిడి మండలం పెట్టుబడి లేక నష్టపోతున్నాంగతంలో ఇటుకలకు డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఈ డిమాండ్ లేదు. మండలంలోని ఓ గ్రామం వద్ద రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగు ఇటుకబట్టీలు పెట్టాం. పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఎం.అప్పలనాయుడు, ఇటుకల వ్యాపారి, రాజాం -
డ్రోన్ల వినియోగంలో సెంచూరియన్ సహకరించాలి
విజయనగరం అర్బన్: వ్యవసాయం, ఉద్యాన వనాల అభివృద్ధిలో డ్రోన్ల వినియోగానికి సహకరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సెంచూరియన్ వర్సిటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్రాజుతో కలెక్టర్ భేటీ అయ్యా రు. సెంచూరియన్ యూనివర్సిటీలో చేపడుతున్న కోర్సుల వివరాలను, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ గురించి కలెక్టర్‌కు చాన్స్‌లర్ వివరించారు. యువతకు నైపుణ్యం ఇవ్వడానికి తాము సిద్ధంతా ఉన్నాయని చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్‌రాజు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్న కో ర్సులు, నైపుణ్య శిక్షణలు, సీడాప్ ఒప్పందం గురించి వివరించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి మాట్లాడుతూ త్వరలో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా యువతకు నైపుణ్య కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే డ్రోన్లతో వ్యవసాయం ఇతర రకాల సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. దీనికి కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ స్పందిస్తూ తాను త్వరలో విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. వ్యవసాయంలో ప్రస్తుతం మామిడి పంట ఉన్నందున తెగుళ్లు నివారణకు డ్రోన్ల ద్వారా కృషి చేయాలని కోరారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ -
సిబ్బంది సమస్యల పరిష్కారానికి వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: పోలీస్‌శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం వెల్ఫేడ్ డే ను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు డీపీఒలో ‘వెల్ఫేర్ డే’ను ఎస్పీ నిర్వహించి మాట్లాడుతూ సిబ్బంది ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న సమస్యలను విజ్ఙాపనల రూపంలో ఈ వెల్ఫేర్ డే ద్వారా తీసుకుంటున్నట్లు చెప్పారు. వారి సమస్యలు,సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన చాంబర్‌కు వచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా పిలిపించి వారి సమస్యలను సావధానంగా ఎస్పీ ఆలకించారు. సిబ్బంది చెప్పిన సమస్యలను వారి ముందే ఓ నోట్ బుక్‌లో నోట్ చేసుకున్నారు. వెంటనే అక్కడిక్కడే సూపరింటెండెంట్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని సిబ్బంది ఇచ్చిన విజ్ఙాపనలకు తగిన వివరణలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా సిబ్బంది సమస్యలకు పరిష్కారానికి తగిన చర్యలు చేపడతానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. మొత్తం ఆరుగురు సిబ్బంది వారి సమస్యలను వెల్ఫేర్డేలో ఎస్పీకి విన్నవించుకున్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
విజయనగరం రూరల్: వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త మురళీరాజు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఆయన కుటుంబానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సందర్భంగా మురళీరాజు భార్య సుష్మ తన పిల్లలతో కలిసి శుక్రవారం జెడ్పీ కార్యాలయానికి వచ్చి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
1110 కేజీల నిషేధిత ప్లాస్టిక్ సామగ్రి సీజ్
విజయనగరం: నగరంలో నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ప్రజారోగ్య సిబ్బంది 1110 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, తన బృందంతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్లాస్టిక్ విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలో ఉన్న ప్లాస్టిక్ దుకాణాల వద్దకు వెళ్లి నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలను గుర్తించి మొత్తం 1,110 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుని విశాఖ జిల్లా మధురవాడలో ఉన్న జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌కు తరలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్ల నయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో తామ కృషి చేస్తున్నప్పటికీ కొందరు వ్యాపారస్తులు అనధికారికంగా ప్లాస్టిక్ విక్రయాలను సాగిస్తున్నారన్నారు. ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేస్తూ ప్లాస్టిక్‌ను విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నారన్నారు. ఇక నుంచి నిరంతరం దాడులు నిర్వహించి ప్లాస్టిక్ అమ్మకాలను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ప్లాస్టిక్ వినిమయం జరగకుండా పూలు, కూరగాయల దుకాణాలు ఇతరత్రా చిన్నచిన్న దుకాణాల వద్దకు వెళ్లి తమ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అయితే కొంతమంది నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్ అమ్మకాలు సాగించడంతో నగరంలో ప్లాస్టిక్ వినిమియం జరుగుతున్నట్లుగా గుర్తించామన్నారు. దీంతో ఆకస్మిక దాడులు చేపట్టాలని ఆదేశించడంతో 1110 కేజీల నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని, ఎనర్జీ ప్లాంట్ కు తరలించామన్నారు. ఇక నుంచి ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ ను విక్రయించినట్లు గుర్తిస్తే సరుకును స్వాధీనం చేసుకోవడంతో పాటు, భారీగా అపరాధ రుసుము విధించి, దుకాణాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పారిశుధ్య పర్యవేక్షకులు బాలకృష్ణ, అంజిబాబు, రవిశేఖర్, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ యువత ఉపాధికి ప్రత్యేక ప్రణాళిక
విజయనగరం టౌన్: జిల్లాలో షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.21.13 కోట్ల ఖర్చుతో 509 యూనిట్ల ఏర్పాటుకు షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ రూపొందించిన ప్రణాళిక అమలుకు అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న శ్రీకారం చుడతామన్నారు. బ్యాంకుల నుంచి రూ.1174.76 లక్షలను రుణాల రూపంలో అందజేస్తామన్నారు. రూ.832.64 లక్షల సబ్సిడీ వర్తింపజేస్తామని చెప్పారు. షెడ్యూల్ కులాల యువతకు ఉపాధి కల్పన కోసం 32 రకాల స్వయం ఉపాధి పథకాల నుంచి ఆర్థిక సహకారం అందజేస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారు రూ.2.50 లక్షల నుంచి రూ.20 లక్షల విలువగల యూనిట్లు ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. దీనికోసం మే 10వ తేదీలోగా ఎస్సీ కార్పొరేషన్‌కు ఏపీఓబీఎమ్ఎమ్ఎస్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 506 యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ గల 152 యూనిట్లు కేటాయిస్తారు. వీటిలో సబ్సిడీ 50 శాతం, బ్యాంకు రుణం 45 శాతం ఉంటుంది. లబ్ధిదారుని వాటా 5 శాతం చెల్లించాలి. ప్యాసింజర్ ఆటో, కారు, గూడ్స్, ట్రక్ వంటి వాహనాల కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్లో డ్రోన్ల కొనుగోలు కోసం ఐదుగురితో కూడిన గ్రూప్‌లకు రుణాలు మంజూరుచేస్తారు. రూ 40 లక్షల వ్యయం కాగల ఒక్కో యూనిట్‌ను ఐదు గ్రూపులకు మంజూరు ఉంటుంది. ఇందులో రూ.32 లక్షలు సబ్సిడీగా లభిస్తుంది. బ్యాంకు నుంచి రూ.6 లక్షలు రుణంగా మంజూరవుతుంది. మిగిలిన రూ.2 లక్షల మొత్తం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. -
కిరణ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
రాజాం సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ చేబ్రోలు కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని మండల వైస్ ఎంపీపీ నక్క వర్షిణి, వైఎస్సార్ సీపీ నియోజవర్గ మహిళా నాయకురాలు ఎస్.అరుణ రాజాం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల నీచంగా మాట్లాడే కిరణ్‌పై తక్షణమే కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుచేసిన వారిలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు బండి నర్సింహులు, యాలాల వెంకటేష్, సర్పంచ్‌లు కొర్ను ఈశ్వరరావు, కరణం తులసినాయుడు, తదితరులు ఉన్నారు. 15న ఐటీఐలో నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా ● ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి విజయనగరం అర్బన్: పట్టణంలోని వీటీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన 27వ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా (పీఎంఎన్ఏఎం) నిర్వహిస్తామని ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి గురువారం తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అప్రెంటీస్ షిప్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. మైలాన్ ల్యాబొరేటరీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిడెడ్, జయభేరి ఆటోమోటివ్ లిమిటెడ్, శ్యాంసంగ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ (ఎస్ఆర్ఎస్, నవదీప్ ఎలక్ట్రానిక్స్), పిట్టీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్, జేవై సొల్యూషన్, డెక్కన్ ఫెర్రోఅల్లోయీస్, వోల్టాస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, తదితర కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని పేర్కొన్నా రు. ఎంపికైన వారికి ఆయా పరిశ్రమల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగిన స్టైఫండ్ చెల్లిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్‌కార్డు, రెండు పాస్‌ఫొటోలతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్: 98491 18075, 98499 44654 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అనంతరం అభ్యర్థులు నమోదు చేయాల్సిన క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు. -
● ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో కలిసి విజయనగరం ఆర్డీవో కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. సీఎం చంద్రబాబు సర్వేలతో కాలక్షేపం చేస్తూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్స్ నగర్ శాఖ సహాయ కార్యదర్మి బూర వాసు, బలిజివీధి శాఖ కార్యదర్మి పొందూరు అప్పలరాజు, శాంతినగర్ శాఖ నాయకులు సూరీడమ్మ, ఏఐటీయూసీ నాయకులు ఆల్తి మరయ్య పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
రూ.20 వేలు భృతి ఇస్తామన్నారు...
వేటనిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు భృతి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. 2024–25 సంవత్సరానికి సంబంధించిన భృతి ఇంతవరకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయినా ఇంతవరకు భృతి చెల్లించలేదు. దానిగురించి ఎటువంటి ప్రకటన చేయడం లేదు. దీనిపై పోరాటం చేస్తాం. – బర్రి చిన్నప్పన్న, మత్య్సకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు భృతి ఏది బాబూ.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతిని ఇంతవరకు చెల్లించకపోవడం దారుణం. సంక్షేమ పథకాలు దేవుడెరుగు కనీసం... ప్రతి ఏటా ఇస్తున్న వేట నిషేధ భృతి ఇవ్వకపోవడం అన్యాయం. – వాసుపల్లి అప్పన్న, మత్స్యకారుడు, తిప్పలవలస భృతి చెల్లింపునకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. మత్య్సకారుల వేట నిషేధ భృతి చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. నిధులు విడుదల కాలేదు. ఈ నెల 15 వ తేదీ నుంచి చేపలవేట నిషేధం అమల్లోకి వస్తుంది. – ఎం.విజయకృష్ణ, ఇన్చార్జి డీడీ, మత్య్సశాఖ -
● రోడ్డు మీద రోడ్డు..
చిత్రం చూశారా.. చక్కగా ఉన్న రోడ్డుపై మళ్లీ రోడ్డు వేస్తున్నారన్న సందేహం కలుగుతోందా... అయితే ఆ రోడ్డు కథ తెలుసుకోవాల్సిందే. ప్రజాధనం దుర్వినియోగం తీరును పసిగట్టాల్సిందే. బొండపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి–26 నుంచి బొండపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోని శ్రీమన్నారాయణ ఆలయం వరకు 2024 మార్చిలో రూ.20 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారు. రోడ్డు వేసిన ఏడాదికే మళ్లీ జాతీయ రహదారి నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు రూ.40 లక్షల ఉపాధిహామీ నిధులతో 3.7 మీటర్ల వెడల్పు, 300 మీటర్ల పొడవున సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను రెండు రోజులుగా చేపడుతున్నారు. గతంలో వేసిన సిమెంట్ రోడ్డు చక్కగా ఉన్నా దానిపై రోడ్డు వేయడాన్ని చూసిన వారు ముక్కునవేలేసుకుంటున్నారు. శ్రీమన్నారాయణ గుడి నుంచి జెడ్పీ హైస్కూల్ వరకు ఉన్న మట్టి రోడ్డును సిమెంట్ రోడ్డు నిర్మించేవరకు ఫరవాలేదని, గతంలో జాతీయ రహదారి నుంచి గుడివరకు నిర్మించిన రోడ్డుపై మళ్లీ రోడ్డు వేయడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి ఈ రోడ్డే నిలువెత్తు నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలిస్తే నిధులు కొల్లగొట్టే తీరు బయటపడుతుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పంచాయతీరాజ్ జేఈ పి.అప్పలనాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా జాతీయ రహదారి నుంచి రోడ్డు వెడల్పు చేయడంతో పాటు, గుడి నుంచి హైస్కూల్ వరకు నిర్మాణం చేయని మట్టిరోడ్డుపై సిమెంట్ రోడ్డు వేస్తున్నట్టు తెలిపారు. – బొండపల్లి -
● రోడ్డెక్కిన ‘మురుగు’ సమస్య
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారుల పర్యవేక్షణలోపం వెరసి మురుగు సమస్య తరచూ రోడ్డెక్కుతోంది. దీనికి ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ కూడలి వద్ద ఉన్న మురుగు కాలువలో కొద్దిరోజులుగా పూడికలు తొలగించడం లేదు. పూడిక పేరుకుపోయి మురుగునీరు గురువారం రోడ్డుపై ప్రవహించింది. నగరవాసుల ఫిర్యాదుతో మేల్కొన్న కార్పొరేషన్ యంత్రాంగం పొక్లెయిన్‌తో కాలువలో పూడికల తొలగింపు పనులకు ఉపక్రమించింది. మురుగు రోడ్డెక్కితో తప్ప అధికారులకు బాధ్యత గుర్తు రాలేదంటూ స్థానికులు గుసగుసలాడారు. – విజయనగరం -
● అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు
చిత్రాల్లో కనిపించిన కుళ్లిన కోడిగుడ్లు గజపతినగరం మండలంలోని సీతారామపురం, కొణిశ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసినవి. కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంతో అంగన్వాడీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పిల్లలు, గర్భిణులకు కుళ్లిన గుడ్లను ఎలా వండిపెట్టేదని ప్రశ్నిస్తున్నారు. నెలలో నాలుగుసార్లు అంగన్ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా, మూడుసార్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత సీడీపీఓ నాగమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కోడిగుడ్లు కుళ్లిపోతే లబ్ధిదారులకు ఇవ్వవద్దని కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కుళ్లిన గుడ్ల ఫొటో తీసి పంపితే వాటి స్థానంలో సంబంధిత కాంట్రాక్టర్‌తో మంచి గుడ్లను సరఫరా చేయిస్తామన్నారు. – గజపతినగరం రూరల్ -
ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం
కూటమి సర్కారు వచ్చిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం నుంచి మత్స్యకారుల సంక్షేమానికి ఎటువంటి భరోసా లేదు. చింతపల్లిలో జెట్టీ నిర్మాణానికి గత ప్రభుత్వం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసింది. నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు ఏడాది అవుతున్నా కనీసం స్పందన లేదు. మత్స్యకారులు వేట సాగక వలసలు వెళ్లే పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం జీవనభృతి మంజూరు చేయాలి. ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణ పనులు ప్రారంభించాలి. – బర్రి దాసు, మత్స్యకారుడు, చింతపల్లి ● -
పింఛన్ల కోసం.. పేదల నిరసన
చీపురుపల్లి: ఒకటి కాదు రెండు కాదు.. పది నెలలుగా ఎదురు చూశారు... పింఛన్ మంజూరైతే ఆర్థిక కష్టాలు తొలగుతాయని, జీవనానికి భరోసా దొరుకుతుందని ఆశపడ్డారు.. వారి ఆశలు అడియాసలే కావడం, పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకపోవడంతో రోడ్డెక్కారు. ఎన్నాళ్లు ఆకలితో అలమటించాలంటూ మండిపడ్డారు. కూటమి నేతల తీరును దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్ల వయస్సు నిండితే పింఛన్ మంజూరు చేస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోయినా పింఛన్ మంజూరు కావడంలేదంటూ వితంతువులు గోడు వినిపించారు. సర్వేల పేరుతో అర్హుల పింఛన్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, తక్షణమే అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చీపురుపల్లిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. చీపురుపల్లి మండలంలోని 19 పంచాయతీల్లో అర్హత ఉండి ఆన్లైన్ చేసుకుని పింఛన్లు మంజూరు కాని లబ్ధిదారుల ఆందోళనకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి, మెయిన్‌రోడ్, ఆంజనేయపురం మీదుగా మండల పరిషత్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఏఓ ప్రవీణ్‌కు, పంచాయతీ కార్యాలయంలోని శానిటరీ ఇన్స్పెక్టర్కు జి.వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. పేదల కోసం న్యాయ పోరాటం చేస్తాం పింఛన్ లబ్ధిదారుల నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేల మంది లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లామని, శాసనమండలిలో ప్రస్తావిస్తానని చెప్పారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్పీ నోటిఫికేషన్ అంటూ రెండో వారం వచ్చినా ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఊసేలేదని, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ మంజూరు, మత్స్యకార భరోసా వంటి ఎన్నో పథకాలను అటకెక్కించారన్నారు. సచివాలయం, వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడంతో ఏ పనికావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. తాజాగా వంట గ్యాస్ ధరలు పెంచి పేదలకు కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, నియోజకవర్గ వలంటీర్ విభాగం అధ్యక్షుడు బెల్లాన త్రినాథరావు, పార్టీ నాయకులు పతివాడ రాజారావు, ఇప్పిలి గోవింద, రఘుమండ త్రినాథరావు, మీసాల రమణ, చందక గురునాయుడు, అధికార్ల శ్రీనుబాబు, బాణాన రమణ, రేవళ్ల సత్తిబాబు, మీసాల ఈశ్వరరావు, గవిడి సురేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. అర్హత ఉన్నా పది నెలలుగా మంజూరుకాని పింఛన్లు భర్తలు చనిపోయినా, వృద్ధాప్యం ఆవరించినా అందని పింఛన్ చీపురుపల్లిలో భారీ ర్యాలీ ప్రభుత్వ తీరుపై నిరసన పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేత పేదలకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ శ్రేణులు జీవనానికి ఇబ్బంది ఏడాది కిందటే భర్త మృతి చెందాడు. ఎలాంటి ఆధారం లేక వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇంతవరకు మంజూరు కాలేదు. అధికారులు, సచివాలయ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తే... కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయాలని చెబుతున్నారు. – సఖినేటి పద్మ, రిక్షాకాలనీ, చీపురుపల్లి మేజర్ పంచాయతీ పింఛన్ ఎప్పుడిస్తారు? ఏడాదిన్నర కిందట భర్త చనిపోయాడు. పింఛన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఎన్నికల కోడ్ అంటూ అప్పట్లో మంజూరు చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయానికి తిరిగినా ఫలితం లేకుండా పోయింది. పింఛన్ ఎప్పుడిస్తారో తెలియడంలేదు. – రేగిడి సూరమ్మ, విజయరాంపురం, చీపురుపల్లి మేజర్ పంచాయతీ కనికరించడం లేదు.. భర్తకు పింఛన్ వచ్చేది. ఆయన చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. పింఛన్ కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. వితంతువులపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. బతకడం కష్టమవుతోంది. – కొంగరాపు లక్ష్మి, పర్ల, చీపురుపల్లి మండలం -
మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’
కొండల మధ్యన విసిరేసినట్లు ఉన్న తాన్నవలస గ్రామంసాలూరు/సాలూరు రూరల్ : ఏ ఆధారం లేని తనకు పింఛన్ సొమ్ము వస్తే జీవనం సాఫీగా సాగించవచ్చని భావించింది. తొమ్మిదినెలలు దాటినా ఆ ఎదురుచూపులు అలాగే మిగిలిపోయాయి. చివరకు పింఛన్ మంజూరు కోసం ఎదురుచూస్తూ.. ఆకలితో అలమటించి ఓ గిరిజన వితంతువు తనువుచాలించిన హృదయ విదారక సంఘటన గిరిజన సంక్షేమ శాఖామంత్రి, సీ్త్రశిశుసంక్షేమశాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో బుధవారం జరిగింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాలూరు మండలంలోని కూర్మరాజుపేట పంచాయతీ గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు వంజరపు అన్నపూర్ణ(62) పింఛన్ కోసం తిరుగుతూ, ఆకలితో అలమటిస్తూ బుధవారం రాత్రి తనువు చాలించింది. ఆమె భర్త కన్నయ్యకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో పింఛన్ వచ్చేది. అయితే 2023 డిసెంబరు 6న కన్నయ్య మరణించాడు. భర్త మరణించిన కారణంగా తనకు పింఛన్ మంజూరుచేయాలని ఆమె స్థానిక సచివాలయానికి వెళ్లింది. అయితే ఆమెకు ఫింఛన్ మంజూరయ్యేలోపు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మంజూరు కాలేదు. తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సుమారు 9నెలలు కావస్తున్నా నేటికీ ఆమెకు పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో ఆ ఒంటరి వృద్ధురాలికి స్థానికులు సాయం చేయగా పొట్ట పోషణ చేసుకునేది. ఈ క్రమంలో పింఛన్ సొమ్ము రాక, ఆకలితో అలమటిస్తూ బుధవారం తనువుచాలించింది. ఈ హృదయ విదారక సంఘటనతో స్దానికులు భావోద్వేగానికి లోనయ్యారు. వితంతువులతో రాజకీయమా..? ఇటువంటి సంఘటనల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది నవంబర్ నుంచి పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్ మంజూరుచేయాల్సి ఉంది. కూటమి పాలనలో భర్త మరణించినా భార్యకు వితంతు పింఛన్ మంజూరు కాకపోవడంతో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు గాలికొదిలేసిన పాలకులు వితంతువుల పట్ల కూడా ఇంత స్వార్థపూరిత రాజకీయాలు చేస్తారా? అంటూ కూటమి ప్రభుత్వ వికృత చర్యలపై మండిపడుతున్నారు.మరణించిన గిరిజన వృద్ధురాలు వంజరపు అన్నపూర్ణ ఇది దారుణం కూర్మరాజుపేటలో గిరిజన వృద్ధురాలు వంజరపు అన్నపూర్ణమ్మ పింఛన్ మంజూరుకాక కుటుంబపోషణకు ఆధారం లేక ఆకలితో మరణించడం చాలా బాధాకరం. ఇది నన్ను బాగా కలిచివేసింది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇటువంటి వారు లక్షల్లో ఉండొచ్చు. వారు మనుషులు కాదా? వారి కష్టాలు నేటి పాలకులకు పట్టకపోవడం అత్యంత శోచనీయం. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే ఆలోచించి, అర్హులందరికీ పింఛన్లు అందించాలి. –పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం -
రెండు వారాల్లో సివిల్ వర్క్స్ పూర్తి చేయాలి
విజయనగరం అర్బన్: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, ఇంజినీర్లను పథకం రాష్ట్ర అధికారుల బృందం ఆదేశించింది. పీఎంశ్రీ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ విభాగ సిబ్బందితో స్థానిక యూత్ హాస్టల్లో గురువారం రాష్ట్రబృందం అధికారులు డాక్టర్ ఎం.ప్రసాదరావు, మహేశ్వరరెడ్డి, జయలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పీఎంశ్రీ పథకం మంజూరైన 34 పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన సివిల్‌వర్క్స్’లో భాగంగా కెమిస్ట్రీ ల్యాబ్స్, లైబ్రరీ రూమ్స్, ప్లే ఫీల్డ్స్, కిచెన్ గార్డెన్ రియిన్ వాటర్ హార్వెస్టింగ్ తదితర పనుల వివరాలను పాఠశాలల వారీగా తెలుసుకున్నారు. అదేవిధంగా అకడమిక్ పురోభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత పనులకు నిధులు మంజూరయ్యాయని జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని కోరారు. ఎస్ఎస్ఏ ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఏఎంఓ బి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణం పరిధిలోని మలిచర్ల ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ పథకం పనులను రాష్ట్ర బృందం పరిశీలించింది. విద్యార్థి మిత్ర స్టాక్ పాయింట్ పరిశీలన పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర’ పథకానికి సంబంధించిన సామగ్రి స్టాక్ పాయింట్‌ను సమగ్ర శిక్ష రాష్ట్ర అధికార బృందం సందర్శించింది. త్వరలో జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు అందజేసే స్కూడెంట్ కిట్స్‌ను భద్రపరిచే ప్రదేశాలను పరిశీలించారు. జిల్లాకు వచ్చిన కిట్స్ ప్రతి విద్యార్థికి అందేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. పీఎంశ్రీ స్కూల్స్ అభివృద్ధిపై రాష్ట్ర బృందం సమీక్ష -
బాత్రూమ్లో పడి వ్యక్తి మృతి
పార్వతీపురం రూరల్: పట్టణంలోని వివేకానంద కాలనీలో బాత్రూమ్లో పడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పట్టణ పోలీసులు గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన కోరాడ సూర్యనారా యణ (46)అలియాస్ సురేష్ అనే వ్యక్తి ఈనెల 8న తన స్వగృహంలో ఉన్న బాత్రూమ్లో పడి మృతిచెందాడు. గురువారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీస్ సిబ్బంది వచ్చి పరిశీలించి సూర్యనారాయణ మృతిచెందినట్లు నిర్ధారించి కుటుంబసభ్యులకు సమాచామందించగా ఉగాది రోజున కన్నవారి ఇంటికి వెళ్లిన భార్య హుటాహుటిన వచ్చింది. ఉగాది రోజున భార్య ఊరికి వెళ్లగా సూర్యనారాయణ ఒక్కడే ఇంటిలో ఉంటూ మద్యం తాగిన మత్తులో బాత్రూమ్లో పడిపోయి ఉంటాడని స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.మురళీధర్ తెలిపారు. మృతునికి ఒక కుమార్తె ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన -
డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి
చికెన్బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చెబుతూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం చేయడం తగదని డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్.హరీష్ అన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై తొలిసంతకం చేశారన్నారు. కానీ నేటికీ నోటిఫికేషన్ వెలువడలేదని, నోటిఫికేషన్ రాక లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటూ తీవ్ర నిరాశకు గురువుతున్నారన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక, అసలు వస్తుందో రాదో అన్న అయోమయ పరిస్ధితిలో పలువురు అభ్యర్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. విజయనగరం జిల్లాకు పోస్టుల ఎంపిక విషయంలో అన్యాయం జరిగిందని, తక్కువ పోస్టులు మంజూరు చేశారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. 16,347వేల పోస్టులు కాకుండా 25వేలతో మెగా డీఎస్సీ నిర్వహించేలా చూడాలని, నిరుద్యోగ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. త్వరితగతిన డీఎస్సీ నోటిఫికేషన్ అన్ని వివరాలతో వెలువడేలా చూడాలని, తక్షణమే మెగా డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
గిరిజన బాలింత మృతి
సాలూరు: పాచిపెంట మండలంలోని గిరిశిఖర మోదుగ పంచాయతీ గ్రామానికి చెందిన గిరిజన బాలింత సేబి లక్ష్మి(30) మరణించింది. గురువారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్‌లో ఆమెను తీసుకురాగా ఆస్పత్రిలో బెడ్ మీద వేయగానే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మి సుమారు రెండు నెలల క్రితం మూడవ బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురికాగా పాచిపెంట సీహెచ్‌సీకి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఒకరోజు వైద్యం తరువాత ఆమెను మళ్లీ గ్రామానికి తీసుకువెళ్లారు. అయితే ఆమెకు పచ్చకామెర్లు వచ్చాయని పసర వైద్యం చేయించినట్లు తెలియవస్తోంది. దీంతో ఒళ్లంతా వాపులు రావడంతో సాలూరు ఏరియా ఆస్పత్రికి గురువారం ఉదయం తీసుకువచ్చారు. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షిని వివరణ కోరగా, గురువారం ఉదయం ఆస్పత్రికి ఆమెను తీసుకువచ్చారని, బెడ్ మీద వేసిన కొన్ని నిమిషాల్లోనే మరణించిందన్నారు. సెప్టిక్‌షాక్ విత్మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మృతిచెందినట్లు చెప్పారు. ఆమెకు పచ్చకామెర్లు రావడంతో ఇంటివద్ద పసర వైద్యం చేయించామని బంధువులు చెప్పారన్నారు. పసర వైద్యమే కారణమా? -
క్షయ రోగుల కుటుంబ సభ్యులకు పరీక్షలు
● జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి విజయనగరం ఫోర్ట్: క్షయ రోగుల కుటుంబసభ్యులకు క్షయ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి తె లిపారు. ఈ మేరకు స్థానిక అరుంధతి నగర్లో ని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ రోగుల కుటుంబసభ్యులకు చేస్తున్న స్కిన్ (సీ వై–టీబీ) టెస్టును గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయ రోగుల కుటుంబసభ్యులకు స్కిన్ టెస్టు చేయనున్నామని చెప్పారు. 48 నుంచి 72 గంటల్లో ఈ పరీక్ష రిజల్ట్ వస్తుందన్నారు. ఈ పరీక్షలో 5ఎంఎంగా నిర్ధారించిన ఎడల టీబీ ప్రివెంటివ్ థెరపీ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు అర్చన దేవి, అశోక్ పాల్గొన్నారు. ఒకే ఈతలో రెండు ఆవుదూడలుగజపతినగరం: మండల కేంద్రంలోని ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ పీవీవీ గోపాల రాజు జెర్సీ ఆవు ఒకే ఈతలో రెండు జెర్సీ ఆడపెయ్యలకు జన్మనిచ్చింది. ఈ విధంగా కవలలు పుట్టడం చాలా అరుదని స్థానిక పశువైద్య శాఖ ఎ.డి చంద్రశేఖర్ అన్నారు. గురువారం పీవీవీ గోపాల రాజుకు చెందిన ఆవు, దానికి పుట్టిన రెండు ఆడపెయ్యలు ఆరోగ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించానని ఎ.డి చంద్రశేఖర్ తెలిపారు. ఒకే ఈతలో జన్మించిన ఆవుపెయ్యిలను పలువురు ఆసక్తిగా తిలకించారు. రూ.కోటి 72 లక్షల విలువైన సిగరెట్లు సీజ్● శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల విజిలెన్స్ ఎస్పీ విజయనగరం క్రైమ్: ఎలాంటి ట్యాక్స్‌లు చెల్లించకుండా ఒడిశా నుంచి ఏపీలోకి వచ్చిన రూ.కోటి 72 లక్షల విలువ గల సిగరెట్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విజయనగరంలోని ఎంవీఆర్జీఆర్ కాలేజ్ సమీపంలో గల సూర్య లేఅవుట్లో సుంకర పేట వద్ద ఓ గోడౌన్లో సిగరెట్లు డంప్ చేస్తుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యాన్‌లో అగ్గిపెట్టెలు బిల్లులతో రవాణా చేస్తున్నట్లు తొలుత తమకు సమాచారం అందిందన్నారు. అయితే మ్యాచ్బాక్స్ బిల్లు పేరుతో 3 లక్షల 16 వేల సిగరెట్ బాక్స్‌లు సరఫరా చేస్తున్నారని, తర్వాత అందిన సమాచారంతో సూర్య లే అవుట్ వద్ద ఉన్న ఓ గొడౌన్లో దాడిచేసి వ్యాన్‌లో ఉన్న సిగరెట్ల లోడును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిరాదరణకు గురైన బాలికకు సంరక్షణగుమ్మలక్ష్మీపురం: కురుపాం మండల కేంద్రంలోని శివన్నపేట గ్రామంలో నిరాదరణకు గురైన 11 ఏళ్ల బాలికను మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్ చొరవతో..మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.కనకదుర్గ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ అధికారులు బాలబాలికల వసతి గృహానికి గురువారం తరలించారు. తల్లిదండ్రులు వదిలేసిన ఓ బాలిక శివన్నపేటలో తిరుగుతూ ఎవరైనా తినడానికి ఇస్తే తింటూ..రోజుకో ఇంటి గడపలో తలదాచుకుంటోందన్న సమాచారాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న మాజీ ఎంపీ ప్రదీప్ కుమార్ దేవ్ బాలిక సంరక్షణ నిమిత్తం ఐసీడీఎస్ పీడీ కనకదుర్గకు తెలియజేశారు. దీనిపై స్పందించిన పీడీ ఆ బాలికను బాలబాలికల వసతి గృహంలో చేర్పించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణకు ఆదేశించగా..ఆయనతో పాటు జిల్లా లీగల్ ఆఫీసర్ పి.శ్రీధర్ బాలికతో మాట్లాడి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి, వారి సూచనల మేరకు వసతి గృహంలో చేర్పించారు. కార్యక్రమంలో కురుపాం మహిళా సంరక్షణ అధికారి రోజారాణి, ఐసీడీఎస్ సిబ్బంది ఉన్నారు. -
ప్రతి కుటుంబం లక్ష ఆదాయం పొందాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని ప్రతికుటుంబం కనీసం రూ.లక్ష ఆదాయం పొందాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి జీవనోపాధి కల్పనలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం కనీసం రూ.లక్ష ఆదాయం సంపాదించాలని ఇందుకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, వశుసంవర్థక సంబంధిత ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు పెంపకాల యూనిట్ల ఏర్పాటు వల్ల పొందే ఆదాయ మార్గాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. జిల్లాలో 110 ఎకరాల్లో పనస పంట వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఒక కుటుంబం రూ.లక్ష ఆదాయం పొందేందుకు అవసరమైన పెట్టుబడి, వేతనాలు, చెల్లింపు, ఖర్చులు తదితర అంశాలతో స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి డీఎస్ దినేష్ కుమార్ రెడ్డి, డీఆర్డీఎ పీడీ ఎం.సుధారాణి, జిల్లా ఉద్యానశాఖాధికారి బి. శ్యామల, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి వి.రాధాకృష్ణ, జిల్లా అగ్రిట్రేడ్ మార్కెటింగ్ అధికారి అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ -
వల్లంపూడి ఎస్ఐని సస్పెండ్ చేయాలి
వేపాడ: వల్లంపూడి ఎస్ఐ బి.దేవిని తక్షణమే సస్పెండ్ చేయాలని, గుడివాడలో జరిగిన సంఘటనలో తప్పుడు కేసులను రద్దు చేయాలని కోరుతూ దళితులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఏపీ దళిత కూలీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గాలి ఈశ్వరరావు, దళిత నాయకుడు కిరణ్ ఆధ్వర్యంలో ముందుగా అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్ఐ తీరుపై నిరసన తెలిపారు. అనంతరం స్టేషన్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం, యాతపేట, వల్లంపూడి మీదుగా ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ జె.రాములమ్మకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా బాధితులు గుడివాడ మోహన్, గాలి ఈశ్వర్వవు మాట్లాడుతూ గుడివాడలో మార్చి 11న రాత్రి జరిగిన ఘటనలో నమోదు చేసిన తప్పుడు కేసులను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ వీరాకుమార్, ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, ఎల్.కోట ఎస్ఐ నవీన్‌పడాల్ బందోబస్తు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు దళితుల ధర్నా తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత -
వలంటీర్లను మోసం చేయడం తగదు
విజయనగరం: వలంటీర్లను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అంబేడ్కర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో వలంటరీ వ్యవస్థ వంచన దినోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూపొందించిన కరపత్రాలను ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్ 9న అప్పటి టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వలంటీర్ల జీతం రూ. 5 వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు జీతం పెంచకపోవడం దారుణమన్నారు. పైగా ఆ వ్యవస్థే లేదని చెబుతున్న నాయకులు బుడమేరు వరదల సమయంలో వారి సేవలను ఎలా వినియోగించుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత పాలకులు స్పందించి వలంటీర్లకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొంగ భానుమూర్తి, దారాన వెంకటేష్, లోపింటి రామకృష్ణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, వేముల వంశీ, ఈర్ల రవిరాజ్, ఉపమాక సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
దారికాచి దోపిడీ.. జాగ్రత్త..!
శృంగవరపుకోట: ఎస్.కోట మండలంలోని బొడ్డవర నుంచి తాటిపూడి మీదుగా విజయనగరం వెళ్లే రోడ్డులో దారిదోపిడీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో ప్రయాణికులపై దాడిచేసి దోచుకుంటున్నారు. గంట్యాడ మండలం బోనంగి గ్రామానికి చెందిన ముప్పన సత్యనారాయణ బుధవారం ఉదయం జీడిపిక్కలు కొనుగోలుకు బొడ్డవర వైపు బైక్‌పై వెళ్తుండగా రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆయనను ఆపారు. వారిలో ఇద్దరు సత్యనారాయణను పట్టుకుని సొమ్ము గుంజుకునే ప్రయత్నం చేశారు. ఆయన జేబు గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో పిడిగుద్దులు గుద్ది తుప్పల్లో తోసేశారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కొని పరారయ్యారు. కొద్ది నిమిషాలకు తేరుకున్న సత్యనారాయణ ముషిడిపల్లిలో సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పడంతో అక్కడి మహిళా పోలీస్ ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. తాటిపూడి రోడ్డులో ఇటీవల ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో బైక్‌లపై వచ్చేవారిని టారర్గెట్ చేస్తూ బైక్ రిపేర్ అయ్యిందని, లిఫ్ట్ కావాలని, పక్క ఉన్న వ్యక్తికి ఆరోగ్యం బాగులేదని.. ఇలా రోజుకో వేషంతో ఏమారుస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తక్షణమే ఆ రోడ్డులో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటుచేయాలని, సీసీ కెమెరాలు అమర్చి దొంగతనాలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వెబ్సైట్లో మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్యకళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే ఈ నెల 10, 11, 15, 16, 19, 21 తేదీల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉదయం 10 నుంచి సాయింత్రం 5 గంటలలోగా లిఖితపూర్వకంగా అందజేయాలని కోరారు. ఐటీఐ పరికరాల కొనుగోలుపై విచారణ బొబ్బిలి: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐకు రూ.90లక్షల విలువైన యంత్ర పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.వి.రమణారావు, విజిలెన్స్ అంధికారులు రెండు రోజులుగా డీడీ ఆధ్వర్యంలో సిబ్బందిని విచారణ చేస్తున్నారు. వర్చువల్ డ్రైవింగ్ సిస్టం, ఆన్లైన్ శిక్షణ తరగతులకు సంబంధించిన విలువైన పరికరాలను పరిశీలించి, ధరలపై ఆరా తీసినట్టు సమాచారం. పూర్తి వివరాలు గురువారం వెల్లడిస్తామని డీడీ తెలిపారు. ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు సమస్యల ఏకరువు సాలూరు: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు వద్ద గిరిజనులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సాలూరు మండలంలోని మారేపా డు, తాడిలోవ, పాలికవలస గిరిశిఖర గ్రామాలకు డీవీజీ బుధవారం కాలినడకన వెళ్లారు. తొలుత మారేపాడు వెళ్లిన చైర్మన్‌కు అక్కడి గిరిజనులు తమ సమస్యలను తెలియజేశారు. తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నామని, గ్రామానికి రోడ్డు సదుపా యం లేదని, పిల్లల ఆధార్ నమోదు సమస్యలు అధికంగా ఉన్నాయని, పోడు పట్టాలు అందజేయలేదని వివరించారు. అనంతరం ఆయన అంగన్వా డీ కేంద్రంలో పిల్లలకు వండిపెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. మరో తాగునీటి పథకం, పోడు పట్టాలు మంజూరు చేయాలని తాడిలోవ గిరిజనులు విజ్ఞప్తి చేశారు. పాలికవలసలో అంగన్వాడీ కేంద్రం టీచర్ పోస్టు భర్తీ చేయాలని, శ్మశానానికి రోడ్డు మంజూరుచేయాలని, పోడు పట్టాలు ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. పెదపదంలో గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భూములు సర్వే చేశారే తప్ప పట్టాలు మంజూరు చేయలేదన్నారు. దీనిపై డీవీజీ స్పందిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.వి.రమణ, ఎంపీడీఓ పార్వతి, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం
బిల్లుల భారం మోయలేం ● విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు జెడ్పీ నుంచి రూ.కోటి చొప్పున నిధుల కేటాయింపు ● తాగునీటి పంపింగ్‌కు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వెల్లడి ● పింఛన్ల తొలగింపుపై వాడీవేడిగా సాగిన చర్చ ● సంక్షేమ పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమన్న జెడ్పీ చైర్మన్ ● మంత్రి ఆరోపణలకు కౌంటర్ ● సమావేశానికి డుమ్మా కొట్టిన మంత్రి, కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు హాజురుకాకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు.. విద్యుత్ బిల్లుల భారం వినియోగదారులు మోయలేని విధంగా ఉన్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు అన్నారు. నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో ఉన్న తన ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు, ఒక ఏసీ వినియోగిస్తున్నామని, నెలకు రూ.లక్ష బిల్లు ఇచ్చారని సభలో ప్రస్తావించారు. నెల్లిమర్ల మండలం సారపల్లి గ్రామంలో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు మంజూరులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన సామగ్రిని రైతు భరోసా కేంద్రంలో నిరుపయోగంగా వదిలేశారని అధికారుల దృష్టికి తెచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా సమస్యలను తెలియజేశారు. విజయనగరం: వేసవి దృష్ట్యా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు తొలిప్రాధాన్యమివ్వాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. శివారు ప్రాంతాల ప్రజలు సైతం తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదన్నారు. దీనికోసం జిల్లా పరిషత్ తరఫున జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జెడ్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వేసవిలో తాగునీటి సరఫరా, పింఛన్ల తొలగింపు, విద్య, విద్యుత్, మెడికల్ అండ్ హెల్త్, ఉపాధి హమీ, హౌసింగ్ తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. జిల్లాలోని అన్నిబోర్ వెల్స్, తాగునీటి పథకాలు తనిఖీచేసి మరమ్మతులకు గురైతే వెంటనే బాగుచేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జెడ్పీ చైర్మన్ సూచించారు. తోటపల్లి, చంపావతి, ఆండ్ర జలాశయాల పరిధిలోని బోరు బావులను ముందే రీచార్జి చేసుకునేందుకు అనుమతులు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. నీటి పంపింగ్‌కు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. పింఛన్ల వెరిఫికేషన్ కోసం ఏ ఆధారంలేని దివ్యాంగులు ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసే శిబిరాలకు హాజరుకావడం కష్టంగా ఉంటోందని, ప్రభుత్వమే సచివాలయ సిబ్బందిని తోడు పంపాలని కోరారు. వితంతువులందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. సీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టులు భర్తీచేసి మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పింఛన్ల తొలగింపుపై జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మధ్య వాడీవేడిగా చర్చసాగింది. అర్హుల పింఛన్లు తొలగిస్తున్నారంటూ పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల పింఛన్లు తొలగించారంటూ వాఖ్యానించారు. దీనిపై జెడ్పీ చైర్మన్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వ పాలన సమయానికి ఇచ్చే పింఛన్లు ఎన్ని..? కూటమి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు ఎన్ని అన్నది స్పష్టంగా లెక్కలు ఉన్నాయని, మరి ఎందుకు పింఛన్లు తగ్గాయంటూ ప్రశ్నించారు. సర్వేల పేరుతో పింఛన్ల తొలగిస్తున్నారని ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారని, దీనికి స్పష్టమైన సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు. గత ప్రభుత్వం ప్రతీ ఆరునెలలకోసారి అర్హతే ప్రామాణికంగా పింఛన్లు, సంక్షేమ పథకాలు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. సభ సాక్షిగా ప్రజలకు మంచి జరగాలన్నదే అభిమతంగా సమస్యలపై చర్చిస్తున్నామన్నారు. కూటమి నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు...? ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి..? 50 సంవత్సరాలకే పింఛన్ మంజూరు..? మహిళలకు ఉచితబస్సు వంటి సూపర్ సిక్స్ హమీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. అధికారంలో ఉండి పనులు చేయకుండా గత ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద విజయనగరం జిల్లాలో 2,75,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా.. టీడీపీ చేసిన తప్పిదాల కారణంగా ఆయకట్టు తగ్గిపోయే పరిస్థితి నెలకొందన్నారు. 2024 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా జెడ్పీకి నిధులకు మంజూరు చేయలేదన్నారు. మంత్రి కొండపల్లి స్పందిస్తూ 15వ ఆర్థిక సంఘం పద్దు కింద రూ.9 కోట్ల నిధులు మంజూరు చేశామని సమాధానమివ్వగా... అవి కేంద్ర ప్రభుత్వం నిధులని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన జనరల్ ఫండ్స్ నిధులు మంజూరు చేయలేదన్నారు. ఎంపీటీసీలు, ఎంపీపీలకు ఇవ్వాల్సిన గౌరవం వేతనం విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాగిన పాలనపై చర్చకు సిద్ధమైతే మేము సిద్ధమన్నారు. చర్చ మధ్య లో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని జోక్యం చేసుకుని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కారణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా చాలడం లేదంటూ వాఖ్యానించడంతో సభలో ఉన్న సభ్యులు ఆమైపె ప్రశ్నల వర్షం కరిపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీల్లో ఎన్ని అమలు చేశారో స్పష్టమైన సమాధానం చెప్పాలని సభ్యులంతా ప్రశ్నించడంతో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు కలెక్టర్ అంబేడ్కర్ జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించడంతో సభలో మిగిలిన అంశాలపై చర్చ సాగింది. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు, జెడ్పీ సీఈఓ బెహరా వెంకట సత్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. 11 మంది ఎమ్మెల్యేలకు ఇద్దరే హాజరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశానికి మంత్రి సంధ్యారాణితో పాటు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలపై చర్చించాల్సిన సభకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 11 ఎమ్మెల్యేలు ఉండగా.. గజపతినగరం ఎమ్మెల్యే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు, ఓ మంత్రి సభకు గైర్హాజరయ్యారు. ఇదే విషయమై మంత్రి శ్రీనివాస్‌ను విలేకరుల ప్రశ్నించగా.. తక్కువ సమయంలో సమాచారం అందించడంలో వారంతా హాజరుకాలేకపోయారని సమాధానం ఇచ్చారు. పింఛన్ల తొలగింపుపై రచ్చ ఆలోచన చేస్తున్నాం పింఛన్లపై చర్చలో గతేడాది నవంబర్ కంటే ముందు భర్తలు కోల్పోయిన మహిళలకు వితంతు పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అసలైన దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయాలన్న ఉద్దేశంతోనే తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు. కార్లు, బైక్‌లు నడిపేవారికి పింఛన్లు ఎలా మంజూరు చేస్తామన్నారు. ఉపాధిహామీ వేతన బకాయిలు జనవరి 14 నుంచి చెల్లించాల్సి ఉందని, ఈ నెల 13, 14 తేదీల్లో చెల్లిస్తామని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఉపాధిహామీ పనులు పంచాయతీ తీర్మానాలతో సంబంధంలేకుండా, నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయని సభ్యులు ప్రస్తావించగా, కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ స్పందిస్తూ గ్రామసభల్లో తీర్మానం చేసిన పనులనే చేపడుతున్నట్టు చెప్పారు. నాణ్యతలోపించే పనులు తన దృష్టికి తీసుకొస్తే తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ తాగునీటి సరఫరాకు అవసరమైన మెటీరియల్‌ను ఎంపీ నిధులతో సమకూర్చుతామని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. విద్యుత్ లో ఓల్టేజీ సమస్య వేధిస్తోందన్నారు. బొబ్బిలి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులకు ఒకే సారి బదిలీ చేశారని, కొత్తవారు వచ్చే వరకు వీరిని కొనసాగేలా చూడాలని అధికారులను కోరారు. సభలో చర్చించిన కొన్ని అంశాలు.. విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని, సర్దుబాటు చార్జీలను ప్రభుత్వమే భరించాలని సభ్యులు కోరారు. ఉపాధి హమీ పథకం మేట్ల అక్రమ నియామకాలను అరికట్టాలని, మండల తీర్మానాలు లేకుండా వెండర్స్‌తో పనులు చేయించడం తగదని పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. కురుపాం, గరుగుబిల్లి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయా మండలాల సభ్యులు కోరారు. జీఎల్‌పురంలో పలు గ్రామాల్లో తాగు నీటి సమస్యను పరిష్కారించాలని ఇటీవల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సొంతింటి నిర్మాణం కోసం సచివాలయానికి వెళ్తే అక్కడి ఇంజినీరింగ్ అసిస్టెంట్ టీడీపీ నేతల నుంచి అనుమతి ఉండాలంటూ దరఖాస్తును చెత్త బుట్టలో పడేశారని దత్తిరాజేరు జెడ్పీటీసీ సభ్యుడు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ అంబేడ్కర్ స్పందిస్తూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
పోలీస్ శాఖలో నలుగురికి కారుణ్య నియామకాలు
విజయనగరం క్రైమ్: పోలీస్‌శాఖలో కారుణ్య నియామకాలు మొదలయ్యాయి.ఈ మేరకు శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించి శాఖలో మృతిచెందిన నలుగురి కుటుంబసభ్యులకు గురువారం ఎస్పీ వకుల్ జిందల్ నియామక పత్రాలను అందజేశారు. పోలీస్‌శాఖలో ఆర్మ్డ్, లా అండ్ ఆర్డర్లో వివిధ కారణాలతో ఇటీవల కొందరు మృతి చెందడంతో ఆయా కుటుంబాలలో కారుణ్య నియాకాలను భర్తీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా కుటుంబాలలో అర్హత ఉన్న వ్యక్తులకు ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా తరుణ్‌కుమార్, కోమలత, స్వామినాథ్, సాయిరెడ్డిలకు ఎస్పీ వకుల్ జిందల్ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారు. ఏఆర్ విభాగంలో పనిచేసిన ఏఆర్ హెచ్‌సీలు వెంకటరావు, అప్పలనాయుడు, సివిల్‌లో పనిచేసిన ఏఎస్సై కుమారస్వామి, హెచ్‌సీ చంద్రశేఖర్ ఇటీవలే అనారోగ్యాలతో మరణించారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, డీపీఓ ఏఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వరలక్ష్మి, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి పాల్గొన్నారు. ఆర్డర్స్ ఇచ్చిన ఎస్పీ వకుల్ -
అంధ విద్యార్థులకు ఉచిత వసతి, విద్యాబోధన
గజపతినగరం: ఒకటవ తరగతి నుంచి 10వతరగతి వరకు విద్యాభ్యాసంతో పాటు భోజన, వసతి సౌకర్యాన్ని అంధ విద్యార్థులకు ఉచితంగా కల్పించనున్నామని ఆసక్తి గల విద్యార్థులు చేరాలని బొబ్బిలి ఏషియన్ ఎయిడ్ స్కూల్ టీచర్స్ సుధాకర్ బుష్మి, బి.త్రినాథం, పి.రాజులు తెలిపారు. ఈ మేరకు బుధవారం గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావుకు కరపత్రాలను అందజేసి విలేకరులతో మాట్లాడారు. గజపతినగరం, పురిటిపెంట, ఎం.వెంకటాపురం గ్రామాల్లో వారు పర్యటించి దృష్టి లోపం గల విద్యార్థులకు ప్రభుత్వ అనుసంధానంతో కూడిన బొబ్బిలి ఏషియన్ ఎయిడ్ స్కూల్ అన్నిరకాల సదుపాయాలను అందిస్తుందని ఆసక్తిగల వారు ముందుకు వచ్చి ఇక్కడ చదువుకుని ఉన్నతమైన స్థానాలకు చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎంఈఓ కార్యాలయం, భవిత సెంటర్ సిబ్బందిని కలిసి కరపత్రాలను అందజేశారు. బొబ్బిలి ఏషియన్ ఎయిడ్ స్కూల్ టీచర్స్ -
ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్
● ఉమ్మడి జిల్లా కలెక్టర్లు డాక్టర్ బీఆర్అంబేడ్కర్, శ్యామ్ప్రసాద్విజయనగరం అర్బన్: భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్ రూపొందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. స్వర్ణాంద్ర–2047 కెపాసిటీ బిల్డింగ్‌పై విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులకు రెండు రోజుల వర్క్‌షాప్ బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌కు హాజరైన కలెక్టర్లు అంబేడ్కర్, శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాకు సంబంధించిన డ్రాప్ ప్లాన్‌ను రూపొందించామని అలాగే నియోజకవర్గాలకు కూడా ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గ ఎంఎల్ఏల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాల భౌగోళిక పరిస్థితిని బట్టి వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రగతికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 6,500 పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామికంగా కూడా అభివృద్ధికి అవకాశం ఉంటుందని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే పారిశ్రామిక, సేవా రంగాలు కూడా అభివృద్ది చెందుతాయన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని, విజన్ 2047 డాక్యుమెంట్ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఉద్యాన పంటల సాగును విస్తరించాలి మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలకు ఒకే ప్రణాళిక పనిచేయదని, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ప్రాథమిక రంగంలో ఉద్యాన పంటల సాగును విస్తరించడం, పశుసంపదను వృద్ధి చేయడం తదితర చర్యలపై సూచించారు. పండ్లు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వర్క్‌షాప్‌ను విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ముఖ్య ఆర్ధిక సూచికల ద్వారా, డేటాను సమీకరించడం, దానిని విశ్లేషించడం, ప్రణాళికలను రూపొందించడంపై శిక్షణ ఇచ్చారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రణాళిక శాఖ విశ్రాంతి డైరెక్టర్, సలహాదారులు సీతాపతిరావు, మూడు జిల్లాల సీపీఓలు పి.బాలాజీ, వీర్రాజు, లక్ష్మీప్రసన్న, నియోజగకవర్గాల ప్రత్యేకాధికారులు, పర్యవేక్షణ బృందం సభ్యులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సురేష్
దత్తిరాజేరు: బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గడసాం గ్రామానికి చెందిన ఇనుగంటి సురేష్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహిత సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌శర్మ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. గజపతినగరం నియోజకవర్గంలోని బ్రాహ్మణుల అభ్యుదయానికి పాటుపడతానని, గజపతినగరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న బ్రాహ్మణుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం అధికార ప్రతినిధిగా త్రిశూల్కుమార్ విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఉత్తరాంధ్ర జోన్ అధికార ప్రతినిధిగా విజయనగరం పట్టణానికి చెందిన త్రిశూల్ విద్యాసంస్థల అధినేత వెంపటి శంకరనారాయణ (త్రిశూల్ కుమార్)ను నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్కేమనోహర్రావుల నుంచి ఎంపిక ఆదేశాలు తనకు వచ్చినట్లు త్రిశూల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రోగనిరోధకశక్తి పెంపుదలతో వ్యాధులు దూరం
● త్వరలో దేశంలో ఇమ్యునో థెరపీ డ్రగ్స్ ● వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్: ఇమ్యునో థెరపీ డ్రగ్స్‌తో శరీరం ఏ వ్యాధికి గురైనా దానిని అదుపు చేయడానికి అవకాశం ఉంటుందని వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అన్నారు. ఈ మేరకు బుధవారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ మెడికల్ స్కిల్స్ అనే వర్క్‌షాపును వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేశ్వర్ మాట్లాడుతూ రానున్న కాలంలో వివిధ రకాల వ్యాధులకు మాత్రలు, ఇంజక్షన్లకు బదులుగా ఇమ్యూనో థెరపీ డ్రగ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇతర దేశాల్లో ఆ విధానం ఇప్పటికే కొనసాగుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా అనేక వ్యాధులను నియంత్రించాలంటే ఇమ్యూనో థెరపీ డ్రగ్స్ చికిత్స కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. వ్యాధుల నియంత్రణ యాంటిజన్, యాంటిబాడీ ప్రతి చర్యలపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్లనే కోవిడ్ సమయంలో యాంటిబాడీ కణాలు ఎక్కువగా చనిపోవడం వల్ల రోగనిరోధకశక్తి తగ్గి ఎక్కువ మంది మత్యువాతపడ్డారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇమ్యునాలజీకి ప్రాధాన్యం పెరిగిందని వివరించారు. అంతేకాకుండా మన దేశంలో వివిధ రకాల అలెర్జీలతో బాధపడుతున్న వారి సంఖ్య 35 శాతం ఉందని, వాటికి చికిత్సనందించే వైద్యులు మాత్రం దేశ వ్యాప్తంగా కేవలం 800 మంది మాత్రమే ఉన్నారన్నారు. త్వరలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం, వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్ సంయుక్తంగా మెడికల్ స్పెషలిస్ట్ అసిస్టెంట్ ప్రోగ్రాం అనే కొత్త కోర్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రొపెసర్ శాంతమ్మ, రిజిస్ట్రార్ డాక్టర్ పి.పల్లవి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎంఎల్ఎన్ ఆచార్యులు, డాక్టర్ చైతన్య, ఫోరెన్సిక్, అనస్థీషియా విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్: మహిళ మృతి
● మరో నలుగురిరు మహిళలకు గాయాలురామభద్రపురం: మండలంలోని గొల్లలపేట గ్రామం వద్ద బుధవారం ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టగా జరిగిన ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో అదే ఆటోలో ఉన్న మరో నలుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్భిణితో ఉన్న ఓ మహిళను చూసేందుకు గొల్లలపేట గ్రామం నుంచి కొట్టక్కి గ్రామానికి ఆటోలో ఐదుగురు మహిళలు బయల్దేరి వెళ్తున్నారు. సరిగ్గా ఆ గ్రామం దాటాక సచివాలయం సమీపంలోని శ్మశానం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న బాలి లక్ష్మి(37) అక్కడికక్కడే మృతిచెందగా బాలి పద్మావతి, బాలి రమణమ్మ, లెంక సత్యవతి, బాలి వాసవిలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్సై వి.ప్రసాదరావు సంఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, మృతురాలి భర్త రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ వ్యవసాయకూలీ కాగా వారికి ఇద్దరు కుమార్తెలు లలిత, హేమ ఉన్నారు. -
ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం
బొండపల్లి: ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారానే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.మురళి పెర్కొన్నారు. ఈ మేరకు బొండపల్లి మండలకేంద్రంలో మూడు రోజుల పాటు శ్రీరామచంద్ర మిషన్, హార్ట్వెల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా ,ధ్యానం శిక్షణ తరగతుల్లో భాగంగా చివరిరోజు బుధవారం ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి మురళి మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. అనారోగ్యం నుంచి బయట పడాలంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు జేఎస్ఎన్.రాజు, జె.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆయుర్వేద వైద్యశాలలో మందుల కొరత
● ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్న రోగులువిజయనగరం ఫోర్ట్: ● గంట్యాడ మండలానికి చెందిన వి. నారంనాయుడు మోకాళ్ల నొప్పులతో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు కొద్ది రోజుల క్రితం వెళ్లాడు. అక్కడ మందులు లేక పోవడంతో ప్రైవేట్ ఆయుర్వేద ముందుల దుకాణంలో కొనుగోలు చేశాడు. ● విజయనగరం మండలానికి చెందిన పి.లక్ష్మి చర్మ సంబంధిత వ్యాధితో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు వెళ్లగా అక్కడి వైద్యుడు రాసిన మందులు లేకపోవడంతో ప్రైవేట్ ఆయుర్వేద మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేసింది. వీరిద్దరే కాదు. అనేక మంది రోగులకు ఎదురువుతున్న పరిస్థితి ఇదే. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని. ప్రజారోగ్యానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అల్లోపతి వైద్యం తర్వాత ఆయుర్వేద వైద్యానికి అంత ప్రాధాన్యం ఉంది. అయితే ప్రస్తుతం ఆయుర్వేద వైద్యశాలలో మందులు లేక పోవడంతో వైద్యం కోసం వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. సాధారణ వ్యాధులకు కూడా లేని మందులు ఆయుర్వేద వైద్యశాలలో సొరియాసిస్, మధుమేహం, కీళ్లనొప్పులు, గైనిక్ సమస్యలు, జీర్ణ కోశ వ్యాధులు, మూత్ర వ్యాధులు, న్యూరాలజికల్ సమస్యలు, గుండెజబ్బులు, రుమటైడ్ ఆర్థరైటిస్, శ్వాసకోశసమస్యలకు సంబంధించిన మందులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రస్తుతం లేవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వైద్యుడికి చూపించిన తర్వాత మందుల గది వద్దకు వెళ్లిన రోగులకు అక్కడ మందులు లేక పోవడంతో ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కొంత కాలంగా ఇదే పరిస్థితి ఉంది. ఇండెంట్ పెట్టాం చాలావరకు మందులు అయిపోయాయి. మందులు పంపించాలని ఇండింట్ పెట్టాం. ఇంకా రాలేదు. ఎం.ఆనంద్‌రావు, వైద్యాధికారి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల -
వీరఘట్టంలో ఆవులు, మేకల దొంగలు
వీరఘట్టం: గడిచిన రెండేళ్లుగా వీరఘట్టం మేజర్ పంచాయతీలోని గొల్లవీధి, తెలగవీధి, పెరుగువీధి, మేకలవీధితో పాటు పలు వీధుల్లో ఆవులు, మేకలు, దూడలను ఆగంతుకులు ఎత్తుకుపోతున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు తెలగవీధిలోని ఓ ఇంటి ముందు ఉన్న రెండు ఆవులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో ఆగంతుకులు తప్పించుకుని పారిపోయారని తెలగవీధికి చెందిన వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. తెలగవీధిలో మూగజీవాలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారనే విషయం తెలియడంతో చాలా వీధుల నుంచి బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. రెండేళ్లుగా మా పశువులను కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులకు తెలియజేశారు. గురువారం పూర్తి స్థాయిలో అందరం కలిసి ఫిర్యాదు చేసేందుకు బాధితులంతా ఏకతాటిపైకి వచ్చారు. ఆవులు, మేకలను దొంగిలిస్తున్న వారిపై కఠినంగా చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు -
40 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్న నవోదయం 2.0 దాడుల్లో భాగంగా బుధవారం జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామంలో 40 లీటర్ల సారాతో డి.సుందరం అనే వ్యక్తి పట్టుబడినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ వ్యక్తి వద్ద లభించిన సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. అలాగే సారా సరఫరా చేసే బొమ్మాళి అరుణ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరఘట్టంలో 60 లీటర్ల సారా..వీరఘట్టం: మండలంలోని పొల్లరోడ్డులో బుధవారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తుండగా బైక్‌పై వస్తూ బైక్ వదిలేసి ఓ వ్యక్తి పరారవడంతో సోదా చేసి బైక్‌పై ట్యూబ్‌లో 60 లీటర్ల సారా ఉన్నట్లు గుర్తించామని ఎస్సై జి,కళాధర్ తెలిపారు. సారాను స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేశామని ఎస్సై చెప్పారు. బైక్‌పై సారా తరలిస్తున్న వ్యక్తి స్థానిక కొండవీధికి చెందిన దుర్గారావుగా గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లపై విజిలెన్స్ దాడులుమెరకముడిదాం: మండలంలోని పలుగ్రామాల్లో వినియోగిస్తున్న అక్రమ విద్యుత్ కనెక్షన్లపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా బుదరాయవలస, సోమలింగాపురం, ఇప్పలవలస గ్రామాల్లో వ్యవసాయ పంపసెట్లకు అక్రమ విద్యుత్ కనెక్షన్లపై దాడులు నిర్వహించి, ఆయా విద్యుత్ కనెక్షన్లు వాడుతున్న రైతులకు అపరాధరుసుం విధించారు. అలాగే పలు విద్యుత్ కనెక్షన్లను అధికారులు పరిశీలించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు చిట్టితల్లి, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కృష్ణ
విజయనగరం ఫోర్ట్: పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రెడ్డి కృష్ణ ఎన్నికయ్యారు. ఈ మేరకు స్థానిక పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం పశు సంవర్థకశాఖ అధికారుల సంఘం నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సీహెచ్. దీనకుమార్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ టి.ధర్మారా వు, కోశాధికారిగా డాక్టర్ కేవీరమణ, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ ఆర్. శారద ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు అఽధికారిగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు బాలకృష్ణ వ్యవహరించారు. డీసీహెచ్ఎస్గా డాక్టర్ పద్మశ్రీ రాణివిజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి(డీసీహెచ్ఎస్)గా డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీ రాణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ డీసీహెచ్ఎస్గా పనిచేస్తున్న ఆమె ఉద్యోగోన్నతిపై రెగ్యులర్ డీసీహెచ్ఎస్గా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీసీహెచ్ఎస్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం డీసీహెచ్ఎస్ పరిధిలో ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు డీసీహెచ్ఎస్ కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపికనెల్లిమర్ల: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే అండర్–19 విభాగం జిల్లా జట్టును నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో బుధవారం ఎంపిక చేశారు. పురుషుల విభాగంలో నాగ వెంకట్(48–50), రోహిత్(50–55), ఎర్రి నాయుడు(55–60), ప్రవీణ్(60–65), కిరణ్(70–75), సూర్య తేజ(80–85), బాలకుమార్(85–90), లోకేష్(90+)లు ఎంపికయ్యారు. వీరు త్వరలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంపిక పోటీలను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దిల అప్పలనాయుడు, జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కాళ్ల మహేష్ తదితరులు నిర్వహించారు. వడదెబ్బతో వ్యక్తి మృతిబొబ్బిలి: ఎండ వేడిమికి తాళలేక తెర్లాం మండలం కె.సీతారాంపురానికి చెందిన కోస్టు సింహాచలం(58) బొ బ్బిలి రైల్వేస్టేషన్లో బుధవారం మృతిచెందాడు. యాత కులస్తుడైన సింహాచలం వెదురుతో తయారయ్యే బుట్టలు, కోళ్ల గూళ్ల ను పటిష్టంగా ఉంచే నల్లుకట్టే పని చేస్తుంటాడు. ఈ పనిమీదనే రాయగడ వెళ్లి పనిముగించుకుని తిరిగి స్వగ్రామం వచ్చే సమయంలో బొబ్బిలి రైల్వేస్టేషన్లో దిగి ఎండ వేడిమికి సేదతీరుతూ అస్వస్థతకు గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు.రెండో ప్లాట్‌ఫాంపై మృతి చెందిన వ్యక్తి సంఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే హెచ్‌సీ బి ఈశ్వరరావు తెలిపారు. -
వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణివిజయనగరం ఫోర్ట్: వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆమె ఆశ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ చేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 1775 మంది ఆశ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సదుపాయాలు అందించడంలో ఆశ కార్యకర్తలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారన్నారు. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాను ముందు స్థాయిలో నిలబెడుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆశ జిల్లా కో ఆర్డినేటర్ బి.మహాలక్ష్మి, సీహెచ్ఓ చంద్రశేఖరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేకాధికారుల నియామకం..
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలోని నియోజకవర్గాలు, మండలాలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండల ప్రత్యేకాధికారులు ప్రతి శుక్రవారం మండలాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. మండల అభివృద్ధిపై వారు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారన్నారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలు తనిఖీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు పార్వతీపురం నియెజకవర్గానికి ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, పాలకొండ నియోజకవర్గానికి సబ్‌కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రోడ్డి, కురుపాం నియోజకవర్గానికి కేఆర్ఆర్సీ ఎస్డీసీ పి.ధర్మచంద్రా రెడ్డి, సాలూరు నియోజకవర్గానికి డ్వామా పీడీ రామచంద్రా రెడ్డిని నియమించారు. ’మున్సిపాల్టీల ప్రత్యేకాధికారులు సాలూరు మున్సిపాల్టీకి డీవీఈఓ డి.మంజులావీణ. పార్వతీపురం మున్సిపాల్టీకి ఐటీడీఏ ఏపీఓ ఎ.మురళీధర్, పాలకొండ మున్సిపాల్టీకి సీతంపేట ఏపీఓ జి.చినబాబులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
● ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడువిజయనగరం: క్రీడారంగంలో అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో క్రీడాకారులు పోటీ పడుతుంటారని, వారిలో ప్రతిభ కనబరిచిన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం ఎంపీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక విజ్జి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న జిల్లాస్థాయి అండర్–19 క్రీడాకారుల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకారుల ప్రతిభను అడిగి తెలుసుకుని, లక్ష్యం కోసం కష్టపడాలని సూచించారు. ఎంపిక పోటీల్లో విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబు, ట్రెజరర్ వర్మరాజు, అసోసియేషన్ సభ్యులు, హెడ్ కోచ్‌లు పాల్గొన్నారు. -
సారా రహిత జిల్లాగా తీర్చి దిద్దుతాం
● ఎకై ్సజ్ శాఖాధికారి బి. శ్రీనాథుడు ● ఏఓబీ గ్రామాల్లో ఎకై ్సజ్ సంయుక్త దాడులుపార్వతీపురం టౌన్: సారా నియంత్రణే ధ్యేయంగా ఎకై ్సజ్‌శాఖ పనిచేస్తుందని, సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖాధికారి బి. శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ సిబ్బందితో మంగళవారం సరిహద్దు గ్రామాలైన సులభ, పెండిమ, కెరడ, వలవ, వనజ గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దాడుల్లో 11,200 పులిసిన బెల్లపు ఊట, 200లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు తెలిపారు. సారా తయారీకి వినియోగిస్తున్న ప్లాస్టిక్ డ్రమ్ములు, బకెట్లు, నల్లబెల్లం వంటివి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో తయారైన సారా పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం వరకు అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఈ రవాణాను అరికట్టేందుకు సారా బట్టీలను ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా కనీసం మూడుసార్లు అంతర్రాష్ట్ర దాడులు నిర్వహిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో డ్రోన్ పరికరాలను ఉపయోగించి సారా తయారీ కేంద్రాలను గుర్తించి మరిన్ని దాడులు నిర్వహిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏఈఎస్ జీవన్ కిశోర్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఒడిశా ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
షెడ్యూల్ మేరకు పదో తరగతి మూల్యాంకనం
● విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్ విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ముగించాలని విద్యాశాఖ ఆర్జేడీ బి.విజయభాస్కర్ ఆదేశించారు. విజయనగరం సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. మూల్యాంకన ప్రాంగణంలో టీచర్లకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఆయన వెంట డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పరీక్షల విభాగం ఏసీ టి.సన్యాసిరాజు ఉన్నారు. బాధ్యతల స్వీకరణ ˘విజయనగరం అర్బన్: జిల్లా ఖజానాశాఖ ఉప సంచాలకుడిగా వి.నాగమహేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్ఏఎస్ కుమార్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం నాగమహేష్ను ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా డీటీ అండ్ ఏఓ ఏ.మన్మథరావు, ఏటీఓ కె.శ్రీనివాసరావు, ఉమ్మడి విజయనగరం జిల్లా ఉప ఖజానా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైవాడ కాలువలో ఆటో బోల్తా ● తప్పిన ప్రమాదం ● ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు వేపాడ: మండలంలోని బల్లంకి నుంచి ఆనందపురం వెళ్లే రోడ్డులో రైవాడ కాలువపై ఏర్పాటుచేసిన తాత్కాలిక కల్వర్టుపై మంగళవారం ఆటో అదుపు తప్పి కాలువలోకి బోల్తా కొట్టింది. ఆటోలో బల్లంకి గ్రామానికి వెళ్తున్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆటోను స్థానికుల సహాయంతో బయటకు తీశారు. జనవరిలో రైవాడ కాలువపై ఉన్న కల్వర్టు కూలిపోవడంతో గ్రామస్తులు తాటిదుంగలతో తాత్కాలిక కల్వర్టును ఏర్పాటుచేశారు. దీనిపై నుంచి గతంలో పిక్కలారీ వెళ్లడంతో కూలిపోయింది. ఇదే తాత్కాలిక కల్వర్టుపై ఇప్పుడు ఆటో బోల్తాకొట్టింది. జీవీఎంసీ అధికారులు, స్థానిక పాలకులు స్పందించి బల్లంకి–ఆనందపురం రోడ్డులో రైవాడ కాలువపై శాశ్వత కల్వర్టు నిర్మించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. -
బొబ్బిలిలో అవిశ్వాస రాజకీయం!
బొబ్బిలి: పౌరుషానికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి గడ్డ.. నేడు కుటిల రాజకీయాలకు కేరాఫ్‌గా మారింది. నిండా ఏడాది పదవీ కాలం లేని మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం బొబ్బిలి రాజులు బెదిరింపు, ప్రలోభ రాజకీయాలకు తెరతీయం చర్చనీయాంశంగా మారింది. ఓ పార్టీ గుర్తుతో గెలిచి మంత్రి పదవి కోసం పార్టీ మారిన నాయకుడు... ఇప్పుడు ఆ మచ్చను కౌన్సిలర్లకు అంటగట్టే ప్రయత్నాన్ని బొబ్బిలి ప్రజలు ఛీకొడుతున్నారు. పార్టీ మారిన కౌన్సిలర్ల తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. విశాఖ కేంద్రంగా బొబ్బిలి రాజులు నడుపుతున్న కుటిల రాజకీయాలకు అవిశ్వాస తీర్మానం రోజున భంగపాటు తప్పదని బహిరంగంగా చెబుతున్నారు. ● ఇదీ పరిస్థితి... బొబ్బిలి మున్సిపాలిటీలో 31 వార్డులకు టీడీపీకి 10 మంది కౌన్సిలర్లుండగా వైఎస్సార్సీపీ నుంచి 21 మంది కౌన్సిలర్లు గెలిచారు. దీంతో చైర్మన్ పీఠాన్ని అప్పట్లో వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్ పీఠంపై బొబ్బిలి రాజులు కన్నేశారు. బలం లేకున్నా... వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి, ఎరవేసి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని కౌన్సిలర్లతో కలెక్టర్ అంబేడ్కర్‌కు నోటీసు ఇప్పించారు. అయితే, కొందరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మాత్రం ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరే నీచపు పనికి ఒడిగట్టమని స్పష్టంచేస్తూ నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడ్డారు. రాజుల మాయమాటల్లో పడిన కౌన్సిలర్లకు హితబోధ చేసేందుకు మాజీ మంత్రి, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. రాజులను వీడి వాస్తవాలను గ్రహించాలని కౌన్సిలర్లకు వారి కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 29న నిర్వహించే అవిశ్వాస తీర్మానం రోజున పార్టీకి వ్యతిరేకంగా చెతులెత్తే పరిస్థితి లేదన్నది సమాచారం. రాజులు ఎన్ని శిబిరాలు నిర్వహించినా ధర్మమే గెలుస్తుందని, చివరకు రాజులకు భంగపాటు తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, స్థానిక సీనియర్ కౌన్సిలర్లు రేజేటి ఈశ్వరరావు, చోడిగంజి రమేష్ నాయుడు కౌన్సిల్‌ను కాపాడుకునే అంశంపై న్యాయవాదుల సూచనల మేరకు ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్సీ బొత్స, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుల సలహాలు పాటిస్తున్నారు. టీడీపీ కోరి తెచ్చుకున్న ఈ ముప్పుతో వారే అవస్థల పాలవుతారని, దగాకు పాల్పడిన కౌన్సిలర్లు కర్మ సిద్ధాంతానికి లోబడి ముప్పు ఎదుర్కోక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు, నాయకులతో చర్చిస్తున్న మాజీ ఎమ్మెల్యే శంబంగి నిలకడలేని నైజం.. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన నాలుగో వార్డు కౌన్సిలర్ అమ్మన్నమ్మ నిజాయితీగా ఉన్నా ఆమె కుమారుడు మాత్రం నిలకడలేని నైజం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. అటుఇటు రెండు వైపులా ఉన్నట్టు నటించడంపై ఆ వార్డు ప్రజలు మండిపడుతున్నారు. నీచపుబుద్ధిని పక్కన పెట్టాలంటూ వార్డు పెద్దలు హెచ్చరికలు చేసినట్టు సమాచారం. టీడీపీ నిర్వహిస్తున్న శిబిరంలో కొంత మంది మహిళా కౌన్సిలర్లను వారి భర్తలు, కుమారులకు చెప్పకుండా నేరుగా పలు ప్రాంతాలకు తిప్పుతుండడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండగా సుజయ్‌కృష్ణరంగారావు నచ్చచెబుతున్నట్టు తెలిసింది. టీడీపీకి నమ్మకంగా ఉంటున్న వారిలో ఇద్దరు వైఎస్సార్ సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై టీడీపీ కూడా వారిని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. సంవత్సరం కూడా లేని పదవి కోసం అర్రులు చాచడం, డబ్బుకు కక్కుర్తిపడి సొంత వార్డులోని ఓటర్ల వద్ద పరువు పోగొట్టుకోవడం, ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడం అవసరమా అన్న ఆలోచనతో కొందరు కౌన్సిలర్లు రాజుల చెర నుంచి బయటకు వచ్చేందుకు దారులు వెతుకుతున్నారనే ప్రచారం సాగుతోంది. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, నేతేటి ప్రశాంత్‌లు అమ్మవారికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.చెరువులో పడి వ్యక్తి మృతిగంట్యాడ: మండలంలోని నరవ గ్రామంలో గల ఎర్ర చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మంగళవారం ఉదయం చెరువులో మృతదేహం తేలడంతో అటువైపు వెళ్లిన గ్రామస్తులు చూసి పోలీసులకు సమచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి మృతుడిని నరవగ్రామానికి చెందిన గేదెల అప్పలనాయుడుగా గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: కోరుకొండ రైల్వేస్టేషన్ ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం పడి ఉన్నట్లు విజయనగరం రైల్వే పోలీసులకు సమాచారం లభించింది. ఇందుకు సంబంధించి జీఆర్పీ సిబ్బంది తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. విజయనగం–కోరుకొండ రైల్వేలైన్ ప్రాంతం గుండాలపేట వద్ద 45 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది గుర్తించారు. అయిదున్నర అడుగుల పొడవు కలిగి ఉండి బూడిద రంగు చొక్కా, బిస్కెట్ రంగు ఫ్యాంట్ ధరించిన వ్యక్తి రైలు పట్టాలపై పడి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చిన మేరకు జీఆర్పీ హెచ్‌సీ క్రష్ణారావు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గుర్తించిగలిగే వారు ఎవరైనా ఫోన్ 9490617089, 9441013330, 08912883218 నంబర్లను సంప్రదించాలని కోరారు. వెట్టిచాకిరీ ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహంవిజయనగరం అర్బన్: బాపట్ల జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంకకు చెందిన ఎస్టీ సామాజిక వర్గ దంపతుల వెట్టిచాకిరీ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర నివేధిక పంపాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు ఆదేశించారు. తమతో వెట్టిచాకిరీ చేయుస్తున్నారంటూ నంబూరి పద్మ, అగ్రి దంపతులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన బాపట్ల కలెక్టర్‌ను చైర్మన్ అభినందించారు. వెట్టిచాకిరీ చేయించడంతో పాటు, ఆ దంపతులను అమ్మకానికి పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు పేర్కొన్నారు. -
పన్ను వసూళ్లపై దృష్టి పెట్టండి
విజయనగరం అర్బన్: నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఆర్ఎస్డీటీలు, మండల సర్వేయర్లతో కలెక్టరేట్లో మంగళవారం రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపన్ను, పీజీఆర్ఎస్ గ్రీవెన్స్, 22ఏ పెండింగ్ దరఖాస్తులు, రీవెరిఫికేషన్ ఆఫ్ హౌస్ సైట్స్, రెగ్యులరైజేషన్ ఆఫ్ హౌస్ సైట్స్, హౌస్‌సైట్స్ అసైన్మెంట్, ఫ్రీహోల్డ్ స్టేటస్, ఏపీసేవా సర్వీసెస్, రీసర్వే రెండవ దశపై మండలాల వారీగా సమీక్షించారు. పీజీఆర్ఎస్ వినతులు పెండింగ్ లేకుండా చూడాలని, అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్ అధికారులు సత్యవాణి, రామ్మోహన్, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ వినతులు పెండింగ్ ఉండకూడదు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ -
డిప్యూటీ సీఎం తీరుపై నిరసన
శృంగవరపుకోట: గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు వినిపించేందుకు ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ వాసులు సోమవారం మండుటెండలో విశాఖ– అరకు రోడ్డులో ఎదురు చూశారు. ఆయన కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోవడంతో నిరాశ చెందారు. దీనికి నిరసనగా బొడ్డవర నుంచి ఎస్.కోట వరకు మంగళవారం పాదయాత్రగా వచ్చి ఎండీఓకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు గాడి అప్పారావు, మద్దిల రమణ, ధారపర్తి సర్పంచ్ సన్నిబాబు, మాజీ సర్పంచ్ ఎం.బుచ్చన్న, ఎర్రయ్య, అరుణ్, జోషి తదితరులు మాట్లాడుతూ గిరిజన గ్రామాల ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదన్నారు. రోడ్లు, కాలువలు, తాగునీరు, విద్య, వైద్యం వంటి సదుపాయాలు అక్కరకు రావడంలేదని వాపోయారు. గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేవారే కరువయ్యారన్నారు. ఎన్నికల సమయంలో గిరిజనులపై చూపించే ప్రేమ తర్వాత నేతల్లో కరువవుతోందన్నారు. గిరిజనుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించేవారే లేరని వాపోయారు. పాదయాత్రగా వెళ్లి ఎంపీడీఓకు వినతి -
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బంగారు పతకాలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): అంతర్జాతీయస్థాయిలో జరిగిన పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్ క్రీడల పోటీల్లో గరివిడి పట్టణానికి చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. ఏప్రిల్ 3 నుంచి 7వరకు ఎస్బీకేఎఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేపాల్ దేశంలో జరిగిన ఈ క్రీడాపోటీల్లో మహిళల విభాగంలో పవర్ లిఫ్టింగ్ క్రీడాంశంలో రాజమహంతి రమణిప్రియ 330 కేజీల బరువును ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచి బంగారుపతకం, షాట్‌ఫుట్, డిస్క్‌త్రో పోటీల్లో కూడా ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించింది. పురుషుల విభాగంలో పవర్‌లిఫ్టింగ్‌లో వైవీ.ప్రసాద్ 400 కేజీల బరువును ఎత్తి ప్రథమ స్థానంలో స్వర్ణ పతకం, అలాగే 50 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకం,100 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో రజత పతకం సాధించాడు. -
24.63
గ్యాస్ భారం రూ.కోట్లు విజయనగరం ఫోర్ట్: ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది మరింత భారం కానుంది. జిల్లాలో మొత్తం 7,04,273 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు 1,85,254, సీఎస్ కనెక్షన్లు 43,287, ఉజ్వల కనెక్షన్లు 1,29,277, జనరల్ కనెక్షన్లు 3,46,455 ఉన్నాయి. ప్రస్తుతం ఉజ్వల పథకం గ్యాస్ సిలిండర్ ధర రూ.520 ఉంది. రూ.50 పెరగడంతో ధర కాస్తా రూ.570కి చేరింది. సాధారణ కనెక్షన్ల గ్యాస్ సిలిండర్ ధర రూ.829 ఉండేది. రూ.50 పెంపుతో 879కి చేరింది. ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఏడాదికి సగటున ఏడు గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తే ఒక్కొక్కరిపై రూ.350 అదనపు భారం పడుతుంది. ఈ లెక్కన ఏడాదికి జిల్లా వినియోగదారులపై రూ.24.63 కోట్ల భారం పడనుంది. ఇబ్బంది పడతాం ఇప్పటికే పప్పులు, కూరగాయలు, నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు ఇప్పడు గ్యాస్ ధర పెంచడంతో మా లాంటి పేదవారిపై మరింత భారం పడుతుంది. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. – బోడసింగి సీత, బోడసింగిపేట గ్రామం, బొండపల్లి మండలం జీవించడం కష్టతరం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల జీవించడం కష్టతరంగా మారింది. నూనె ధరలు పేదలు కొనుగోలు చేయ లేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం గ్యాస్ ధర పెంచడం వల్ల మాలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. – ఎస్.రామునాయుడు, గ్యాస్ వినియోగదారులు, పెదవేమలిగ్రామం, గంట్యాడ మండలం -
తైక్వాండో బ్లాక్ బెల్ట్ పరీక్షలో విజేతలకు అభినందన
విజయనగరం: జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్‌బెల్ట్ టెస్ట్‌లో అర్హత పొందిన క్రీడాకారులను హోటల్ జీఎస్ఆర్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పలువురు అభినందించారు. ఇటీవల నిర్వహించిన అర్హత పరీక్షలో వి.రోహిణి, చరిష్మా, కె.నిత్య, డి.ప్రియవల్లి, దేవన్ ఫస్ట్ డాన్ బ్లాక్‌బెల్ట్ సాధించగా..వి కుశాల్, పి.పునీత్, ఎస్.సాత్విక్, వై. ముఖేష్, టి.సంకీర్తన, వి.యశ్మిత, సూర్య, కె.సాహిత్య సెకెండ్ డాన్ బ్లాక్ బెల్ట్ టెస్ట్‌లో అర్హత సాధించారు. వారికి జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, సత్య ఐటీఐ విద్యాసంస్థల కరస్పాండెంట్ అల్లు శ్రీకాంత్ సర్టిఫికెట్లు ప్ర దానం చేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డి.ప్రసాద్, రాజేష్, కోచ్ యశస్విని పాల్గొన్నారు. -
సిబ్బంది అవసరాల కోసం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
విజయనగరం క్రైమ్: పోలీస్‌సిబ్బంది అవసరాలకు అనుగుణంగా కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పని చేస్తోందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వార్షిక సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎస్పీతోపాటు ఏఎస్పీ సౌమ్యలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి అవసరార్థం ఆర్థికపరంగా ఆదుకోవడానికి క్రెడిట్ సొసైటీ ఏర్పాటు జరిగిందన్నారు.తక్కువ వడ్డీకి కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు పొందవచ్చన్నారు. కుటుంబ అవసరాలైన పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాల కోసం సిబ్బంది పే స్కేల్ ఆధారంగా రుణాలు పొందవచ్చని చెప్పారు. కాగా 2024–2025 ఆదాయ వ్యయాల,సంక్షేమానికి సొసైటీ తీసుకున్న, అమలు చేసే చర్యలను సభ్యలకు ఎస్పీ తెలియజేశారు. సిబ్బంది తీసుకున్న సభ్యత్వం,సర్వీస్ ఆధారంగా ఇప్పటికే రూ. మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. వెల్ఫేర్‌లో భాగంగా కో ఆపరేటివ్ సభ్యత్వం కలిగిన టెన్త్, ఇంటర్ చదివిన సిబ్బంది పిల్లలకు రూ.లక్షా,87 వేల 500 స్కాలర్షిప్లను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పిల్లలు ఎక్కడ చదువుతున్నదీ?ఎంత ర్యాంక్ తెచ్చుకున్నారు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎస్బీ సీఐ చౌదరి, ,ఏఆర్ ఆర్ఐ గోపాలనాయుడు కో ఆపరేటివ్ సెక్రటరీ నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు రామకృష్ణ, ఈశ్వరరావు, విజయ్‌చందర్, చిన్నారావులతో పాటు,పోలీస్ అడ్హాక్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ డీపీఓలో కో ఆపరేటివ్ సొసైటీ వార్షిక సమావేశం -
డ్రగ్స్ నియంత్రణకు సమన్వయంతో పని చేయాలి
విజయనగరం క్రైమ్: డ్రగ్స్ నియంత్రణకు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఏఎస్పీ పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్య రహిత జిల్లాగా విజయనగరం ఉండేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం ఈగిల్ అనే ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వింగ్‌కు ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క శాఖ తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. గంజాయి వ్యసనానికి అలవాటు పడిన వారిని గుర్తించి సన్మార్గంలో పెట్టేందుకు అందరూ కృషి చేయాలని ఏఎస్పీ సౌమ్యలత సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం, ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి శ్రీనాథుడు, డిజేబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నపూర్ణ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు లలిత, త్రినాథ్ రావు, డిస్ట్రిక్ సర్వేలైన్స్ అధికారి డా.సత్యనారాయణ,సెట్విజ్ సీఈఓ సోమేశ్వరరావు,ఈగిల్ జేఓ ఎం.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదనపు ఎస్పీ సౌమ్యలత -
సైబర్ నేరాలపై అప్రమత్తం
పాలకొండ: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు హితవు పలికారు. ఇటీవల వీరఘట్టం మేజర్ పంచాయతీతో పాటు, విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో జరిగిన సైబర్ నేరాలను తమ సిబ్బంది ఛేదించిన సందర్బంగా సోమవారం పాలకొండ సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ తెలియజేసిన కేసుల వివరాలిలా ఉన్నాయి.. గత నెల 29న సంతకవిటి మండలానికి చెందిన బొద్దాన సుధాకర్ నుంచి రూ.12 వేలు, కోరాడ సంతోష్‌కుమార్ నుంచి రూ.15 వేలతో పాటు గత నెల 31న వీరఘట్టం మేజర్ పంచాయతీకి చెందిన ఎం.ప్రతాప్ నుంచి రూ.28 వేలు ఫోన్‌పే ద్వారా కాజేసిన సైబర్ నేరగాడిని పోలీసులు విజయవాడలో పట్టుకున్నారు. తొలుత సైబర్ నేరగాడు బాధితులకు 7569341175 అనే ఫోన్ నంబర్ ద్వారా కాల్స్ చేయడంతో ఆ నంబర్‌ను ట్రాక్ చేసి విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు వీరఘట్టానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ వి.చంద్రశేఖర్, కానిస్టేబుల్ వి.నవీన్‌లను బృందంగా ఏర్పాటు చేసి విజయవాడకు పంపించారు. వారిని సీఐ ఎం.చంద్రమౌళి, వీరఘట్టం ఎస్సై జి.కళాధర్ మానిటరింగ్ చేస్తూ సైబర్ నేరగాడి ఫోన్ ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు ఆ వివరాలను క్రైమ్ టీమ్‌కు తెలియజేశారు. ఈ విధంగా నాలుగు రోజుల పాటు విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఫోన్‌నంబర్ ఆధారంగా గాలించి సైబర్ నేరస్తుడు మున్న వెంకట నవీన్ ఆచూకీ గుర్తించి విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ ప్రస్తుతం వీరఘట్టం, సంతకవిటి మండలాల్లో సైబర్ నేరాలకు పాల్పడిన మున్న వెంకట నవీన్ బీటెక్ చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై ఇలా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడి డగ్గర నుంచి రూ.55 వేలు రికవరీ చేశారు. నిందిత వ్యక్తి గూగుల్‌లో వ్యాపారులు, పెద్ద పెద్ద వర్తకుల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఎస్సై నంటూ, ఏఎస్సై నంటూ, కానిస్టేబుల్ నంటూ ఫోన్లు చేసి వారిని నమ్మించి ఫోన్ పే ద్వారా డబ్బులు కాజేశాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని విచారణ చేసి పాలకొండలో కోర్టులో హాజరు పరిచారు. పోలీస్ సిబ్బందికి అభినందనలు.. సైబర్ నేరాన్ని విజయవాడ వెళ్లి ఛేదించిన వీరఘట్టం హెడ్ కానిస్టేబుల్ వి.చంద్రశేఖర్, కానిస్టేబుల్ వి.నవీన్‌లను, మానిటరింగ్ చేసిన వీరఘట్టం ఎస్సై జి,కళాధర్, సీఐ ఎం.చంద్రమౌళిలను డీఎస్పీ రాంబాబు అభినందించారు. సమావేశంలో పాలకొండ ఎస్సై ప్రయోగమూర్తి పాల్గొన్నారు. పాలకొండ డీఎస్పీ రాంబాబు హితవు -
బైక్‌లు ఢీకొని మహిళకు గాయాలు
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటణలో ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. సోమవారం కురుపాం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలం జి.శివడ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై బి.జీవిరావు, భార్య ప్రియతో కలిసి కురుపాం వస్తుండగా..కురుపాం నుంచి చందు అనే యువకుడు ద్విచక్రవాహనంపై గుమ్మలక్ష్మీపురం వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలోని మూలిగూడ జంక్షన్ వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రియకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన ప్రియను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా వైద్యసేవలు అందించారు. సంఘటనపై కురుపాం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
పార్వతీపురంటౌన్: పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీదారుల నుంచి 110 అర్జీలు స్వీకరించారు. సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని అర్జీదారులకు భరోసా కల్పించారు. వినతులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యతగల ఎండార్స్మెంట్ అందజేయాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన వినతుల్లో కొన్ని ఇలా.. ● కురుపాం మండలం అగంగూడ గ్రామంలో 56 కుటుంబాల వారు తాగునీటి కోసం మూడు కిలోమీటర్ల దూరంలో వేరే ప్రాంతానికి వెళ్లి నీరు తీసుకువస్తున్నామని, వేసవి కారణంగా బావినీరు ఇంకిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అర్జీ చేశారు. ● కొఠియా గ్రామాలైన పగలు చెన్నూరు, పట్టుచెన్నూరు, కొదమ, గంజాయిభద్ర గ్రామాల్లో విద్యార్ధులకు తెలుగు భాష అర్ధం కాకపోవడంతో జాతాపు వలంటీర్లను నియమించాలని అర్జీ అందజేశారు. ● పాచిపెంట మండలం ములయ కంబూరు పంచాయతీలో ములగపాడు, కందివలస, కాకులమామిడి గ్రామాలకు లాగే కీరంగి పంచాయతీలోని వంకమామిడి, కప్పరాయి గ్రామాలకు తాగునీటి బోర్లు మంజూరు చేయాలని విన్నవించారు. ● కురుపాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన కాలువలు, రహదారి పనులు పూర్తి చేసి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు దరఖాస్తు అందజేశారు. ● జియ్యమ్మవలస మండలం బూరిరామినాయుడు వలసలో సామాజిక భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు వినతి అందజేశారు. ● వందశాతం వైకల్యంతో మంచాన పడిఉన్న తనకు ఎన్టీఆర్ భరోసా కింద రూ. 15వేలు పింఛన్ అందజేయాలని వీరఘట్టం మండలం దశమంతపురం గ్రామానికి చెందిన ఎన్. విజయకుమార్ దరఖాస్తు అందజేశారు. కార్యక్రమంలో జేసీ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్డీఏ పీడీ సుధారాణి, డ్వామా పీడీ రామచంద్రరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జవాబుదారీ తనంతో పిటిషన్లకు పరిష్కారం పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి జవాబుదారీ తనంతో వ్యవహరించి పిటిషన్లకు పోలీసు శాఖ పరంగా పరిష్కారం చూపించడనున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల దగ్గర 9 అర్జీలను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త, అత్తారింటి వేధింపులు, ఆన్లైన్ మోసాలు, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ప్రేమ పేరుతో మోసాలు ఉన్నాయి. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం తదితరులు ఉన్నారు. పీజీఆర్ఎస్కు 56 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 56 వినతులు వచ్చాయి. పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి వినతులు స్వీకరించారు. చెక్‌డ్యాం నిర్మించాలని కుమ్మరిగుంటకు చెందిన శంకరరావు కోరారు. సీసీ రహదారి నిర్మించాలని కోతాంకు చెందిన బిడ్డిక శ్రీను విన్నవించారు. గురండికి చెందిన రవికుమార్ చేసిన రోడ్డుపనులకు బిల్లులు చెల్లించాలని కోరారు. లక్కాయిగూడ–శిలిగాంకు నూతన రహదారి నిర్మించాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. సన్నాయిగూడ గిరిజనులు పవర్‌వీడర్ ఇప్పించాలని విన్నవించారు. సీసీ డ్రైన్స్ నిర్మించాలని దిగువదరబ గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, పీహెచ్‌వో ఎస్వీ గణేష్, ఏటీడబ్ల్యూవో మంగవేణి, డీఈ సింహాచలం పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పీజీఆర్ఎస్కు 118 వినతులు -
8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
నెల్లిమర్ల: మండలంలోని బుచ్చన్నపేట జంక్షన్లో ఉన్న కురమా కమల ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల(19 బ్యాగులు) పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారికి అందిన సమాచారం మేరకు ఆ విభాగం ఎస్సై రామారావు సిబ్బందితో కలిసి దాడిచేశారు. పట్టుబడిన బియ్యాన్ని బొప్పడాం రేషన్ డీలర్‌కు అప్పగించినట్లు సీఎస్‌డీటీ శంకరరావు తెలిపారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం కలిగి ఉన్న వ్యక్తిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పెదబొండపల్లిలో.. పార్వతీపురం రూరల్: తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లిలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లగేజీ ఆటోను అదుపులోకి తీసుకుని 10 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ డి. సింహాచలం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం ముగడ గ్రామం నుంచి వయా పెదబొండపల్లి మీదుగా ఒడిశాలోని అలమండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో దారి కాచి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనలో పీడీఎస్ బియ్యంతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పార్వతీపురం రూరల్ పోలీసులకు అప్పగించామన్నారు. దాడుల్లో పార్వతీపురం సీఎస్‌డీటీ ఎం.రాజేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయిలో రేగిడి పాఠశాల ప్రతిభరేగిడి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయస్థాయిలో చక్కని ప్రతిభ కనబరిచింది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్ సెల్, న్యూఢిల్లీ అటల్ టింకరింగ్ ల్యాబ్, నీట్ ఆయోగ్‌తో సంయుక్తంగా ఆన్లైన్లో 2024–25 ఏడాదికి గాను స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు బూరవెల్లి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో సృజనాత్మకంగా రూపొందించిన సహజసిద్ధమైన హెయిర్‌డై ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. దేశంలో మొదటి 100 స్థానాల్లో ఈ ప్రొజెక్టుకు చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రొజెక్టులు ఎంపికకాగా అందులో రేగిడి ప్రొజెక్టు ఒకటి. ఈ ప్రొజెక్టును మరింత అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం మొదటి విడతగా రూ.35వేలు నిధులు విడుదల చేసిందని ఉపాధ్యాయిని ఉమా మహేశ్వరి తెలిపారు. ఈ ప్రాజెక్టును జూలై 29న ఢిల్లీలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, సైన్స్ అధికారి రాజేష్, జిల్లా సైన్స్‌ఫోరం ప్రతినిధులు సన్యాసినాయుడు, వేణుగోపాల్ తదితరులు ఉమామహేశ్వరిని అభినందించారు. -
ప్రతి అర్జీకి పరిష్కారం చూపడమే ధ్యేయం
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ● ప్రజాసమస్యల పరిష్కార 187 వినతులువిజయనగరం అర్బన్: ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికకు అర్జీదారుల తాకిడి పెరిగింది. జిల్లా కేంద్రాలకు అర్జీదారులు రావాల్సిన పని లేకుండా గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ సదస్సుల పేరుతో దాదాపు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల ప్రభావం కనబడలేదు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 187 వినతులు అందాయి. వాటిలో అత్యధికంగా 88 వినతులు రెవెన్యూ శాఖకు చెందినవే ఉన్నాయి. అర్జీల స్వీకరణ ప్రక్రియలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తోపాటు కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, ప్రమీల గాంధీ పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్: ఎస్పీ వకుల్ జిందల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యలపరిష్కార వేదికకకు 42 ఫిర్యాదులు. అందాయి. భూతగాదాలు, కుటుంబసమస్యలు, మోసాలకు చెందిన సమస్యలతో ఫిర్యాదు దారులు ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చారు. ఫిర్యాదు దారుల సమస్యలను సావధానంగా విన్న ఎస్పీ వకుల్ జిందల్ ఫిర్యాదుల్లో ఉన్న విషయాలను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫిర్యాదుదారుల ముందే ఫోన్‌చేసి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అంతేకాకుండా వీడియో కాల్ చేసి మరీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులకు ఏడు రోజుల్లో పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత పాల్గొన్నారు. -
త్వరలో శాటిలైట్ వ్యవస్థ పటిష్టం
పార్వతీపురం టౌన్: రాష్ట్రంలోని అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా శాటిలైట్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విపత్తులు, అగ్నిమాపక శాఖ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల అగ్నిమాపక కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.250కోట్లతో రాష్ట్రంలోని అగ్నిమాపక కేంద్రాల ఆధునికీకరణకు త్వరలోనే శ్రీకారం చుట్టేండుకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 17 గ్నిమాపక భవనాల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. అందులో పార్వతీపురం, పాలకొండ అగ్నిమాపక కేంద్రాల నరుద్ధరణకు సంబంధించి ఒక్కో కేంద్రానికి రూ. 2.5కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎఫ్ఓ రంజన్ రెడ్డి, డీఎఫ్ఓ శ్రీనిబాబు, అగ్నిమాపక అధికారి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. విపత్తులు, అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
క్షేత్ర స్థాయిలో శాఖాపరమైన విధులను గుర్తించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాకు శిక్షణ నిమిత్తం కేటాయించిన 36మంది ప్రొబేషనరీ ఎస్సైలు సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారితో ఎస్పీ మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు. పోలీస్‌శాఖలో అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలను ముందుగా అభినందించారు. క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లను శిక్షణ నిమిత్తం వారికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజా యితీతో పారదర్శకంగా జవాబుదారీ తనం పాటిస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి పోలీస్‌శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని కోరారు. కేటాయించిన పోలీస్‌స్టేషన్ పరిఽ దిలో ఉన్న గ్రామాలను తరచూ సందర్శిస్తూ ము ఖ్యంగా ఏఓబీ ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజలతో మమేకం అవాలని సూచించారు. కుస్తీలో కొండవెలగాడ విద్యార్థులకు పతకాలు నెల్లిమర్ల: మండలంలోని కొండవెలగాడ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పతకాలు సాధించారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు రాజమండ్రిలో జరిగిన జూనియర్ కుస్తీ పోటీల్లో ఎల్ చైతన్య 44 కిలోల విభాగంలో బంగారు పతకం, ఎం.రణదీప్ 48 కిలోల విభాగంలో రజత పతకం, ఎస్ రామాంజనేయులు 47 కిలోల విభాగంలో రజత పతకం కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి. జ్ఞానశంకర్, పీడీ పతివాడ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు అభినందించారు. -
మిస్టర్ ఇండియా పారా విజేతకు సత్కారం
విజయనగరం: ఈ నెల 5,6 తేదీలలో ఒడిశాలోని సంబల్పూర్లో జరిగిన మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో పారా బిల్డర్ ఈదుబిల్లి సూర్యనారాయణ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రశంసించారు. ఈ మేరకు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సూర్యనారాయణను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెరకముడిదాం మండలం వంగర గ్రామానికి చెందిన సూర్యనారాయణ జాతీయస్థాయిలో రాణించి మెడల్స్ సాధించడం జిల్లాకు గర్వకారణమని, భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి క్రీడల్లో జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచాలని ఆకాంక్షించారు. పారా క్రీడలకు సంబంధించిన వివరాలను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ మంత్రికి వివరించారు. పారా క్రీడాకారులకు సహకారం అందేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
కొఠియా గ్రామాల్లో పర్యటనకు భద్రత కల్పించండి
పార్వతీపురంటౌన్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో పర్యటించనున్నామని తమకు భద్రత కల్పించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాస్పద కొఠియా పరిధిలో గల 21 గ్రామాల్లో ఆందోళన చెందుతున్న గిరిజనులందరికీ మద్దతుగా ఉండి పర్యటన చేపడతామని తెలిపారు. ఒడిశా ప్రభుత్వం అక్రమంగా చొరబడి గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంగన్వాడీ భవనాలను కూల్చివేసి దిగువ శెంబి వద్ద పవర్ ప్రాజెక్టు నిర్మిస్తోందని, దీనిని అడ్డుకున్న గిరిజనులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖాధికారులు, ఫారెస్టు అధికారులు, 108 వాహనాలను ఒడిశా అధికారులు, పోలీసులు వివాదాస్పద గ్రామాల్లోకి రానివ్వకపోయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో పౌరవేదిక ప్రధాన కార్యదర్శి జలంత్రి రామచంద్ర రాజు, కార్యదర్శి తుమ్మగంటి రామ్మోహనరావు, మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు, గొర్లి సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌కు లోక్‌సత్తా వినతిపత్రం -
వస్తారా? ముఖం చాటేస్తారా?
● ప్రజాప్రతినిధుల ముందుకు రాలేకపోతున్న కూటమి ఎమ్మెల్యేలు ● గత మూడు జెడ్పీ సమావేశాల్లో ఒకసారి మాత్రమే హాజరు ● మళ్లీ 9న జెడ్పీ సమావేశానికి ఆహ్వానం సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాసంక్షేమం, అభివృద్ధి అంశాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి జెడ్పీ సమావేశాలు మంచి అవకాశం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలే ఈ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. మూడుసార్లు జెడ్పీ సమావేశాలు జరిగితే ఒక్కసారి మాత్రమే కొంతమంది ముఖం చూపించారు. ఇక శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన... ఈ నలుగురూ ఒక్కసారి కూడా ఈ సమావేశాలకు హాజరుగాకపోవడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో ప్రజలకు ప్రాతినిథ్యం వహించే ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఈ సమావేశాల్లో ప్రజల సమస్యలపై గళం వినిపిస్తుంటారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వాటిని ఏవిధంగా పరిష్కరిస్తారో చెబితే ఆ సమాచారం ప్రజలకు చేరుతుంది. కానీ అధికార టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం లేచింది మొదలు అక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షానికి సూక్తులు చెప్పే ఈ నాయకులు... క్షేత్రస్థాయిలో అంతే కీలకమైన జెడ్పీ సమావేశాలకు మాత్రం డుమ్మా కొట్టేస్తున్నారు. మళ్లీ ఈనెల 9వ తేదీన జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానాలు పంపారు. ఈసారైనా హాజరవుతారా? లేదంటే ముఖం చాటేస్తారా? అనే చర్చ నడుస్తోంది. ప్రశ్నలు ఎదుర్కోలేకేనా? సార్వత్రిక ఎన్నికల సమరంలో గట్టెక్కడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన నాయకులు సూపర్ సిక్స్‌తో పాటు మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించారు. అరకు ఎంపీ మినహా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు, విజయనగరం ఎంపీ టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోనే చేరా యి. అంటే దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత వారిదే. కానీ ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. కేవలం సామాజిక పింఛన్ల పెంపు హామీ ఒక్కటే ఇప్పటివరకూ కూటమి ప్రభుత్వం అమలుచేసింది. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీ కూడా ఒక్క సిలిండర్‌కే సరిపెట్టారు. ఉగాది నుంచి అమలుచేస్తామన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తుస్సుమనిపించారు. తల్లికి వందనం ఏప్రిల్ నుంచి, రైతుభరోసా పెట్టుబడి సాయం మే నెల నుంచి అమలుచేస్తామని చెబుతున్నా బడ్జెట్లో నిధుల కేటాయింపు కనిపించలేదు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలు మొదలయ్యాయి. రోడ్ల మరమ్మతులు అంతంతమాత్రమే. గోకులం షెడ్లకు బిల్లులు ఇవ్వలేదు. మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. వీటన్నింటిపై ఎంపీపీ లు, జెడ్పీటీసీలు ప్రశ్నించడానికి సిద్ధమవుతు న్నారు. వీటికి సమాధానం చెప్పడానికి కూటమి పార్టీ ప్రజాప్రతినిధులు ఈసారైనా జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు హాజరుకావాలి. ఖాళీగా ఉన్న సీట్లు (ఫైల్) జెడ్పీ సమావేశం (ఫైల్) జిల్లాపరిషత్‌లో కీలకమైన స్థాయీసంఘ సమావేశాలకు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మె ల్యేలు, ఎంపీ, మంత్రులను అధికారులు ఆహ్వానించారు. కానీ ఒక్కరూ హాజరుకాలేదు. సీజనల్ వ్యాధులు, రైతులకు విత్తనాల సరఫరా తదితర కీలక అంశాలపై సమీక్ష జరిగినా అధికార పార్టీ తరఫున సమాధానం చెప్పేవారే కరువయ్యారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఉమ్మ డి విజయనగరం జిల్లాకు చెందిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయు డు, ఎమ్మెల్యేలు లోకం మాధవి, పూసపాటి అదితి గజపతిరాజు, తోయక జగదీశ్వరి, బోనె ల విజయచంద్ర మాత్రమే హాజరయ్యారు. -
32 వేల మంది ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: జిల్లాలో వచ్చే మార్చి నాటికి గృహనిర్మాణ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని హౌసింగ్ ఏఈలను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. పీఎంఏవై 2.0 కొత్త గృహాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 32 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని, వారికి ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో గృహనిర్మాణ ప్రక్రియ, కొత్త ఇళ్ల మంజూరుపై కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడా రు. పీఎంఏవై (అర్బన్) 1.0 కింద మంజూరైన ఇళ్లలో 11,648 ఇళ్లలో 3,921 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 7,727 ఇళ్ల నిర్మాణాలను వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభు త్వం ఇటీవలే అదనపు సాయం కింద ఎస్సీ, బీసీల కు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, అదివాసీ గిరిజన తెగలకు రూ.లక్ష చొప్పున మంజూరు చేసిందని, ఈ సాయాన్ని లబ్ధిదారులందరికీ వర్తింప జే యాలని చెప్పారు. మున్సిపాల్టీల్లో సుమారు 1,500 మంది లబ్ధిదారులు ఉన్నారని వీరికి ఈ అదనపు సాయాన్ని అందించేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించాలని సూచించారు. వృద్ధిరేటు పెరగాలి విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ అనుబంధ రంగా ల్లో 12.97 శాతం ఉన్న వృద్ధి రేటును ఈ ఏడాదిలో 16.32 శాతానికి పెంచాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయంలో ఎటువంటి చర్యలు చేపట్టాలో వ్యవసాయాధికారులు మండలాల వారీగా ప్రణాళిక రుపొందించాలన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ అనుబంధ అధికారులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రధానంగా వరి పండుతోందని, ఇతర ప్రత్యామ్నా య పంటల సాగుపైనా దృష్టి పెట్టాలన్నారు. జిల్లా లో 25 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగువు తోందని, ఈ విస్తీర్ణాన్ని కూడా పెంచాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, సీపీఓ బాలాజీ పాల్గొన్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బబిత
విజయనగరం లీగల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎం.బబితను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ మూడేళ్లుగా పనిచేస్తున్న బి.సాయికళ్యాణ్ చక్రవర్తిని గుంటూరుకు బదిలీచేసింది. జిల్లా ప్రధాన న్యాయ మూర్తిగా సాయికళ్యాణ్ చక్రవర్తి న్యాయపరిపాలనలో తమదైన ముద్రవేసుకున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్‌లపై అవగాహన కల్పిస్తూ పెండింగ్ కేసుల పరిష్కారానికి విశేష కృషిచేశారు. కొత్త కోర్టు మంజూరు, నిర్మాణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. సీనియర్ సిటిజన్స్ సౌకర్యార్థం కోర్టులో లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. కోర్టు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. విరివిగా న్యాయ అవగాహన సదస్సులను ఏర్పాటుచేసి ప్రజలను చైతన్యవంతులను చేశారు. చట్టాలపై అవగాహన కల్పించారు. బాధ్యతల స్వీకరణ విజయనగరం లీగల్: ప్రభుత్వ న్యాయవాదిగా రెడ్డి సూర్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అంబేడ్కర్‌ను ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంతవరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసిన టి.వి.శ్రీనివాసరావు పదవీ కాలం ముగిసింది. మైనార్టీ వెల్ఫేర్ అధికారిగా లక్ష్మీనారాయణ విజయనగరం టౌన్: విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల మైనారిటీ వెల్ఫేర్ అధికారిగా పీఎన్వీ లక్ష్మీనారాయణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఏపీ మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ మైనార్టీ వెల్ఫేర్ అధికారిగా, మైనార్టీ కార్పొరేషన్ ఈడీగా ఆయన అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా మైనార్టీ అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. -
●డోలీలో ప్రసవ వేదన..
చిత్రంలో డోలీలో తరలిస్తున్న నిండు గర్భిణి పేరు సోముల బోడమ్మ. ఆమెది ఎస్.కోట మండలంలోని చిట్టింపాడు గిరిశిఖర గ్రామం. సోమవారం పురిటినొప్పులు ఆరంభం కావడంతో భర్త రాముతో పాటు కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. గ్రామానికి వాహనం వచ్చేదారిలేక.. రాళ్ల దారిలో 10 కిలోమీటర్ల మేర డోలీలోనే బొడ్డవర వరకు గర్భిణిని తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి వాహనంలో తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటనపై గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ అడవితల్లి బాట పట్టిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.. తల్లుల ప్రసవ వేదనను ఆలకించాలని కోరారు. ఉత్తుత్తి రోడ్లు ప్రారంభంతో ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మన్యంలో ప్రతి పల్లెకు పక్కారోడ్డు అంటూ ఇచ్చిన హామీని చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు. – ఎస్.కోట -
ఎంటీయూ–1121 రకం సాగుకే మొగ్గు
● ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్ విజయనగరం ఫోర్ట్: జిల్లాలో 73 శాతం మంది రైతులు ఎంటీయూ–1121 (శ్రీధృతి) వరి రకం సాగుకే మొగ్గుచూపుతున్నట్టు ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్ తెలిపారు. విజయనగ రం గాజులరేగ ఏరువాక కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు రైతులు ఎంటీయూ–1121 రకానికి ప్రత్యామ్నాయ రకాలు అందించాలని వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేశారన్నారు. ఎంటీయూ–1224, ఎంటీయూ–1210, ఎంటీయూ– 1310, ఎంటీయూ–1321 వరి రకాలు జిల్లా నేలల కు అనుకూలమని, అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. ఎంటీయూ–1310, 1321 రకాలు మధ్యస్థ సన్న రకాలుగా పేర్కొన్నారు. ఎంటీయూ –1121 రకం ఎకరానికి 26 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఎంటీయూ–1310, 1321 రకాల సాగుతో 33 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎంటీయూ–1121 వరి రకం స్థానంలో ఎంటీయూ–1310, 1321, 1224 రకాలను 10 శాతం మేర సాగుకు ప్రోత్సహిస్తామన్నారు. వరిలో వెదపద్ధతే మేలని, సాగుఖర్చు ఎకరాకు రూ.7వేలు తగ్గుతుందన్నారు. వేరుశనగకు సంబంధించి కదిరి, లేపాక్షి రకం, నిత్య హరిత, విశిష్ట రకాలు జిల్లాకు అనుకూలమని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు వ్యాప్తి తగ్గిందన్నారు. పెసర పంటలో ఎల్బీజీ–607, 630, 574 రకాలు, మినుములో ఎల్బీజీ–884, 904, 932, టీబీజీ– 104, జీబీజీ–45 రకాలు పల్లాకు తెగులను తట్టుకుంటాయని తెలిపారు. సమావేశంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరావు పాల్గొన్నారు. -
దేవుడా.. మాకు దిక్కెవరు..
● పశ్చిమబెంగాల్లో జీఆర్ఈఎఫ్ జవాన్ మృతి ● వీరభద్రపురానికి మృతదేహం తరలింపు ● అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కొత్తవలస: బాగున్నావా.. పిల్లలు ఏం చేస్తున్నారు.. చక్కగా చదువుతున్నారా.. ఆరోగ్యం జాగ్రత్త.. అమ్మనాన్నలు బాగున్నారా.. అంటూ ఫోన్లో కుటుంబ క్షేమ వివరాలు తెలుసుకున్న భర్త.. విగతజీవిగా కళ్లముందు కనిపించేసరికి భార్య కన్నీటిశోకంలో మునిగిపోయింది. దేవుడా.. ఎంత పనిచేశావంటూ భర్త మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించింది. పారామిలటరీ జవాన్ మృతితో కొత్తవలస మండంలోని వీరభద్రపురం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశ సాయుధ దళాల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)లో పారా మిలటరీకి చెందిన జీఆర్ఈఎఫ్ (జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్) విభాగంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పనిచేస్తున్న వీరభద్రపురం గ్రామానికి చెందిన రాయపురెడ్డి దేముడునాయుడు విధుల్లో ఉంటూ శనివారం వాంతులతో అస్వస్థతకు గురై అక్కడి మిలటరీ ఆస్పత్రిలో మృతిచెందారు. జవాన్ మృతి చెందిన విషయాన్ని ఆర్సీ–87 (జీఆర్ఈఎఫ్) మేజర్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్‌కుమార్ కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్‌జిందల్, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని వీరభద్రపురానికి సోమవా రం తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసి భార్య నాగమణితోపాటు కుమారులు హర్షవర్దన్(9), యశ్వంత్(7), తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతదేహానికి మాజీ సైనిక ఉద్యోగులతో పాటు కొత్తవలస సీఐ షణ్ముఖరావు పూలమాలలు వేసి గౌరవవందనం సమర్పించారు. విజయనగరం నుంచి వచ్చిన ప్రత్యేక రిజర్వ్డ్ పోలీసులు గౌరవవందనం సమర్పించి గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. -
విజయనగరం
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పట్టపగలే చోరీ..! ఎస్.కోట మండలం పోతనాపల్లి గ్రామంలోని కిలపర్తి కొండమ్మ ఇంట్లో సోమవారం ఉద యం దొంగలు పడ్డారు. 15 తులాల బంగారు ఆభరణలు దోచుకుపోయారు. –8లో ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు డి.ఏసు. ఇతనిది విశాఖపట్నం జిల్లా మధురవాడ. గత నెల 24వ తేదీన విజయనగరంలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో ఈయన గుండెకు స్టంట్ వేశారు. తదుపరి చికిత్స కోసం సోమవారం రావాలని చెప్పడంతో వ్యయప్రయాసలకోర్చి ఆస్పత్రికి వచ్చారు. సమ్మెలో ఉన్నందున చికిత్స అందించలేమని వైద్యులు చెప్పడంతో చేసేది లేక ఇంటిముఖం పట్టారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు లగుడు త్రినాథ్. ఇతనిది మెంటాడ మండలం లోతుగెడ్డ గ్రామం. ఇతనికి గత నెల 18వ తేదీన విజయనగరంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. తదుపరి చికిత్స కోసం కుటుంబ సభ్యులు సోమవారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమ్మెలో ఉన్నందున చికిత్స అందించలేమని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. సేవలు అందించలేమని చెప్పేశారు.. నా పేరు ఎస్.శంకర్. మాది మెంటాడ మండలం లోతుగెడ్డ. మా మేనత్తకు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో ఈఏడాది మార్చి నెలలో వెన్నెపూసకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించాం. తదుపరి చికిత్స కోసం సోమవారం ఆస్పత్రికి వచ్చాం. ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లించని కారణంగా సమ్మెలో ఉన్నాం.. సేవలు అందించలేం అని వైద్యులు చెప్పారు. చేసేది లేక ఇంటికి వెళ్లిపోతున్నాం. ● చికిత్సకోసం ఆస్పత్రికి వచ్చే వారికి తప్పని తిప్పలు ● కొంతమంది సొంత డబ్బులతో వైద్యం చేయించుకునే పరిస్థితి న్యూస్‌రీల్ -
విజయనగరం
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్ర 20 లక్షల మొక్కల పెంపకానికి చర్యలు కార్మికులకు అండగా.. ఈ శ్రమ్ అసంఘటిత రంగ కార్మికుల పట్ల విజయనగరం జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యధోరణి అవలంభిస్తోంది. –8లోవెయిట్లిఫ్టింగ్లో భానుప్రసాద్ ఫస్ట్ బొబ్బిలి: నేపాల్‌కు చెందిన ఎస్బీకేఎఫ్ మరి యు ఇందుశ్రీ సంస్థల ఆధ్వర్యంలో అక్కడి పోఖ్రాలో జరిగిన నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బొబ్బిలికి చెందిన యువకుడు భానుప్రసాద్ మొదటి స్థానానికి ఎంపికయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో భానుప్రసాద్‌కు జాతీయ స్థాయి ప్రధమ బహుమతిని అక్కడి నిర్వాహకులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశా రు. ఇటీవలే రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన భానుప్రసాద్ ఫైనల్స్ జరిగిన నేపాల్‌లో 220 కిలోల విభాగంలో తన సత్తా చాటా డు. భానుప్రసాద్‌ను పలువురు అభినందించారు. నేరడి సమీపంలో ఏనుగులు భామిని: మండలంలోని నేరడి బీ సమీపంలో ఏనుగులు ఆదివారం కనిపించాయి. రబీ వరితో పాటు మొక్కజొన్న, కనకాంబరాలు, కూరగాయల పంటలు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగులు పంట చేలల్లో సంచరిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఏనుగులను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. 10న కురుపాంలో జాబ్ మేళా పార్వతీపురం టౌన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ కలిగి 18 ఏళ్లు నిండి 28 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఉద్యోగమేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈ నెల 10వ తేదీ గురువారం ఉదయం 9గంటలకు కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హాజరు కావాలని కోరారు. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలకు చెందిన అధికార ప్రతినిధులు హాజరై, అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీలోకి ఎంపిక చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జాబ్ మేళాకు హాజరు కానున్న అభ్యర్థులు తమ వివరాలను హెచ్‌టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్ సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, రిఫరెన్స్ నంబరుతో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో ఉదయం 9గంటలకు డ్రైవ్ జరుగు ప్రదేశంలో హాజరు కావాలని ఆ ప్రకటనలో కోరారు. వివరాలకు 63034 93720, 89788 78557 నంబర్లను సంప్రదించాలని సూచించారు. తాగునీటి సమస్య ఉండరాదు : కలెక్టర్ పార్వతీపురం టౌన్: వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు వినిపించరాదని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. సమస్య ఉన్న చోట తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆరోగ్య, గ్రామీణ నీటి సరఫరా శాఖలు నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను ఎప్పటికప్పుడు చేపట్టాలని అన్నారు. చేపట్టే నీటి నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలని, రెండు శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో 14 రకాల పరీక్షలను చేపట్టడం జరుగుతుందని, దీనిని ప్రతీ రోజు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని, అన్ని రకాల పరీక్షలను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల విషయమై క్షేత్ర స్థాయిలో అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందుకు ఆయా ప్రాంతాల్లో గల కార్యాలయాలు, సంస్థలు, సంఘాల సహకారం తీసుకోవాలని ఆయన చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జీలకర్ర బెల్లం చూపిస్తున్న పురోహితుడు ● రామతీర్థంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం ● కనులారా వీక్షించి పులకించిన భక్త జనం ● జై శ్రీరామ్ అంటూ మార్మోగిన రామతీర్థం ● స్వామి వారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పక్క దారిలో ప్రముఖుల దర్శనాలు ● ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్య భక్తులు నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి సాధారణ భక్తులు ఉత్తర రాజగోపురం మీదుగా గతంలో దర్శనాలు చేసుకునేవారు. తూర్పు రాజగోపురం నుంచి ఇన్‌గేట్ ద్వారా ప్రజాప్రతినిధులు, వీఐపీలు, ఇతర ప్రముఖులు స్వామి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ... అయితే ఈ ఏడాది తూర్పు రాజగోపురం వద్ద సామాన్య భక్తులను వేలాదిగా లోపలకి విడిచిపెట్టడంతో ప్రముఖులు వెళ్లాల్సిన లైన్లో భారీగా భక్తులు దర్శనమిచ్చారు. దీంతో స్వామి దర్శనానికి విచ్చేసే మంత్రులు, ప్రజాప్రతినిధులను పక్క దారిలో స్వామి దర్శనానికి పంపించారు. వచ్చే భక్తులు, వెళ్లే ప్రజాప్రతినిధులు ఒకే గేట్ ద్వారా రాకపోకలు సాగించడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకేసారి వీఐపీలతో వచ్చే అనుచరులను నేరుగా గర్భగుడిలోకి విడిచి పెట్టడంతో స్వామివారు కనిపించ లేదంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయం ప్రకారం వెనుకమార్గంలో దర్శనాలు చేసుకోవడం శాస్త్ర విరుద్ధమైనప్పటికీ వీవీఐపీలకు సైతం అదే మార్గంలో దర్శనాలు చేయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నెల్లిమర్ల రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. నవమి వేడుకులను పురస్కరించుకొ ని ఆలయంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజ లు ప్రారంభమయ్యాయి. ఉదయం 3 గంటలకు ఆరాధన, బాలభోగం, సేవాకాలం కార్యక్రమాలను అర్చకస్వాములు నిర్వహించారు. 6 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. తరువాత ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల నడు మ కల్యాణమండపం వద్దకు తీసుకువచ్చారు. మండపంలోని మధ్యభాగంలో అమ్మవారిని, స్వామి వారిని వేంచేంపుజేశారు. మండపంలో ఆశీనులైన శ్రీ సీతారాముల వారికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీరామచంద్ర ప్రభువుకు ఏకాంతంగా అవతార సర్గ విన్నపం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు అత్యంత వైభవంగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఫల రసా లు, సముద్ర నదీ జలాలతో అభిషేకాన్ని జరిపించారు. అర్చకస్వాములు ప్రతీ తంతుకు వేదమంత్రాన్ని పఠిస్తూ కల్యాణ ఘట్టాన్ని కొనసాగించారు. కల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ‘కన్యావరణ’ ‘యజ్నోపవీతదారణం’ జరిపించా రు. వధూవరుల వంశ గోత్ర నామాలను ప్రవచించారు. ఆశీర్వచనం, పాదప్రక్షాళణం, పుష్పోదకస్నా నం నిర్వహించి వరపూజ చేశారు. అనంతరం స్వామివార్లకు నూతన వస్త్రాలంకరణ చేశారు. అభిజిత్ లగ్నంలో... వేద పండితులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూ సరిగ్గా 12గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారామస్వామి వారి శిరస్సుపై ఉంచారు. అనంతరం అర్చకస్వాములు మంత్రాలను జపిస్తూ శాస్త్రోక్తంగా సాక్షాత్తు సీతమ్మ తల్లి మంగళసూత్రాలను భక్త జనులకు చూపించి మాంగల్యధారణ గావించారు. తరువాత తలంబ్రా ల వేడుకను కనుల పండువగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేడుక జరుగుతున్నంతసేపు కల్యాణ ప్రాంగణం రామనామస్మరణతో మార్మోగింది. కల్యాణం అనంతరం స్వామివారి తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలను తీసుకొని భక్తులు తిరిగి పయనమయ్యారు. కల్యా ణం జరుగుతున్నంత సేపు సుదర్శన జీవీ హయ గ్రీవాచార్యులు(నంద్యాల) వాస్తవ్యులు ప్రత్యక్ష వ్యాఖ్యాతగా స్వామివారి కల్యాణం గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత నృత్యాలు, కోలాట కార్యక్రమాలను భక్తులను విశేషంగా అలరించాయి. రామస్వామిని దర్శించుకున్న ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సింహాచలం దేవస్థానం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ దంపతులు కల్యాణ వేడుకకు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామికి సమర్పించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, దేవదాయశాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎస్టీ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీవీజీ శంకరరావు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, రాష్ట్ర సాధుసంతు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి, నాయకులు మత్స సత్యనారాయణ, సముద్రపు రామారావు, పతివాడ సత్యనారాయణ, తదితర ప్రముఖులు సీతారామస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కీర్తి, ఈఓ శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జైశ్రీరామ్ అని నినదిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు (ఇన్సెట్లో) ప్రత్యేక అలంకరణలో సీతారామలక్ష్మణులు బొబ్బిలి: పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్రను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.విజయగౌరి విమర్శించారు. స్థానిక ట్రిపుల్ ఎస్ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలన్న ప్రచార వాల్‌పోస్టర్‌ను ఆమె ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు వాటిని మూసివేసే దిశగా అడుగులు వేస్తుండడం దుర్మార్గమన్నారు. జీవో నంబరు 117తో యూపీ పాఠశాలలు మూసివేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేసి, పాఠశాలలను విలీనం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. బొండపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా 2025 – 2026 సంవత్సరానికి సంబంధించి 20 లక్షల మొక్కలను వనమిత్ర కేంద్రాలతో పాటు నర్సరీల్లో పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియా పాండే తెలిపారు. మండల కేంద్రంలోని వనమిత్ర కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 33 వనమిత్ర కేంద్రాలతో పాటు నర్సరీల్లో ఈ ఏడాది 20 లక్షల వివిధ రకాలైన మొక్కలను పెంచి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే వివిధ రకాల మొక్కలతో పాటు ప్రత్యేకంగా ఈ ఏడాది 30 వేల పసన మొక్కలను నర్సరీల్లో పెంచి పంపిణీ చేసేందుకుగాను చర్యలు చేపట్టినట్టు తెలిపారు. బొబ్బిలి వీణల తయారీ కోసం అవసరమైన పసన చెట్లు కొరత తీవ్రంగా ఉన్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వీణల తయారీదారులు తీసుకువచ్చారని, ఈ నేపథ్యంలో వాటి పెంపకానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది 50 వేల పనస మొక్కలను నర్సరీల్లో పెంచి పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ కొండలరావు, ఎఫ్ఆర్ఓ సింధు, ఫారెస్టు ఆఫీసరు బి.అప్పలరాజు వనమిత్ర కేంద్రం సహాయకులు పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. న్యూస్‌రీల్ అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియా పాండే -
అవినీతికి కేరాఫ్ ఉపాధి
విజయనగరం ఫోర్ట్: గ్రామీణ ప్రాంత ప్రజల వలసలను నివారించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొంతమంది సిబ్బందికి వరంలా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకంలో పని చేసే క్షేత్ర సహాయకుల నుంచి ఏపీఓల వరకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలున్నాయి. వీరిలో కొంత మంది పట్టుబడుతుండగా మరి కొంతమంది తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వహించే సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) బృందం సభ్యులు నిర్వహించే తనిఖీల్లో సిబ్బంది అక్రమాలను గుర్తించి ఉన్నత అధికారులకు నివేదిక ఇస్తుండడంతో అక్రమాలకు పాల్పడ్డ వారి గుట్టు రట్టువుతుంది. అక్రమాలకు పాల్పడినప్పటకీ కొంతమంది బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2023 – 24 ఏడాదిలో వేతనదారులు ఎంత పని చేశారు.. చేసిన పనికి తగ్గ వేతనాలు వారికి పూర్తి స్థాయిలో అందాయా.. లేదా, ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారికి ఉపాఽధి హామీ పథకం ద్వారా రావాల్పిన బిల్లులు వచ్చాయా.. రాలేదా, పని కల్పించడానికి సిబ్బంది ఏమైనా అవినీతికి పాల్పడ్డారా.. అన్న అంశాలపై గ్రామాల్లో సామాజిక తనిఖీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. గుర్తించిన అక్రమాలు వివరాలు, అక్రమాలకు పాల్పడ్డ సిబ్బంది పేరు రాసి నివేదిక అందజేస్తారు. ఈ వేదికల్లో ఎవరి నుంచి ఎంత రికవరీ చేయాలన్నది కూడా వెల్లడిస్తారు. 612 మంది నుంచి రికవరీకి ఆదేశాలు 2023 – 24 సంవత్సరానికి సంబంఽధించి సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) సిబ్బంది నిర్వహించిన సామాజిక తనిఖీలో 612 మంది అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. వారి నుంచి రికవరీ చేయాలని గుర్తించి ఉపాధి హామీ ఉన్నత అధికారులకు నివేదిక అందజేశారు. ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్స్), మేట్లు, సాంకేతిక సహాయకులు (టెక్నికల్ అసిస్టెంట్స్) ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ (ఈసీ), కంప్యూటర్ ఆపరేటర్స్, ఏపీఓలు క్షేత్ర స్థాయిలో పని చేస్తుంటారు. సోషల్ ఆడిట్ సిబ్బంది రికవరీకి సూచించింది కూడా ఈ కేడర్ల వారిపైనే. రూ.7.35 లక్షలు రికవరీ ఉపాధి హామీ సిబ్బంది నుంచి రూ.7.35 లక్షలు రికవరీ చేయాలని సామాజిక తనిఖీ సిబ్బంది సూచించారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ సిబ్బంది 463 మంది, టెక్నికల్ అసిస్టెంట్స్ 86 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 28 మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ 23 మంది, ఏపీఓలు 12 మంది నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయనున్నారు. సిబ్బంది పాల్పడే అవతవకలు ఇవే.. ●బినామీ మస్తర్లు వేసి వారి ద్వారా డబ్బులు తీసుకోవడం. ●తక్కువ కొలతలో పని చేసినప్పటికీ ఎక్కువగా పని చేసినట్టు కొలతలు వేయడం. ●మొక్కలు చనిపోయినప్పటకీ, బ్రతికి ఉన్నట్టు చూపించి వాటికి సంబంధించి మెయింటెనెన్స్ తీసు కోవడం తదితర అక్రమాలకు పాల్పడతారు. అయితే అక్రమాలకు పాల్పడ్డ సిబ్బంది నుంచి రికవరీతోనే సరిపెట్టేస్తుండడంతో అక్రమాలకు చెక్ పడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6 లక్షల మంది వేతనదారులు ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో 3.85 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో యాక్టి వ్ జాబ్ కార్డులు 3.41 లక్షలు ఉన్నాయి. అదే విధంగా 6.04 లక్షల మంది వేతనదారులు ఉపాధి హామీ పథకంలో పనులకు వస్తున్నారు. ఉపాధి హామీ పనుల్లో పెచ్చుమీరుతున్న అవినీతి సామాజిక తనిఖీల్లో వెల్లడవుతున్న నిజాలు 612 మంది నుంచి రూ.7.35 లక్షల రికవరీకి ఆదేశాలు బినామీ మస్తర్లు, కొలతల్లో అక్రమాలు రికవరీ ప్రారంభించాం రూ.7.35 లక్షలు రికవరీ చేయాలని సోషల్ ఆడి ట్ సిబ్బంది సూచించారు. రూ.1.59 లక్షలు సిబ్బంది జీతాల నుంచి రికవరీ ప్రారంభించాం. మిగతా డబ్బులు కూడా శతశాతం రికవరీ చేస్తాం. – ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా -
ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లిపోతున్నారు..
కొత్తవలస: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. దేశపాత్రునిపాలెం గ్రామ సమీపంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ను శనివారం రాత్రి ఎత్తుకెళ్లిపోయారు. గడిచిన రెండు నెలల వ్యవధిలో మండలంలోని పలు గ్రామాలలో ఏడు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయని ఏఈ అప్పారావు తెలిపారు. కంటకాపల్లి జగనన్న కాలనీలో –2, కాటకాపల్లి జగనన్న కాలనీలో –1, పెదరావుపల్లిలో –2, దాట్ల లే అవుట్లో రెండు ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లిపోయారని చెప్పారు. సింగిల్ ఫేజ్ (16 కేవీ సామర్థ్యం) ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ సరఫరా ఉన్నప్పుడే దొంగలు చాకచక్యంగా కిందకు దించి అందులో గల కాపర్‌ను తీసుకొని ట్రాన్స్ఫార్మర్ డొక్కులను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ విలువ రూ. 2 లక్షలకు పైనే ఉంటుంది. దేశపాత్రునిపాలెంలో జరిగిన దొంగతనంపై గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హ్యాకథాన్ పోటీల్లో లక్ష్మీపురం విద్యార్థుల సత్తా
రేగిడి: మండలంలోని లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆమెజాన్ ప్యూచర్ ఇంజనీర్ హ్యాక్‌థాన్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. విశాఖపట్నంలోని హోటల్ గ్రీన్‌పార్క్‌లో నిర్వహించిన పోటీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 27 మంది విద్యార్థులు పాల్గొనగా.. లక్ష్మీపురం ఉన్నత పాఠశాలకు చెందిన రేగిడి పూర్ణిమ, తోట నిహారిక, బిందు మాధవి (8వ తరగతి) రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి సాధించారు. దీంతో అమెజాన్ సంస్థ పాఠశాలకు ఒక టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు ట్యాబ్‌లు పంపించింది. ఈ మేరకు విద్యార్థులను పాఠశాల ఆవరణలో ఆదివారం అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఎం. కృష్ణారావు, ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య, సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావు, పీఎంసీ చైర్పర్సన్ కర్నేన రమాదేవి, తదితరులు అభినందించారు. -
పోలీసుల సాక్షిగా రాములోరి కల్యాణం
● పెనసాంలో భారీగా మోహరించిన పోలీసులు ● ఉత్కంఠ పరిస్థితుల్లో శ్రీరామ నవమి వేడుకలు గంట్యాడ: మండలంలోని పెనసాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సీతారాముల కల్యాణం జరిగింది. పోలీసుల సాక్షిగా సీతారాములు మరోసారి ఒక్కటయ్యారు. అసలు కల్యాణం జరుగుతుందో.. లేదోననే ఉత్కంఠ శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు నెలకొంది. వివరాల్లోకి వెళితే.. పెనసాం గ్రామంలో 25 ఏళ్లుగా లెంక నారాయణప్పడు కుటుంబీకులు శ్రీరామనవమి రోజున కల్యాణం జరిపిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది కూటమి పార్టీకి చెందిన కొంతమంది ఎప్పడూ ఒకే కుటుంబీకులు కల్యాణం జరిపించాలా... మర్చాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో 15 రోజుల కిందట పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో గంట్యాడ పోలీస్ స్టేషన్, విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఏళ్ల తరబడి తమ కుటుంబ సభ్యులే సీతారాముని కల్యాణం జరిపిస్తున్నామని లెంక నారాయణప్పడు కుటుంబీకులు పోలీసులు, అధికారులకు చెప్పారు. అప్పట్లో గ్రామ పెద్దలు, మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో లెంక నారాయణప్పడు కుటుంబీకులే కల్యాణం జరిపించాలంటూ చేసిన తీర్మానాలను సైతం అధికారులకు చూపించారు. అయినప్పటకీ కూటమి నేతలు అంగీకరించలేదు. విజయనగరం డీఎస్పీ పెనసాం గ్రామ పెద్దలు, మండల ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ, కూటమి కి చెందిన నేతలతో శనివారం రాత్రి కూడా చర్చలు జరిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎట్టకేలకు లెంక నారాయణప్పడు కుటుంబీకుల్లో ఒకరు, కూటమికి చెందిన ఒకరు కల్యాణం జరిపించడానికి అంగీకరించారు. ఇరువర్గాలు అంగీకరించినప్పటకీ, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 120 మంది వరకు ఇతర సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 144వ సెక్షన్ విధించారు. అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా సీతారాముల కల్యాణం జరిగితే.. పెనసాంలో పోలీసుల పహారాలో కల్యాణం జరగడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్యాణంలో జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నరసింహామూర్తి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, సర్పంచ్ కర్రోతు పాపాయ్యమ్మ , ఎంపీటీసీ సభ్యుడు లెంక మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. -
దాడి కేసులో నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: రెండు రోజుల కిందట యువతిపై దాడి చేసిన నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం శివరాం గ్రామంలో ఉంటున్న బాధిత యువతికి తన అన్న ద్వారా నిందితుడు గర్ల ఆదినారాయణతో పరిచయం ఉంది. నిందితుడు తరచూ బాధిత యువతి ఇంటికి వస్తుంటాడు. ఇదిలా ఉంటే బాధిత యువతి చెల్లెలు విజయవాడలో ఉంటోంది. నిందితుడు ఫోన్ ద్వారా ఆమెతో కూడా పరిచయం పెంచుకున్నాడు. కొద్ది రోజలుగా నిందితుడు ఆదినారాయణ ఫోన్లో బాధితురాలి చెల్లిని అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె శివరాంలో ఉంటున్న సోదరికి చెప్పుకుంది. దీంతో బాధితురాలు తన చెల్లిని ఎందుకు వేధిస్తున్నావని ఆదినారాయణను నిలదీసింది. అలాగే చుట్టుపక్కల వాళ్లకు కూడా చెప్పడంతో ఆదినారాయణ బాధిత యువతితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన ఇంటిలో వంటపాత్రలు శుభ్రం చేస్తున్న బాధిత యువతిపై నిందితుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు ఐదు బృందాలను రంగంలోకి దించింది. గంటల వ్యవధిలో నిందితుడు పట్టుబడడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని త్వరగా పట్టుకున్న నేపథ్యంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, గరివిడి ఎస్సై లోకేశ్వరరావులను ఎస్పీ అభినందించారు. -
నేడు వినతుల స్వీకరణ
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా వినతుల పరిష్కార వేదికలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటారని మంత్రి కార్యాలయం ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినతులు నేరుగా మంత్రి స్వీకరిస్తారని, ఈ అవకాశాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలని కోరారు. ఆటో బోల్తా.. ● ఒకరి మృతి ● ఎనిమిది మందికి గాయాలు సీతంపేట: కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వస్తూ ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రాజన్నగూడకు చెందిన సవర లక్ష్మణ్ సీతంపేటలో గల అడ్వంచర్ పార్కులో గేట్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తన పుట్టినరోజును పార్కులో జరుపుకుంటానని చెప్పి భార్యాపిల్లలు, తల్లి, బంధువులను రమ్మని ఆహ్వానించాడు. దీంతో లక్ష్మణ్ తల్లి సవర పెద్దతిక్కమై (60), భార్యా పిల్లలు, బంధువులు ఆటోలో స్వగ్రామం నుంచి అడ్వంచర్ పార్కుకు బయలుదేరారు. సరిగ్గా అక్కన్నగూడ వద్దకు వచ్చే సరికి ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్ద తిక్కమై అక్కడికక్కడే మృతి చెందగా.. సవర ఉషారాణి, స్మిత్, రాషి, సునేమి, రాయమన్స్, సవర సౌజన్య, సవర లీనా, సవర సోహెల్ గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానిక సీహెచ్‌సీకి తరలించగా.. ముగ్గురిని శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. తన పుట్టిన రోజునే తల్లి మృతి చెందడం.. కుటుంబ సభ్యులు గాయపడడంతో లక్ష్మణ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఎస్సై వై. అమ్మన్నరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలంలోని బీజే పాలెం గ్రామానికి చెందిన కడుకట్ల అప్పన్న (60) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో బహిర్భూమి కోసం గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి. లోకేశ్వరరావు తెలిపారు. చికిత్సపొందుతూ ఒకరు.. జియ్యమ్మవలస రూరల్: మండలంలోని కుందరతిరువాడ పంచా యతీ నీచుకవలస గ్రా మానికి చెందిన పత్తిక రా జేష్ (24)విశాఖపట్నం గాజువాకలో నూతన గృహానికి పెయింటింగ్‌లు వేసేందుకు వెళ్లి అక్కడ గత నెల 28న విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు కేజీహెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. కుటుంబాన్ని పోషిస్తున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సునీత, తమ్ముడు రాకేష్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదవశాత్తూ మరొకరు.. చీపురుపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్లో ట్రాక్‌పై ప్రమాదవశాత్తూ ప్రసాద్ (55) అనే వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రాజాం మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన ప్రసాద్ విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో పని చేస్తున్నారు. మూడు రోజుల కిందట తన స్వగ్రామమైన బొద్దాం వచ్చిన ఆయన తిరిగి విజయవాడకు వెళ్లేందుకు చీపురుపల్లి రైల్వేస్టేషన్‌కు శనివారం రాత్రి చేరుకున్నాడు. అయితే ప్రసాద్ రైలు నుంచి జారి పడి మరణించాడా.. లేక మరే ఇతర కారణాల వల్ల మరణించాడో అన్న విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య.. చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కొండపాలేం గ్రామంలో కె.బాలరాజు (32) అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బాలరాజు తన భార్య పద్మతో కలిసి శ్రీకాకుళం జిల్లా పలాసలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తుండేవాడు. బాలరాజుకు మద్యం అలవాటు ఉండడంతో నిత్యం భార్యతో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో పలాస నుంచి కొండపాలెంలో ఉన్న తల్లి యశోద వద్దకు ఇటీవల వచ్చేశాడు. ఆదివారం ఉదయం తల్లితో గొడవపడి ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మికులకు అండగా.. ఈ శ్రమ్
అర్హులు వీరే.. ● వయసు 16 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ● ఆదాయపు పన్ను పరిధిలోకి రాకూడదు. ● ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) సదుపాయం లేని వారు. ● ఉద్యానవనాలు, నర్సరీలు, పాడి పరిశ్రమ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు, టైలర్లు, డ్రైవర్లు, హెల్పర్లు, వీధి వ్యాపారులు, కల్లుగీత, రిక్షా కార్మికులు, చెత్త ఏరేవారు, కొరియర్ బాయ్‌లు, ఇళ్ల పనివారు, ఉపాధి వేతనదారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజనం వర్కర్లు, లోడింగ్/అన్లోడింగ్ కార్మికులు, తదితరులందరూ ఈ పథకానికి అర్హులు. ● పథకంపై అవగాహన అంతంతమాత్రమే ● జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులు సుమారు 7 లక్షల మంది ● పథకంలో నమోదైన వారు 4,19,542 మంది ● అవగాహన కల్పించని అధికారులువిజయనగరం గంటస్తంభం: అసంఘటితరంగ కార్మికుల పట్ల విజయనగరం జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యధోరణి అవలంభిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ పథకం గురంచి తెలిసిన వారే నమోదు చేసుకుంటున్నారు తప్ప తెలియని వారి గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో సుమారు 7 లక్షల మంది వరకు అసంఘటిత రంగ కార్మికులుండగా.. ఇంతవరకు 4,19,542 మంది మాత్రమే ఈ పథకంలో నమోదు చేసుకున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 2 లక్షల మంది పైచిలుకు నమోదు చేసుకోవాల్సి ఉంది. కొరవడిన అవగాహన.. అధికారులు అవగాహన కల్పించకపోవడంతో ఈ పథకం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియడం లేదు. ప్రారంభంలో అధికారుల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కార్మిక సంఘాల నేతల సూచనలతో నమోదు చేసుకునేందుకు కార్మికులు పోటీపడ్డారు. ఇప్పుడు ఎక్కడా ఆ ఊసే లేదు. అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు, చిరు వ్యాపారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఈ – శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో నమోదైన వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. పైగా ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతాయి. ఈ పోర్టల్‌ను ప్రారంభించి ఏడాది గడిచినా.. నేటికీ చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. చేకూరే ప్రయోజనాలివి.. ఈ –శ్రమ్‌లో నమోదైతే 12 అంకెలు కలిగిన యూఏఎన్ కార్డులు అందజేస్తారు. ఈ కార్డులు ఉన్నవారికే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ అంగవైకల్యం చెందితే రూ. లక్ష బీమా పరిహారం అందజేస్తారు. అలాగే ఇతర సంక్షేమ పథకాల్లో కూడా వీరికి ప్రాధాన్యం ఇస్తారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి ఉపాధి మార్గాలు చూపిస్తారు. 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తారు. పథకంలో నమోదుకు కావాల్సిన పత్రాలు.. సేవింగ్ బ్యాంక్ ఖాతా బ్యాంక్ ఖాతా ఐఎఫ్ఎస్సీ కోడ్ రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ యాక్టివ్ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో లింక్ నివాస ధృవీకరణ పత్రం పాస్‌పోర్టు సైజ్ ఫొటో వయస్సు రుజువు పత్రం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ–శ్రమ్ పథకంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు ఆరుగురికి ప్రమాద బీమా పరిహారం రూ. 2 లక్షల చొప్పున అందజేశాం. ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నా ఈ పథకానికి అర్హులే. – ఎస్‌డీవీ ప్రసాదరావు, కార్మిక శాఖ ఉప కమిషనర్, విజయనగరం జిల్లా -
సైబర్ మోసగాడు అరెస్ట్ ?
● అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ● నిందితుడు ఇంజినీరింగ్ విద్యార్థిగా గుర్తింపు వీరఘట్టం: హోలో .. నేను వీరఘట్టం పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను.. ఎస్సై గారు ఆస్పత్రిలో ఉన్నారు.. అర్జెంట్‌గా రూ.55 వేలు ఫోన్ పే ద్వారా కావాలని నమ్మబలికి 75693 41175 నంబర్ నుంచి ఫోన్ చేసి వీరఘట్టంనకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి నుంచి నిందితుడు రూ.28 వేలు కాజేశాడు. ఈ వ్యవహారంపై ఈనెల 2న సాక్షిలో ‘కానిస్టేబుల్‌నని చెప్పి సైబర్ మోసం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై వీరఘట్టం పోలీసులు స్పీడ్‌గా స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు బాధితుడికి వచ్చిన 75693 41175 ఫోన్ నంబర్ ఆధారంగా సైబర్ నేరగాడి ఆచూకీ గుర్తించారు. ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయగా నిందితుడు కృష్ణా జిల్లా బాపట్లలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఐదు రోజుల కిందట బాపట్లకు పయనమయ్యారు. ఎస్సై జి. కళాధర్ వీరఘట్టం నుంచి నిందితుడి ఫోన్‌ను ట్రాక్ చేస్తూ హెచ్‌సీ, కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. దీంతో బాపట్లలో నిందితుడ్ని పోలీసులు ఆదివారం చాకచక్యంగా పట్టుకున్నారు. సైబర్ నేరానికి పాల్పడిన వ్యక్తి బీటెక్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిగా గుర్తించారు. ఈ సైబర్ నేరం వెనుక ఉన్న కుట్రదారులందరినీ పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నిందితుడ్ని సోమవారానికి వీరఘట్టంనకు తీసుకువస్తారని సమాచారం. వాట్సాప్ గ్రూప్‌పై అనుమానాలెన్నో.... ‘వి.జి.టి.యం నీడ్ మనీ ట్రాన్స్ఫర్స్ వీరఘట్టం’ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఈ సైబర్ నేరానికి బీజం పడడంతో పోలీసులు ఈ గ్రూప్ అడ్మిన్‌తో పాటు పెద్ద ఎత్తున మనీ ట్రాన్స్ఫర్స్ చేస్తున్న వారిపై నిఘా వేశారు. ఈ గ్రూప్‌లో ఎవరికై నా డబ్బులు కావాలన్నా, ఫోన్ పే కావాలన్నా గ్రూప్‌లో ఉండే సభ్యులు గతంలో పెట్టిన మెసేజ్‌లు.. ఇంత వరకు జరిగిన అన్ని మనీ ట్రాన్స్‌ఫర్స్‌పై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాడు నోరు విప్పితే అసలు దొంగలు ఎవరనేది తేలుతుంది. -
వేతనం ఇవ్వకపోతే బతికేది ఎలా?
నెలల తరబడి వేతనం ఇవ్వకపోతే ఎలా బతుకుతాం. ఇప్పుడు భవన నిర్మాణ పనులకు వెళ్దామన్నా అక్కడా పని దొరకట్లేదు. తప్పక ఉపాధి పనులకు వెళ్లితే అక్కడా వేతనాలు ఇవ్వట్లేదు. – బొడసింగి సీత, బోడసింగిపేట, బొండపల్లి మండలం –––––––––––––––––––––––––––––– మూడు మాసాల నుంచి డబ్బులు పడడం లేదు ఉపాధిహామీ పని డబ్బులు మూడు మాసాలుగా ఇవ్వడం లేదు. ప్రతిరోజు ఎండలో పనిచేస్తున్నాం. వారంవారం ఇవ్వాల్సిన డబ్బులు ఇంతకాలం పడలేదు. గత ప్రభుత్వంలో ప్రతివారం అందేవి. – బి.రాములు, గజపతినగరంమాటలకు చేతలకు తేడా ఉంది... ఉపాధి హామీ వేతనదారులకు రోజూ రూ.300 వరకూ వేతనం గిట్టుబాటు అయ్యేలా చూస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు చెప్పారు. కానీ రోజువారీ కూలీ రూ.160కు మించట్లేదు. ఆ డబ్బులు కూడా రెండున్నర నెలలుగా ఇవ్వలేదు. నాకు, నా భార్యకు కలిపి సుమారు రూ.10 వేల వరకూ రావాలి. – బి.తవిటినాయుడు, జె.రంగరాయపురం, బొబ్బిలి మండలం –––––––––––––––––––––––––––––– పనులు చేసినా పస్తులు తప్పట్లేదు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకంలో పనులు చేసినా పస్తులు తప్పడం లేదు. బిల్లులు ఇవ్వడం లేదు. మేము పనులు చేసి 13 వారాలు అయింది. ఇంతవరకూ రూపాయి ఇవ్వలేదు. – తొత్తడి భారతి, కొత్తూరు, ఎస్.కోట మండలం -
వేడుకగా గురు వందనం
విజయనగరం టౌన్: కేంద్ర సాహిత్య నాటక అకాడమీ పురస్కార గ్రహీత, మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల పూర్వ అధ్యాపకుడు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావును శిష్యప్రశిష్య సమాఖ్య శనివారం గురువందనం పేరుతో సత్కరించింది. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలతో పాటు దేశ, విదేశాల్లో స్థిరపడిన శిష్యులందరూ కలిసి సంగీత కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముందు ప్రముఖ విద్వాంసులు ద్వారం సత్యనారాయణరావు నిర్వహించిన వయోలిన్ కచేరీ ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. విశాఖ మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ గౌరవ కార్యదర్శి రామదాస రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండా సుధారాణి, కట్టమూరి చంద్రశేఖరం, కేఏవీఎల్ఎన్.శాస్త్రి, చాగంటి కొండలరావు, త్రినాథరావు, చాగంటి రాజ్యలక్ష్మి, ఎం.ధనలక్ష్మి, విజయలక్ష్మి, కళావతి, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 13 ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు విజయనగరం టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 13 ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రొగ్రాం కో ఆర్డినేటర్ జె.శ్యామ్‌సుందర్ తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక టీటీడీ కార్యాలయంలో టీటీడీ నుంచి వచ్చిన కంకణాలు, పుసుపు, కుంకుమ, గోవిందనామాలను అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉభయ జిల్లాల్లో నిర్మించిన 13 ఆలయాల్లో ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ ప్రసాద్భవానీ, అర్చకుడు పీవీ నరసింహాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీటీఎస్‌ఏ నూతన కమిటీ ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ (ఏపీటీఎస్‌ఏ) ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం స్థానిక సంఘ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా డి.నవీన్‌చంద్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి.సురేష్‌కుమార్, జిల్లా సెక్రటరీగా కేవీఎస్ఎస్ సింధూర, వైస్ ప్రెసిడెంట్లుగా ఎస్.దివ్యభారతి, పి.సంతోష్‌కుమార్, వై.కామినాయుడు, బీవీఎస్ఎం నాయుడు, జాయింట్ సెక్రటరీలుగా వి.సరస్వతమ్మ, టి.అనిల్, ఎస్.రంజిత్‌కుమార్, ట్రెజరర్‌గా జి.ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా పి.కిరణ్‌కుమార్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా ఎస్.భాస్కర్, ఎలక్షన్ పరిశీలకుడిగా డి.రమణరెడ్డి వ్యవహరించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి అప్పారావు, జి.నారాయణ, నాయుడు జగన్నాథం, కామరాజు, సత్యంనాయుడు, ఏపీఎన్జీఓ జిల్లా, పట్టణ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్‌బాబు, సురేష్, వై.ఆనంద్‌కుమార్, కనకరాజు, కోశాధికారి ఎస్వీ సుధాకర్, శ్రీకాకుళం, విశాఖపట్నం , తూర్పుగోదావరి, పార్వతీపురం జిల్లాల నుంచి ట్రెజరీ సిబ్బంది పాల్గొన్నారు. -
జగ్జీవన్‌రామ్ ఆశయాలను కొనసాగిద్దాం
విజయనగరం అర్బన్: జగ్జీవనర్ రామ్ ఆశయాలను కొనసాగించడమే అసలైన నివాళి అని కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ అన్నారు. బడుగు బలహీనవర్గాల నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి, వియ్యంపేట డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల విద్యార్థులు జగ్జీవన్‌రామ్ జీవి త విశేషాలు, ఆయన సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలను సాంస్కృతిక ప్రదర్శనల రూపంలో కళ్లకుకట్టారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించిన గురుకులాల విద్యార్థులను కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, ఎమ్మెల్సీ రఘురాజు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్విని, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం ● పోక్సో కేసు నమోదు లక్కవరపుకోట: మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల వయస్సుగల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పుడిన బాలుడి (15)పై పోక్సో కేసు నమోదు చేసినట్టు విజయనగరం డీఎస్సీ ఎం.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి ఆడుకుంటుండగా బాలుడు వారి ఇంటికి వెళ్లాడు. చిన్నారి తల్లి ఇంటి వెనుక భాగంలో వంట చేసుకుంటుండగా బాలికను ఇంటిలోని మంచంపైకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బాలికను పరిశీలించిన తల్లికి రక్తం చారలు కనిపించడంతో ఎల్.కోట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఎస్.కోట సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. బాలుడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. -
కథలు అభ్యుదయ భావాలకు ప్రతీకలు
విజయనగరం అర్బన్: ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు కథలు అభ్యుదయ భావాలకు ప్రతీకగా నిలవడంతో పాటు యువ కథకులకు మార్గనిర్దేశం చేస్తాయని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజి శంకరరావు అన్నారు. విజయనగరంలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో అట్టాడ అప్పలనాయుడు తాను రాసిన నక్షత్రబాట కథా సంపుటిని డీవీజీ శంకరరావుకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కథలు, సామాజిక పరిస్థితులపై అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరినాయుడుతో చర్చించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. విజయనగరం సాహితీ చరిత్రలో కథలకు ఎంతో ప్రాధాన్యముందన్నారు. అప్పలనాయుడు, గౌరినాయుడు వంటి కథా రచయితలు ఎంతో మంది యువ కథకులకు స్ఫూర్తిగా నిలవడం గొప్ప విషయమన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవిజీ శంకరరావు -
జిల్లా వాసులకు అరకు కాఫీ రుచులు
పార్వతీపురం: జిల్లా వాసులకు అరకు కాఫీ రుచులు అందుబాటులోకి తేసుకురానున్నట్లు పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. పట్టణంలోని ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అరకు కాఫీకి మంచి గుర్తింపు ఉందన్నారు. అరకు కాఫీని అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్ధేశంతో ఇటీవల పార్లమెంట్, శాసనసభలలో అవుట్‌లెట్స్ ప్రారంభించారన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గతంలోనే పెట్రోల్‌బంక్ వద్ద అరకు కాఫీని ప్రారంభించినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల మూసివేయాల్సి వచ్చిందన్నారు. దీన్ని మరలా తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈయనతో పాటు ఏపీఓ ఎ.మురళీధర్, సహయ గణాంకాధికారి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ -
ఆటో బోల్తా పడడంతో ఒకరి మృతి
సీతంపేట: మండలంలోని ఇసుకగెడ్డ వద్ద ఆటో బోల్తాపడిన సంఘటనలో పాలకొండ మండలం వెలగవాడకు చెందిన జి.లక్ష్మణరావు(38) అనే వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సీతంపేట నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆటో ఇసుకగెడ్డ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న లక్ష్మణరావు అపస్మారక స్థితికి చేరుకోగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనంలో క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే లక్ష్మణరావు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధవులు ఆరోపిస్తూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మృతుడికి భార్య మేరీ, ఇద్దరు ఆడపిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మరో నలుగురికి గాయాలు -
కర్రల మిషన్‌లో పడి మహిళ మృతి
గంట్యాడ: పని చేస్తున్న కర్రల మిషనే ఆమె పాలిట యమపాశమైంది. ప్రమాదవశాత్తూ మిషన్‌లో పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తమతో పనిచేసిన మహిళ కళ్లెదుటే మృతి చెందడంతో సహచర కూలీలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కిడాం గ్రామానికి చెందిన అసకపల్లి జ్యోతి అనే మహిళ, అదే గ్రామానికి చెందిన కొంతమంది మహిళలతో కలిసి సిరిపురం సచివాలయం ఎదురుగా ఉన్న నీలగిరి కర్రల డిపోలో పనికి వచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం నీలగిరి కర్రలను మిషన్‌లో వేస్తుండగా చీర కొంగు మిషన్‌లోకి చిక్కుకు పోవడంతో ఒక్కసారిగా మిషన్‌లో పడిపోయింది. దీంతో ఆమె అక్కడక్కడే మృతి చెందింది. మృతిరాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు -
కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు..
తాను తయారు చేసిన వాహనంపై కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్‌తో గౌతమ్ (ఫైల్)● 15 గంటల్లో బైక్ తయారీ చేసిన గౌతమ్ ● బ్యాటరీలతో సరికొత్త వాహనాలు డిజైన్ ● స్టీరింగ్ లేని కారు, వ్యవసాయానికి ఉపయోగపడే స్ప్రేయర్లు కూడా..పార్వతీపురం టౌన్: పట్టణానికి చెందిన గెంబలి గౌతమ్ విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తి చేశాడు. చూసే ప్రతి కళా ఒడిసి పట్టడమంటే చిన్నప్పటి నుంచి సరదా. అదే అలవాటుగా మారి.. నూతన ఆవిష్కరణలకు బీజం పోసింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకూ కొత్త ఆలోచనలతో సాగిపోతున్నాడు. రోజురోజుకూ పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరి మన్ననలను పొందుతున్నాడు. కళాత్మక ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఆవిష్కరణలను చూసి ఔరా అని అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అనాల్సిందే. విభిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్న గౌతమ్ ఆలోచనలను ఒక్కసారి పరిశీలిస్తే.. దివ్యాంగులకు స్టీరింగ్ లేని కారు.. దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారుని తయారు చేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బురపరిచాడు. ఈయన రూపొందించిన కారుకి స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారుని తయారు చేశాడు. కాళ్లు వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించారు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలూ ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం నుంచి గౌతమ్ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి వారికి అందజేశారు. ఏ ఆలోచన వచ్చినా.. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటివరకూ స్టీరింగ్ లెస్ కారుతో పాటు రెయిన్ బో స్కూటర్, రెండింతల మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంతమందికి డిజైన్చేసి అందజేశాను. చిన్నప్పటినుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. – జి.గౌతమ్, యువకుడు, పార్వతీపురం. ఈ–బైక్ తయారీలో తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటలపాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టమ్, హ్యాండ్ బ్రేక్ ఉపయెగించాడు. రాత్రి కూడా సునాయాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్‌లైట్ అమర్చాడు. పట్టణానికిచెందిన ఓ వ్యాపారి ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా 15 గంటలో పూర్తి చేయడం విశేషం. కొత్త ఆవిష్కరణలు.. పెట్రోల్ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీనివల్ల సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపించేలా సరికొత్త డివైజ్‌లు రూపొందించాడు గౌతమ్. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులను చేసి లీటర్ పెట్రోల్ గతంలో ఇచ్చిన మైలేజ్ కంటే డబుల్ వచ్చేలా చేశాడు. ఇప్పటికే ప్రాక్టికల్‌గా పరీక్షించిన గౌతమ్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాడు.తక్కువ ఖర్చుతోనే స్కూటర్.. ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13 వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను గౌతమ్ రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, అయితే ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. సత్కారం.. జిల్లాకు చెందిన గౌతమ్ నూతన ఆవిష్కరణలతో ముందుకు వెళ్తూ యువ శాస్త్రవేత్తగా జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నారని కలెక్టర్ కొనియాడారు. ఇటీవల ఉగాది పురస్కారం అందజేసి సత్కరించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు చేపట్టి అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
గిరిజన యూనివర్సిటీకి పరిశోధనా ప్రాజెక్ట్
విజయనగరం అర్బన్: కేంద్రియ గిరిజన యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బయోటెక్నాలజీ విభాగానికి రూ.4 కోట్ల విలువైన పరిశోధనా ప్రాజెక్ట్ మంజూరైంది. శనివారం స్థానిక యూనివర్సిటీ క్యాంపస్‌లో వీసీ టీవీ కట్టిమణి విలేకరులతో మాట్లాడుతూ.. ‘గిరిజనులలో సికిల్‌సెల్ ఎనీమియా’ అనే ఆరోగ్య సమస్యపై పరిశోధన చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవికి అప్పగించిందని తెలిపారు. ఆదివాసీలు అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాలలో సికిల్ సెల్ వ్యాధి నివారణకు రూ.4 కోట్ల వంతున మంజూరు చేయనున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి చేపడుతున్నారని చెప్పారు. తాజాగా యూనివర్సిటీ తరఫున వచ్చిన ఈ పరిశోధనా మిషన్‌లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆదివాసులపై పరిశోధనలు చేపడతారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి -
నెలల తరబడి బిల్లులు పడలేదు...
మాకు నెలల తరబడి ‘ఉపాధి’ బిల్లులు పడలేదు. గతంలో నాలుగైదు రోజుల్లో డబ్బులు మా చేతిలో పడేవి. ఇప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. – బెవర త్రినాథరావు, వేతనదారుడు, వన్నలి, రేగిడి మండలం ––––––––––––––––––––– వేతనాలు అందక ఇబ్బందులు మండుటెండలో చాలా దూరం నడిచి ఉపాధి హమీ పనులకు వెళ్తున్నాం. కానీ సకాలంలో వేతనాలు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – కల్లూరి సింహాచలం, వేతనదారుడు, పెదమానాపురం –––––––––––––––––––––––––––– మండుటెండలో పనికి వెళ్తున్నాం... గత ప్రభుత్వంలో ఉపాధి పనికి వెళ్తే వేతనం గిట్టుబాటు అయ్యేది. సకాలంలో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. మండుటెండలో పనికి వెళ్తున్నాం. అయినా ప్రభుత్వం కనికరించట్లేదు. – వెంకటరమణ, వేతనదారుడు, పెదమానాపురం –––––––––––––––––––––––––––– కష్టపడి పనిచేస్తున్నా సుఖం లేకపోతోంది ఉపాధి హామీ వేతనాలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. రోజూ కిలోమీటరు దూరంలోని బ్యాంకుకు వెళ్లి డబ్బులు పడ్డాయో లేవో అని బ్యాంకు ఖాతాను తనిఖీ చేసుకోవడమే సరిపోతోంది. ఇంకా డబ్బులు పడలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో నిరాశతో తిరుగొస్తున్నాం. – ఎన్ రమణ, ఒమ్మి, నెల్లిమర్ల మండలం -
గ్రూప్ – 2 ఫలితాల్లో శ్రీనివాస్ సత్తా
విజయనగరం అర్బన్: ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ – 2 మెయిన్ ఫలితాల్లో మండలంలోని సుంకరిపేటకు చెందిన మాజీ వాయుసేనాని సుంకర శ్రీనివాస్ సత్తా చాటారు. 2004 నుంచి 20 సంవత్సరాల పాటు ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్మన్గా సేవలు అందించి 2024 జనవరిలో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ.. గత నెలలో విడుదలైన ఎస్ఎస్సీ సీజీఎల్ పోటీ పరీక్షలో జీఎస్టీ అండ్ కస్టమ్స్ శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. అయితే గ్రూప్ – 2 ఫలితాల్లో విజేతగా నిలవడంతో ఈ పోస్టులోనే జాయిన్ అవుతానని శ్రీనివాస్ తెలిపాడు. యువకుడి అదృశ్యం పార్వతీపురం రూరల్: మండలంలోని డోకిశీల గ్రామానికి చెందిన చింతల కిశోర్ అనే యువకుడు ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై బి. సంతోషికుమారి తెలిపారు. ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కిశోర్‌ను మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆటో బోల్తా ● పది మందికి గాయాలు బొబ్బిలి రూరల్: మండలంలోని ముత్తాయివలస గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తలకు గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పక్కి గ్రామంలో ఒకరు మృతి చెందగా.. కొండదేవుపల్లి గ్రామానికి చెందిన బంధువులు పరామర్శకు ఆటోలో బయలుదేరారు. సరిగ్గా కమ్మవలస వద్దకు వచ్చేసరికి ఆటో బోల్తా పడడంతో అందులో ఉన్న పదిమందికీ గాయాలయ్యాయి. వెంటనే వీరిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించగా.. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. వీరిలో బి.పారినాయుడు, లక్ష్మున్నాయుడు తలలకు గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే బేబినాయన, డీఎస్పీ భవ్యారెడ్డి, తదితరులు పరామర్సించారు. మద్యం సీసాల పట్టివేత బొండపల్లి: మండలంలోని గరుడుబిల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిలో 65 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై యు. మహేష్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శనివారం గ్రామంలో తనిఖీలు చేపడుతుండగా.. మహేష్ ఇంటిలో మద్యం బాటిళ్లు దొరికాయి. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో సిబ్బంది తాళ్లపూడి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. పశువుల శాల కూలి ఆవు మృతి వీరఘట్టం: మండలంలోని దశుమంతపురం గ్రామంలో పశువుల శాల కూలి ఆవు మృతి చెందింది. శుక్రవారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి కెంగువ గణేష్‌కు చెందిన పశువుల శాల కూలిపోయింది. ఆ సమయంలో శాలలో రెండు ఆవులు, రెండు దూడలుండగా.. ఒక ఆవు, రెండు దూడలు తప్పించుకున్నాయి. ఒక ఆవు మాత్రం మృతి చెందింది. విషయం తెలుసుకున్న వీఆర్ఓ రాజేంద్ర శనివారం గ్రామానికి చేరుకుని పశువుల శాల, ఆవు కళేబరాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని చెప్పారు. బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పిడుగుపాటుకు మరో ఆవు..కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం పిడుగు పడడంతో పి. సత్యనారాయణకు చెందిన ఆవు మృతి చెందింది. ఇంటి సమీపంలోని కళ్లంలో ఆవును కట్టగా.. ఒక్కసారిగా పిడుగు పడడంతో తమ జీవనాధారమైన ఆవు మృతి చెందిందని సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. -
సీతారాముల కల్యాణం చూతము రారండి
నెల్లిమర్ల రూరల్: జిల్లాలోని రామాలయాలన్నీ సీతారాముల కల్యాణోత్సవానికి ముస్తాబయ్యాయి. మామిడి కొమ్మల తోరణాలు, పూలదండలతో అలంకరించిన పందిళ్లు, విద్యుత్ దీపాల వెలుగులతో ఆలయాలు మిరమిట్లు గొలుపుతున్నాయి. జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి ఆలయం శ్రీరామనవమి వేడుకులకు ముస్తాబయింది. స్వామివారి కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు అనువుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నమందు కల్యాణ ఘట్టం పూర్తికాగానే స్వామివారి ముత్యాల తలంబ్రాల పంపిణీకి ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయించారు. ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పుష్ఫాలతో సుందరంగా అలంకరించారు. పోలీసులు సుమారు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తుకు సన్నద్ధమయ్యారు. ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓ రామతీర్థంలో రాములోరి కల్యాణోత్సవ ఏర్పాట్లను ఆర్డీఓ దాట్ల కీర్తి శనివారం పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి స్వామివారి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆమె వెంట ఈఓ శ్రీనివాసరావు ఉన్నారు. -
ఉలిక్కిపడిన శివరాం
చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో యువతికి ప్రథమ చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది చీపురుపల్లిరూరల్ (గరివిడి): పట్టపగలు.. అందరూ వీధిలో తిరుగాడుతుండగా.. శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇంటి ఆవరణలో పాత్రలు కడిగే పనుల్లో నిమగ్నమైన యువతిపై ముసుగు వేసుకుని వచ్చిన యువకుడు కత్తితో దాడిచేసి పరారైన ఘటనతో గరివిడి మండలం శివరాం గ్రామం ఉలిక్కిపడింది. ఎన్నడూ చూడని, జరగని విధంగా యువతిపై దాడిచేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మహిళలకు రక్షణలేదన్న మాటే అందరినోటా వినిపించింది. ఇంటివద్ద ఉంచినా అమ్మాయిలకు రక్షణ కల్పించలేకపోతున్నా మన్న ఆవేదన గ్రామస్తుల్లో కనిపించింది. మద్యం ఏరులైపారుతుండడం, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో కొందరు యువకులు భయం లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నాంటూ జనం మండిపడ్డారు. అదును చూసుకుని... శివరాం గ్రామానికి చెందిన బాధితురాలు కోండ్రు అఖిల తల్లిదండ్రులతో పాటు నానమ్మ, ఇద్దరు అన్నదమ్ములతో కలిసి ఉంటోంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు పనికి వెళ్లిపోయారు. నాన్నమ్మ, అఖిల మాత్రమే ఇంటిలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన యువకుడు సినిమా సన్నివేశాన్ని తలపించేలా మంకీ క్యాప్ ధరించి పరుగున ఇంటి పనుల్లో నిమగ్నమైన అఖిల వద్దకు వెళ్లాడు. క్షణం ఆలోచించకుండా విచక్షణారహితంగా కత్తితో దాడిచేశాడు. కడుపు పక్కభాగంలో రెండు చోట్ల గాయపరిచాడు. యువతి కేకలు వేయడంతో పరారయ్యాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించి చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇంటిలో ఉండే ఆడబిడ్డ కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితికి చేరడంతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువతి పరిస్థితి విషమం... కత్తిపోట్లకు గురైన అఖిల పరిస్థితి విషమంగా ఉందని వైద్యబృందం తెలిపినట్లు బంధువర్గాలు చెబుతున్నాయి. యువతి కడుపులోకి బలంగా కత్తిపోట్లు వెళ్లడంతో లోపల లివర్ భాగానికి తగిలి రక్తస్రావం జరుగుతోంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్నట్టు యువతి బంధువులు తెలిపారు. ఎస్పీ సందర్శన.. సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్పీ వకుల్‌జిందాల్ గ్రామానికి చేరుకుని డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం సీఐ ఉపేంద్ర, గరివిడి ఎస్ఐ బి. లోకేశ్వరరావుతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో సాంకేతిక ఆధారాలు సేకరించారు. యువతిపై జరిగిన దాడి కేసు మిస్టరీని ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. పోలీసుల అదుపులో అనుమానితులు ఈ దాడి సంఘటనలో పోలీసులు అదే గ్రామానికి చెందిన ప్రధాన అనుమానితుడు బూర్లె ఆదినారాయణతో పాటుగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇంటి ఆవరణలో పనిచేస్తున్న యువతిపై కత్తిపోట్లు ముఖానికి మంకీ క్యాప్ ధరించి కత్తితో పొడిచి పరారైన దుండగుడు యువతికి తీవ్రగాయాలు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ఎస్పీ వకుల్ జిందల్ డాగ్‌స్క్వాడ్, క్లూస్టీమ్స్తో ఆధారాలు సేకరించిన పోలీస్ బృందం నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. గరివిడి మండలం శివరాం గ్రామానికి చెందిన కోండ్రు అఖిల అనే 18 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన ఓ నిందితుడు కత్తితో దాడి చేయడంతో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను జెడ్పీ చైర్మన్ శనివారం ఆస్పత్రిలో పరామర్శించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అధైర్య పడొద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చులకోసం పార్టీ తరఫున రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిలపై దాడిఘటన విషయాన్ని తెలుసుకున్న మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ యువతిని పరామర్శించి, అండగా ఉండాలని చెప్పారన్నారు. కొద్దిరోజుల కిందట భీమిలి నియోజకవర్గంలో కూడా ఓ యువతి తల్లిని చంపేశారని, యువతి ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఇదే నియోజకవర్గంలో చిన్నారిపై ఓ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డడాని చెప్పారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని 12 రోజులపాటు ప్రాణాలతో పోరాడి చనిపోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. వీధిరౌడీల్లా మహిళలపై తెగబడుతున్నారన్నారు. పట్టపగలే ఇళ్లలోని చొరబడి దాడులుకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి భయానక పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రాజమండ్రి నిందితుడిని ఇంతవరకు పట్టుకోలేదన్నారు. మహిళలపై రోజుకి 60, 70 సంఘటనలు జరుగుతుండడం విచారకరమన్నారు. ఆడపిల్లలపై చేయివేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని కూటమి నేతలు చెప్పారని, మరి ఇంతవరకు ఎంతమందని శిక్షించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పగలు కూడా మహిళలు రోడ్డుపై ప్రయాణించేందుకు భయపడే పరిస్థితులు నెలకున్నాయన్నారు. గ్రామాల్లో కిళ్లీ బడ్డీల్లో కూడా మద్యం ఏరులై పారుతోందన్నారు. గంజాయి నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దిశయాప్ ఉండేదని, ఆ యాప్ ఫోన్లో ఉండడం వల్ల మహిళలకు రక్షణ ఉండేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వమే అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనడం హాస్యా స్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారని ఆరోపించారు. ఆస్పత్రి వార్డుల్లో పర్యటిస్తే కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుతీరు మంత్రికి బోధపడుతుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు అమ్మవడి, ఫీజురీయింబర్స్‌మెంట్, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు విద్యార్థుల చదువుకు అండగా ఉండేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఫీజులు చెల్లించలేక చదువుకు స్వస్థిచెప్పే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘనతను కూటమి ప్రభుత్వం మూటగట్టుకుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యలత, గరివిడి ఎంపీపీ మీసాల విశ్వేశరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మహిళలపై వీధి రౌడీల్లా తెగబడుతున్నారు పట్టపగలే మహిళలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి మద్యం ఏరులై పారుతోంది.. కిళ్ల్లీ బడ్డీల్లో కూడా మద్యం దొరుకుతోంది గంజాయి నియంత్రణలోనూ విఫలం ఆడ పిల్లలపై చేయివేస్తే అది చివరి రోజు అన్నారు.. మరి ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో కూటమి నేతలు చెప్పాలి.. జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కత్తిదాడికి గురైన యువతికి పరామర్శ వైఎస్సార్సీపీ తరఫున రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేత -
క్రీడా శిక్షకుల శిక్షణకు పిలుపు
మంచి అవకాశం క్రీడారంగంపై ఆసక్తి ఉన్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ మంచి అవకాశం కల్పించింది. ఆరు వారాల పాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణఇచ్చి వారికి శిక్షకులుగా గుర్తింపు ఇవ్వనుంది. దీనికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 6 నుంచి జూలై 2వ తేదీ వరకు ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సెల్: 94917 67327 నంబర్‌ను సంప్రదించగలరు. – ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి, విజయనగరం విజయనగరం: క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడమే కాదు.. అవసరమైతే అదే క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు, వారికి తర్ఫీదు ఇచ్చేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ అవకాశం కల్పిస్తోంది. క్రీడా శిక్షకుడిగా ఎదగాలని ఉందా? పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారా అలాంటి వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ ఓ వేదికను ఏర్పాటు చేసింది. ఇది వరకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి చాలా మంది శిక్షణ పూర్తి చేసుకొని ధ్రువపత్రాలు సాధించారు. నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో 23 క్రీడాంశాల్లో ఆరు వారాల శిక్షణ ధ్రువపత్రం కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటర్మీడియట్.. ఆపై.. ఇంటర్మీడియట్, ఆపై ఉత్తీర్ణత సాధించి 20 నుంచి 42 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జిల్లా స్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో తొలి మూడు స్థానాలు, రాష్ట్ర స్థాయి ఆలిండియా వర్సిటీ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ యూనివర్సిటీ స్థాయి పోటీలకు ప్రాతినిథ్యం, ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలు జానియర్, సీనియర్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. జూలై 2 వరకు దరఖాస్తుల నమోదుకు అవకాశం ఆరు వారాల ధ్రువపత్రం కోర్సులో 30 రోజులు థియరీ, 14 రోజులు ప్రాక్టికల్స్ ఉంటాయి. అర్హులు మే 6 నుంచి జూలై 2వ తేదీలోగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డబ్ల్యూసిసి.ఎన్ఎస్ఎన్ఐఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణకు ఎంపికై న వారి జాబితాను అర్హతలను బట్టి విడుదల చేస్తారు. శిక్షణ కేంద్రాలు క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడ ఆధారంగా శిక్షణ కేంద్రం కేటాయిస్తారు. క్రీడాకారులు ఎంపికై న తర్వాత ఏకరూప దుస్తులు, క్రీడా శిక్షణ కాలంలో ధరించడానికి సాధారణ దుస్తులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలా, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో ఎన్ఎస్ఎన్ఐఎస్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఏయే అంశాల్లో.. సైక్లింగ్, క్రికెట్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, రోబాల్, రోయింగ్, సాఫ్ట్‌బాల్, షూటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, టేబుల్‌టెన్నిస్, లాన్స్టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషూ, యోగా తదితర క్రీడాంశాలుంటాయి. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న భారత క్రీడా ప్రాధికార సంస్థ ఆరు వారాలపాటు శిక్షణ ధ్రువపత్రం అందజేత -
సమస్యలపై బొత్స ఆరా
చీపురుపల్లిరూరల్(గరివిడి): వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రజల సమస్యలపై ఆరా తీశారు. వైఎస్సార్ సీపీ గరివిడి కార్యాలయంలో చీపురుపల్లి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఉపాధి హామీ బిల్లుల పెండింగ్‌పై ఆరా తీశారు. కొత్త పింఛన్ల పంపిణీ తీరును నాయకులను అడిగి తెలుసుకున్నారు. 75 రోజులుగా ఉపాధి హామీ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వేతనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక నాయకులు బొత్సకు వివరించారు. ఈ సమస్యపై ఆయన పంచాయతీరాజ్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. 75 రోజులుగా వేతనదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ సోమవారం బిల్లులు మంజూరవుతాయని చెప్పారు. చీపురుపల్లి నియోజకవర్గంలో పింఛన్ల కోసం 800 మంది అర్హులు ఉన్నా ఎవరికీ మంజూరు కాలేదని స్థానిక నాయకులు బొత్సకు తెలియజేశారు. చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామానికి చెందిన నేవీ కమాండర్ ప్రమాదంలో మరణించినప్పటికీ ఆయన కుటుంబానికి చెందాల్సిన ఐదు ఎకరాల భూమి ఇంత వరకు రాలేదని గ్రామానికి చెందిన నాయకులు ఆయన దృష్టికి తీసుకురాగా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పనులు చురుగ్గా జరిగేవని, ఆ పనులు ఇప్పడు జరుగుతున్నాయా అని నాయకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ మండల నాయకుడు ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గరివిడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చీపురుపల్లి మండల నాయకులతో సమావేశం -
ఆకట్టుకోనున్న గోటి తలంబ్రాల సేవ..
● పార్కింగ్: రామతీర్థంలో నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకల్లో స్వామివారి కల్యాణానికి గోటి తలంబ్రాలను ఉపయోగించనున్నారు. గడిచిన మూడు నెలలుగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో పలువురు భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. భద్రాచలంలో ఏటా జరుగుతున్న శ్రీరాముడి కల్యాణానికి వినియోగించినట్టే రామతీర్థంలో శ్రీరామడి కల్యాణానికి కూడా శ్రీకష్ణ చైతన్య సంఘం వారు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. కల్యాణం అనంతరం తలంబ్రాల సేవను అర్చకులు జరిపించనున్నారునెల్లిమర్ల రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి కల్యాణశోభ సంతరించుకుంది. సీతారాముల కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తజనం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రామస్వామి వారి దేవస్థానం సమీపంలోని స్వామివారి కల్యాణ మండపంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం నుంచి సీతారామస్వామివారి పరిణయం వేడుకగా జరగనుంది. కల్యాణం నిర్వహించే వేదికను సుందరంగా అలంకరిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఐదు రోజుల నుంచే ఆలయానికి కల్యాణ శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది రుత్వికులు స్వామివారి సన్నిధిలో పారాయణాలు, లక్ష తులసీ దళార్చన, కుంకుమార్చన తదితర కార్యక్రమాలను నిర్విరామంగా జరుపుతున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శనం ఇలా... రూ.50 టికెట్ తీసుకునే భక్తులకు తూర్పు రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత దర్శనం ఉత్తర రాజగోపురం ద్వారా అనుమతిస్తారు. సీతారామచంద్రస్వామి వారి కల్యాణం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు వివిధ రకాల సదుపాయాలను కల్పించారు. ఎండ తీవ్రత దష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రత దష్ట్యా కల్యాణ ప్రాంగణంలో స్వామివారి కల్యాణాన్ని భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, భక్తులు కూర్చునే వద్ద చల్లగా ఉండేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు మజ్జిగ, తాగునీరు, చిన్న పిల్లలకు పాలు అందించనున్నారు. సతివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల ప్రయాణం చేసి రామతీర్థం చేరుకోవచ్చు. ఆటోల్లో వచ్చే వారు కోట జంక్షన్ నుంచి నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్‌కు చేరుకొని అక్కడ నుంచి 5 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రణస్థలం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి సతివాడ మీదుగా రామతీర్థానికి చేరుకోవచ్చు. ● ఆలయ ప్రాంగణం వద్ద, కళ్యాణ వేదిక ప్రారంభం వద్ద ● తలంబ్రాల కౌంటర్: స్వామివారి కళ్యాణ వేదిక వద్ద ఎడమ భాగాన ● ప్రాథమిక చికిత్సా కేంద్రం: కల్యాణ వేదిక ప్రాంగణంలో.. ● ప్రసాదాల కౌంటర్: తూర్పు రాజగోపురం వద్ద ● స్నానపుగదులు: రామకోనేరు వద్ద (డార్మెటరీ భవనం పక్కన) ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల 6న సీతారాముల కల్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి ప్రచా రాన్ని బాగానే నిర్వహించాం. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. భక్తులకు మంచినీరు, మజ్జిగ, చిన్న పిల్లలకు పాలు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత ప్రసాదాల పంపిణీకి చర్యలు తీసుకున్నాం. – వై.శ్రీనివాసరావు, ఈఓ, రామతీర్థం దేవస్థానం● ఇలా చేరుకోవాలి: సీతారాముల కల్యాణం చూతము రారండి రాములోరి పెళ్లికి చురుగ్గా ఏర్పాట్లు తిరుపతి నుంచి వచ్చిన పట్టువస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా గోటితో ఒలిచిన కోటి తలంబ్రాల సేవ ముత్యాల తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు -
గజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి కూడలి వద్ద గర్భాం రోడ్డులో గురువారం పెదమానాపురం ఎస్సై జయంతి సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా ఆటోలో తరలిస్తున్న 16.1కేజీ గంజాయిని ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గజపతినగరం సీఐ జీఏవీ రమణతో కలిసి ఆమె మాట్లాడుతూ రాజస్దాన్ రాష్ట్రం జాలోర్ జిల్లా, చైల తహీల్ గ్రామానికి చెందిన సురేష్ కుమార్ పురోహిత్, గోపాల్ పురోహిత్‌లు, అలాగే ఒడిశాలోని పొట్టంగి పోలీస్‌స్టేషన్ పరిధి కురియలపాడు గ్రామానికి చెందిన జన్ని అప్పన్న, మజ్జి అప్పరావు, జన్ని అప్పన్నలను ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇందులో మరికొంత మంది అనుమానితులు ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకోనున్నామన్నారు. గంజాయి తరలిస్తున్న వారిని వెంబడించి పట్టుకున్న ఎస్సై జయంతిని ఎస్పీ వకుల్ జిందల్ అభినందించినట్లు చెప్పారు. -
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలి
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సి.ఎం.డి ఇమ్మడి ఫృద్వీతేజ్ అన్నారు. వీటీ అగ్రహారం కోర్టు ఎదురుగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, వి.ఎన్.గ్లోబల్ ఎంటర్ ప్రైజస్ సంస్థ ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఐదువేల విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్‌లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు సౌరవిద్యుత్ యూనిట్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. సంస్థ పరిధిలో ఇప్పటి వరకు 7,800 సూర్యఘర్ యూనిట్లను ఏర్పాటు చేయగా, విజయనగరం జిల్లాలో 700 యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటు, లోడ్ అధికంగా ఉన్న చోట అదనపు ట్రాన్సఫార్మర్లు, ఫీడర్ల విభజనతో వేసవిలో అంతరాయం లేకుండా చేస్తామని తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో 1812 విద్యుత్ కాల్ సెంటర్ మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సేవలందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ డి.చంద్రం, సీజీఎం జంగా శ్రీనివాస్‌రావు, ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, ట్రాన్స్‌కో ఎస్ఈ బాలాజీ, ఈఈలు పి.త్రినాథ్‌రావు, కిరణ్, మురళీ, డీఈ సురేష్‌బాబు, హరి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ ఫృద్వీతేజ్ విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం -
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలి
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సి.ఎం.డి ఇమ్మడి ఫృద్వీతేజ్ అన్నారు. వీటీ అగ్రహారం కోర్టు ఎదురుగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, వి.ఎన్.గ్లోబల్ ఎంటర్ ప్రైజస్ సంస్థ ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఐదువేల విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్‌లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు సౌరవిద్యుత్ యూనిట్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. సంస్థ పరిధిలో ఇప్పటి వరకు 7,800 సూర్యఘర్ యూనిట్లను ఏర్పాటు చేయగా, విజయనగరం జిల్లాలో 700 యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటు, లోడ్ అధికంగా ఉన్న చోట అదనపు ట్రాన్సఫార్మర్లు, ఫీడర్ల విభజనతో వేసవిలో అంతరాయం లేకుండా చేస్తామని తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో 1812 విద్యుత్ కాల్ సెంటర్ మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సేవలందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ డి.చంద్రం, సీజీఎం జంగా శ్రీనివాస్‌రావు, ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, ట్రాన్స్‌కో ఎస్ఈ బాలాజీ, ఈఈలు పి.త్రినాథ్‌రావు, కిరణ్, మురళీ, డీఈ సురేష్‌బాబు, హరి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ ఫృద్వీతేజ్ విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం -
క్రీడా శిక్షకుల శిక్షణకు పిలుపు
మంచి అవకాశం క్రీడారంగంపై ఆసక్తి ఉన్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ మంచి అవకాశం కల్పించింది. ఆరు వారాల పాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణఇచ్చి వారికి శిక్షకులుగా గుర్తింపు ఇవ్వనుంది. దీనికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 6 నుంచి జూలై 2వ తేదీ వరకు ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సెల్: 94917 67327 నంబర్‌ను సంప్రదించగలరు. – ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి, విజయనగరం విజయనగరం: క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడమే కాదు.. అవసరమైతే అదే క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు, వారికి తర్ఫీదు ఇచ్చేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ అవకాశం కల్పిస్తోంది. క్రీడా శిక్షకుడిగా ఎదగాలని ఉందా? పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారా అలాంటి వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ ఓ వేదికను ఏర్పాటు చేసింది. ఇది వరకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి చాలా మంది శిక్షణ పూర్తి చేసుకొని ధ్రువపత్రాలు సాధించారు. నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో 23 క్రీడాంశాల్లో ఆరు వారాల శిక్షణ ధ్రువపత్రం కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటర్మీడియట్.. ఆపై.. ఇంటర్మీడియట్, ఆపై ఉత్తీర్ణత సాధించి 20 నుంచి 42 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జిల్లా స్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో తొలి మూడు స్థానాలు, రాష్ట్ర స్థాయి ఆలిండియా వర్సిటీ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ యూనివర్సిటీ స్థాయి పోటీలకు ప్రాతినిథ్యం, ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలు జానియర్, సీనియర్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. జూలై 2 వరకు దరఖాస్తుల నమోదుకు అవకాశం ఆరు వారాల ధ్రువపత్రం కోర్సులో 30 రోజులు థియరీ, 14 రోజులు ప్రాక్టికల్స్ ఉంటాయి. అర్హులు మే 6 నుంచి జూలై 2వ తేదీలోగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డబ్ల్యూసిసి.ఎన్ఎస్ఎన్ఐఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణకు ఎంపికై న వారి జాబితాను అర్హతలను బట్టి విడుదల చేస్తారు. శిక్షణ కేంద్రాలు క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడ ఆధారంగా శిక్షణ కేంద్రం కేటాయిస్తారు. క్రీడాకారులు ఎంపికై న తర్వాత ఏకరూప దుస్తులు, క్రీడా శిక్షణ కాలంలో ధరించడానికి సాధారణ దుస్తులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలా, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో ఎన్ఎస్ఎన్ఐఎస్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఏయే అంశాల్లో.. సైక్లింగ్, క్రికెట్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, రోబాల్, రోయింగ్, సాఫ్ట్‌బాల్, షూటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, టేబుల్‌టెన్నిస్, లాన్స్టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషూ, యోగా తదితర క్రీడాంశాలుంటాయి. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న భారత క్రీడా ప్రాధికార సంస్థ ఆరు వారాలపాటు శిక్షణ ధ్రువపత్రం అందజేత -
పంచాయతీ వనరుల కేంద్రం సిద్ధం కావాలి
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రధాన కేంద్రంలో ఏర్పాటు కానున్న జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పక్కన రూ.200 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం స్థలాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే జిల్లాలో వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఉంటుందని, అదేవిధంగా ఇతర ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని పంచాయతీ రాజ్‌శాఖ ఇంజినీర్లకు కలెక్టర్ స్పష్టం చేశారు. అందుకే వీలైనంత త్వరగా భవన నిర్మాణ పనులను ప్రారంభించి అప్పగించాలని సూచించారు. ఏడాదిలోగా భవనం పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ, ఈ ఏడాది చివరి నాటికి భవనాన్ని నిర్మించి అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తొలుత భవన నిర్మాణ స్థలాన్ని సందర్శించి, గదుల మార్కింగులను పరిశీలించిన ఆయన భవన నిర్మాణ వివరాలను సంబంధిత ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ వి.సన్యాసిరావు, మండల ఇంజినీరింగ్ అధికారి గంటా చంద్రమౌళి, ఎస్ఎస్. లాజిస్టిక్స్ కాంట్రాక్టర్ సురేష్, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ -
సమస్యలపై బొత్స ఆరా
చీపురుపల్లిరూరల్(గరివిడి): వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రజల సమస్యలపై ఆరా తీశారు. వైఎస్సార్ సీపీ గరివిడి కార్యాలయంలో చీపురుపల్లి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఉపాధి హామీ బిల్లుల పెండింగ్‌పై ఆరా తీశారు. కొత్త పింఛన్ల పంపిణీ తీరును నాయకులను అడిగి తెలుసుకున్నారు. 75 రోజులుగా ఉపాధి హామీ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వేతనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక నాయకులు బొత్సకు వివరించారు. ఈ సమస్యపై ఆయన పంచాయతీరాజ్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. 75 రోజులుగా వేతనదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ సోమవారం బిల్లులు మంజూరవుతాయని చెప్పారు. చీపురుపల్లి నియోజకవర్గంలో పింఛన్ల కోసం 800 మంది అర్హులు ఉన్నా ఎవరికీ మంజూరు కాలేదని స్థానిక నాయకులు బొత్సకు తెలియజేశారు. చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామానికి చెందిన నేవీ కమాండర్ ప్రమాదంలో మరణించినప్పటికీ ఆయన కుటుంబానికి చెందాల్సిన ఐదు ఎకరాల భూమి ఇంత వరకు రాలేదని గ్రామానికి చెందిన నాయకులు ఆయన దృష్టికి తీసుకురాగా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పనులు చురుగ్గా జరిగేవని, ఆ పనులు ఇప్పడు జరుగుతున్నాయా అని నాయకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ మండల నాయకుడు ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గరివిడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చీపురుపల్లి మండల నాయకులతో సమావేశం -
మత్య్సశాఖ ఇన్చార్జి డీడీగా విజయకృష్ణ
విజయనగరం ఫోర్ట్: మత్య్సశాఖ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా ఎం.విజయకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని మత్య్సశాఖలో ఏడీగా పనిచేస్తున్నారు. ఇక్కడ డీడీగా పని చేసిన నేతల నిర్మాలకుమారి జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై రాజమండ్రి బదిలీ అయింది. కృత్రిమంగా పండించిన పండ్లను విక్రయిస్తే చర్యలు ● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ విజయనగరం ఫోర్ట్: రసాయనిక పదార్థాలతో కృత్రిమంగా మగ్గించిన పండ్లను విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదుచేస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ హెచ్చరించారు. తన చాంబర్లో అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమంగా పండించిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుందన్నారు. సెప్టిక్ అల్సర్లు, తలనొప్పి, మైకం ఇతర న్యూరోలాజికల్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ కన్వీనర్‌గా జిల్లా సహాయఫుడ్ కంట్రోలర్ ఉంటారని, జిల్లా ఉద్యాన అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్, మార్కెటింగ్‌శాఖ ఏడీ సభ్యులుగా ఉంటారన్నారు. నైపుణ్యంతోనే రాణింపు చీపురుపల్లిరూరల్(గరివిడి): విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే భవిష్యత్‌లో ఉన్నతంగా రాణిస్తారని తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ జె.వి.రమణ తెలిపారు. గరివిడి శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల ద్వితీయ వార్షిక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాలలో నూతన క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. పశు వైద్యాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులు మూగజీవాలకు సేవ చేయాల్సి ఉంటుందని, అందుకు తగిన అన్ని రకాల శిక్షణ విద్యార్థి దశలోనే పొందాలన్నారు. క్రీడా విజేతలను పతకాలతో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను, సీతం ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ శశిభూషణ్‌రావు, జిల్లా పశువైధ్యాధికారి వై.వి.రమణ, డిప్యూటీ డైరెక్టర్ మోహినికుమారి, తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ కోసం రోడ్డును తవ్వేశారు! ● ఆందోళనకు దిగిన గిరిజనులు ● వెనుదిరిగిన లే అవుట్ సిబ్బంది శృంగవరపుకోట: ఓ ప్రైవేటు లే అవుట్ కోసం ఎస్.కోట మండలం ముషిడిపల్లి పంచాయతీలో చినఖండేపల్లి నుంచి చీడిపాలెం వెళ్లే రోడ్డును పొక్లెయిన్, జేసీబీతో శుక్రవారం తవ్వేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్కూల్ పిల్లల ఆటో వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దశాబ్దాల తరబడి గిరిజనులు రాకపోకలు సాగిస్తున్న రోడ్డును ఎలా తవ్వేస్తారంటూ లే అవుట్ సిబ్బందిని ప్రశ్నించారు. గ్రామస్తుల కోసం మరో రోడ్డు వేస్తామని చెప్పినా ససేమిరా అనడంతో యంత్రాలను తీసుకుని అక్కడి నుంచి రియల్టర్లు పరారయ్యారు. రోడ్డు పనులు చేస్తున్న స్థలం గంట్యాడ రెవెన్యూ పరిధిలో ఉండడంతో వీఆర్వో గణపతి పరిశీలించారు. దీనిపై విచారణ జరుపుతామని గంట్యాడ తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి చెప్పారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వేపాడ: మండలంలోని వీలుపర్తి క్వారీలో పనిచేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోవడంతో గాయాలపాలై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ఇందుకు సంబంధించి వల్లంపూడి ఎస్సై బి.దేవి అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సీహెచ్ సత్తిబాబు(54) వీలుపర్తి క్వారీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి కాలకృత్యాలకు వెళ్లిన సత్తిబాబు రాళ్ల గుట్టపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి గాయాలపాలయ్యాడు. దీంతో అక్కడే ఉన్న తోటి కార్మికులు విశాఖ తరలించి కేజీహెచ్‌లో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయినట్లు మృతుడి కుమారుడు సీహెచ్.రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించినట్లు ఎస్సై బి.దేవి తెలిపారు. మృతిచెందిన సత్తిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.