పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, నేతేటి ప్రశాంత్‌లు అమ్మవారికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
గంట్యాడ: మండలంలోని నరవ గ్రామంలో గల ఎర్ర చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మంగళవారం ఉదయం చెరువులో మృతదేహం తేలడంతో అటువైపు వెళ్లిన గ్రామస్తులు చూసి పోలీసులకు సమచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి మృతుడిని నరవగ్రామానికి చెందిన గేదెల అప్పలనాయుడుగా గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: కోరుకొండ రైల్వేస్టేషన్ ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం పడి ఉన్నట్లు విజయనగరం రైల్వే పోలీసులకు సమాచారం లభించింది. ఇందుకు సంబంధించి జీఆర్‌పీ సిబ్బంది తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. విజయనగం–కోరుకొండ రైల్వేలైన్ ప్రాంతం గుండాలపేట వద్ద 45 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది గుర్తించారు. అయిదున్నర అడుగుల పొడవు కలిగి ఉండి బూడిద రంగు చొక్కా, బిస్కెట్ రంగు ఫ్యాంట్ ధరించిన వ్యక్తి రైలు పట్టాలపై పడి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చిన మేరకు జీఆర్‌పీ హెచ్‌సీ క్రష్ణారావు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గుర్తించిగలిగే వారు ఎవరైనా ఫోన్ 9490617089, 9441013330, 08912883218 నంబర్లను సంప్రదించాలని కోరారు.
వెట్టిచాకిరీ ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం
విజయనగరం అర్బన్: బాపట్ల జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంకకు చెందిన ఎస్టీ సామాజిక వర్గ దంపతుల వెట్టిచాకిరీ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర నివేధిక పంపాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు ఆదేశించారు. తమతో వెట్టిచాకిరీ చేయుస్తున్నారంటూ నంబూరి పద్మ, అగ్రి దంపతులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన బాపట్ల కలెక్టర్‌ను చైర్మన్ అభినందించారు. వెట్టిచాకిరీ చేయించడంతో పాటు, ఆ దంపతులను అమ్మకానికి పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు పేర్కొన్నారు.
పుష్పాలంకరణలో పైడితల్లి
పుష్పాలంకరణలో పైడితల్లి
పుష్పాలంకరణలో పైడితల్లి


