
గజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి కూడలి వద్ద గర్భాం రోడ్డులో గురువారం పెదమానాపురం ఎస్సై జయంతి సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా ఆటోలో తరలిస్తున్న 16.1కేజీ గంజాయిని ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గజపతినగరం సీఐ జీఏవీ రమణతో కలిసి ఆమె మాట్లాడుతూ రాజస్దాన్ రాష్ట్రం జాలోర్ జిల్లా, చైల తహీల్ గ్రామానికి చెందిన సురేష్ కుమార్ పురోహిత్, గోపాల్ పురోహిత్‌లు, అలాగే ఒడిశాలోని పొట్టంగి పోలీస్‌స్టేషన్ పరిధి కురియలపాడు గ్రామానికి చెందిన జన్ని అప్పన్న, మజ్జి అప్పరావు, జన్ని అప్పన్నలను ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇందులో మరికొంత మంది అనుమానితులు ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకోనున్నామన్నారు. గంజాయి తరలిస్తున్న వారిని వెంబడించి పట్టుకున్న ఎస్సై జయంతిని ఎస్పీ వకుల్ జిందల్ అభినందించినట్లు చెప్పారు.