
పోలీస్ శాఖలో నలుగురికి కారుణ్య నియామకాలు
విజయనగరం క్రైమ్: పోలీస్‌శాఖలో కారుణ్య నియామకాలు మొదలయ్యాయి.ఈ మేరకు శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించి శాఖలో మృతిచెందిన నలుగురి కుటుంబసభ్యులకు గురువారం ఎస్పీ వకుల్ జిందల్ నియామక పత్రాలను అందజేశారు. పోలీస్‌శాఖలో ఆర్మ్‌డ్, లా అండ్ ఆర్డర్‌లో వివిధ కారణాలతో ఇటీవల కొందరు మృతి చెందడంతో ఆయా కుటుంబాలలో కారుణ్య నియాకాలను భర్తీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా కుటుంబాలలో అర్హత ఉన్న వ్యక్తులకు ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా తరుణ్‌కుమార్, కోమలత, స్వామినాథ్, సాయిరెడ్డిలకు ఎస్పీ వకుల్ జిందల్ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారు. ఏఆర్ విభాగంలో పనిచేసిన ఏఆర్ హెచ్‌సీలు వెంకటరావు, అప్పలనాయుడు, సివిల్‌లో పనిచేసిన ఏఎస్సై కుమారస్వామి, హెచ్‌సీ చంద్రశేఖర్ ఇటీవలే అనారోగ్యాలతో మరణించారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, డీపీఓ ఏఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వరలక్ష్మి, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి పాల్గొన్నారు.
ఆర్డర్స్ ఇచ్చిన ఎస్పీ వకుల్