
కిరణ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
రాజాం సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ చేబ్రోలు కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని మండల వైస్ ఎంపీపీ నక్క వర్షిణి, వైఎస్సార్ సీపీ నియోజవర్గ మహిళా నాయకురాలు ఎస్.అరుణ రాజాం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల నీచంగా మాట్లాడే కిరణ్‌పై తక్షణమే కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుచేసిన వారిలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు బండి నర్సింహులు, యాలాల వెంకటేష్, సర్పంచ్‌లు కొర్ను ఈశ్వరరావు, కరణం తులసినాయుడు, తదితరులు ఉన్నారు.
15న ఐటీఐలో నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా
● ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి
విజయనగరం అర్బన్: పట్టణంలోని వీటీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన 27వ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా (పీఎంఎన్‌ఏఎం) నిర్వహిస్తామని ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి గురువారం తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అప్రెంటీస్ షిప్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. మైలాన్ ల్యాబొరేటరీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిడెడ్, జయభేరి ఆటోమోటివ్ లిమిటెడ్, శ్యాంసంగ్ ఆథరైజ్‌డ్ సర్వీస్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎస్, నవదీప్ ఎలక్ట్రానిక్స్), పిట్టీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్, జేవై సొల్యూషన్, డెక్కన్ ఫెర్రోఅల్లోయీస్, వోల్టాస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, తదితర కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని పేర్కొన్నా రు. ఎంపికైన వారికి ఆయా పరిశ్రమల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగిన స్టైఫండ్ చెల్లిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్‌కార్డు, రెండు పాస్‌ఫొటోలతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్: 98491 18075, 98499 44654 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అనంతరం అభ్యర్థులు నమోదు చేయాల్సిన క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు.

కిరణ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి