సారా రహిత జిల్లాగా తీర్చి దిద్దుతాం
● ఎకై ్సజ్ శాఖాధికారి బి. శ్రీనాథుడు
● ఏఓబీ గ్రామాల్లో ఎకై ్సజ్ సంయుక్త దాడులు
పార్వతీపురం టౌన్: సారా నియంత్రణే ధ్యేయంగా ఎకై ్సజ్‌శాఖ పనిచేస్తుందని, సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖాధికారి బి. శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ సిబ్బందితో మంగళవారం సరిహద్దు గ్రామాలైన సులభ, పెండిమ, కెరడ, వలవ, వనజ గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దాడుల్లో 11,200 పులిసిన బెల్లపు ఊట, 200లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు తెలిపారు. సారా తయారీకి వినియోగిస్తున్న ప్లాస్టిక్ డ్రమ్ములు, బకెట్లు, నల్లబెల్లం వంటివి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో తయారైన సారా పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం వరకు అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఈ రవాణాను అరికట్టేందుకు సారా బట్టీలను ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా కనీసం మూడుసార్లు అంతర్‌రాష్ట్ర దాడులు నిర్వహిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో డ్రోన్ పరికరాలను ఉపయోగించి సారా తయారీ కేంద్రాలను గుర్తించి మరిన్ని దాడులు నిర్వహిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏఈఎస్ జీవన్ కిశోర్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఒడిశా ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.


