
క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
● ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
విజయనగరం: క్రీడారంగంలో అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో క్రీడాకారులు పోటీ పడుతుంటారని, వారిలో ప్రతిభ కనబరిచిన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం ఎంపీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక విజ్జి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న జిల్లాస్థాయి అండర్–19 క్రీడాకారుల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకారుల ప్రతిభను అడిగి తెలుసుకుని, లక్ష్యం కోసం కష్టపడాలని సూచించారు. ఎంపిక పోటీల్లో విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబు, ట్రెజరర్ వర్మరాజు, అసోసియేషన్ సభ్యులు, హెడ్ కోచ్‌లు పాల్గొన్నారు.