
పరీక్ష ఫెయిలయ్యానని..
భోగాపురం: మండలంలోని ముంజేరు గ్రామానికి చెందిన మొగసాల స్రవంతి (19) అనే యువతి మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వి.పాపారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముంజేరు గ్రామానికి చెందిన స్రవంతి ఇంటర్‌మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 12వ తేదీన వెలువడిన ఇంటర్‌మీడియట్ ఫలితాల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేకపోడవంతో ఆదివారం మధ్యాహ్నం చీరతో ఊయ్యాల హుక్కుకు ఉరివేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి తండ్రి సూరిబాబు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పురుగు మందు తాగి వ్యక్తి..
రామభద్రపురం: మండలంలోని ఎస్.సీతారాంపురం గ్రామానికి చెందిన మునకాల వెంకటరమణ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వి.ప్రసాదరావు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరమణ నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు. మూడేళ్లుగా మానేశాడు. అయితే మూడు నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల రెండు రోజుల నుంచి ఆ నొప్పి కాస్త ఎక్కువవడంతో చిన్న కుమారుడు కార్తీక్ ఆస్పత్రికి తీసుకెళ్లి డాక్టర్‌కు చూపిస్తానని చెప్పినా వినకుండా శనివారం మండలకేంద్రంలోని చిన్నమ్మతల్లి గుడి సమీపంలోని మామిడితోటలో పురుగుమందు తాగేశాడు. దీంతో స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. పెద్ద కుమారుడు పృథ్వీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
మనస్తాపంతో యువతి ఆత్మహత్య