సీతారాముల కల్యాణం చూతము రారండి
నెల్లిమర్ల రూరల్: జిల్లాలోని రామాలయాలన్నీ సీతారాముల కల్యాణోత్సవానికి ముస్తాబయ్యాయి. మామిడి కొమ్మల తోరణాలు, పూలదండలతో అలంకరించిన పందిళ్లు, విద్యుత్ దీపాల వెలుగులతో ఆలయాలు మిరమిట్లు గొలుపుతున్నాయి. జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి ఆలయం శ్రీరామనవమి వేడుకులకు ముస్తాబయింది. స్వామివారి కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు అనువుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నమందు కల్యాణ ఘట్టం పూర్తికాగానే స్వామివారి ముత్యాల తలంబ్రాల పంపిణీకి ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయించారు. ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పుష్ఫాలతో సుందరంగా అలంకరించారు. పోలీసులు సుమారు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తుకు సన్నద్ధమయ్యారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓ
రామతీర్థంలో రాములోరి కల్యాణోత్సవ ఏర్పాట్లను ఆర్డీఓ దాట్ల కీర్తి శనివారం పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి స్వామివారి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆమె వెంట ఈఓ శ్రీనివాసరావు ఉన్నారు.
సీతారాముల కల్యాణం చూతము రారండి
సీతారాముల కల్యాణం చూతము రారండి
సీతారాముల కల్యాణం చూతము రారండి


