
రూ.20 వేలు భృతి ఇస్తామన్నారు...
వేటనిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు భృతి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. 2024–25 సంవత్సరానికి సంబంధించిన భృతి ఇంతవరకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయినా ఇంతవరకు భృతి చెల్లించలేదు. దానిగురించి ఎటువంటి ప్రకటన చేయడం లేదు. దీనిపై పోరాటం చేస్తాం.
– బర్రి చిన్నప్పన్న, మత్య్సకార సహకార
సంఘం జిల్లా అధ్యక్షుడు
భృతి ఏది బాబూ..
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతిని ఇంతవరకు చెల్లించకపోవడం దారుణం. సంక్షేమ పథకాలు దేవుడెరుగు కనీసం... ప్రతి ఏటా ఇస్తున్న వేట నిషేధ భృతి ఇవ్వకపోవడం అన్యాయం.
– వాసుపల్లి అప్పన్న, మత్స్యకారుడు,
తిప్పలవలస
భృతి చెల్లింపునకు ఎలాంటి ఆదేశాలు రాలేదు..
మత్య్సకారుల వేట నిషేధ భృతి చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. నిధులు విడుదల కాలేదు. ఈ నెల 15 వ తేదీ నుంచి చేపలవేట నిషేధం అమల్లోకి వస్తుంది.
– ఎం.విజయకృష్ణ, ఇన్‌చార్జి డీడీ, మత్య్సశాఖ

రూ.20 వేలు భృతి ఇస్తామన్నారు...