క్రీడా శిక్షకుల శిక్షణకు పిలుపు | - | Sakshi
Sakshi News home page

క్రీడా శిక్షకుల శిక్షణకు పిలుపు

Apr 5 2025 12:58 AM | Updated on Apr 5 2025 12:58 AM

క్రీడా శిక్షకుల శిక్షణకు పిలుపు

క్రీడా శిక్షకుల శిక్షణకు పిలుపు

మంచి అవకాశం

క్రీడారంగంపై ఆసక్తి ఉన్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ మంచి అవకాశం కల్పించింది. ఆరు వారాల పాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణఇచ్చి వారికి శిక్షకులుగా గుర్తింపు ఇవ్వనుంది. దీనికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 6 నుంచి జూలై 2వ తేదీ వరకు ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సెల్‌: 94917 67327 నంబర్‌ను సంప్రదించగలరు.

– ఎస్‌.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి, విజయనగరం

విజయనగరం: క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడమే కాదు.. అవసరమైతే అదే క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు, వారికి తర్ఫీదు ఇచ్చేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ అవకాశం కల్పిస్తోంది. క్రీడా శిక్షకుడిగా ఎదగాలని ఉందా? పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారా అలాంటి వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ ఓ వేదికను ఏర్పాటు చేసింది. ఇది వరకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి చాలా మంది శిక్షణ పూర్తి చేసుకొని ధ్రువపత్రాలు సాధించారు. నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో 23 క్రీడాంశాల్లో ఆరు వారాల శిక్షణ ధ్రువపత్రం కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఇంటర్మీడియట్‌.. ఆపై..

ఇంటర్మీడియట్‌, ఆపై ఉత్తీర్ణత సాధించి 20 నుంచి 42 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జిల్లా స్థాయి చాంపియన్‌ షిప్‌ పోటీల్లో తొలి మూడు స్థానాలు, రాష్ట్ర స్థాయి ఆలిండియా వర్సిటీ చాంపియన్‌ షిప్‌, జోనల్‌ ఇంటర్‌ యూనివర్సిటీ స్థాయి పోటీలకు ప్రాతినిథ్యం, ఎస్‌జీఎఫ్‌ జాతీయ స్థాయి పోటీలు జానియర్‌, సీనియర్‌ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి.

జూలై 2 వరకు దరఖాస్తుల నమోదుకు అవకాశం

ఆరు వారాల ధ్రువపత్రం కోర్సులో 30 రోజులు థియరీ, 14 రోజులు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. అర్హులు మే 6 నుంచి జూలై 2వ తేదీలోగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డబ్ల్యూసిసి.ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌.ఇన్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణకు ఎంపికై న వారి జాబితాను అర్హతలను బట్టి విడుదల చేస్తారు.

శిక్షణ కేంద్రాలు

క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడ ఆధారంగా శిక్షణ కేంద్రం కేటాయిస్తారు. క్రీడాకారులు ఎంపికై న తర్వాత ఏకరూప దుస్తులు, క్రీడా శిక్షణ కాలంలో ధరించడానికి సాధారణ దుస్తులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్‌ రాష్ట్రం పటియాలా, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోలకతాలో ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.

ఏయే అంశాల్లో..

సైక్లింగ్‌, క్రికెట్‌, ఫెన్సింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, రోబాల్‌, రోయింగ్‌, సాఫ్ట్‌బాల్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, తైక్వాండో, టేబుల్‌టెన్నిస్‌, లాన్స్‌టెన్నిస్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, ఉషూ, యోగా తదితర క్రీడాంశాలుంటాయి.

దరఖాస్తులు ఆహ్వానిస్తున్న భారత

క్రీడా ప్రాధికార సంస్థ

ఆరు వారాలపాటు శిక్షణ

ధ్రువపత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement