వేడుకగా గురు వందనం
విజయనగరం టౌన్: కేంద్ర సాహిత్య నాటక అకాడమీ పురస్కార గ్రహీత, మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల పూర్వ అధ్యాపకుడు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావును శిష్యప్రశిష్య సమాఖ్య శనివారం గురువందనం పేరుతో సత్కరించింది. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలతో పాటు దేశ, విదేశాల్లో స్థిరపడిన శిష్యులందరూ కలిసి సంగీత కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముందు ప్రముఖ విద్వాంసులు ద్వారం సత్యనారాయణరావు నిర్వహించిన వయోలిన్ కచేరీ ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. విశాఖ మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ గౌరవ కార్యదర్శి రామదాస రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండా సుధారాణి, కట్టమూరి చంద్రశేఖరం, కేఏవీఎల్‌ఎన్.శాస్త్రి, చాగంటి కొండలరావు, త్రినాథరావు, చాగంటి రాజ్యలక్ష్మి, ఎం.ధనలక్ష్మి, విజయలక్ష్మి, కళావతి, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
13 ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు
విజయనగరం టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 13 ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రొగ్రాం కో ఆర్డినేటర్ జె.శ్యామ్‌సుందర్ తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక టీటీడీ కార్యాలయంలో టీటీడీ నుంచి వచ్చిన కంకణాలు, పుసుపు, కుంకుమ, గోవిందనామాలను అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉభయ జిల్లాల్లో నిర్మించిన 13 ఆలయాల్లో ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ ప్రసాద్‌భవానీ, అర్చకుడు పీవీ నరసింహాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
వేడుకగా గురు వందనం


