
మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా గోవిందరావు బాధ్యతల స్వీ
విజయనగరం క్రైమ్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రమంతటా ఉన్న దిశ మహిళ పోలీస్‌స్టేషన్‌లను మహిళా పోలీస్‌స్టేషన్‌లుగా మార్చిన సంగతి విదితమే. విజయనగరం మహిళా పోలీస్‌స్టేషన్‌కు రెండో డీఎస్పీగా ఆర్.గోవిందరావు సోమవారం బాధ్యతులు చేపట్టారు. అనంతరం నేరుగా ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లి ఎస్పీ వకుల్ జిందల్‌ను కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అలాగే స్టేషన్ కు వచ్చిన ప్రతి బాధితురాలి బాధను అర్థం చేసుకుని కేసు నమోదు చేసేలా ప్రవర్తించాలని చెప్పారు. ఇక మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గోవిందరావు 1991లో డిపార్ట్‌మెంట్‌లో చేరి జిల్లాలోని ఎస్.కోట, డెంకాడ, సబ్ మైరెన్, విజయనగరం రూరల్ ఎస్సైగా పనిచేశారు. ఇటీవలే విజయనగరం డీఎస్పీగా పనిచేసిన అనంతరం మహిళా స్టేషన్ డీఎస్పీగా తాజాగా బాధ్యతలు చేపట్టారు.