
బాత్‌రూమ్‌లో పడి వ్యక్తి మృతి
పార్వతీపురం రూరల్: పట్టణంలోని వివేకానంద కాలనీలో బాత్‌రూమ్‌లో పడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పట్టణ పోలీసులు గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన కోరాడ సూర్యనారా యణ (46)అలియాస్ సురేష్ అనే వ్యక్తి ఈనెల 8న తన స్వగృహంలో ఉన్న బాత్‌రూమ్‌లో పడి మృతిచెందాడు. గురువారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీస్ సిబ్బంది వచ్చి పరిశీలించి సూర్యనారాయణ మృతిచెందినట్లు నిర్ధారించి కుటుంబసభ్యులకు సమాచామందించగా ఉగాది రోజున కన్నవారి ఇంటికి వెళ్లిన భార్య హుటాహుటిన వచ్చింది. ఉగాది రోజున భార్య ఊరికి వెళ్లగా సూర్యనారాయణ ఒక్కడే ఇంటిలో ఉంటూ మద్యం తాగిన మత్తులో బాత్‌రూమ్‌లో పడిపోయి ఉంటాడని స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.మురళీధర్ తెలిపారు. మృతునికి ఒక కుమార్తె ఉంది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన