
విజయనగరం
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పట్టపగలే చోరీ..!
ఎస్.కోట మండలం పోతనాపల్లి గ్రామంలోని కిలపర్తి కొండమ్మ ఇంట్లో సోమవారం ఉద యం దొంగలు పడ్డారు. 15 తులాల బంగారు ఆభరణలు దోచుకుపోయారు. –8లో
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు డి.ఏసు. ఇతనిది విశాఖపట్నం జిల్లా మధురవాడ. గత నెల 24వ తేదీన విజయనగరంలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రిలో ఈయన గుండెకు స్టంట్ వేశారు. తదుపరి చికిత్స కోసం సోమవారం రావాలని చెప్పడంతో వ్యయప్రయాసలకోర్చి ఆస్పత్రికి వచ్చారు. సమ్మెలో ఉన్నందున చికిత్స అందించలేమని వైద్యులు చెప్పడంతో చేసేది లేక ఇంటిముఖం పట్టారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు లగుడు త్రినాథ్. ఇతనిది మెంటాడ మండలం లోతుగెడ్డ గ్రామం. ఇతనికి గత నెల 18వ తేదీన విజయనగరంలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. తదుపరి చికిత్స కోసం కుటుంబ సభ్యులు సోమవారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమ్మెలో ఉన్నందున చికిత్స అందించలేమని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు.
సేవలు అందించలేమని
చెప్పేశారు..
నా పేరు ఎస్.శంకర్. మాది మెంటాడ మండలం లోతుగెడ్డ. మా మేనత్తకు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రిలో ఈఏడాది మార్చి నెలలో వెన్నెపూసకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించాం. తదుపరి చికిత్స కోసం సోమవారం ఆస్పత్రికి వచ్చాం. ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లించని కారణంగా సమ్మెలో ఉన్నాం.. సేవలు అందించలేం అని వైద్యులు చెప్పారు. చేసేది లేక ఇంటికి వెళ్లిపోతున్నాం.
● చికిత్సకోసం ఆస్పత్రికి వచ్చే వారికి తప్పని తిప్పలు
● కొంతమంది సొంత డబ్బులతో వైద్యం చేయించుకునే పరిస్థితి
న్యూస్‌రీల్

విజయనగరం

విజయనగరం

విజయనగరం