
క్షేత్ర స్థాయిలో శాఖాపరమైన విధులను గుర్తించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాకు శిక్షణ నిమిత్తం కేటాయించిన 36మంది ప్రొబేషనరీ ఎస్సైలు సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారితో ఎస్పీ మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు. పోలీస్‌శాఖలో అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలను ముందుగా అభినందించారు. క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లను శిక్షణ నిమిత్తం వారికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజా యితీతో పారదర్శకంగా జవాబుదారీ తనం పాటిస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి పోలీస్‌శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని కోరారు. కేటాయించిన పోలీస్‌స్టేషన్ పరిఽ దిలో ఉన్న గ్రామాలను తరచూ సందర్శిస్తూ ము ఖ్యంగా ఏఓబీ ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజలతో మమేకం అవాలని సూచించారు.
కుస్తీలో కొండవెలగాడ
విద్యార్థులకు పతకాలు
నెల్లిమర్ల: మండలంలోని కొండవెలగాడ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పతకాలు సాధించారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు రాజమండ్రిలో జరిగిన జూనియర్ కుస్తీ పోటీల్లో ఎల్ చైతన్య 44 కిలోల విభాగంలో బంగారు పతకం, ఎం.రణదీప్ 48 కిలోల విభాగంలో రజత పతకం, ఎస్ రామాంజనేయులు 47 కిలోల విభాగంలో రజత పతకం కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి. జ్ఞానశంకర్, పీడీ పతివాడ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు అభినందించారు.

క్షేత్ర స్థాయిలో శాఖాపరమైన విధులను గుర్తించాలి