అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం

Published Tue, Apr 8 2025 7:01 AM | Last Updated on Tue, Apr 8 2025 7:45 AM

పార్వతీపురంటౌన్‌: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీదారుల నుంచి 110 అర్జీలు స్వీకరించారు. సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని అర్జీదారులకు భరోసా కల్పించారు. వినతులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యతగల ఎండార్స్‌మెంట్‌ అందజేయాలని అధికారులను ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో

అందిన వినతుల్లో కొన్ని ఇలా..

● కురుపాం మండలం అగంగూడ గ్రామంలో 56 కుటుంబాల వారు తాగునీటి కోసం మూడు కిలోమీటర్ల దూరంలో వేరే ప్రాంతానికి వెళ్లి నీరు తీసుకువస్తున్నామని, వేసవి కారణంగా బావినీరు ఇంకిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అర్జీ చేశారు.

● కొఠియా గ్రామాలైన పగలు చెన్నూరు, పట్టుచెన్నూరు, కొదమ, గంజాయిభద్ర గ్రామాల్లో విద్యార్ధులకు తెలుగు భాష అర్ధం కాకపోవడంతో జాతాపు వలంటీర్లను నియమించాలని అర్జీ అందజేశారు.

● పాచిపెంట మండలం ములయ కంబూరు పంచాయతీలో ములగపాడు, కందివలస, కాకులమామిడి గ్రామాలకు లాగే కీరంగి పంచాయతీలోని వంకమామిడి, కప్పరాయి గ్రామాలకు తాగునీటి బోర్లు మంజూరు చేయాలని విన్నవించారు.

● కురుపాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన కాలువలు, రహదారి పనులు పూర్తి చేసి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు దరఖాస్తు అందజేశారు.

● జియ్యమ్మవలస మండలం బూరిరామినాయుడు వలసలో సామాజిక భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు వినతి అందజేశారు.

● వందశాతం వైకల్యంతో మంచాన పడిఉన్న తనకు ఎన్‌టీఆర్‌ భరోసా కింద రూ. 15వేలు పింఛన్‌ అందజేయాలని వీరఘట్టం మండలం దశమంతపురం గ్రామానికి చెందిన ఎన్‌. విజయకుమార్‌ దరఖాస్తు అందజేశారు. కార్యక్రమంలో జేసీ ఎస్‌ఎస్‌ శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్‌ శ్రీవాత్సవ, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, డ్వామా పీడీ రామచంద్రరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జవాబుదారీ తనంతో పిటిషన్లకు పరిష్కారం

పార్వతీపురం రూరల్‌: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి జవాబుదారీ తనంతో వ్యవహరించి పిటిషన్లకు పోలీసు శాఖ పరంగా పరిష్కారం చూపించడనున్నట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల దగ్గర 9 అర్జీలను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త, అత్తారింటి వేధింపులు, ఆన్‌లైన్‌ మోసాలు, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ప్రేమ పేరుతో మోసాలు ఉన్నాయి. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం తదితరులు ఉన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 56 వినతులు

సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 56 వినతులు వచ్చాయి. పీఓ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి వినతులు స్వీకరించారు. చెక్‌డ్యాం నిర్మించాలని కుమ్మరిగుంటకు చెందిన శంకరరావు కోరారు. సీసీ రహదారి నిర్మించాలని కోతాంకు చెందిన బిడ్డిక శ్రీను విన్నవించారు. గురండికి చెందిన రవికుమార్‌ చేసిన రోడ్డుపనులకు బిల్లులు చెల్లించాలని కోరారు. లక్కాయిగూడ–శిలిగాంకు నూతన రహదారి నిర్మించాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. సన్నాయిగూడ గిరిజనులు పవర్‌వీడర్‌ ఇప్పించాలని విన్నవించారు. సీసీ డ్రైన్స్‌ నిర్మించాలని దిగువదరబ గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ డీడీ అన్నదొర, పీహెచ్‌వో ఎస్‌వీ గణేష్‌, ఏటీడబ్ల్యూవో మంగవేణి, డీఈ సింహాచలం పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌

పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు

అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం1
1/2

అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం

అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం2
2/2

అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement