
గిరిజన బాలింత మృతి
సాలూరు: పాచిపెంట మండలంలోని గిరిశిఖర మోదుగ పంచాయతీ గ్రామానికి చెందిన గిరిజన బాలింత సేబి లక్ష్మి(30) మరణించింది. గురువారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్‌లో ఆమెను తీసుకురాగా ఆస్పత్రిలో బెడ్ మీద వేయగానే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మి సుమారు రెండు నెలల క్రితం మూడవ బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురికాగా పాచిపెంట సీహెచ్‌సీకి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఒకరోజు వైద్యం తరువాత ఆమెను మళ్లీ గ్రామానికి తీసుకువెళ్లారు. అయితే ఆమెకు పచ్చకామెర్లు వచ్చాయని పసర వైద్యం చేయించినట్లు తెలియవస్తోంది. దీంతో ఒళ్లంతా వాపులు రావడంతో సాలూరు ఏరియా ఆస్పత్రికి గురువారం ఉదయం తీసుకువచ్చారు. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షిని వివరణ కోరగా, గురువారం ఉదయం ఆస్పత్రికి ఆమెను తీసుకువచ్చారని, బెడ్ మీద వేసిన కొన్ని నిమిషాల్లోనే మరణించిందన్నారు. సెప్టిక్‌షాక్ విత్‌మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మృతిచెందినట్లు చెప్పారు. ఆమెకు పచ్చకామెర్లు రావడంతో ఇంటివద్ద పసర వైద్యం చేయించామని బంధువులు చెప్పారన్నారు.
పసర వైద్యమే కారణమా?