జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బబిత
విజయనగరం లీగల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎం.బబితను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ మూడేళ్లుగా పనిచేస్తున్న బి.సాయికళ్యాణ్ చక్రవర్తిని గుంటూరుకు బదిలీచేసింది. జిల్లా ప్రధాన న్యాయ మూర్తిగా సాయికళ్యాణ్ చక్రవర్తి న్యాయపరిపాలనలో తమదైన ముద్రవేసుకున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్‌లపై అవగాహన కల్పిస్తూ పెండింగ్ కేసుల పరిష్కారానికి విశేష కృషిచేశారు. కొత్త కోర్టు మంజూరు, నిర్మాణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. సీనియర్ సిటిజన్స్ సౌకర్యార్థం కోర్టులో లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. కోర్టు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. విరివిగా న్యాయ అవగాహన సదస్సులను ఏర్పాటుచేసి ప్రజలను చైతన్యవంతులను చేశారు. చట్టాలపై అవగాహన కల్పించారు.
బాధ్యతల స్వీకరణ
విజయనగరం లీగల్: ప్రభుత్వ న్యాయవాదిగా రెడ్డి సూర్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అంబేడ్కర్‌ను ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంతవరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసిన టి.వి.శ్రీనివాసరావు పదవీ కాలం ముగిసింది.
మైనార్టీ వెల్ఫేర్ అధికారిగా లక్ష్మీనారాయణ
విజయనగరం టౌన్: విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల మైనారిటీ వెల్ఫేర్ అధికారిగా పీఎన్‌వీ లక్ష్మీనారాయణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఏపీ మైక్రో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ మైనార్టీ వెల్ఫేర్ అధికారిగా, మైనార్టీ కార్పొరేషన్ ఈడీగా ఆయన అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా మైనార్టీ అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బబిత


