
వీరఘట్టంలో ఆవులు, మేకల దొంగలు
వీరఘట్టం: గడిచిన రెండేళ్లుగా వీరఘట్టం మేజర్ పంచాయతీలోని గొల్లవీధి, తెలగవీధి, పెరుగువీధి, మేకలవీధితో పాటు పలు వీధుల్లో ఆవులు, మేకలు, దూడలను ఆగంతుకులు ఎత్తుకుపోతున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు తెలగవీధిలోని ఓ ఇంటి ముందు ఉన్న రెండు ఆవులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో ఆగంతుకులు తప్పించుకుని పారిపోయారని తెలగవీధికి చెందిన వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. తెలగవీధిలో మూగజీవాలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారనే విషయం తెలియడంతో చాలా వీధుల నుంచి బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. రెండేళ్లుగా మా పశువులను కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులకు తెలియజేశారు. గురువారం పూర్తి స్థాయిలో అందరం కలిసి ఫిర్యాదు చేసేందుకు బాధితులంతా ఏకతాటిపైకి వచ్చారు. ఆవులు, మేకలను దొంగిలిస్తున్న వారిపై కఠినంగా చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు