ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం

Published Mon, Apr 14 2025 1:03 AM | Last Updated on Mon, Apr 14 2025 1:03 AM

ఇంటర్

ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 6 గురుకులాల్లో శతశాతం ఉత్తీర్ణత

విజయనగరం అర్బన్‌: ‘ఇది విజయనగరం జిల్లా వేపాడ మండల కేంద్రంలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ గురుకుల భవనం. ఇక్కడి ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్ధులు 75 మంది ఎంపీసీ, బైపీసీ కోర్సులలో పరీక్ష రాస్తే అందరూ ఉత్తీర్ణలై శతశాతం ఫలితాల గురుకులాల జాబితాలో చేరింది. అదే విధంగా ఇంటర్‌ రెండో సంవత్సరం ఎంపీసీ, బైపీసీ పరీక్షలు రాసిన 62 మంది విద్యార్ధులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ ఇంటర్‌ ఎంపీసీలో 454/470 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అధిక మార్కుల తెచ్చుకున్న వారితో ఈ కళాశాల ముందువరుసలో ఉంది.

● పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండల కేంద్రంలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయం ఇది. ఇక్కడ ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదివిన 73 మంది విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ కోర్సుల విద్యార్థులు 61 మందికి అందరూ పాసై శతశాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ద్వితీయ ఇంటర్‌లో 966/100 మార్కులు తెచ్చుకుని కె.గాయత్రి, పి.శాంతికుమారి జిల్లా స్థాయిలో ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. ప్రథమ ఇంటర్‌ బైపీసీలో 454/700 మార్కులతో పి.రేవతి జిల్లాలో ముందువరసలో ఉంది.

మొదటి నాలుగు స్థానాల్లో గురుకులాల

విద్యార్థినులు

ద్వితీయ ఇంటర్‌ ఎంపీసీ కోర్సుల ఫలితాల్లో జిల్లా స్థాయి మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థుల వివరాలిలా ఉన్నాయి. గరుగుబిల్లి గురుకుల పాఠశాల విద్యార్థిని పి.మేఘన 972/1000, కొమరాడ గురుకుల కళాశాల విద్యార్థిని కె.గాయత్రి 966/1000, పి.శాంతికుమారి 966/1000, వేపాడ గురుకుల విద్యార్థిని ఎం.కావ్య 961/1000 మార్కులతో మొదటి నాలుగు స్థానాలను వరుసగా సాధించారు. అదేవిధంగా బైపీసీలో కూడా మొదటి మూడు స్థానాలు గురుకులాల విద్యార్ధినులే సాధించారు. చీపురుపల్లి గురుకుల విద్యార్థిని కె.కల్యాణి 975/1000, కొమరాడ గురుకుల విద్యార్థిని టి.లోహిత, డి.దుర్గ 974/1000, చీపురుపల్లి విద్యార్థిని కె.రమ్య 968/1000 మార్కులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. సీఈసీ విభాగంలో నెల్లిమర్ల విద్యార్థినులు కె.శశికళ 959/1000, ఎం.హారిక 927/1000 మార్కులు తెచ్చుకుని వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు. హెచ్‌ఈసీ విభాగంలో భామిని విద్యార్థిని ఎ.రాజేశ్వరి 856/1000 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రథమ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో కొమరాడ విద్యార్థిని పి.రేవతి 463/470, గరుగుబిల్లి విద్యార్థిని ఆర్‌.పూజిత 459/470, వేపాడ విద్యార్థిని సౌజన్య 454/470 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ప్రథమ ఇంటర్‌ బైపీసీ విభాగంలో కొమరాడ గురుకుల పాఠశాల విద్యార్థిని వై.ప్రశాంతి 433/440, వంగర గురుకుల విద్యార్థినులు కె.హరిప్రియ 432/440, పి.మౌనిక 431/440 మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఎంఈసీ గ్రూప్‌లో ఎన్‌.రేణుక 424/440, సీఈసీలో వై.దేవి 421/500, హెచ్‌ఈసీ గ్రూప్‌లో డి.సంజన 477/500 మార్కులతో ఆయా గ్రూప్‌లలో మొదటి స్థానంలో ఉన్నారు.

పెరిగిన ఉత్తర్ణత శాతం

గత ఏడాది ఫలితాల్లో ప్రథమ ఇంటర్‌ 82.21 ఉత్తీర్ణత శాతం ఉంటే తాజాగా వచ్చిన ఫలితాల్లో 86.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా గత ఏడాది ద్వితీయ ఇంటర్‌లో 87.25 ఉత్తీర్ణత శాతం ఉంటే తాజాగా వచ్చిన ఫలితాల్లో 93.82 శాతం నమోదైంది.

ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం1
1/2

ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం

ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం2
2/2

ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement