ప్రతి అర్జీకి పరిష్కారం చూపడమే ధ్యేయం
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్
● ప్రజాసమస్యల పరిష్కార 187 వినతులు
విజయనగరం అర్బన్: ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికకు అర్జీదారుల తాకిడి పెరిగింది. జిల్లా కేంద్రాలకు అర్జీదారులు రావాల్సిన పని లేకుండా గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ సదస్సుల పేరుతో దాదాపు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల ప్రభావం కనబడలేదు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 187 వినతులు అందాయి. వాటిలో అత్యధికంగా 88 వినతులు రెవెన్యూ శాఖకు చెందినవే ఉన్నాయి. అర్జీల స్వీకరణ ప్రక్రియలో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తోపాటు కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, ప్రమీల గాంధీ పాల్గొన్నారు.
విజయనగరం క్రైమ్: ఎస్పీ వకుల్ జిందల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యలపరిష్కార వేదికకకు 42 ఫిర్యాదులు. అందాయి. భూతగాదాలు, కుటుంబసమస్యలు, మోసాలకు చెందిన సమస్యలతో ఫిర్యాదు దారులు ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వచ్చారు. ఫిర్యాదు దారుల సమస్యలను సావధానంగా విన్న ఎస్పీ వకుల్ జిందల్ ఫిర్యాదుల్లో ఉన్న విషయాలను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫిర్యాదుదారుల ముందే ఫోన్‌చేసి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అంతేకాకుండా వీడియో కాల్ చేసి మరీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులకు ఏడు రోజుల్లో పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత పాల్గొన్నారు.
ప్రతి అర్జీకి పరిష్కారం చూపడమే ధ్యేయం


