
డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చెబుతూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం చేయడం తగదని డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్.హరీష్ అన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై తొలిసంతకం చేశారన్నారు. కానీ నేటికీ నోటిఫికేషన్ వెలువడలేదని, నోటిఫికేషన్ రాక లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటూ తీవ్ర నిరాశకు గురువుతున్నారన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక, అసలు వస్తుందో రాదో అన్న అయోమయ పరిస్ధితిలో పలువురు అభ్యర్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. విజయనగరం జిల్లాకు పోస్టుల ఎంపిక విషయంలో అన్యాయం జరిగిందని, తక్కువ పోస్టులు మంజూరు చేశారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. 16,347వేల పోస్టులు కాకుండా 25వేలతో మెగా డీఎస్సీ నిర్వహించేలా చూడాలని, నిరుద్యోగ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. త్వరితగతిన డీఎస్సీ నోటిఫికేషన్ అన్ని వివరాలతో వెలువడేలా చూడాలని, తక్షణమే మెగా డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.